card holders
-
భారీ షాకిచ్చిన కేంద్రం.. 10 లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఇదే!
తప్పుడు సమాచారంతో రేషన్ కార్డులు పొందిన వారందరికి కేంద్రం షాక్ ఇవ్వనుంది. ఇటువంటి కార్డ్‌లను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయబోతోంది. దీనిపై సమీక్ష ప్రక్రియ ఇంకా కొనసాగుతోందట. అయితే రాబోయే రోజుల్లో దీని సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చుని సమాచారం. 10 లక్షల కార్డులు కట్! ఇప్పటివరకు ప్రభుత్వం 10 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులగా గుర్తించింది. ఈ జాబితాను స్థానిక రేషన్ డీలర్లకు పంపనుంది. ఈ నకిలీ లబ్ధిదారుల పేర్ల జాబితాను తయారు చేసి, అలాంటి కార్డుదారుల నివేదికను జిల్లా కేంద్రానికి పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారాన్ని పరిశీలించిన తర్వాత అటువంటి లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయాలని సంబంధిత శాఖకు తెలపనుంది. వీళ్లంతా అనర్హులే ఎన్ఎఫ్ఎస్ఏ (NFSA) ప్రకారం వీరు రేషన్ పొందేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఆదాయపు పన్ను చెల్లించే వారు, 10 బిగాల కంటే ఎక్కువ భూమి ( 6 ఎకరాల భూమి) ఉన్న వ్యక్తుల కార్డులను రద్దు చేయనుంది. వీటితో పాటు రేషన్‌ను ఉచితంగా విక్రయిస్తూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన ప్రభుత్వం వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌లో చాలా వరకు రేషన్ కార్డులు దుర్వినియోగం జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, ప్రాధాన్యత కలిగిన పసుపు, గులాబీ రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఎక్కడి నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా (పోర్టబిలిటీ) ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) లబ్ధిదారులు నిత్యావసర సరుకులు తీసుకునే సదుపాయాన్ని పౌర సరఫరాలశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం నుంచి (ఏప్రిల్ 1) ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇటీవలే నెలపాటు జిల్లాల పరిధిలో అమలు చేసిన పోర్టబిలిటీ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. ఇప్పటివరకు కార్డుదారులు తమకు కేటాయించిన రేషన్ షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. ఇల్లు మారినా, కొత్త ఇంటికి దగ్గరలో రేషన్ షాపున్నా కూడా పాత షాపులోనే సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. పోర్టబిలిటీ విధానం ద్వారా ఈ పరిస్థితికి పౌర సరఫరాలశాఖ చరమగీతం పాడింది. ఒకే కార్డున్న కుటుంబం వేర్వేరు చోట్లా తీసుకోవచ్చు... రాష్ట్రంలో ఉన్న 85 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.75 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించేందుకు 17 వేల రేషన్ షాపులున్నాయి. వీటన్నిటినీ ఇప్పటికే ఆన్లైన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అంతేకాదు ఒకే రేషన్ కార్డులో ఉన్న సభ్యులు వేర్వేరు రేషన్ షాపుల్లో తమ అవసరానికి తగినట్లుగా సరుకులు పొందవచ్చు. ఉదాహరణకు కుటుంబంలో ఐదుగురు సభ్యులుంటే ఇద్దరు సభ్యులు తమ కోటాకు సంబంధించిన బియ్యాన్ని మహబూబ్‌నగర్‌లో, మరో ముగ్గురు మెదక్‌లోనూ తీసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఆదిలాబాద్‌లో గోధుమలు తీసుకుంటే మరొకరు రంగారెడ్డిలో కిరోసిన్ తీసుకోవచ్చు. టీ–రేషన్ యాప్‌లో లొకేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా కార్డుదారుడికి దగ్గరలోని రేషన్ షాప్ వివరాలు గూగుల్ మ్యాప్‌లో ప్రత్యక్షమవుతాయి. సరుకులు తీసుకున్న వెంటనే లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా తమ కోటాకు సంబంధించిన మొత్తం సమాచారం అందుతుంది. లబ్ధిదారులు వరుసగా ఏడాదిపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా వారి కార్డును తొలగించరు. వాళ్లకు ఎప్పుడు అవస రముంటే అప్పుడు సరుకులు తీసుకోవచ్చు. పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి పోర్టబిలిటీ విధానం ఎంతగానో దోహదపడనుంది. పోర్టబిలిటీతో డీలర్లలో మార్పు: సీవీ ఆనంద్ జిల్లాల్లో ఇప్పటివరకు అమలు చేసిన పోర్టబిలిటీతో రేషన్ డీలర్లలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఎక్కువమంది తమ షాపుల్లో సరుకులు తీసుకునేలా సేవలు అందించడానికి పోటీ పడుతున్నారని పౌర సరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సమయ పాలన పాటిస్తూ కార్డుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తున్నారని వివరించారు. ఈ విధానంలో రేషన్ దుకాణాలకు ముందుగానే 10 నుంచి 15 శాతం ఎక్కువ సరుకులను కేటాయిస్తామన్నారు. -
కార్డుదారులకు కష్టాలు
– ఇన్యాక్టివేషన్లో 1.50 లక్షల కార్డులు – రేషన్ అందక పేదల అవస్థలు – యాక్టివేషన్ కోసం తంటాలు – ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తే ప్రయోజనం ఈమె పేరు జి.తిపమ్మ. వయస్సు 70 ఏళ్లపైనే ఉంటుంది. నగరం పరిధిలో ఎంజీ కాలనీలో రేషన్ కార్డు (డబ్ల్యూఏపీ 129501500381) ఉంది. కార్డు ఇనాక్టివేషన్‌లో ఉందంటూ డీలర్ బియ్యం ఇవ్వలేదు. తహశీల్దారు కార్యాలయానికి వెళితే డీఎస్ఓ కార్యాలయానికి వెళ్లి కార్డు యాక్టివేట్ చేసుకోవాలని అక్కడి వారు చెప్పారు. దీంతో డీఎస్ఓ కార్యాలయానికి వచ్చిన విచారిస్తే కార్డు రద్దయ్యింది మరోమారు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒంటరిగా ఉంటున్నాను. ఉన్న కార్డు తీసేశారు. ఎవరిని అడగాలి? ఎక్కడి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలో తెలియదంటూ ఆమె ఆవేదన చెందింది. తిప్పమ్మ ఒక్కరేకాదు జిల్లావ్యాప్తంగా ఇలాంటి వారు చాలా మంది కార్డుదారులు ఇనాక్టివేషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం అర్బన్ : తెల్లకార్డుదారులు ఇన్‌యాక్టివేషన్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఇన్యాక్టివేషన్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.50 కార్డులు ఉన్నట్లు సమాచారం. కార్డుదారులకు నిత్యావసర సరకులు అందడం లేదు. దీంతో కార్డు యాక్టివేషన్ కోసం లబ్ధిదారులు తహశీల్దారు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కార్డు ఇన్యాక్టివేషన్కావడంతో నిత్యావసర సరుకుల అందక ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌యాక్టివేషన్ తిప్పలు : ఇన్‌యాక్టివేషన్ అయిన తమ కార్డులను యాక్టివేట్ చేయించుకునేందుకు పేదలు నానా అగచాట్లుప డుతున్నారు. ఆధార్ అనుసంధానం కాక కొన్ని, ఆధార్‌లో పేరుకూ కార్డులో పేరుకూ వ్యత్యాసం ఉండడం, ఆధార్ నంబరును తప్పుగా నమోదు చేయడం, ఆధార్ వేలిముద్రలు సరిపోలకపోవడం, ఇలా వివిధ కారణాలతో కార్డులు ఇనాక్టివేషన్లోకి వెళ్లిపోయాయి. దీంతో వాటిని యాక్టివేట్ చేయించుకునేందుకు తహశీల్దారు కార్యాలయానికి వెళ్లడం... ‘ఈ పని మా చేతిలో లేదు డీఎస్ఓ కార్యాలయానికి వెళ్లండి’ అక్కడి వారు పంపడం పరిపాటిగా మారింది. తహశీల్దారు కార్యాలయంలోనే పరిష్కరించాల్సిన ఇన్‌యాక్టివేషన్ సమస్యలను కూడా అక్కడి వారు డీఎస్ఓ కార్యాలయానికి పంపిస్తున్నారు. దీంతో పేదలు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్లోని డీఎస్ఓ కార్యాలయానికి వస్తున్నారు. సమస్య ఇక్కడ పరిష్కారం కాదని తెలుసుకొని ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపడితే పేదలకు ప్రయోజనం : జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోనూ ఇన్‌యాక్టివేషన్ కార్డులు ఉన్నాయి. వీటిని ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలో తెలియక పేదలు ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇన్‌యాక్టివేషన్ కార్డులను యాక్టివేట్ చేయించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలి. తద్వారా పేదలు తమ మండల కేంద్రానికి వెళ్లి తమ కార్డులను యాక్టివేట్ చేసుకుంటారు. -
అన్నీ నాసిరకమే!
కొందరు రేషన్‌షాపు డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వం సరఫరా చేసే నిత్యావసర వస్తువులేగాక నాసిరకమైన సబ్బులు, సర్ఫ ప్యాకెట్లు, టీపొడి, మంచినూనె, కొబ్బరినూనె తదితర వస్తువులను విక్రయిస్తున్నారు.. అవి వద్దన్నా బలవంతంగా లబ్ధిదారులకు అంటగడుతూ ఇబ్బందులపాలు చేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.. - పూడూరు - రేషన్ షాపుల్లో కల్తీ వస్తువులు - పట్టించుకోని అధికారులు - ఆందోళనలో లబ్ధిదారులు మండలంలో మొత్తం రేషన్ 34 షాపులు ఉన్నాయి. అందులో కొన్ని మినహా అన్నిట్లో ఈ సరుకులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం కేవలం బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోధుమలు మాత్రమే సరఫరా చేస్తోంది. అయితే పూడూరు మండలంలోని కొన్ని రేషన్ షాపుల డీలర్లు నాసిరకమైన సబ్బులు, ఇతర వస్తువులను కార్డుదారులకు అంటగడుతున్నారు. అధికారులు, డీలర్లు కుమ్మక్కై తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని షాపుల్లో ఈ వస్తువులన్నీ తప్పనిసరి కొనాల్సిందేనని నమ్మబలుకుతున్నారు. లే దంటే వచ్చేనెల రేషన్ కట్ అవుతుందని బెదిరిస్తున్నారు. ఈ తంతు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని ఈ వ్యవహారంపై ఎవరూ పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ట్ర నాయకుడే వీటిని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వాటిని అమ్మండి ఏమైనా ఇబ్బందులు వస్తే.. నేను చూసుకుంటాను.. అని అతను హామీ ఇస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. ఈ సరుకులు అమ్మకుంటే ఉన్నతాధికారులతో తనిఖీలు చేయిస్తూ వేటు వేయిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నాడన్నారు. డీలర్‌షిప్‌లు రద్దు చేస్తాం రేషన్ షాపుల్లో ప్రభుత్వం అందించే వస్తువులు మాత్రమే విక్రయించాలి. కొన్ని రేషన్‌షాపుల్లో కిరాణా వస్తువులు సైతం అనుమతి లేకుండా అమ్ముతున్నట్లు మాకు ఫిర్యాదులు అందాయి. ఇతర వస్తువులు అమ్మితే చర్యలు తీసుకుని డీలర్‌షిప్‌ను రద్దు చేస్తాం. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి పంచదార, బియ్యం, గోధుమలు, కిరోసిన్, గోధుమపిండి, కందిపప్పు సరఫరా అవుతోంది. త్వరలో అన్ని రేషన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటాం. - వెంక ట ఉపేందర్‌రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్, పూడూరు తనిఖీలు నిర్వహించాలి రేషన్ షాపుల్లో నాసిరకం సరుకులు అమ్ముతూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వచ్చిన సరుకులు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్న లబ్ధిదారులకు వాటిని అంటగట్టడం తగదు. ఏకంగా డీలర్ల సంఘం రాష్ర్ట నాయకుడే ఇలా పంపిణీ చేస్తున్నారు. వెంటనే అధికారులు ఆయా రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలి. - హరీశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండల అధ్యక్షుడు బ్లాక్‌లో అమ్ముతున్నారు కొందరు రేషన్ డీలర్లు బ్లాక్‌లో సరుకులను అమ్ముతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇవి అమ్ముకోవాలని జీఓ ఉందని చెబుతున్నారు. ప్రతి మండలంలో ఇదే తంతు జరుగుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర సరుకుకులు కొంటేనే బియ్యం ఇస్తామని లబ్ధిదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. వెంటనే జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. - కోళ్ల యాదయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి -
ప్రజాపంపిణీ అస్తవ్యస్తం..
- తేదీ6 దాటిన చౌకదుకాణాలకు చేరని రేషన్ - ఈ-పాస్‌ను వ్యతిరేకిస్తున్న డీలర్లు - కోర్టును ఆశ్రయించిన డీలర్లు - ఇబ్బందుల్లో లబ్ధిదారులు నెల్లూరు(రెవెన్యూ): ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ-పాస్ విధానం అమలులో జాప్యం కారణంగా లబ్ధిదారులు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ప్రజాపంపిణీ ప్రక్రియ 6వ తేదీదాటినా ప్రారంభం కాలేదు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ ఇప్పటి వరకు చౌకధర దుకాణాలకు చేరలేదు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లు రేషన్ దుకాణాల్లోకి అన్లోడ్ చేసుకోవడంలేదు. ఈ-పాస్ విధానాన్ని రేషన్ దుకాణాలలో అమలు చేసి, దానిపై డీలర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించిన తర్వాతే ప్రక్రియను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తు డీలర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో 1,874 చౌకధర దుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెల జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. రేషన్ లో అక్రమాలను అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించింది. ముందు నుంచి ఈ విధానాన్ని డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో మొదటి విడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తుగా పట్టణ ప్రాంతాల్లోని 350 చౌకదుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేసి రేషన్ పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు 120 ఈ-పాస్ మిషన్లు రావడంతో అధికారులు ఇబ్బందుల్లోపడ్డారు. 750 రేషన్‌కార్డులకు పైగా ఉన్న దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాల్లో పూర్తిస్థాయిలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించారు. అధికారులు సిఫార్సులను పట్టించుకోకపోవడంతో డీలర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ-పాస్ మిషన్లలో డేటా అప్లోడ్ చేయడం, సిమ్‌కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30కి పైగా ఈ-పాస్ మిషన్లలో అప్డేట్ చేయలేదు. ఈ-పాస్ విధానం అమలులో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే తాము రేషన్ డౌన్లోడ్ చేసుకుంటామని డీలర్లు ఎదురుతిరిగారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో తేడాలు వస్తున్నయని దాంతో డీలర్లు నష్టపోవాల్సి వస్తుందని ఈ సమస్యకు పరిష్కారం చూపేంతవరకు రేషన్ దింపుకునేదిలేదని డీలర్లు భీష్మించుకుకూర్చున్నారు. అధికారులు, డీలర్ల మధ్య కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చౌకదుకాణానికి రావడం షాపు తీయకపోవడంతో వెనుతిరుగుతున్నారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయవలసి ఉంటుంది. డీలర్లు మాత్రం స్టాక్ రాలేదని 5 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇచ్చే 10 రోజుల్లో రెండు శనివారాలు సెలవు రోజులు కాగా, మిగిలిన 8 రోజులు మాత్రమే రేషన్ పంపిణీ చేస్తారు. సమస్యలను పరిష్కరించి త్వరగా రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. రేషన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం : ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. డేటా అప్డేట్ చేయడం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 120 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశాం. వచ్చేనెలలో మిగిలిన చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. -సంధ్యారాణి, డీఎస్ఓ