డబ్బుతో సహా ఏటీఎమ్ మిషన్ను ఎత్తుకెళ్లారు
జైపూర్: ఏటీఎమ్ మిషన్లలో డబ్బు దోచుకెళ్లడం.. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లిన దాడి చేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. రాజస్థాన్లో దొంగలు ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో దాదాపు 20 లక్షల రూపాయిలు ఉన్నట్టు అంచనా. సికర్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్ అపహరణకు గురైనట్టు శనివారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. బ్యాంక్ కార్యాలయం కేబిన్లో దీన్నీ ఏర్పాటు చేశారు.
ఏటీఎమ్ మిషన్లో డబ్బు ఎంత ఉందన్న విషయాన్ని బ్యాంక్ కచ్చితంగా వెల్లడించలేదు. అయితే 20 లక్షలు ఉండవచ్చని సికర్ ఎస్పీ హైదర్ అలీ చెప్పారు. ఏటీఎమ్ మిషన్ ఉంచిన గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు.