ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం.
ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు.
मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd
— Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024
Comments
Please login to add a commentAdd a comment