hate messages
-
ఛీఛీ.. మూమూస్ ఇలా చేస్తారా?
ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd — Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024 -
Bharat Jodo Yatra: బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆటలు సాగనివ్వం
అలప్పుజా: అధికార బీజేపీ దేశంలో విద్వేషం, హింసాకాండను ప్రేరేపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. దేశాన్ని విభజించాలన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆటలను సాగనివ్వబోమని హెచ్చరించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుటిల సిద్ధాంతాలను అమలు చేస్తామంటే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని చెర్తాలాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హింసాద్వేషాలను నమ్ముకుంటే దేశం ప్రగతి సాధించలేదని మరోమారు స్పష్టం చేశారు. అరాచక పాలన వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్న నిజాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమా? కొత్త ఆసుపత్రులు నిర్మించగలమా? కొత్త రోడ్లు వేయగలమా? మన పిల్లలను విద్యావంతులను చేయగలమా? అని రాహుల్ ప్రశ్నించారు. ఎంతమాత్రం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సామాన్య ప్రజలు తమ భుజస్కందాలపై ఈ దేశాన్ని మోస్తున్నారని, కొందరు దుష్టులు సృష్టిస్తున్న ద్వేషాల వల్ల జనమే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు మన దేశంలో ఉన్నారని, అదే సమయంలో నిత్యావసరాల కోసం మన ప్రజలు అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్న దేశం, ధరల మంటలు మండుతున్న దేశం మనకు కావాలా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో సామాన్యులు రోజురోజుకూ చితికిపోతుంటే బడాబాబులు మాత్రం మరింత ధనవంతులవుతున్నారని ఆక్షేపించారు. రాహుల్ పాదయాత్ర సోమవారం 12వ రోజుకు చేరుకుంది. అలప్పుజలోని వడక్కల్ బీచ్‌లో మత్స్యకారులను కలుసుకున్నారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వెంబనాడ్ సరస్సులో ఓ హౌస్‌బోటులో పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్నారు. స్నేక్ బోటు రేసింగ్‌లో పాల్గొన్నారు. 50 మంది యువకులతో కలిసి కాసేపు పడవ నడిపించారు. -
రెస్టారెంట్ ధ్వంసం.. విద్వేషపూరిత రాతలు
వాషింగ్టన్: న్యూ మెక్సికోలోని సాంటే ఫే నగరంలో ఒక భారతీయ రెస్టారెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశారు. రెస్టారెంట్ గోడల మీద విద్వేషపూరిత సందేశాలను రాశారు. ఇండియా ప్యాలెస్ అనే ఈ రెస్టారెంట్ ఓ సిక్కు వ్యక్తిది అని స్థానిక మీడియా తెలిపింది. రెస్టారెంట్‌కు జరిగిన నష్టం 1,00,000 డాలర్లుగా ఉంటుందని సమాచారం. ఈ సంఘటనను సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (ఎస్ఏఎల్డీఈఎఫ్- సాల్డెఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ రకమైన ద్వేషం, హింస ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి అని సాల్డెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ కౌర్ గిల్ అన్నారు. అంతేకాక శాంటా ఫే ఒక ప్రశాంతమైన పట్టణం అని.. సిక్కు సమాజం గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో సంతోషంగా జీవిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో యజమాని మాట్లాడుతూ.. ‘దుండగులు రెస్టారెంట్‌లోని టేబుల్స్‌ని విరగ్గొట్టారు. గాజు సామానును ముక్కలు ముక్కలు చేశారు. వైన్ ర్యాక్‌ను ఖాళీ చేశారు. ఓ దేవత విగ్రహాన్ని శిరచ్ఛేదన చేశారు. కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. వంటగదిని కూడా పూర్తిగా నాశనం చేశారు. ఆహారాన్ని వేడి చేసే పరికరాలు ధ్వంసం చేశారు. గోడల మీద ‘వైట పవర్’.. ‘ట్రంప్2020’.. ‘ఇంటికి వెళ్లు’ అని రాసి ఉంది. ఇవన్ని చూసి అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా అర్థం కావడం లేదు’ అని వాపోయాడు. దీని గురించి స్థానిక పోలీసులు, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమంలో భాగంగా స్పానిష్ వలసవాదులతో సంబంధం ఉన్న విగ్రహాలను తొలగించడంతో ఇటీవల ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. అంతేకాక ఈ ఏడాది ఏప్రిల్ 20న కొలరాడోలోని లాక్వుడ్లో ఎరిక్ బ్రీమాన్ అనే వ్యక్తి.. సిక్కు అమెరికన్ లఖ్వంత్ సింగ్‌పై దారుణంగా దాడి చేశాడు. నాటి నుంచి ఈ ద్వేషపూరిత నేరాలలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని సాల్డెఫ్ తెలిపింది. లఖ్వంత్ సింగ్‌పై దాడి చేస్తున్నప్పుడు సదరు వ్యక్తి.. ‘మీ దేశానికి తిరిగి వెళ్ళు’ అని బెదిరించాడని తెలిపారు. అయితే దాడి చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి
పీటన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతివిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా జాతివిద్వేష పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు కొట్టారు. గోడలపై కుక్క మలాన్ని పూశారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద పోస్టర్లు అతికించారు. పోస్టర్లపై ‘గోధుమ వర్ణం వారు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు’ అనే రాతలు రాశారు. అయితే.. ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అంతేకాదు.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని, తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయంగా వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని చెప్పారు. కానీ మళ్లీ తన ఇంటిపై ఇలాంటి దాడి జరుగుతుందోమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసి ఉంటారని ఎఫ్‌బీఐ భావిస్తోంది. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’