తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్‌లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం.
10 లక్షల కార్డులు కట్!
ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది.
వీళ్లంతా అనర్హులే
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్‌ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment