rajashtan
-
వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!
జైపూర్: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్‌కు నిరాకరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్‌ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర సింగ్ తన్వర్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామన్నారు. -
రాజస్తాన్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు అభ్యర్థులు
రాజస్తాన్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు అభ్యర్థులు -
వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే
అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘ప్రేమికుడే ఈ పని చేశాడు’ ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే! -
మరణాన్ని తట్టుకోలేకపోయింది.. కడదాకా వెంటపడింది
మనుషులకు మల్లే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పిల్లల కోసం అల్లలాడిపోవడం, ఆపదలో అవసరమైతే పోరాడడం, యజమానుల పట్ల విశ్వాసం, ఆప్యాయత-ప్రేమల్ని ప్రదర్శించడం ఈ కోవలోకే చెందుతాయి కూడా. అయితే మృతి చెందిన తన నేస్తాన్ని పూడ్చడానికి వెళ్తుంటే.. ఆ బాధను తట్టుకోలేక ఓ పక్షి చేసిన పని నెటిజనుల హృదయాన్ని కరిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు సందడి చేసేవి. ఎక్కడి నుంచో వచ్చిన వాటికి రోజూ ధాన్యం గింజలు వేస్తున్నాడాయన. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి మృతి చెందింది. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి ఆ నెమలిని పూడ్చమని చెప్పాడు రామస్వరూప్. నెమలి మృతదేహాన్ని పూడ్చడానికి తీసుకువెళ్లున్న క్రమంలో.. పాపం మరో నెమలి దాని వెంట పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘నెమలి తన సహచర నెమలిని విడిచి ఉండలేకపోతోంది. హృదయాన్ని కదిలించే వీడియో’ అని కామెంట్ జతచేశారు. అలా పరుగులు తీసిన నెమలి.. ఖననం చేసేదాకా ఆ నెమలి అక్కడే ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఆ నెమలి పరుగులు తీసిన వీడియోను 1.26 లక్షల మంది వీక్షించారు. నెమలి వీడియో వీక్షించిన నెటిజనులు హార్ట్ టచింగ్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘మనుషుల కంటే పక్షులు, పశువులకే ప్రేమ అధికంగా ఉంటుంది!’, ‘ఆ నెమలి ఎంత బాధ అనుభవిస్తోందో.. పక్షి ప్రేమికులకు తెలుస్తుంది’, ‘దేవుడి సృష్టి చాలా గొప్పదని.. ప్రేమ, అనుబంధాలకు సంబంధించి ఆ నెమలి ఆధునిక మానవుని కళ్లు తెరిపిస్తోంది’, ‘నువ్వు లేక నేనుండలేను నేస్తం.. నువ్వు ఎక్కడికి పోతున్నావ్!’ అని నెటిజనన్లు కామెంట్లు చేస్తున్నారు. The peacock doesn’t want to leave the long time partner after his death. Touching video. Via WA. pic.twitter.com/ELnW3mozAb — Parveen Kaswan (@ParveenKaswan) January 4, 2022 -
పెట్రో బాదుడు : రూ.100 దాటేసింది
సాక్షి, జైపూర్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహన దారులను బెంబేలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో రికార్డు స్థాయిలనుచేరుతున్నాయి. ఇప్పటికే జైపూర్‌లో పెట్రోలు ధర రూ.100 మార్క్‌ను టచ్ చేసింది. తాజాగా 100 రూపాయలను అధిగమించి వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. వరుసగా 9వ పెంపు నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర బుధవారం (ఫిబ్రవరి 17) రూ .100.13 పలుకుతోంది. డీజిల్ ధర లీటరుకు 92.13 రూపాయలుగా ఉంది. పెట్రోలు ధరకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే అత్యధిక ధర. (భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్ ధర) -
వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్ క్లిప్పింగ్స్
జైపూర్ : రాజస్థాన్‌లో అధికారుల అత్యున్నత సమావేశంలో షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి కలకలం సృష్టించింది. సాక్షాత్తూ ప్రభుత్వ ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్ విభాగం కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అభ్యంతరకర వీడియో ఒకటి ప్లే కావడంతో అధికారులందరూ నివ్వెరపోయారు. అనంతరం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు . సచివాలయంలో ఆహార పౌరసరఫరా శాఖ కార్యదర్శి ముగ్దా సింగ్ అధ్యక్షతన ఒక సమావేశం జరుగుతోంది. వివిధ పథకాలు, కార్యక్రమాలు సమీక్షించేందు కుద్దేశించిన ఈ సమావేశానికి దాదాపు పదిమంది శాఖ అధికారులు, ఎన్ఐసి ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా సరఫరాదారులు, ఇతరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి తెరపై పోర్న్ క్లిప్పింగ్ ప్లే అవడం మొదలుపెట్టింది. దీంతో అవాక్కవడం ఉన్నతాధికారుల వంతైంది. ఈ ఘటనపై ముగ్దా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదికను సమర్పించాల్సిందిగా ఎన్ఐసీ డైరెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకుంటామని తెలిపారు. -
రాజస్తాన్, హరియాణాల్లో టీఐఎఫ్ బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: మోడల్ ఇండస్ట్రియల్ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రతినిధులు శనివారం రాజస్తాన్‌లోని మానెసర్, హరియా ణాలోని నిమ్రాన్ పారిశ్రామిక వాడలను సందర్శించారు. పరి శ్రమల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను ఎలా నియం త్రిస్తున్నారనే విషయాల్ని తెలుసుకున్నారు. అక్కడ కాలుష్య జలాలను శుద్ధి చేసేందుకు 20 ఎకరాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో.. రాష్ట్రంలోని చౌటుప్పల్ దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్, ముచ్చర్ల ఫార్మాసిటీల్లోనూ ఇదే తరహాలో ప్లాంట్లు నెలకొల్పేలా ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించారు. పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డబ్బుతో సహా ఏటీఎమ్ మిషన్‌ను ఎత్తుకెళ్లారు
జైపూర్: ఏటీఎమ్ మిషన్లలో డబ్బు దోచుకెళ్లడం.. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లిన దాడి చేయడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో దొంగలు ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో దాదాపు 20 లక్షల రూపాయిలు ఉన్నట్టు అంచనా. సికర్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్ అపహరణకు గురైనట్టు శనివారం ఉదయం బ్యాంక్ సిబ్బంది గుర్తించారు. బ్యాంక్ కార్యాలయం కేబిన్‌లో దీన్నీ ఏర్పాటు చేశారు. ఏటీఎమ్ మిషన్‌లో డబ్బు ఎంత ఉందన్న విషయాన్ని బ్యాంక్ కచ్చితంగా వెల్లడించలేదు. అయితే 20 లక్షలు ఉండవచ్చని సికర్ ఎస్పీ హైదర్ అలీ చెప్పారు. ఏటీఎమ్ మిషన్ ఉంచిన గదిలో సీసీ కెమెరాలు లేవని తెలిపారు.