Food and Civil Supplies
-
ఛీఛీ.. మూమూస్ ఇలా చేస్తారా?
ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd — Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024 -
భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!
తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్‌లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం. 10 లక్షల కార్డులు కట్! ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది. వీళ్లంతా అనర్హులే ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్‌ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
మరో 1.58 కోట్ల మందికి ఆహార భద్రత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గ్రామీణ, పట్టణ పేదల కడుపు నింపుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి మరికొంత మందిని చేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు కోటిన్నర మందిని కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు కసరత్తు ప్రారంభించింది. దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు ఆఖరు నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని ఆహార శాఖ వర్గాలు చెబుతున్నాయి. లబ్ధిదారుల్లో కొత్త ఆశలు ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలో 81.35 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్న యోజన కింద 10 కోట్ల మందికి ప్రతినెలా 35 కిలోల ఉచిత బియ్యం సరఫరా చేస్తున్నారు. మరో 71 కోట్ల మందికి రేషన్ కార్డుపై కిలో రూ.3 చొప్పున 5 కిలోల బియ్యం, రూ.2కి గోధుమలు వంటి నిత్యావసరాలను అందజేస్తున్నారు. ఆహార పంపిణీ కోసం రాయితీ రూపంలో కేంద్రం రూ.4.22 లక్షల కోట్ల ఆర్థిక భారం మోస్తోంది. ఆహార భద్రతా చట్టం పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాను చేర్చారు. చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టలేదు. పైగా 2013 నుంచి 2021 వరకూ ఆధార్ సంఖ్యలతో రేషన్ కార్డులను సీడింగ్ చేయడం ద్వారా అనర్హులను తొలగించారు. వలస వెళ్లిన కుటుంబాలు, ఒకే కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, ఒకే కుటుంబంలో తెలుపు, గులాబీ కార్డులు కలిగి ఉన్న వారి వివరాలు, నివాసంలో లేకుండా రేషన్ కార్డులున్న వారి వివరాలు, చనిపోయిన వారి వివరాలను సేకరించి దేశవ్యాప్తంగా 4.70 కోట్ల కార్డులను ఏరివేశారు. వారి స్థానంలో ప్రస్తుతం అర్హులైన 1.58 కోట్ల మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాలపైనే ఎంపిక బాధ్యత కొత్త లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని, ఇందులో తమ పాత్ర ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త రేషన్‌కార్డుల జారీకి ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఉమ్మడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఆహార ఉత్పత్తి గణనీయంగా పెరినప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు, మహిళలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలో 38.4 శాతం మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ ఎత్తు ఉన్నారు. 21 శాతం మంతి తక్కువ బరువుతో ఉన్నారు. మహిళల్లో ఏకంగా 55 శాత మంది రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సవాళ్లకు ఆహార భద్రతా చట్టంతో చెక్ పెట్టొచ్చని కేంద్రం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్‌లో పోర్న్ క్లిప్పింగ్స్
జైపూర్ : రాజస్థాన్‌లో అధికారుల అత్యున్నత సమావేశంలో షాకింగ్ ఇన్సిడెంట్ ఒకటి కలకలం సృష్టించింది. సాక్షాత్తూ ప్రభుత్వ ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫుడ్ అండ్ సివిల్ సప్లయ్ విభాగం కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా అభ్యంతరకర వీడియో ఒకటి ప్లే కావడంతో అధికారులందరూ నివ్వెరపోయారు. అనంతరం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు . సచివాలయంలో ఆహార పౌరసరఫరా శాఖ కార్యదర్శి ముగ్దా సింగ్ అధ్యక్షతన ఒక సమావేశం జరుగుతోంది. వివిధ పథకాలు, కార్యక్రమాలు సమీక్షించేందు కుద్దేశించిన ఈ సమావేశానికి దాదాపు పదిమంది శాఖ అధికారులు, ఎన్ఐసి ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన జిల్లా సరఫరాదారులు, ఇతరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు. ఇంతలో ఉన్నట్టుండి తెరపై పోర్న్ క్లిప్పింగ్ ప్లే అవడం మొదలుపెట్టింది. దీంతో అవాక్కవడం ఉన్నతాధికారుల వంతైంది. ఈ ఘటనపై ముగ్దా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అనంతరం నివేదికను సమర్పించాల్సిందిగా ఎన్ఐసీ డైరెక్టర్‌ను ఆదేశించామన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకుంటామని తెలిపారు. -
పాము కరిచిందనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలింపు!
భోఫాల్: పాము కాటుకు గురైనారనే అనుమానంతో మంత్రిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లో పౌర సరఫరాల శాఖాను నిర్వహిస్తున్న విజయ్ షా పాముకాటుకు గురయ్యారు. పాము కాటుకు గురైన మంత్రిని ప్రభుత్వ జేపీ ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురయ్యారా లేక విష కీటకం కుట్టిందా అనే విషయంపై ఇంకా నిర్ధారణకు రాలేదని జేపీ ఆస్పత్రి ముఖ్య వైద్యాదికారి పంకజ్ శుక్లా తెలిపారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు జరిగిందన్నారు. మంత్రి షాను ఐసీయూకి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.