సన్నాలు..సై
బాపట్ల : సన్న బియ్యం సై కొడుతున్నాయి. మూడు నెలల్లో కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.38కు చేరింది. ఈ నెలాఖరుకు రూ.50లకు చేరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఖరీఫ్, రబీ సీజన్లలో పంట దిగుబడి తగ్గడం, ఈ ఏడాది వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గత ఏడాది నీటి ఎద్దడి కారణంగా కర్నూలు ప్రాంతంలో సన్నబియ్యం దిగుబడి సక్రమంగా లేకపోవటంతో బాపట్ల బీపీటీకి డిమాండ్ వచ్చిపడింది.
ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో సాగర్ ఆయకట్టుకింద సుమారు 1.25 లక్షల హెక్టార్లలో పంట వేయకపోవటంతో ధాన్యానికి డిమాం డ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎగుమతులు జోరందుకోవటంతో రైతులు ధాన్యం అమ్మేందుకు ముందుకు రావటంలేదు. మరింత ధర కోసం వేచి చూస్తున్నారు. దీనికితోడు మన రాష్ట్రంలో ధాన్యాన్ని మిల్లులో ఆడిస్తే ఐదుశాతం వ్యాట్, రెండు శాతం సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంది. దీంతో వ్యాపారులు నేరుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేందుకే ఇష్టపడుతున్నారు.
అక్కడ బియ్యంపై పన్ను లేదు...
కొత్త రాష్ట్రమైన తెలంగాణతోపాటు క ర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో బియ్యంపై పన్ను లు లేకపోవటంతో ఇక్కడి వ్యాపారులు నేరుగా ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అక్కడి రైస్‌మిల్లులు ఇక్కడి నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మర ఆడించి బియ్యా న్ని అమ్ముకుంటున్నాయి. ఈ కారణంతో మన రాష్ట్రాంలోని రైస్‌మిల్లులకు పనిలేకుండా పోయింది.
ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గింది...
ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లా లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. ప్రకా శం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 48.50 వేల హెక్టార్లు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 1.28లక్షల ఎకరాలు, గుం టూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీ ర్ణం 2.27 లక్షలు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 70వేల ఎకరాలుగా ఉంది. అయితే సాగర్ ఆయకట్టుతోపాటు, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి కారణంగా పంటలు పండించవద్దని వ్యవసాయాధికారులు, ఇరిగేషన్ అధికారులు పలు సూచనలు, సలహాలు ఇవ్వటంతో సుమారు రెండు జిల్లాల్లో 1.25 లక్షల హెక్టార్లలో భూమి సాగు కాలేదు. దీంతో ఈ ఏడాది ధాన్యం దిగుబడి తగ్గుతుందని ముందుగానే అంచనా వేసిన వ్యాపారులు తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యానికి ధరలు పెంచి ఎగుమతులు చేస్తున్నారు.
ప్రస్తుతం బియ్యం ధరలు ఇలా ...
సన్న బియ్యం తినే వారి సంఖ్య పెరిగిపోవటంతో బీపీటీలపై మోజుపెరిగింది. ఎక్కువ మంది ఈ బియ్యంవై పే మొగ్గుచూపుతున్నారు. బీపీటీ రకం 75 కిలోల బస్తా గత నెలలో రూ.1300 నుంచి రూ.1350 ఉండగా ప్రస్తుతం రూ.1650-రూ.1700 మధ్య పలుకుతోంది. అదే పాత ధాన్యం అయితే రెం డు వేల రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇదేవిధంగా 2716 రకం రూ.1050 నుంచి రూ.1300కు, 74 ర కం రూ.1200 నుంచి 1500కు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా సన్న రకం ధాన్యం పండుతుంది. అయితే అక్కడ కూడా నీటి ఎద్దడి కారణంగా పంట లేకపోవటంతో ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు.
బాపట్లలో కేంద్రీకృతమైన వ్యాపారం
గతంలో హైదరాబాద్‌కు గుంటూరు, కర్నూలు నుంచి రోజు 100లారీలకుపై గా బియ్యం ఎగుమతులు జరుగుతుం డేవి. కృష్ణాపరివాక ప్రాంతంలో పంట దెబ్బతినటం, తమిళనాడు, మహారాష్ట్ర లో ధాన్యం పండకపోవటంతో ధాన్యం వ్యాపారులు బాపట్లవైపుచూస్తున్నారు. ఇక్కడ పండే సన్నాలకు మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్, కర్నూలు, నల్లగొండ, విశాఖపట్నం, తమిళనాడు, క ర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వ్యా పారులు బాపట్ల ప్రాంతంలో మకాం వేసి కొనుగోళ్లు ప్రారంభించారు.