ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేస్తున్న మహిళలు
కుందుర్పి : తాగునీటి సమస్య పరిష్కారం కోసం మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన 200 మంది రోడ్డెక్కారు. పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చినా అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం 7 గంటలకే గ్రామస్తులంతా రోడ్డుపైకి చేరుకున్నారు. ప్రదాన కూడలిలలో ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆందోళన కొనసాగించడంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ నవీన్, ఎంపీడీఓ నాగరాజు తదితరులు గ్రామస్తులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment