రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం.
భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది.
బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు.
ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం..
ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment