ముంబై: ఓ పని మనిషి.. తాను పనిచేసే ఓనర్‌లో ఇంట్లో చోరీ చేసి పరార్ అయ్యారు. దొంగిలించిన కొత్త వాచ్, చీర ధరించిన ఫొటోలు సదరు పని మనిషి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకోగా. ఓనర్ దంపతులకు తెలిసిపోయింది. దీంతో పనిమనిషి రూపాలి సింగ్‌పై సమతా నగర్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కండివ్లిలోని ఓ దంపతుల ఇంట్లో.. రూపాలి సింగ్ రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ జంట ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్నారు. వారి ఇంట్లో రూపాలి పనిమనిషిగా చేరారు.ఇక.. ఇంటిని శుభ్రం చేయటం, వారి పిల్లలను చూసుకోవడం ఆమె పని. అక్టోబరు 7న రూపాలి.. తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారని పని మానేసి.. తన సొంతూరు వెళ్తున్నట్లు తెలిపారు.
అయితే.. ఓనర్ భార్య దసరాకు కొత్త చీర కట్టుకోవాలని భావించించారు. ఆమెకు కొత్త చీర అల్మారాలో కనిపించలేదు. చీర ఎక్కడ ఉందని.. ఆమె పనిమనిషి రూపాలికి ఫోన్ చేసి కనుకున్నారు. తాను ఇస్త్రీ చేసి అల్మారాలో ఉంచానని రూపాలి చెప్పారు. ఇంట్లో ఎక్కడ చూసినా ఓనర్ భార్యకు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి.. అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఓనర్ దంపతులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. యజమాని ఇంటి నుంచి పనిమనిషి రూపాలి.. బ్యాగుల్లో ఏదో తీసుకుని వెళ్తున్నట్లు కనిపించారు. యజమాని భార్య తన వాట్సాప్‌ను తనిఖీ చేస్తుండగా.. సింగ్ స్టేటస్ చూసి అవాక్కయ్యారు.
వాట్సాప్‌లో స్టేటస్‌లో పనిమనిషి తన యజమానికి సంబంధించిన వాచ్, దుస్తులను ధరించి కనిపించారు. కొత్త చీర, వాచ్ కాకుండా ఇంట్లో పలు విలువైన వస్తువులు కనిపించలేదు. ఆభరణాలు, వాచ్, చీరలు, సన్ గ్లాసెస్, శాలువా, మేకప్ కిట్, పెర్ఫ్యూమ్‌లు, పిల్లల బ్యాగ్ కనిపించలేదు. వీటి విలువ సమారు 2.4 లక్షల ఉంటుందని ఓనర్ జంట తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాజీ పనిమనిషి కోసం వెతుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment