కార్డుదారులకు కష్టాలు | problems of card holders | Sakshi
Sakshi News home page

కార్డుదారులకు కష్టాలు

Published Tue, Dec 6 2016 11:06 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

కార్డుదారులకు కష్టాలు - Sakshi

కార్డుదారులకు కష్టాలు

– ఇన్‌యాక్టివేషన్‌లో 1.50 లక్షల కార్డులు
– రేషన్‌ అందక పేదల అవస్థలు
– యాక్టివేషన్‌ కోసం తంటాలు
– ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తే ప్రయోజనం


ఈమె పేరు జి.తిపమ్మ. వయస్సు 70 ఏళ్లపైనే ఉంటుంది. నగరం పరిధిలో ఎంజీ కాలనీలో రేషన్‌ కార్డు (డబ్ల్యూఏపీ 129501500381) ఉంది. కార్డు ఇనాక్టివేషన్‌లో ఉందంటూ డీలర్‌ బియ్యం ఇవ్వలేదు.  తహశీల్దారు కార్యాలయానికి వెళితే  డీఎస్‌ఓ కార్యాలయానికి వెళ్లి కార్డు యాక్టివేట్‌ చేసుకోవాలని అక్కడి వారు చెప్పారు. దీంతో డీఎస్‌ఓ కార్యాలయానికి వచ్చిన విచారిస్తే కార్డు రద్దయ్యింది మరోమారు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒంటరిగా ఉంటున్నాను. ఉన్న కార్డు తీసేశారు. ఎవరిని అడగాలి? ఎక్కడి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలో తెలియదంటూ ఆమె ఆవేదన చెందింది. తిప్పమ్మ ఒక్కరేకాదు జిల్లావ్యాప్తంగా ఇలాంటి వారు చాలా మంది కార్డుదారులు ఇనాక్టివేషన్‌ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

అనంతపురం అర్బన్‌ : తెల్లకార్డుదారులు ఇన్‌యాక్టివేషన్‌ కష్టాలు  ఎదుర్కొంటున్నారు. ఇలా ఇన్‌యాక్టివేషన్‌లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.50 కార్డులు ఉన్నట్లు సమాచారం. కార్డుదారులకు నిత్యావసర సరకులు అందడం లేదు. దీంతో కార్డు యాక్టివేషన్‌ కోసం లబ్ధిదారులు తహశీల్దారు, పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కార్డు ఇన్‌యాక్టివేషన్‌కావడంతో నిత్యావసర సరుకుల అందక ఇబ్బంది పడుతున్నారు.

ఇన్‌యాక్టివేషన్‌ తిప్పలు :
    ఇన్‌యాక్టివేషన్‌ అయిన తమ కార్డులను యాక్టివేట్‌ చేయించుకునేందుకు పేదలు నానా అగచాట్లుప డుతున్నారు. ఆధార్‌ అనుసంధానం కాక కొన్ని, ఆధార్‌లో పేరుకూ కార్డులో పేరుకూ వ్యత్యాసం ఉండడం, ఆధార్‌ నంబరును తప్పుగా నమోదు చేయడం, ఆధార్‌ వేలిముద్రలు సరిపోలకపోవడం, ఇలా వివిధ కారణాలతో కార్డులు ఇనాక్టివేషన్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో వాటిని యాక్టివేట్‌ చేయించుకునేందుకు తహశీల్దారు కార్యాలయానికి వెళ్లడం... ‘ఈ పని మా చేతిలో లేదు డీఎస్‌ఓ కార్యాలయానికి వెళ్లండి’ అక్కడి వారు పంపడం పరిపాటిగా మారింది. తహశీల్దారు కార్యాలయంలోనే పరిష్కరించాల్సిన ఇన్‌యాక్టివేషన్‌ సమస్యలను కూడా అక్కడి వారు డీఎస్‌ఓ కార్యాలయానికి పంపిస్తున్నారు. దీంతో పేదలు వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్‌లోని డీఎస్‌ఓ కార్యాలయానికి వస్తున్నారు. సమస్య ఇక్కడ పరిష్కారం కాదని తెలుసుకొని ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌ చేపడితే పేదలకు ప్రయోజనం :
    జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోనూ ఇన్‌యాక్టివేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటిని ఎక్కడ యాక్టివేట్‌ చేసుకోవాలో తెలియక పేదలు ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇన్‌యాక్టివేషన్‌ కార్డులను యాక్టివేట్‌ చేయించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలి. తద్వారా పేదలు తమ మండల కేంద్రానికి వెళ్లి తమ కార్డులను యాక్టివేట్‌ చేసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement