వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్‌ క్లిప్పింగ్స్‌  | Porn Clip Played in a Government Meeting in Rajasthan | Sakshi
Sakshi News home page

వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్‌ క్లిప్పింగ్స్‌ 

Published Tue, Jun 4 2019 4:02 PM | Last Updated on Tue, Jun 4 2019 4:17 PM

Porn Clip Played in a Government Meeting in Rajasthan - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : రాజస్థాన్‌లో అధికారుల  అత్యున్నత సమావేశంలో షాకింగ్‌ ఇన్సిడెంట్‌ ఒకటి కలకలం సృష్టించింది.  సాక్షాత్తూ ప్రభుత్వ ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.  ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లయ్‌  విభాగం  కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా  అభ్యంతరకర వీడియో ఒకటి ప్లే కావడంతో అధికారులందరూ నివ్వెరపోయారు.  అనంతరం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు .

సచివాలయంలో ఆహార పౌరసరఫరా శాఖ కార్యదర్శి ముగ్దా సింగ్ అధ్యక్షతన ఒక సమావేశం జరుగుతోంది. వివిధ పథకాలు, కార్యక్రమాలు సమీక్షించేందు కుద్దేశించిన ఈ సమావేశానికి దాదాపు పదిమంది శాఖ అధికారులు, ఎన్ఐసి ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా సరఫరాదారులు, ఇతరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి తెరపై పోర్న్‌ క్లిప్పింగ్‌ ప్లే అవడం మొదలుపెట్టింది. దీంతో అవాక్కవడం ఉన్నతాధికారుల వంతైంది. ఈ ఘటనపై ముగ్దా సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదికను సమర్పించాల్సిందిగా ఎన్‌ఐసీ డైరెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement