సాక్షి, హైదరాబాద్: మోడల్ ఇండస్ట్రియల్ పార్క్‌లను అధ్యయనం చేసేందుకు టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) ప్రతినిధులు శనివారం రాజస్తాన్‌లోని మానెసర్, హరియా ణాలోని నిమ్‌రాన్ పారిశ్రామిక వాడలను సందర్శించారు. పరి శ్రమల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలను ఎలా నియం త్రిస్తున్నారనే విషయాల్ని తెలుసుకున్నారు.
అక్కడ కాలుష్య జలాలను శుద్ధి చేసేందుకు 20 ఎకరాల్లో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో.. రాష్ట్రంలోని చౌటుప్పల్ దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్, ముచ్చర్ల ఫార్మాసిటీల్లోనూ ఇదే తరహాలో ప్లాంట్లు నెలకొల్పేలా ప్రణాళికలు తయారు చేయాలని నిర్ణయించారు. పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.