rice price
-
భారత్ రైస్ వస్తోంది.. కేజీ ధర ఎంతంటే?
రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం. భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది. బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. -
బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
భారతదేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బియ్యం పరిశ్రమలకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గత జులైలో బియ్యం ధరలను తగ్గించడానికి ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అంతే కాకుండా ఎగుమతి సుంకాలను సుమారు 20 శాతం వరకు పెంచింది. ఇవన్నీ దేశంలో బియ్యం కొరత రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త అని తెలుస్తోంది. -
‘సన్నాల ఎగుమతి నిషేధం’తో రాష్ట్ర రైతులకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్లో దేశీయంగా బియ్యం ధరలను అదుపులో ఉంచడంతోపాటు భవిష్యత్తు లో ఆహార కొరత లేకుండా చూసేందుకు కేంద్రం విదేశాలకు బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణ యం తీసుకోవడం తెలంగాణ రైతాంగానికి అశనిపాతంగా మారనుంది. కేంద్రం చర్యతో విదేశాల్లో డిమాండ్ ఉన్న సాగు రకాలైన జైశ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా బియ్యం వంగడాలు పండించే తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా రెండు సీజన్లలో సాగయ్యే సన్నాలను స్థానిక వినియోగంతోపాటు విదేశీ ఎగు మతుల కోసమే అధికంగా పండిస్తున్న రైతులు అధిక ధరలను పొందుతు న్నా రు. క్వింటాల్ సన్న ధాన్యాన్ని రూ. 2,500 నుంచి రూ. 3,000 మధ్య విక్రయిస్తూ లాభపడుతు న్నారు. కానీ ప్రస్తుతం ఈ రైతులు కూడా ఈ వానాకాలం పంట నుంచే దొడ్డు బియ్యం వైపు మరలే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎగుమతి సుంకం విధించినా పెరిగిన ఎగుమతులు... బియ్యం ఎగుమతులను కట్టడి చేసే ఉద్దేశంతో కేంద్రం గతేడాది 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. కానీ సుంకం విధించినా ఎగుమతులు ఆగకపోగా సుమారు 35 శాతం అధికంగా విదేశాలకు బియ్యం తరలి వెళ్లింది. అదే సమయంలో దేశంలో బియ్యం ధరలు ఒక్క ఏడాదిలోనే 11.5 శాతం మేర పెరిగాయి. అలాగే దేశంలో ఏటా 12 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా గతేడాది నుంచి అది 11 కోట్ల మెట్రిక్ టన్నులకు తగ్గింది. దీంతో కేంద్రం భవిష్యత్తు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొందని రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. దేశంలో 24 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం పండించే పరిస్థితులు ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ‘సాక్షి’తో అన్నారు. దేశీయ అవసరాలు, విదేశీ ఎగుమతులకే 40 శాతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఏటా 2 కోట్ల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వస్తోంది. ఇందులో కోటీ 40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు ధాన్యం పండిస్తున్న రైతులు... దాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నారు. మిగతా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్ను ల సన్న ధాన్యాన్ని (అంటే 40 శాతం పంటను) రైతులు స్వీ య అవసరాలతోపాటు స్థానిక, దేశీయ, విదేశీ విక్రయాల కోసం పండిస్తున్నట్లు ఓ మిల్లర్ల సంఘం నాయకుడు విశ్లేషించారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి వచ్చే సుమారు 36 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 20 లక్షల మెట్రిక్ టన్నులను స్థానిక, దేశీయ అవసరాలకు వినియోగి స్తున్న మిల్లర్లు... మరో 16 లక్షల మెట్రిక్ టన్ను లను వివిధ ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, పెద్దపల్లి తదితర జిల్లాల్లోని సన్నబియ్యాన్ని ఎగుమతులకు వినియోగిస్తున్నారు. ఆ రకాలను మినహాయించాలి.. బాస్మతీయేతర ముడి బియ్యం ఎగుమతిపై నిషేధం తెలంగాణ రైతుల ప్రయోజనాలకు విరుద్ధం. జైశ్రీరాం, ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ మొదలైన రకాలు దేశంతోపాటు విదేశాల్లోనూ ఎక్కువ మంది ఇష్టపడే వరి రకాలు. తెలంగాణలోనే పండే ఈ రకాలు ఎకరాకు బాస్మతి కంటే తక్కువ దిగుబడి ఇస్తాయి. అలాంటి శ్రేష్టమైన రకానికి లాభ దాయకమైన ధరలను పొందకపోతే రైతులు డిమాండ్‌లేని సాధారణ రకాలను సాగు చేస్తారు. బాస్మతి తర హాలోనే తెలంగాణలోని సూపర్ ఫైన్ రకాలను నిషేధం నుంచి మినహాయించాలి. –తూడి దేవేందర్‌రెడ్డి, దక్షిణ భారత మిల్లర్ల సంఘం నాయకుడు బియ్యం సేకరణలో రాష్ట్రానికి కేంద్రం సహకరించట్లేదు.. ప్రస్తుతం దేశానికే అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ ఉంది. కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తే ప్రపంచానికి కూడా అవ సరమైన బియ్యాన్ని అందిస్తాం. ఇప్పటికే ఏటా 3 కోట్ల ట న్నుల ధాన్యాన్ని పండిస్తున్న రైతులు వచ్చే రెండేళ్లలో మరో కోటి టన్నులు అదనంగా పండించబోతున్నా రు. అసలు యా సంగిలో దేశంలో అత్యధికంగా వరి సాగవుతున్న రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ట్రాల్లో వరి పంట తగ్గడడం వల్లనే కేంద్రం ఎగుమ తులపై నిషేధం విధించింది. తెలంగాణలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని సేకరించే విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఆంక్షలను పక్కనపెట్టి ప్రస్తుతం మిల్లులు, గోదాముల్లో ఉన్న ధాన్యం, బియ్యాన్ని ముందుగా ఎఫ్‌సీఐ సేకరించాలి. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
భగ్గుమంటున్న బియ్యం ధరలు
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరి ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. అయినా బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కరోనా కారణంగా గ్రేటర్లో బియ్యం వినియోగం కూడా భారీగా తగ్గింది. వివిధ ఉపాధి అవకాశాలు, వృత్తులను నమ్ముకొని వచ్చిన ఇతర జిల్లాల్లోని వారు తమతమ సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో స్థానికంగా వినియోగం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగం.. డిమాండ్ తగ్గినా గ్రేటర్లో మాత్రం ధరలు తగ్గడం లేదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సాక్షి, హైదరాబాద్: బియ్యాన్ని వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో చేర్చి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల బియ్యం ధరలు తగ్గి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించారు. గతంలో బియ్యంపై 4 శాతం వ్యాట్‌ను వసూలు చేసేవారు. వ్యాట్ వసూలు చేయడం వల్లే బియ్యం ధరలు పెరుగుతున్నాయని వ్యాట్‌ను తొలగించాలంటూ రైస్ మిల్లర్లు, వ్యాపారులు ఆందోళన చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలను సమర్పించారు. జీఎస్టీ పుణ్యమా అని బియ్యంపై అసలు పన్నులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బియ్యం అమ్మకాలు ఫ్రీ మార్కెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు బియ్యం ధరలు తగ్గుతాయని సంతోషించారు. వ్యాపారులపై పన్నుల భారం తగ్గింది కానీ... వినియోగదారులపై ధరాఘాతం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం గ్రేటర్లో బియ్యం కిలో రూ. 46 నుంచి రూ. 50కి తక్కువ లేవు. వ్యాట్ ఉన్నప్పుడూ అదే ధర వ్యాట్ తొలగించిన తర్వాతా అదే ధరకు బియ్యం అమ్ముతుండటంతో వ్యాట్‌తో ఎవరికి లాభం కలిగిందనే విషయం అందరికీ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు మిల్లర్ల నుంచి కిలో రూ. 28 నుంచి రూ. 30కు కొనుగోలు చేస్తున్నారు. కానీ సాధారణ వినియోగదారులకు కిలో రూ. 46 నుంచి రూ. 50లకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. (ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు) వరి సాగులో గణనీయమైన మార్పు తెలంగాణ పూర్తిగా వరిపై ఆధారపడిన రాష్ట్రంగానే చెప్పవచ్చు. ఏటా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వరినే అధికంగా సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో ఊహించని విధంగా దిగుబడి పెరిగింది. ఖరీఫ్‌లో 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి కొనుగోలుచేసింది. ఇక మిల్లర్లు నేరుగా రైతుల నుంచి మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి ఉంటారని అంచనా. అలాగే ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అంటే కొందరు మిల్లర్లు నేరుగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుచేసే అవకాశం ఉందని అంటున్నారు. ఖరీఫ్ తర్వాత రెండోపంటగా రబీలో ఊహించని విధంగా వరి దిగుబడి పెరుగుతున్నా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్కెట్లో సన్న బియ్యం కొనాలంటే కనీసం రూ. 46 పెట్టనిదే దొరికే పరిస్థితి లేదు. బియ్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిన ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, మినహాయింపు ఫలాలు వినియోగదారులకు అందేలా చూస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకూ బియ్యం విషయంలో మాత్రం ఏచర్య తీసుకోలేదు. -
వంటిల్లు డీలా!
కొండెక్కిన కూరగాయల ధరలతో జనం సతమతం - ఘాటెక్కిన పచ్చి మిర్చి... భయపెడుతున్న క్యా‘రేట్’ - చుక్కలతో పోటీ పడుతున్న చిక్కుళ్లు.. బియ్యం ధరలకూ రెక్కలు.. ‘మా ఇంట్లో ఎప్పుడూ ఫ్రిజ్ నిండా కూరగాయలుండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్న మార్కెట్‌కు రూ.500 తీసుకెళ్తే.. తెచ్చుకుందామనుకున్న కూరగాయల్లో సగమంటే సగం కూడా రాలేదు. మాకిష్టమైనవి కాకుండా ఏవి ధర తక్కువో అడిగడిగి కొనాల్సి వచ్చింది. ఈ ధరలు తగ్గేదాకా ఆకుకూరలతో సరిపెట్టుకోక తప్పదనిపిస్తోంది. ఉల్లిపాయలొక్కటే కొండెక్కలేదు. లేకపోతే పచ్చడి మెతుకులూ గగనమయ్యేవి’ అంటూ తిరుపతికి చెందిన స్వరూప వాపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 90 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి : కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పచ్చి మిర్చి ఘాటెక్కింది. బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్ తదితర కాయగూరలు కందిపప్పు ధరను మించిపోయాయి. కొన్ని కూరగాయలైతే రెండు నెలల కిందటితో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరలను చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. కిలో బీన్స్/ చిక్కుళ్లు / క్యారెట్.. ప్రాంతం, నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో పచ్చి మిర్చి రూ.80 – 85 పలుకుతోంది. కాకర, గోరుచిక్కుడు, బీట్రూట్, కీరదోస, వంగ తదితర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. విజయవాడ బహిరంగ మార్కెట్లో కిలో కంద గడ్డ రూ.70పైగా ఉంది. రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్లో కూడా కిలో కంద రూ.60కి పైగా అమ్మడం గమనార్హం. సాధారణ రోజుల్లో కిలో రూ.15, 20 ఉండే కీరదోస ప్రస్తుతం విజయవాడ రైతు బజారు/ కాళేశ్వరరావు మార్కెట్లో ఏకంగా రూ.45కి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.12 ఉండగా విజయవాడలో రూ.20 నుంచి 22 వరకూ అమ్ముతుండటం గమనార్హం. విజయవాడ బహిరంగ మార్కెట్లో కిలో టమోటా రూ.30పైగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, తిరుపతితోపాటు చిన్న పట్టణాల్లో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో పొట్ల కాయను దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.20కి అమ్ముతున్నారు. ఎండకు తోటలు ఎండిపోవడం వల్లే.. కరువు వల్ల నీరు లేక కూరగాయల తోటల సాగు తగ్గడం, ఎండలకు తోటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే కూరగాయల ధరలు పెరిగాయని, మరో నెలన్నర పాటు ఈ ధరలు ఇలాగే ఉంటాయంటున్నారు. మూడు నాలుగు నెలలు కష్టపడి కూరగాయలు పండిచిన వారికి వచ్చే మొత్తం కంటే ఒకటి రెండు రోజులు మార్కెట్లో పెట్టి అమ్మేవారు, దళారులే ఎక్కువ డబ్బు పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. ‘మార్కెట్లో కిలో పచ్చి మిర్చి రూ.80కి అమ్ముతున్నారు. మాకు మాత్రం రూ.40 కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంత అన్యాయం చేస్తున్నారు...’ అని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లెకు చెందిన లోకనాథం నాయుడు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ’కిలో చిక్కుడు కాయలు మావద్ద రూ.40కి తీసుకుంటున్నారు. వ్యాపారులేమో మార్కెట్లో రూ.75, 80 అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దుకాణం అద్దె, మనిషికి కూలీ, ఇతర ఖర్చులు అంటారు. మేం అమ్ముకోలేం కాబట్టి వారు చెప్పిన రేటుకు ఇచ్చి వెళ్లక తప్పడంలేదు’ అని వైఎస్సార్ జిల్లా సుండుపల్లికి చెందిన రైతు కులశేఖర్ అన్నారు. ధరలు ఇలా మండిపోతుంటే ఏమి తిని బతకాలంటూ పేదలు వాపోతున్నారు. బెంబేలెత్తిస్తున్న బియ్యం ధర మార్కెట్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి మొదటి శ్రేణి కొత్త బియ్యం కిలో రూ.33 ఉండేది. ఇప్పుడు ఇవే బియ్యం ధర రూ.37, 38కి పెరిగాయి. పాత బియ్యమైతే కిలో రూ.44 నుంచి ఏకంగా రూ.50కి పెరిగాయి. మంచి క్వాలిటీ అయితే కిలో రూ.52 – 55 వరకు అమ్ముతున్నారు. వంద కిలోల బస్తా సోనా మసూరి పాత బియ్యం రూ.5000 పలుకుతోంది. నిజామాబాద్ సన్నాలు పేరు చెప్పి రూ.5300 నుంచి రూ.5500 కూడా అమ్ముతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తగ్గడం వల్ల బియ్యం ధరలు పెరిగాయి. కర్నూలు సోనా మసూరి పేరు చెప్పి చాలా ప్రాంతాల్లో కల్తీ బియ్యం అంటగడుతున్నారు. ఎంపీయూ 1060 రకం ధాన్యం సోనా మాసూరి లాగా ఉంటుంది. దీనిని సోనామసూర బియ్యంలో 20 నుంచి 30 శాతం కలిపి అమ్ముతున్నారు. మరికొందరు తగ్గుబియ్యంలో రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించి కలిపేస్తున్నారు. పుల్లగూరలే గతి... నెల రోజులుగా ఎండలే అనుకుంటే కూరగాయల ధరలూ మండిపోతున్నాయి. అర కిలో కూరగాయలతో తాళింపు చేసుకునేటోళ్లం పావు కిలోకే పరిమితమయ్యాం. అందరికీ అందుబాటులో ఉండే వంకాయల ధర కూడా పెరిగిపోయింది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటకూర, చిర్రాకు, బచ్చలాకుతో పుల్లగూర చేసుకుని కానిచ్చేస్తున్నాము. – కనకదుర్గ, అజిత్‌సింగ్‌నగర్, విజయవాడ -
సన్నబియ్యంకుతకుత !
► పెరుగుతున్న సన్నబియ్యం ధరలు ► పది రోజుల్లోనే క్వింటాలుపై రూ.800 పెరుగుదల ► మార్కెట్లో క్వింటాలు రూ.4800 నుంచి రూ.5600 ► మిల్లర్ల వద్ద అక్రమ నిల్వలు ► పట్టించుకోని విజిలెన్స్‌శాఖ కడప అగ్రికల్చర్ : ఒక వైపు వర్షాభావంతో కేసీ కెనాల్‌కు సాగు నీరు విడుదల కాక వరిసాగుకు నోచుకోలేదు. మరోవైపు నిరుడి ధాన్యపు నిల్వలను బియ్యంగా మలచి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇక ధాన్యం పండే సూచనలు కనిపించలేదని ప్రచారం చేస్తూ వ్యాపారులు బియ్యం ధరలు అమాం తంగా పెంచేశారు. సన్నబియ్యానికి కొరత బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరను పెంచి సామాన్యులతోపాటు మధ్య తరగతి వారికి దడ పుట్టిస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువుల్లోను, ప్రాజెక్టుల్లోను నీరు లేక బోసి ఉన్నాయి. దీంతో బోరుబావుల్లో నీరు అడుగంటింది. ఏటా బోరుబావుల కింద ఎంతోకొంత వరిసాగు చేసే రైతులు ఈ ఏడాది వరిసాగు చేయలేకపోయారు. అలాగే కేసీ కెనాల్‌కు అధికారికంగా నీరు విడుదల కాకపోవడంతో పెద్దగా పంటసాగుకు నోచుకోలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు ధరలను అమాంతం పెంచేశారని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం ధరలు (జిలకర్ర, సోనామసూర) ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు వాటి ధరలను వ్యాపారులు, మిల్లర్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది నుంచి బియ్యం ధరలు నెలకునెలకూ పెరగడమే గాని తగ్గడం లేదు. వారం క్రితం క్వింటాలు రూ. 4800 ఉండగా సన్నబియ్యం ధర ఇప్పుడు మార్కెట్లో రూ. 5600 ధర పలుకుతున్నాయి. ఇవి కూడా కొత్త బియ్యం 25 కి లోల బస్తా వారం క్రితం రూ.850లు ఉం డగా అదే బియ్యం ఇప్పుడు రూ.1000 పలుకుతున్నాయి. అలాగే పాత బియ్యం ధర 25కిలోల బస్తా రూ.1200 ఉండగా నేడు అదే బస్తా రూ.1400లు పలుకుతున్నాయి. పాత బి య్యమైతే ఒకరేటు, కొత్త బియ్యమైతే మరో రేటు పలుకుతుండడం విశేషం. మిల్లర్లు గోడౌన్లలో అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. విజిలెన్స్ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వారు గోడౌన్లపై దాడులు చేస్తే మిల్లర్ల, వ్యాపారుల బాగోతం బయటపడుతుందని వినియోగదారులు అంటున్నారు. తగ్గిన పంట సాగు.. : జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో 91,970 ఎకరాలలో వరిసాగయ్యేది. ఈ ఏడాది వర్షాభావం వల్ల ఖరీఫ్ సీజన్ అంతా కలిపి బోరుబావుల కింద కేవలం 52,537 ఎకరాలలోనే సాగు చేశారు. ఈ సాగు కూడా సన్నబియ్యం ధరల పెరుగుదలపై ప్రభా వం చూపుతోంది. ఏటా ఖరీఫ్ సీజన్లో 1,36,155 ఎకరాల మొత్తంలో వరి పంటసాగైతే 32.67 లక్షల క్వింటాళ్ల ధా న్యం దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది 52,537 ఎకరాలకుగాను 12.60 లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సన్నబియ్యం కిలో రూ. 30లకే ఒట్టిమాట.. : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం పర్యటనలో ఓ కూలీ బియ్యం ధరలపై ప్రస్తావించినప్పుడు బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో కిలో 30 రూపాయలకే సన్న రకాల బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి మాట చెప్పారు. జిల్లాలోని అన్ని రైతు బజార్లలో తప్పని సరిగా విక్రయించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి నెల రోజులు దాటినా ఇంత వరకు అతీగతీ లేదని నిరుపేదలు, సామాన్యులు విమర్శిస్తున్నారు. బయో మెట్రిక్ పద్ధతి వచ్చినా రేషన్ బియ్యం పక్కదారి..: జిల్లాలోని రేషన్ షాపుల్లో బియ్యానికి బయోమెట్రిక్ పద్ధతిని ప్రభుత్వం అమలు చేస్తున్నా కొందరు డీలర్లు పాత కార్డులను తమ వద్ద ఉంచుకుని కార్డు రేషన్‌తో అవసరంలేని ఆయా కార్డుదారులను రప్పించుకుని వేలి గుర్తులను బయోమెట్రిక్‌లో వేయించి వారికి అంతోఇంతో ఇచ్చి వారి కోటా బియ్యాన్ని తీసుకుని ఆ బియ్యాన్ని వ్యాపారులకు, మిల్లర్లకు అందజేస్తున్నట్లు సమాచారం. అలాగే మరి కొందరు కార్డులు రద్దు కాకుండా ఆయా కార్డుల బియ్యం, ఇతర సరుకులు డీలరే అమ్ముకునేలా వేలి గుర్తులు వేసి పోతున్నారని తెలిసింది. ఈ బియ్యాన్ని రైస్‌మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుండడం వల్లే అధిక ధరల పెరుగుదలకు కారణంగా అవుతోందని వినియోగదారులు వాపోతున్నారు. -
సన్నాలు..సై
బాపట్ల : సన్న బియ్యం సై కొడుతున్నాయి. మూడు నెలల్లో కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.38కు చేరింది. ఈ నెలాఖరుకు రూ.50లకు చేరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఖరీఫ్, రబీ సీజన్లలో పంట దిగుబడి తగ్గడం, ఈ ఏడాది వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గత ఏడాది నీటి ఎద్దడి కారణంగా కర్నూలు ప్రాంతంలో సన్నబియ్యం దిగుబడి సక్రమంగా లేకపోవటంతో బాపట్ల బీపీటీకి డిమాండ్ వచ్చిపడింది. ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో సాగర్ ఆయకట్టుకింద సుమారు 1.25 లక్షల హెక్టార్లలో పంట వేయకపోవటంతో ధాన్యానికి డిమాం డ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎగుమతులు జోరందుకోవటంతో రైతులు ధాన్యం అమ్మేందుకు ముందుకు రావటంలేదు. మరింత ధర కోసం వేచి చూస్తున్నారు. దీనికితోడు మన రాష్ట్రంలో ధాన్యాన్ని మిల్లులో ఆడిస్తే ఐదుశాతం వ్యాట్, రెండు శాతం సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంది. దీంతో వ్యాపారులు నేరుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేందుకే ఇష్టపడుతున్నారు. అక్కడ బియ్యంపై పన్ను లేదు... కొత్త రాష్ట్రమైన తెలంగాణతోపాటు క ర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో బియ్యంపై పన్ను లు లేకపోవటంతో ఇక్కడి వ్యాపారులు నేరుగా ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అక్కడి రైస్‌మిల్లులు ఇక్కడి నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మర ఆడించి బియ్యా న్ని అమ్ముకుంటున్నాయి. ఈ కారణంతో మన రాష్ట్రాంలోని రైస్‌మిల్లులకు పనిలేకుండా పోయింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గింది... ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లా లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. ప్రకా శం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 48.50 వేల హెక్టార్లు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 1.28లక్షల ఎకరాలు, గుం టూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీ ర్ణం 2.27 లక్షలు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 70వేల ఎకరాలుగా ఉంది. అయితే సాగర్ ఆయకట్టుతోపాటు, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి కారణంగా పంటలు పండించవద్దని వ్యవసాయాధికారులు, ఇరిగేషన్ అధికారులు పలు సూచనలు, సలహాలు ఇవ్వటంతో సుమారు రెండు జిల్లాల్లో 1.25 లక్షల హెక్టార్లలో భూమి సాగు కాలేదు. దీంతో ఈ ఏడాది ధాన్యం దిగుబడి తగ్గుతుందని ముందుగానే అంచనా వేసిన వ్యాపారులు తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యానికి ధరలు పెంచి ఎగుమతులు చేస్తున్నారు. ప్రస్తుతం బియ్యం ధరలు ఇలా ... సన్న బియ్యం తినే వారి సంఖ్య పెరిగిపోవటంతో బీపీటీలపై మోజుపెరిగింది. ఎక్కువ మంది ఈ బియ్యంవై పే మొగ్గుచూపుతున్నారు. బీపీటీ రకం 75 కిలోల బస్తా గత నెలలో రూ.1300 నుంచి రూ.1350 ఉండగా ప్రస్తుతం రూ.1650-రూ.1700 మధ్య పలుకుతోంది. అదే పాత ధాన్యం అయితే రెం డు వేల రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇదేవిధంగా 2716 రకం రూ.1050 నుంచి రూ.1300కు, 74 ర కం రూ.1200 నుంచి 1500కు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా సన్న రకం ధాన్యం పండుతుంది. అయితే అక్కడ కూడా నీటి ఎద్దడి కారణంగా పంట లేకపోవటంతో ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. బాపట్లలో కేంద్రీకృతమైన వ్యాపారం గతంలో హైదరాబాద్‌కు గుంటూరు, కర్నూలు నుంచి రోజు 100లారీలకుపై గా బియ్యం ఎగుమతులు జరుగుతుం డేవి. కృష్ణాపరివాక ప్రాంతంలో పంట దెబ్బతినటం, తమిళనాడు, మహారాష్ట్ర లో ధాన్యం పండకపోవటంతో ధాన్యం వ్యాపారులు బాపట్లవైపుచూస్తున్నారు. ఇక్కడ పండే సన్నాలకు మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్, కర్నూలు, నల్లగొండ, విశాఖపట్నం, తమిళనాడు, క ర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వ్యా పారులు బాపట్ల ప్రాంతంలో మకాం వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. -
పండగపూట పస్తులేనా ?
పంచదార పైపైకే వెళ్తోంది.. మంచినూనె చెంతకు రానంటోంది. బియ్యం ధర మండిపోతోంది. పప్పుల ధరలు తిప్పలు పెడుతున్నాయి. ఇలా.. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందనంత దూరానికి చేరాయి. బంధువులతో కలసి సరదాగా జరుపుకుందా మనుకుంటున్న దసరా పండుగ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో వాటిని కొనే పరిస్థితి లేక పండుగ నాడు కూడా పస్తులుండాల్సిందేనా అన్న నిరాశలో పేదలున్నారు. పాలమూరు : ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది. పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడం ఇబ్బందిగా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు పండుగ పూట పిండివంటలు చేసుకునేందుకు జంకుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పు, పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. ఓ వైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు రేషన్ సరుకుల్లో కోత.. వెరసి పండగ పూట వస్తులుండే పరిస్థితి నెలకొంది. బతుకమ్మ, దసరా, బక్రీద్.. వరుసగా వస్తున్న పండుగలు పేద, మధ్య తరగతి వారికి భారంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఈ పండుగలను ఆర్భాటవంగా జరుపుకోవాలని చెబుతున్న ప్రభుత్వం ధరలను నియంత్రించి రేషన్ సరుకులను సకాలంలో అందించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 9 సరుకుల జాడే లేకుండా పోయింది. జిల్లాలో 10 లక్షల కుటుంబాలున్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9.57 లక్షల వరకున్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కెర మాత్రమే సరఫరా చేస్తున్నారు. అమ్మహస్తం పేరుతో ఇస్తున్న 9 రకాల వస్తుల్లో ప్రస్తుతం బియ్యం,చక్కెర మాత్రమే ఇస్తున్నారు. దీంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పండుగల సందర్భంగా ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండటం లేదు. బయటి మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ప్రతి సంవత్సరం పండుగకు అదనంగా అరకిలో చక్కెర ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. నిలిచిపోయిన పామోలిన్, కందిపప్పు రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతినెల జిల్లాకు 8లక్షల పామోలిన్ ప్యాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్రతి రేషన్ కార్డుపై లీటర్ పామోలిన్ రూ. 40కు ఇచ్చేవారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పామోలిన్ రూ.55 ఉంది. కంది పప్పుదీ అదే పరిస్థితి. జిల్లాకు ప్రతినెల దాదాపు 8 లక్షల కంది పప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా అవి 5 నెలలుగా నిలిచిపోయాయి. కందిపప్పు రేషన్ దుకాణాల్లోకి కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్లో రూ.80కి విక్రయిస్తున్నారు. గత నెల వరకు బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కెర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్ షాపులో కిలో రూ.13.50కు లభించే పంచదార కాస్తా బహిరంగ మార్కెట్లో రూ.34కి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
బియ్యం ధరకు రెక్కలు
సాక్షి, కర్నూలు: జిల్లాలో ‘సన్న’గా సాగుతున్న దోపిడీ ఇది. ‘కృత్రిమ’ంగా తయారవుతున్న కుట్ర ఇది. అధికారుల ఉదాసీనత.. అక్రమార్కుల సైగలతో నల్లబజారు తలుపులు బార్లా తెరుచుకుంటున్నాయి. ఫలితంగా పెరిగిన ధర మార్కెట్లో రాజ్యమేలుతుంది. మధ్య తరగతిని అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర రికార్డు స్థాయిలో పెరిగింది. సోనా మసూరి పాత బియ్యం ప్రస్తుతం క్వింటా రూ. 5 వేలుపైనే పలుకుతోంది. బ్రాండ్ పేరుతో కొందరు క్వింటా రూ. 5,400కు అమ్ముతున్నారు. గత నెలలో రూ.4600 ఉండేది. స్వర్ణ రకం బియ్యం ధర కూడా ఇదే తరహాలో చుక్కలను తాకుతోంది. వ్యాపారులు, మిల్లర్లు బహిరంగ మార్కెట్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవడంతో సమస్య తలెత్తుతోంది. కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో యంత్రాంగం పెద్దగా ఇటువైపు దృష్టి సారించకపోవడంతో బడా వ్యాపారులు చెలరేగిపోతున్నారు. దీంతో వ్యాపారులు, మిల్లర్లు ఆడిందే ఆటగా తయారైంది. పరిస్థితి ఇలాగే ఉంటే ధర మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జిల్లా అవసరాలకు.. జిల్లాలో ఏడాదికి ఉత్పత్తయ్యే ధాన్యం (రెండు పంటలు కలిపి) 80 లక్షల టన్నులు. ఉత్పత్తయ్యే ధాన్యాన్ని బియ్యంగా తయారు చేస్తే 52 లక్షల టన్నులవుతాయి. 42 లక్షల జనాభా ఉన్న జిల్లా ప్రజల అవసరాలకు ఇందులో ఆరేడు లక్షల టన్నుల బియ్యం సరిపోతాయి. జిల్లాలో ఎక్కువగా కర్నూలు సోనా, స్వర్ణ రకం బియ్యం వినియోగిస్తున్నారు. అయితే జిల్లాలో ఎక్కువగా వినియోగించే సోనామసూరి రకం ఉత్పత్తి 35 లక్షల టన్నులుంటుంది. జిల్లాలో పండించే ధాన్యాన్ని విశాఖ, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి జరుగుతోంది. ప్రస్తుతం పలుకుతున్న ధర గతంలో ఎప్పుడూ లేదని పలువురు ఆందోళన చెందుతున్నారు. బియ్యం ధర తలుచుకుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. గతంలో ఎగువ, మధ్య తరగతి ప్రజలు మాత్రమే వినియోగించే సన్నాలు ఇపుడు సామాన్యులు సైతం వినియోగిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ.. ఇది పరిస్థితి కొనసాగితే కేజీ రూ. 60 దాకా పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన బియ్యం ధర మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన ధర వల్ల జిల్లా ప్రజలపై ఏడాదికి రూ. 300 కోట్ల వరకూ అదనపు భారం పడే అవకాశముంది. బియ్యం ధర పెరగడానికి అక్రమార్కులైన కొందరు వ్యాపారులు, మిల్లర్లు అత్యాశకు పోయి కృత్రిమంగా కొరత సృష్టిస్తుండడమే కారణం. రైతుల నుంచి ధాన్యం కొనేటప్పుడు ధర తక్కువగా ఉంటోంది. బియ్యం కొనే వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. అయిదుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి 50 కేజీల బియ్యం అవసరమవుతాయి. నెలకు రూ. 2,500 వరకు బియ్యానికే కేటాయించాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనికిరాని రూ. 30 బియ్యం..! ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో మార్కెట్ మిల్లర్లు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. గత సంవత్సరం బియ్యం ధరను నియంత్రించడానికి ప్రభుత్వం సోనా బియ్యాన్ని కేజీ రూ. 30కే అమ్మే ప్రయత్నం చేసింది. అయితే అందులో నూకలు ఎక్కువగా ఉండటం, అన్నం ముద్దవుతుండడంతో కొనుగోలుకు ప్రజలు ముందుకు రాలేదు. ఈ బియ్యాన్ని ఇప్పుడు రైతు బజార్లలో అమ్మకానికి పెట్టినా ఆదరణ లభించడంలేదు. నాణ్యత లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఇవి వృథాగా పడి ఉన్నాయి. యంత్రాంగం ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలని, అక్రమ నిల్వలు వెలికి తీసి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. -
సన్న బియ్యం..ధర భారం
కొత్తగూడెం: ఖరీఫ్ కలిసి వచ్చేలా లేదు..రబీ సీజన్లో రైతుల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా నిండుకున్నాయి. ఇక బియ్యం ధరలకు రెక్కలు వస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్‌కు రూ.200 మేరకు బియ్యం ధరలను వ్యాపారులు పెంచేశారు. ఖరీఫ్‌లో వర్షాలు సక్రమంగా కురవకపోతే ఈ రెండు నెలల్లో కిలో బియ్యం ధర రూ.70కి చేరవచ్చని వ్యాపారులు అంటున్నారు. జిల్లాలోని రైస్ మిల్లుల వద్ద స్టాక్ లేకపోవడం, నల్లగొండ జిల్లా నుంచే అధికంగా బియ్యం ఇక్కడకు సరఫరా అవుతుండటంతో అక్కడి బడా వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బియ్యం మార్కెట్లోకి వచ్చాయి. అప్పటి వరకు సన్నబియ్యం మొదటిరకం రూ.40ల వరకు ఉన్న ధరను రూ.38కి తగ్గించి వేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెల నుంచి బియ్యం ధరలు ఎగిసి పడుతున్నాయి. జిల్లాలోని మిల్లుల్లో స్టాక్ అయిపోవడం, గత ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం ఎక్కువగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, కోదాడకు చెందిన వ్యాపారులు అధికంగా కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఆ జిల్లా నుంచే బియ్యం ఎక్కువగా జిల్లా మార్కెట్‌కు వస్తున్నాయి. అక్కడకు చెందిన బడా వ్యాపారులు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలను ఏకపక్షంగా పెంచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఏడునెలల్లో రూ.12 పెంపు.. గత ఏడాది వర్షాలు సకాలంలో కురవడం, ఖరీఫ్‌లో సాంబమసూరి ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉండటంతో డిసెంబర్లో రూ.38 ఉన్న కిలో బియ్యం ఇప్పుడు రూ.50కి చేరింది. రైతుల వద్ద ధాన్యం పూర్తిగా అయిపోవడం, వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యం సైతం చివరి దశకు చేరుకోవడంతో అమాంతం ధర పెరిగిపోయింది. బియ్యం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే తమ పరిస్థితి ఏమిటని పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నల్లగొండ జిల్లా నుంచి మాత్రమే బియ్యం దిగుమతి ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయాలు చేస్తున్నారు. అదే మన జిల్లాలో అందుబాటులో ఉంటే ఒకటి, రెండు రూపాయలైనా తక్కువగా ఉండేదని పలువురు అంటున్నారు. ఒకవేళ వర్షాలు వస్తే ఖరీఫ్ సీజన్ ముగిసే సమయానికి కాని ధాన్యం అందుబాటులోకి రాదు. లేనిపక్షంలో ఈ బియ్యం ధరలకు అడ్డూఅదుపు ఉండదని వాపోతున్నారు. రైస్‌మిల్లులకూ గడ్డుకాలం.. దళారులంతా నల్లగొండ జిల్లాలోని రైస్ మిల్లులకు ధాన్యం విక్రయించారు. స్థానికంగా ఉన్న రైస్ మిల్లుల్లో స్టాక్ లేదు. మిల్లులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. జిల్లాలోని తల్లాడలో 12 పారా బాయిల్రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు ఇప్పటికే మూత పడ్డాయి. కొత్తగూడెంలో ఎనిమిది రైస్ మిల్లులు ఉండగా అందులో నాలుగు మిల్లులు, పాల్వంచలో రెండు మిల్లులు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని మిల్లులు మూతపడే అవకాశాలు లేకపోలేదు. అధికారులు స్థానికంగా ఉన్న మిల్లులకు ధాన్యం తరలించేందుకు చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా దళారులు ఇష్టారాజ్యంగా ధాన్యం కొనుగోలు చేసినా అధికారులెవరూ పట్టించుకోకపోవడం మరో కారణంగా చెప్తున్నారు. గత ఏడాది బియ్యం ధరలు పెరగడంతో హడావిడిగా కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు రూ.30లకే సన్నబియ్యాన్ని అందించారు. బయట మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటం, కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు తగ్గించిన ధర ప్రకారం తమకు బియ్యం ఇవ్వకపోవడంతోనే నష్టపోవాల్సి వచ్చిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు కూడా సబ్సిడీ ఇస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేదికాదని వ్యాపారులు అంటున్నారు. పెరిగిన బియ్యం ధరలివే... బియ్యం ప్రస్తుతం కేజీ రూ.50 వరకు ఉంది. గత ఆరు నెలల కాలంలో రూ.22 వరకు బియ్యం ధర పెరగడం విశేషం. -
నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి
జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ ఆదేశం ఒంగోలు కలెక్టరేట్ : నిత్యవసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్‌నాయక్ ఆదేశించారు. స్థానిక తన చాంబ ర్లో బుధవారం సాయంత్రం నిర్వహించి న జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, పౌరసరఫరాలశాఖ ద్వారా రైతు బజార్లలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే కందుకూరు రైతు బజార్లో నెల్లూరు సన్నాలు బియ్యాన్ని కిలో 30 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపా రు. ఒంగోలులోని రైతు బజార్లలో కూడా ఆ రకం బియ్యాన్ని అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్మిల్ల ర్ల యజమానులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సాధారణ ధరకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు బజార్లలో కూడా కొన్నిరకాల నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. టమోటా కిలో 32, కందిపప్పు 62, మినుములు 44, ఉల్లిపాయలు కిలో 17 రూపాయల ధర ఉందన్నారు. ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను జేసీ ఆదేశించారు. ప్రజల జీవితాలతో చెలగాటం : మాగులూరి వ్యాపారస్తులు కల్తీ మినరల్ వాటర్ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మాగులూరి నాగేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తనిఖీలు నిర్వహించి లెసైన్స్ లేని మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయించాలని కోరారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాను ఒంగోలు దక్కించుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని మరో సభ్యుడు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రంగాకుమారి, సివిల్ సప్లయిస్ డీఎం కొండయ్య, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీలు రవీంద్ర, జెన్నమ్మ, తూనికలు, కొలతలశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం.. ప్రియం
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సన్న బియ్యం ధర ఆకాశాన్నంటుతోంది. నిన్న మొన్నటి వరకు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యం ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. జీరోపై ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 62.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇందులో 50 శాతం గోదాముల్లోనే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం గోదాముల్లోకి చేరడంతో మార్కెట్లో సప్లయ్ తగ్గిపోయి బియ్యం ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల క్రితం క్వింటా బియ్యం ధర రూ.3వేల నుంచి రూ.3,100 ఉండగా.. నేడు రూ.3,500లకు చేరుకుంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తర్వాత నుంచి ధరలు పెరుగుతుండటం గమనార్హం. కర్నూలు సోనాకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. సన్న రకాలతో పోలిస్తే కర్నూలు సోనా ధరలు మాత్రమే పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శిరువెళ్ల, కోవెలకుంట్ల, బనగానపల్లె, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో గోదాములు అధికంగా ఉన్నాయి. గత ఖరీఫ్‌లో 62.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. ఇందులో 30 లక్షల క్వింటాళ్లకు పైగా గోదాముల్లోనే ఉండిపోయింది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పిస్తే ధరలు పెరుగుతాయనే దూరదృష్టితో మిల్లర్లు, వ్యాపారులు ధాన్యాన్ని గోదాముల్లో దాచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు బియ్యం సరఫరాా తగ్గిపోయి ధర పెరిగేందుకు కారణమైంది. అనుకున్నట్లుగానే బియ్యం ధర పెరుగుతుండటంతో గోదాముల్లోని ధాన్యం నిల్వలు బయటకొస్తున్నాయి. మార్కెటింగ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకోకపోవడంతో ధాన్యం, బియ్యం జీరోపై తరలుతోంది. రాష్ట్ర పరిధిలో బియ్యం విక్రయించేందుకు 5 శాతం వ్యాట్, ఒక శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాట్ పోటు అధికం. అందువల్లే మిల్లర్లు, వ్యాపారులు జీరోపై ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం ధరలు పెరిగేందుకు ట్యాక్స్‌లు కూడా కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాట్‌ను బూచిగా చూపి మిల్లర్లు ధరలు పెంచేస్తున్నారు. బియ్యం, ధాన్యం వ్యాపారంలో 60 శాతం పైగా జీరోపైనే తరలిపోతోంది. నిబంధనల మేరకు మిల్లర్లు ప్రభుత్వానికి లెవీ ఇవ్వాల్సి ఉంది. లెవీ ఇచ్చిన మిల్లర్లకు పౌర సరఫరాల శాఖ బహిరంగ మార్కెట్లో బియ్యం అమ్ముకునేందుకు పర్మిట్లు ఇస్తుంది. బియ్యం రాష్ట్రం పరిధిలో అమ్ముకోవాలన్నా, ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవాలన్నా పౌర సరఫరాల శాఖ జారీ చేసిన పర్మిట్ తప్పనిసరి. అయితే మిల్లర్లు, వ్యాపారులు ఈ పర్మిట్లు లేకుండానే జీరోపై తరలిస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. బియ్యం ధర అమాంతం పెరిగిపోతుండటం సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. క్వింటా బియ్యం ధర రూ.3,500లకు చేరినా రిటైల్‌గా కిలో బియ్యం రూ.38 నుంచి రూ.40లు పలుకుతోంది. దీంతో రేషన్ దుకాణాల్లో కిలో రూపాయి చొప్పున కొనుగోలు చేసిన బియ్యాన్ని పలువురు లబ్ధిదారులు బహిరంగ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. సన్నబియ్యం ధర పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
గెట్ల కొనాలే..!
ఒక వంక కాయగూరలు కాగుతున్నాయి. పప్పు దినుసులు మండుతున్నాయి. నేనేం తక్కువా అంటూ బియ్యం ధరలూ చుక్కలను తాకుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులను వెక్కిరిస్తున్నాయి. కళ్లెం వేసేవారు లేక అంతా దిక్కులు చూస్తున్నారు. ఆకలి చంపుకోలేక ఉన్న ధరకే కొని పరేషానవుతున్నారు. నానాటికీ బతుకులు దుర్భరమవుతుంటే బాధ పడుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ బియ్యం (దొడ్డు) రకం ఒక మోస్తారుగా పెరుగుతుండగా.... సన్నరకం ధరలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా రెక్కొలొస్తున్నాయి. రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాల కథనం. పౌరసరఫరాల అధికారుల నిఘా సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరల పెరుగుదలకు దాచుకున్న బియ్యం నిల్వలే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలను పోల్చుకుంటే పాలమూరులో బియ్యం ధరల పెరుగుదల తక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నప్పటికీ... వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. జిల్లాలో ఏప్రిల్ మాసంలో పాత సన్నరకం బియ్యం (సోనామసూరి) క్వింటాల్ ధర రూ.4,200ల నుంచి రూ.4300ల వరకు ఉండగా ప్రస్తుతం ఆధర రూ.4400 నుంచి రూ.4500 వరకు పెరిగింది. ఒక క్వింటాల్ బియ్యం ధర నెలరోజుల వ్యవధిలోనే రూ.200ల వరకు పెరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొత్త సన్నరకం బియ్యం క్వింటాల్ ధర రూ.3000 నుంచి రూ.3100 ఉండగా ప్రస్తుతం ఆ ధర రూ.3300ల నుంచి రూ.3400ల వరకు పలుకుతోంది. దొడ్డురకం బియ్యంలో కూడా పెరుగుదల సృష్టంగా కనిపిస్తోంది. పాతవి దొడ్డురకం బియ్యం ఏప్రిల్‌లో క్వింటాల్ ధర రూ.2900ల నుంచి రూ.3000 ఉండగా ప్రస్తుతం రూ.3,100 ధర పలుకుతోంది. దొడ్డు రకం కొత్త్త బియ్యం ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది బియ్యం పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వచ్చి ఉన్నట్లయితే బియ్యం ధరలు పెరిగి ఉండేది కాదని కొంత మంది వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. జిల్లాలోని పలువురు పెద్ద వ్యాపారులు, ముఖ్యంగా మిల్లర్లు కావాలని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.