Irrigation officials
-
జన్వాడ ఫాంహౌస్‌పై హైడ్రా నజర్
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఫాంహౌస్‌లో కొలతలు వేసిన అధికారులు.. సర్వేను పూర్తి చేశారు.ఇప్పటికే బద్వేల్ ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను గత బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది.ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది.జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ‘‘నా పేరుతో ఏ ఫాంహౌజ్ లేదు. నా ఫ్రెండ్ ఫాంహౌజ్ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉంటే నేనే కూలగొట్టిస్తా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. -
వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు?
సాక్షి అమలాపురం: గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. మూడు దశల్లో కచ్చితమైన అంచనాకు వస్తుంటారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తొలిదశలో గోదావరి నదికి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసే వర్షాల ఆధారంగా గోదావరికి వచ్చే వరదపై అధికారులకు అంచనా ఉంటుంది. క్యాచ్మెంట్ ఏరియా ఏకంగా 3,12,812 స్క్వేర్ మీటర్లు. ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో విస్తరించింది. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాల వివరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీబ్ల్యూసీ) పంపిస్తోంది. మహారాష్ట్రలోని క్యాచ్మెంట్ ప్రాంతంలో భారీగా కురిసినా నేరుగా వరద ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చే అవకాశం తక్కువ. మధ్యలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్నందున ఆలస్యమవుతోంది. అదే తెలంగాణలోని వరంగల్, ఏటూరి నాగారం, మంచిర్యాలా, మణుగూరు, ఇచ్చంపల్లి, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే తక్కువ సమయంలోనే ధవళేశ్వరం వద్ద ఉధృతి కనిపిస్తోంది. కాళేశ్వరం టూ ధవళేశ్వరం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షంతో వచ్చే అంచనాతోపాటు రెండవ దశలో గోదావరి, ఉప నదుల మీద ఏర్పాటు చేసిన గేజ్ స్టేషన్ల వద్ద రీడింగ్‌ల ద్వారా వరద అంచనా వేస్తారు. వరదపై చాలా వరకు పక్కాగా లెక్క వస్తోంది. ప్రధానంగా భద్రాచలం గేజ్ స్టేషన్ వద్ద ఉన్న నీటి పరిణామాన్ని బట్టి ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం తేలుతోంది. ఆయా గేజ్ స్టేషన్ల దూరాన్ని బట్టి ధవళేశ్వరం బ్యారేజీకి వరద వచ్చేందుకు పట్టే సమయం తేలుతోంది. గోదావరిపై పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం, కూనవరం వద్ద, కొత్తగా కాపర్డామ్, పోలవరం వద్ద, అలాగే ఉప నది శబరిపై కుంట, కొయిడాల వద్ద గేజ్ స్టేషన్లు ఉన్నాయి. భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరద వచ్చేందుకు 18 గంటల సమయం పడుతోంది. గేట్ల నుంచి వెళ్లే నీటి పరిమాణంతో వరద లెక్క మూడవ దశలో వరద లెక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తేలుతోంది. బ్యారేజ్ స్పిల్ లెవిల్ మీద 10.67 స్పిల్ లెవిల్ మీద ఎంత ఎత్తున నీరు వచ్చిందో చూస్తారు. మొత్తం 175 గేట్లు ఉండగా, ఎన్ని గేట్లు ఎత్తారు, గేట్ల మధ్య పొడవు, వెడల్పును పరిగణలోకి తీసుకుని ఒక సెకనుకు ఎన్ని క్యూసెక్కులు వెళుతోంది లెక్క కడతారు. గాంధీ గడియారం... పేపర్ బాల్స్ ఇప్పుడంటే బ్యారేజీకి వచ్చే వరదపై కచ్చితమైన అంచనాకు సాంకేతికంగా పలు పరికరాలను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు వరద ప్రవాహాన్ని, వేగాన్ని కొలవడం అధికారులకు కత్తిమీద సామే. ఇందుకు వారు గాంధీ గడియారం, పేపర్ బాల్స్ (పేపర్లతో చుట్టిన బంతి)ని వినియోగించేవారు. ‘పేపర్‌ను ఉండగా చుట్టి బ్యారేజీ ఎగువ వైపు వేసేవాళ్లం. బ్యారేజీ దిగువకు ఎంతసేపటిలో వచ్చిందనేది తెలుసుకోవడానికి గాంధీ గడియారాన్ని ఉపయోగించేవాళ్లం. ఈ సమయాన్ని నమోదు చేయడం ద్వారా వరద వేగాన్ని గుర్తించే వాళ్లం’ అని ఇరిగేషన్ రిటైర్డ్ ఇన్చార్జి ఎస్ఈ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ‘సాక్షి’కి తెలిపారు. -
సాక్షి ఎఫెక్ట్: ‘ర్యాలంపాడు’ లీకేజీల అడ్డుకట్టకు చర్యలు
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిరి్మంచిన ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట లీకేజీలపై అధికారులు దృష్టిసారించారు. రిజర్వాయర్ కట్టకు బీటలు పడి పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడిన సంఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘ర్యాలంపాడు’కి బీటలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కట్ట నుంచి ఎక్కడెక్కడ లీకేజీలున్నాయి? ఎంత పరిమాణంలో నీరు వృథా అవుతోంది.. తదితర అంశాలపై చర్చించారు. రిజర్వాయర్ పరిస్థితిపై ఇటీవల ఇద్దరు సీఈల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇదిలా ఉంటే లీకేజీలకు మరమ్మతు చేయాలంటే.. ముందుగా ర్యాలంపాడులోని నీటిని బయటకు పంపాల్సి ఉంటుందని, అయితే దీనివల్ల ప్రస్తుతం 1.36 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు దెబ్బతింటాయని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సీజన్‌కు సాగునీటిని అందించి వచ్చే యాసంగిలో జలాశయంలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసేందుకు వీలుపడుతుందన్నారు. -
వరుస పరిణామాలతో తెలంగాణ నీటిపారుదల యంత్రాంగం బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెజిట్ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావ డంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోపక్క కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖకు ఊపిరి సలపడం లేదు. లేఖాస్త్రాలతో పెరుగుతున్న ఒత్తిడి గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే.. అందులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి. ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. నాలుగురోజులుగా తలమునకలు ఇలా కోర్టు కేసులు, కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలు, వాటికి వివరాల సమర్పణ, లేఖలకు సమాధానాలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడం తదితర పనుల్లో రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్లు గడిచిన నాలుగు రోజులుగా తల మునకలుగా ఉన్నారు. ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కోర్టు కేసులు, తదితర అంశాలపై రిటైర్ట్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంపుల సరఫరా చేస్తే డబ్బులిస్తారా? తాజాగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పంపులు, మోటార్లను సరఫరా చేస్తున్న బీహెచ్ఈఎల్ సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వీటికి అనుమతులు వస్తాయా? అనుమతులు వచ్చేంతవరకూ పనులు నిలిపివేయాలా? ఒకవేళ పంపులు, మోటార్లు సరఫరా చేస్తే చెల్లింపులు యధావిధిగా కొనసాగుతాయా? అనే ప్రశ్నలకు వివరణ కోరినట్లు సమాచారం. -
ఇరిగేషన్ అధికారులపై టీడీపీ నేత వీరంగం
సాక్షి, డోన్: పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు గత 15రోజులుగా పెద్దొంక, బోగందాని వంక నీటి పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను మైనర్ ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ నారాయణ, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం సాయంత్రం శీను పొలంలో కొలతలు వేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతను తన కుటుంబ సభ్యులను వెంటదీసుకుని వెళ్లి అధికారులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయంపై మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్ సోమవారం రాత్రి 8గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రేపు ఇరిగేషన్ అధికారులతో సీఎం కేసీఆర్ భేటీ
-
బ్రిడ్జి కోసం మురుగు కాలువలో దిగిన ఎమ్మెల్యే
నెల్లూరు (వేదాయపాళెం): ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఏకంగా తీవ్ర దుర్గంధం వెదజల్లే మురుగు కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. వీలైనంత త్వరగా వరద కాలువపై బ్రిడ్జి నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంట పాటు మురుగు కాల్వలోనే నిల్చున్నారు. చివరకు అధికారులు దిగివచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ చాణక్యపురి వద్ద ఉన్న వరద కాలవపై బ్రిడ్జి నిర్మించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో స్థానికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎన్నిసార్లు చెప్పినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఆయన నేరుగా ఆ మురుగు కాలువ వద్దకు చేరుకున్నారు. తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నా లెక్కచేయకుండా.. నడుములోతు ఉన్న మురుగు నీటిలోకి దిగి నిల్చున్నారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి సమాధానమిచ్చే వరకు బయటకు రానన్నారు. దాదాపు గంట పాటు ఆ మురుగు నీటిలోనే ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఉన్నతాధికారులు.. జేఈ బాలసుబ్రహ్మణ్యాన్ని ఘటనా స్థలికి పంపించారు. పనులను గంట లోపు ప్రారంభిస్తామని.. 45 రోజుల్లోపు బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన చెప్పడంతో ఎమ్మెల్యే కాలువలో నుంచి బయటకు వచ్చారు. తమ కోసం మురుగు నీటిలోకి సైతం దిగి నిరసన తెలిపిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. -
కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
కాళేశ్వరం/ఏటూరునాగారం: మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి మరింత పెరిగింది. ఎగువన ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శుక్రవారం ఉదయం నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద కాళేశ్వరం మీదుగా తరలిపోతోంది. అటు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి సైతం వరదనీరు వస్తుండడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.6 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. మొత్తంగా 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు తరలిపోయినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. 2016, 2017లో వచ్చిన వరదల కంటే ఈ ఏడాది అధికంగా ప్రవాహం నమోదైందని తెలిపారు. నీటమునిగిన పంటలు గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పంట చేలు నీట మునిగాయి. పలుగుల, మద్దులపల్లి, కాళేశ్వరంలోని పూస్కుపల్లి గ్రామాల్లో వంద లాది ఎకరాల పత్తి పంటను వరద కమ్మేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తివేత.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు శుక్రవారం ఉపసంహరించారు. గురువారం రాత్రి 9.30 సమయంలో 8.97 మీటర్లకు చేరిన ప్రవాహం శుక్రవారం ఉదయం 9.3 మీటర్లకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం వరకు క్రమేణ తగ్గుతూ 8.36 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు ఇంకా చేరలేదని ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ నరేందర్ తెలిపారు. కాగా, ముల్లకట్ట వద్ద గోదావరి 76 మీటర్ల ఎత్తున రెండు కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. -
ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
నెల్లూరు(పొగతోట): ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు నిర్వహించిన సమావేశం క్షణం.. క్షణం.. భయం.. భయంగా సాగింది. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇరిగేషన్ అధికారులు నీళ్లునమిలారు. ఇరిగేషన్ పనులకు సంబంధించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇరిగేషన్ అధికారులు నివ్వెరపోయారు. ‘మీరు చెప్పే సమాధానాలకు నాకు చిరాకు వేస్తుందంటూ కలెక్టర్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మాట్లాడుతున్నది తెలుగులోనే ఇంగ్లిష్ కాదని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక గోల్డెన్జూబ్లీహాల్లో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పనులు పూర్తి కాకుండా బిల్లులు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. వర్షాకాల సీజన్ ప్రారంభమవుతుందని తెలిసి ముందుగా ఎంబుక్స్ ఎందుకు నమోదు చేస్తారని అడిగారు. బదిలీ అయిన తరువాత పాత తేదీలు వేసి బిల్లులు ఎందుకు పెడుతున్నారని అధికారులపై మండిపడ్డారు. ఈ విధంగా అవకతవకలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఎంబుక్కులకు సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా బిల్లులు పెట్టడం, వర్షాకాలం వస్తుందని తెలిసి ఎంబుక్కులు నమోదు చేసిన ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. పనుల నాణ్యతను పరిశీలించకుండా బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నాణ్యతలేని పనులను ఎన్ని గుర్తించారు?, ఎటువంటి చర్యలు చేపట్టారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రతి వారం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. చెక్‌డ్యామ్‌లను మార్చి 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. 116 రోజులకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసుకోకపోతే పనులు ఏవిధంగా పూర్తి అవుతాయన్నారు. కాలువ పనులకు సంబంధించి అటవీ అధికారులతో చర్చించాలన్నారు. సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరు సమన్వయంతో పనిచేసి అటవీ అనుమతులు తీసుకోవాలన్నారు. నీరు–చెట్టు పనులకు అగ్రిమెంట్ చేసుకుని ముందుకు రాని కాంట్రాక్టర్లకు నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలన్నారు. అటువంటి పనులను రద్దు చేయాలన్నారు. 12 మండలాల్లో అనుకున్న స్థాయిలో పనులు జరగడంలేదన్నారు. ఈ మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా, పంటలు ఎండకుండా నీరు సరఫరా చేయాలని సూచించారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ ఎస్ఈ ప్రసాధ్, తెలుగుగంగ ఎస్ఈ వెంకటేశ్వర్లు, రెగ్యులర్ ఎస్ఈ నాగులమీరా, డీఈలు, ఈఈలు, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు. కరువు మండలాల్లో రైతులకు రుణాలు మంజూరు చేయండి నెల్లూరు(పొగతోట): కరువు మండలాల్లో రైతుల రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి రుణాలు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ప్రకటించిన 15 మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలను టర్మ్లోన్లుగా మార్పు చేయించాలని బ్యాంకర్లకు సూచించారు. టర్మ్లోన్లను మూడేళ్లలో తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎల్ఈసీ కార్డులు, సీఓసీలు అధికంగా మంజూరు చేయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ల ద్వారా 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాల్లో మంజూరు చేసిన యూనిట్లు అధికశాతం గ్రౌండింగ్ కాలేదన్నారు. లబ్ధిదారులకు పథకాలు మంజూరు చేసేందుకు మార్చి 2వ తేదీన మేగా గ్రౌండింగ్ మేళా నిర్వహించాలని సూచించారు. ఎస్టీ భూమి కొనుగోలు పథకానికి సంబంధించి ప్రతిపాదనలు జిల్లా ఎంపిక కమిటీకి పంపించాలన్నారు. మార్చి 15వ తేదీ లోపు పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. పథకాల అమలులో సమస్యలు ఉంటే, వాటిని ఈ నెల 26వ తేదీన నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎల్డీఎం వెంకట్రావ్, వ్యవసాయ శాఖ జేడీ చంద్రనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్చార్జి ఈడీ రోజ్మండ్, ఐటీడీఏ పీఓ కమలకుమారి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి పాల్గొన్నారు. -
తేడా వస్తే సస్పెండవుతారు
సాగునీటి విడుదలలో నిర్లక్ష్యం వద్దు ఇంజనీర్లకు మంత్రి కామినేని హెచ్చరిక కౌతవరం (గుడ్లవల్లేరు) : సాగునీటి విడుదలలో ఇరిగేషన్ అధికారులు అలక్ష్యం చేస్తే సస్పెన్షన్లు తప్పవని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. కౌతవరం ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చారు. పంట పొలాల్లో నీరున్నా పైనున్న కొందరు రైతులు మళ్లీ తోడుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉయ్యూరు నుంచి పుల్లేటికి రావలసిన వాటాను తీసుకురావాలని ఇరిగేషన్ సీఈ వై.సుధాకర్‌ను ఆయన కోరారు. అలాగే బల్లిపర్రు లాకుల గేట్లను వెంటనే తెరిపించాలని ఆదేశించారు. కాగా, వర్షాకాలంలో వచ్చే జబ్బుల నివారణపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సగమే వరి నాట్లు : సీఈ సుధాకర్ జిల్లాలోని 13లక్షల హెక్టార్లకుగాను 7లక్షల వరకు వరి సాగవుతుందని ఇరిగేషన్ సీఈ సుధాకర్ తెలిపారు. అందులో 50శాతం వరకు మాత్రమే వరినాట్లు పడ్డాయన్నారు. మిగిలిన శాతం సాగు చేయాలంటే మరొక 10టీఎంసీల సాగునీటి అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం నుంచి 8వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పులిచింతలలో 7టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఒకవేళ వర్షాలు పడితే ఆ నీటిని నిలిపివేస్తామన్నారు. -
బందరు కాలువకు గండి
- నీట మునిగిన వేలాది ఎకరాలు కంకిపాడు(కృష్ణాజిల్లా) కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఈరంకి వద్ద ఉన్న బందరు కాలువకు ఆదివారం మధ్యాహ్నం గండిపడింది. కాల్వ కట్ట కూడా కొతకు గురైంది. భలితంగా నీళ్లు వృధాగా పోతూ కాలువ ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఒక్కసారిగా కాలువకు గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుగల అధికారులెవరూ ఇంతవరకూ సంఘటన స్థలానికి రాలేదని రైతులు పేర్కొన్నారు. -
గోదావరి జలాలకు పూజలు
రంగన్నగూడెం (హనుమాన్‌జంక్షన్ రూరల్) / గన్నవరం రూరల్ : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు పోలవరం కుడికాలువ ద్వారా శుక్రవారం బాపులపాడు మండలానికి చేరాయి. మండల పరిధిలోని రంగన్నగూడెం వద్ద ఉదయం ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు నీటికి హారతులిచ్చారు. జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణారావు, ఎంపీపీ తుమ్మల కోమలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.వీర్రాజు పూజలు నిర్వహించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వీర్రాజు మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం కాలువలో 2400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎస్పీ నూజివీడు ఓ అండ్ ఎం ఈఈ అర్జునరావు, జగ్గయ్యపేట ఎన్ఎస్పీ ఈఈ శ్రీనివాసరావు, పోలవరం డీఈఈ జె.ప్రసాద్, ఏఈ శ్యామ్‌కుమార్, సర్పంచి ప్రసన్నరావు పాల్గొన్నారు. కొత్తగూడెం చీమలవాగు యూటీ వద్ద.. కొత్తగూడెం(గన్నవరం రూరల్) : మండలంలోని కొత్తగూడెం చీమలవాగు అండర్ టన్నెల్ వద్ద శుక్రవారం పోలవరం కాలువ నీటికి రాష్ర్ట జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు పూజలు చేశారు. నీరు శుక్రవారం ఉదయం 11 గంటలకు బల్లిపర్రు గ్రామానికి నీరు చేరాయి. బల్లిపర్రు, తెంపల్లె, వీరపనేనిగూడెం, కొత్తగూడెం, చింతగుంట, గొల్లనపల్లి, గోపవరపుగూడెం, కట్టుబడిపాలెం దాటి సూరంపల్లి వద్దకు పోలవరంలో నీరు మధ్యాహ్నం 3 గంటలకు చేరాయి. -
గిద్దలూరులో పచ్చ రచ్చ
♦ అన్నా వర్గీయుడితో చెరువు పని చేయించిన ఇరిగేషన్ అధికారులు ♦ నాకు తెలియకుండా పని చేస్తారా... అంటూ ముత్తుముల బెదిరింపు ♦ బెంబేలెత్తి పని నిలిపిన అధికారులు పని నిలిపేస్తే సంగతి చూస్తానన్న అన్నా ♦ ఎట్టకేలకు అన్నా వర్గీయుడితోనే పని చేయించిన అధికారులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గిద్దలూరు నియోజకవర్గంలో పచ్చ పార్టీ నేతల మధ్య రచ్చ పతాకస్థాయికి చేరింది. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబులు ఢీ అంటే ఢీ అంటున్నారు. చిన్న అవకాశం దొరికినా... ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఇది అధికారుల మెడకు చుట్టుకుంది. ఇద్దరు అధికార పార్టీ కీలక నేతలు కావడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక నియోజకవర్గంలోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొమరోలు మండలం రాజుపాళెంలో శనివారం చెరువు ఆక్రమణల తొలగింపు పనులు ఇరువర్గాల మధ్య వర్గవిభేదాలను మరోమారు బయటపెట్టాయి. వివరాలలోకెళితే...కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే చెరువులను సర్వే చేయించే కార్యక్రమం ఊపందుకుంది. సర్వే పూర్తయిన చెరువుల్లో ఆక్రమణలను తొలగింపులో భాగంగా నీరు-చెట్టు పనుల్లో ట్రెంచి ఏర్పాటు చేస్తున్నారు. కొమరోలు మండలం రాజుపాళెం చెరువులో అదే గ్రామానికి చెందిన అన్నా రాంబాబు వర్గీయుడు, ఆయకట్టు ప్రెసిడెంట్ పాండు ట్రెంచి నిర్మాణ పనులు ప్రారంభించారు. వంద మీటర్ల మేర ట్రెంచి నిర్మాణ పనులు జరిగాక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తన అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో బెంబేలెత్తిన ఇరిగేషన్ అధికారులు పనులు నిలిపివేసి జేసీబీని వెనక్కు పంపించేశారు. ఇంతలో అనుచరుల ద్వారా సమాచారం అందుకున్న అన్నా రాంబాబు ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేశారు. తన వర్గీయుడు చేస్తున్న పనిని ఎలా నిలిపివేస్తారంటూ అధికారులను చీవాట్లు పెట్టారు. నిబంధనల ప్రకారం చెరువు ఆయకట్టు ప్రసిడెంట్‌కు అప్పగించాలని, ఆయన ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నప్పుడు ఎలా నిలిపివేస్తారంటూ అధికారులను నిలదీశారు. ఇద్దరు నేతలు ఫోన్లు చేసి చివాట్లు పెట్టడంతో ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. వారి సూచన మేరకు ఎట్టకేలకు ఆయకట్టు ప్రసిడెంట్ పాండు ద్వారానే పనులు చేయించి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ తర్వాత అశోక్‌రెడ్డి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి తనకు తెలియకుండా ఎక్కడా పనులు ప్రారంభించవద్దని... అవసరమైతే ముఖ్యమంత్రి వద్దే తేల్చుకుంటానంటూ ఇరిగేషన్ అధికారులను హెచ్చరించినట్లు సమాచారం. ఇటు ఎమ్మెల్యే, అటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య నలిగిపోతున్నామని, నియోజకవర్గంలో పని చేసే పరిస్థితి లేదని నీటిపారుదల శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఇరువురి మధ్య అధికారులు బలిపశువులుగా మారుతున్నారని అధికారులు వాపోయారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇరువర్గాల మధ్య పని చేసే వాతావరణం లేదని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. -
ఏలేరు నీటిని ఎందుకు ఆపారు?
ఇరిగేషన్ అధికారుల తీరుపై పెండెం ఆగ్రహం పిఠాపురం : క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అర్ధాంతరంగా ఎందుకు ఆపారో చెప్పి, వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఆయన గురువారం పిఠాపురం మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఏలేరు నీటిపై ఆధారపడి పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 3,500 ఎకరాల్లో చెరకు, మిరప, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు సాగు చేశామని,15 రోజులకొకసారి వంతుల వారీగా నీరు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో దొరబాబు ఏలేరు నీటిపారుదల శాఖాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువైన పంటలు ఎండిపోతుంటే పట్టించుకోపోవడం దారుణమన్నారు. పంటలు ఎండిపోతున్నా నీటి విడుదలను ఎందుకు ఆపారో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పెండెం హెచ్చరించారు. -
హోదాపై కేంద్రానికి స్పష్టత లేదు
* రాజీ పడ్డానన్న ఆరోపణలు సరికాదు * విభజన చట్టంలో ఉన్నవి అమలుకు కేంద్రంపై ఒత్తిడి * విజయనగరం పర్యటనలో సీఎం సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమీ చెప్పడంలేదని, ఏం ఇస్తుందో, ఏం చేస్తుందో స్పష్టత ఇస్తే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రావల్సిన వాటిన్నింటిపైనా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, సింగవరంలో జరిగిన నీరుచెట్టు, నీరు ప్రగతి కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో రాజీపడ్డానన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. విధి లేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ‘ హోదా విషయంలో కేంద్రపై ఒత్తిడి తెస్తాను. దీనిపై గురువారం ఉదయం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులతో మాట్లాడి కొంచెం ఆలోచించాలని కోరాను. వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడాను. అవసరమయితే మళ్లీ మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తాను’ అని సీఎం పేర్కొన్నారు. కృష్ణా నదిపై ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడం వల్ల రావాల్సిన నీరే రావడం లేదని, ఇప్పుడు దానిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే మరింత ఇబ్బందులు వస్తాయనీ కేంద్రానికి చెప్పానన్నారు. దీనిపై కేంద్రం కమిటీ వేసిందని, ఆ కమిటీ సభ్యులు సమష్టిగా నిర్ణయం తీసుకుంటారని చెబితే తెలంగాణ సీఎంకు కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. సాక్షి కథనంపై ఆగ్రహం: సాక్షి పత్రికలో ప్రత్యేక హోదాపై గురువారం ప్రచురితమయిన కథనాన్ని బహిరంగ సభ సాక్షిగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఊగిపోయారు. ‘నేను ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుపోటు పొడిచానట! ఇదేమయినా బాగుందా తమ్ముళ్లూ!’ అని కార్యకర్తలనుద్దేశించి సమర్ధించుకునేందుకు, సంజాయిషీ చెప్పుకునేందుకు యత్నించారు. ఇరిగేషన్ అధికారులపై బాబు ఫైర్: విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన నీరు ప్రగతి వర్క్‌షాపులో ఇరిగేషన్ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ‘బీకేర్‌పుల్ ఆన్ దట్. ఏం తమాషాగా ఉందా... సమావేశం నిర్వహించటంతో పాటు మూడు నెలలకొకసారి నీటి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మారాలి’ అంటూ వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ ఎస్.వి.రమణపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీఎం పర్యటనలో భాగంగా అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామిని గురువారం దర్శించుకున్నారు. -
‘ప్రజంటేషన్’తో బాధ్యత పెరిగింది: హరీశ్
రీ డిజైనింగ్‌పై మంత్రుల సంఘం సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో నీటిపారుదల అధికారులపై బాధ్యత పెరిగిందని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. లక్ష్యాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం సచివాలయంలో హరీశ్ అధ్యక్షతన మూడోసారి సమావేశమైంది. ఐదున్నర గంటల పాటుసాగిన ఈ భేటీలో కమిటీ సభ్యులైన ఆర్థిక మంత్రి ఈటల, రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల పాల్గొన్నారు. డిజైన్ మార్పులతో ప్యాకేజీలవారీగా, ప్రాజెక్టులవారీగా తలెత్తే ఆర్థిక, న్యా య, సాంకేతిక చిక్కులపై చర్చించారు. రీ ఇంజనీరింగ్‌తో పెరిగే ఆయకట్టు, పాత కాంట్రాక్టు సంస్థల పనితీరును అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రీ ఇంజనీరింగ్ వల్ల ప్రాణహిత- చేవెళ్లకు సంబంధించిన 18 ప్యాకేజీలు, దేవాదుల ఫేజ్ 3లోని 2, 3 ప్యాకేజీలు, సీతారామ ప్రాజెక్టు, కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ స్థలం మార్పు, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్, గండిపల్లి, గౌరవల్లి రిజర్వాయర్లపై చర్చ జరిగింది. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులకు కమిటీ పలు సూచనలు చేసింది. నీటిపారుదల రంగానికి కేటాయిం పులు వచ్చే బడ్జెట్లో రూ.30 వేల కోట్లకు పెరగవచ్చని హరీశ్ అన్నారు. -
నీటి దోపిడీ... నిజమే
► అన్నదాతల కడుపుకొట్టి.. రూ.కోట్లు కొల్లగొట్టారు ► ఈఈపై వేటు వేసి తప్పించుకునే యత్నం ► ఇరిగేషన్ అధికారుల రహస్య సమావేశం.. ► కలెక్టర్ చర్యలపై అధికారుల అసహనం ► అధికారుల నిర్వాకంపై రగిలిపోతున్న రైతులు దేవుడు వరం ఇచ్చి జిల్లాకు 116 టీఎంసీల నీటిని అందించాడు. రైతుల ఆనందానికి అవధుల్లేవు. రెండు పంటలకు దిగుల్లేదనుకున్నారు. కానీ ఇరిగేషన్ అధికారులు, అధికారపార్టీ నేతల ఆగడాలతో రెండో పంట నీటికోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చింది. న్యాయంగా రావాల్సిన నీటి వాటాను పంపిణీ చేయాల్సిన అధికారులు వాటిని అమ్ముకున్నారన్న అపప్రదను మూటకట్టుకోవాల్సి వచ్చింది. వారి నిర్వాకం తెలిసి రైతులు రగిలిపోతున్నారు. ►సోమశిల నుంచి బకెట్ నీళ్లు కూడా వృథాగా పో లేదు.. చెంబు నీళ్లు అక్రమంగా ఇవ్వలేదు.. రైతు ల శ్రేయస్సే ధ్యేయంగా నీటి ని అందించాం.. ఇవి ఇరిగేషన్ అధికారులు తియ్యగా చెప్పిన ‘నీటి’ సూక్తులు. ► ఒక్క నీటిబొట్టును వృథా చే యం.. ఒక్క టీఎంసీతో 10వేల ఎకరాలు పండిస్తాం..ఇవీ తరచూ అధికారపార్టీ నాయకులు చేసే ఆర్భాటం. ఇందుకుభిన్నంగా సో మశిలలో అక్రమాలు జరిగాయి. ఆచర్యల్లో భాగంగానే ఈఈపై సస్పెన్షన్ వేటు. దీంతో నీటిస్వా హా నిజమేనని తేలిపోయింది. ► ఏ మేరకు నీరు అక్రమం గా పంపిణీ చేశారు, ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారాయన్న అంశంపై విచారణ జరగాల్సి ఉంది. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని కేవలం ఈఈపై వేటువేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : గత డిసెంబర్ 12న జరిగిన ఐఏబీ మీటింగ్ నాటికి సోమశిల జలాశయంలో 66.7 టీఎంసీల నీరు ఉంది. అదేనెల 18వ తేదీ నుంచి నీటి పంపిణీ ప్రారంభించారు. సరిగ్గా నెలకు సోమశిల జలాశయం నీటి మట్టం 53 టీఎంసీలకు చేరుకుంది. నీటి ఆవిరి, లీకులవల్ల జరిగే వృథాను అంచనా వేసి కేటాయింపు లు చేస్తారు. అయితే పంపిణీ అయిన 12 టీఎంసీలలో కాలువలు బలహీనంగా ఉండటంతో రోజు వారీ విడుదల చేస్తున్న నీరు సంగం వృథా అవుతుందని అప్పట్లో అందరూ అపోహపడ్డారు. ఐఏ బీ తీర్మానం ప్రకారం ఖరీఫ్ పంటకు పెన్నార్ డెల్టా కు 20.445 టీఎంసీలు, కనుపూరు కాలువకు 1.934 టీఎంసీలు, కావలి కాలువకు 2.881, నార్త్‌ఫీడర్ 4.781, సౌత్‌ఫీడర్ 1.884 టీఎంసీల నీటిని కేటాయించారు. అయితే రోజువారి కాలువలకు పంపిణీల్లో పూర్తిస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆందోళనలు ప్రారంభిం చారు. దీంతో కొంత నీరు వృథాగా పోయిందని అప్పట్లో అధికారులు నమ్మబలికారు. నీటిని అమ్ముకున్నారు కాలువలపై పర్యవేక్షణ లోపం, లష్కర్లు లేకపోవడంతోపాటు స్థానిక అధికారపార్టీ నాయకుల ఆగడాలతో నీటిని ఇష్టం వచ్చినట్లు పొలాలకు వదులుకున్నారు. ఇదే అదనుగా భారీ ఆయకట్టు ఉన్న రైతులకు నీటిని అమ్ముకున్నారన్న వాస్తవం ప్రస్తు తం రైతాంగం జీర్ణించుకోలేకపోతుంది. కావలి, కనుపూరు కాలువల ద్వారా అక్రమ నీటి పంపిణీతో రూ.కోట్లు అధికారులు తమ జేబుల్లో వేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోటార్ల విని యోగంపై ప్రభుత్వానికి రావాల్సిన రూ.40కోట్లు అధికారులు నొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. మోటార్‌కు రూ.10వేలు చొప్పున వసూ లు చేశారని రైతులు చెబుతున్నారు. నీటి ‘కాకి’లెక్కలు... 24 టీఎంసీల నీటి గల్లంతుపై కలెక్టర్ నివేది కలు ఇవ్వాలంటూ తహశీల్దార్లను సోమశిలకు పంపిన రోజునే 4 టీఎంసీల నీటి లెక్కలు తేలకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ సంబంధిత ఈఈని సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతస్థాయి అధికారులతోనే.. సదరు ప్రాజెక్ట్‌లో నీటిని ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఈఈ స్థాయి వ్యక్తి పంపిణీ చేయరని కొందరు ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతస్థాయి అధికారులతోనే నీటి అమ్మకాలు జరిగి ఉంటాయనేది వారి వాదన. పథకం ప్రకారమే అధికారులు నీటిని అమ్ముకున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. పథకం ప్రకారమే అమ్ముకున్నారు.. విస్తారంగా నీరు ఉన్నప్పటికీ పథకం ప్రకారమే ఇరిగేషన్ అధికారులు నీటి ని అమ్ముకున్నారని తేలి పోయింది. నీరు-చెట్టు, ఎఫ్డీఆర్ పనుల్లో సైతం భారీ అవి నీతి చోటుచేసుకుంది. నాయకుల అండదండలతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికైనా వారిని కట్టడి చేసి రైతులను ఆదుకోవాల్సి ఉంది. - బెజవాడ గోవిందరెడ్డి, రైతు నాయకులు ఐఏబీ మీటింగ్ అప్పుడే చెప్పాం.. ఎన్నడూలేని విధంగా చిత్తూ రు జిల్లా ఆయకట్టుకు నీటిని కేటాయించడం సరికాదని అప్పుడే చెప్పాం. అయినా కేటాయించారు. ఆ పంపిణీపై ఇంతవరకు ఎవరూ నోరు మెదపడంలేదు. మరి నీరు ఎటుపోయింది. - నిరంజన్‌రెడ్డి, రైతు నాయకులు -
తోటపల్లి ప్రధాన కాలువకు లైనింగ్ ?
* రూ. 300 కోట్లు అవసరం * నిధుల మంజూరుకు ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం * ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు విజయనగరం కంటోన్మెంట్ : ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన తోటపల్లిని ప్రారంభిద్దామన్న ధ్యాసే తప్ప ఇతర బాగోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోయినా కేంద్రం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా సాగునీటి రంగానికి కేటాయించే నిధులకు సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసింది. ఏమేం అభివృద్ధి పనులు చేయొచ్చో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరడంతో ఇరిగేషన్ అధికారులు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్‌ను 1200 క్యూసెక్కుల నీటి సామర్థ్యంగా 2003లో డి జైన్ చేశారు. అయితే అప్పట్లో పూసపాటి రేగ, గుర్ల, గరివిడి, గజపతినగరం, తదితర అదనపు ఆయకట్టు ప్రతిపాదనలు లేవు. ఆ తర్వాత నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో ఈ అదనపు ప్రాంతాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే అదనపు ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు పూర్తి స్థాయిలో జోరుగా అందాలంటే కాలువ ఆసాంతం లైనింగ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కాలువ అంతా మట్టి, తుప్పలు, పెద్ద రెల్లు గడ్డితో నిండి ఉంది. మొత్తం 118 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ పరిస్థితి అంతా ఇలాగే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పనుల కోసం సుమారు రూ. 300 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలించే అవకాశం ఉంది. నిధులు మంజూరు చేస్తే ఈ ఏడాదే పనులు ప్రారంభించే అవకాశముంది. లైనింగ్ ఎందుకంటే..? కాలువలో పిచ్చిమొక్కలు, పూడికలు పేరుకుపోవడంతో శివారు ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదు. ఇలా కాకుండా వాటన్నింటినీ తొలగించి కాంక్రీట్‌తో లైనింగ్ చేస్తే సాగునీటి ప్రవాహం జోరందుకుని అంతటా ఒకేలా నీరందుతుంది. అలాగే లైనింగ్ చేయడం వల్ల కాలువ గట్లు కూడా బలంగా తయూరవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రతిపాదనలు సమర్పిస్తాం తోటపల్లి కాలువ లైనింగ్ ప్రతిపాదనలు ఏప్రిల్ మొదటి వారంలో పంపిస్తాం. ప్రస్తుతం ప్రతిపాదనల తయూరీపై దృష్టి సారించాం - డోల తిరుమల రావు, పర్యవేక్షక ఇంజినీరు, తోటపల్లి -
పాలకంకులకు.. చాలని నీళ్లు
గోదావరి డెల్టాలో రబీ వరిచేలు కంకులు వేసి, పాలుపోసుకుంటున్నాయి. సాధారణంగా ఈ దశలోనే చేలకు నీటి అవసరం ఎక్కువ. తదనుగుణంగా పంట కాలువలకు విడుదల చేసే నీటి పరిమాణాన్నీ పెంచాలి. అయితే ఇరిగేషన్ అధికారులు చాలీచాలని పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తూ, తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పైర్లకు తడి పెట్టేందుకు రైతులు నానా పాట్టూ పడుతున్నారు. అమలాపురం : డెల్టాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. సాగు ఆరంభం నుంచి కాలువల ద్వారా చాలీచాలకుండానే నీరు సరఫరా చేస్తున్నా రైతులు నానా తంటాలు పడుతూనే పంటను కాపాడుకుంటూ కంకులు పాలు పోసుకునే దశకు తెచ్చారు. ఏదేమైనా తూర్పు, మధ్య డెల్టాల్లో శివార్లలో, మెరకల్లో నీరందక సుమారు లక్ష ఎకరాల్లో పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటి వరకూ చేసిన కృషి ఒకఎత్తు అయితే.. ఈ దశలో చాలినంత తడిని అందించి కంకులు పాలు పోసుకుని, గట్టిపడేలా చేయడం మరొక ఎత్తు. అయితే ఈ కీలక తరుణంలోనూ అధికారులు నీటి విడుదల పరిమాణాన్ని స్వల్పంగా పెంచి చేతులు దులుపుకోన్నారు. వారం రోజుల క్రితం మూడు డెల్టాలకు కలిపి 6,700 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, ప్రస్తుతం తూర్పు డెల్టాకు రెండు వేలు, మధ్యడెల్టా 1,420, పశ్చిమ డెల్టాకు 3,830 క్యూసెక్కుల చొప్పున రెండు జిల్లాలోని డెల్టా కాలువలకు 7,250 క్యూసెక్కుల నీరు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది కాక మన జిల్లాలో పంపింగ్ ద్వారా మరో 30 క్యూసెక్కుల నీరు చేలకు చేరుతోంది. గతంలో 130 డ్యూటీ (ఒక క్యూసెక్కు 130 ఎకరాల చొప్పున) ఇవ్వగా, ఇప్పుడు దీనిని 120 చేశారు. వాస్తవానికి ఈ సమయంలో కాలువలకు 90 డ్యూటీ చొప్పున సాగునీరు పంపిణీ చేయాల్సి ఉంది. కనీసం 100 డ్యూటీలో అయినా ఇస్తే రైతులకు కొంత ఊరటగా ఉండేది. అయితే నీరు అందుబాటులో లేదంటూ.. అధికారులు చేతులు ఎత్తివేశారు. 90 డ్యూటీలో నీరు అనుమానమే.. అధికారులు చెబుతున్న ఆయకట్టుకు తగ్గట్టు.. చేలు పాలుపోసుకునే దశలో మూడు డెల్టాలకు 90 డ్యూటీలో నీరు పంపిణీ చేయాలంటే 9,667 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలి. కనీసం 9 వేల క్యూసెక్కులు పంపిణీ చేసినా కొంత ఊరటగా ఉండేది. బలిమెల నుంచి డొంకరాయి జలాశయం ద్వారా అదనంగా వెరుు్య క్యూసెక్కుల నీరు తెప్పిస్తున్నా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వ లేకపోవడం, గోదావరి సహజ జలాలు 750 క్యూసెక్కులు కూడా లేకపోవడం వల్ల కాలువలకు నీటి విడుదల పెంచలేకపోతున్నారు. ఇప్పటికే నీరందక శివారు, మెరక ప్రాంతాల్లోనే కాక పంట కాలువలు, చానళ్లను ఆనుకున్న ఎగువ ఆయకట్టులో సైతం మోటార్లతో నీరు తోడక తప్పని పరిస్థితి నెలకొంది. బలిమెల నీరు గోదావరికి చేరినా 90 డ్యూటీలో కాలువలకు నీటి విడుదల సాధ్యం కాకపోవచ్చు. ‘సాక్షి’ కథనంతో అదనపు నీరు డొంకరాయి జలాశయం పవర్ కెనాల్‌కు 4 వేల క్యూసెక్కులు, బైపాస్ పద్ధతిలో అదనంగా మరో వెయ్యి క్యూసెక్కుల నీరు గోదావరిలో చేరేలా విడుదల చేసేవారు. ఇక్కడ నీటి నిల్వలు తరిగిపోతున్నందున ముందుముందు నీటి ఇబ్బంది తప్పదని గత నెల 24న ‘జల సంక్షోభం’ అనే కథనం ద్వారా ‘సాక్షి’ హెచ్చరించింది. దీనితో కదలిక వచ్చిన అధికారులు బలిమెల రిజర్వాయర్ నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని పవర్ జనరేషన్ ద్వారా వచ్చేలా ఒడిశా అధికారులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంతోపాటు ఒడిశా ఉమ్మడిగా నిర్వహిస్తోంది. వేసవిలో విద్యుత్ వాడకాన్ని తగ్గించుకుంటామని, డెల్టాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న దృష్ట్యా బలిమెల నుంచి వెయ్యి క్యూసెక్కులు పవర్ జనరేషన్ ద్వారా తెప్పించేందుకు అక్కడి అధికారులను ఒప్పించారు. ఇలా అదనంగా నీరు వస్తున్నందున డొంకరాయి జలాశయం నుంచి రెండు వేల క్యూసెక్కుల నీటిని బైపాస్ పద్ధతిలో అధికారులు డెల్టాకు ఇవ్వగలుగుతున్నారు. -
ఎండిపోతున్న పంటపోలాలను పరిశీలించిన కొత్తపల్లి
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తీర ప్రాంతంలో ఎండిపోతున్న పంటపోలాలను వైఎస్ఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం పరిశీలించారు. పంటపోలాలకు సాగునీరు అందక బాధపడుతున్న రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, నరసాపురం మండలం మెడి గ్రామంలో ఎండిన పంటపోలాలను చూసి ఇరిగేషన్ అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. పంటకాలంలో నీళ్లు అందకపోవడంతో పోలాలు ఎండిపోతున్నాయంటూ వాపోయారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దత్తత గ్రామమైన పేరుపాలెంలో ఈ నెల 22న కాంగ్రెస్ నేత చిరంజీవి పర్యటించనున్నారు. -
కబ్జా కోరల్లో బుడమేరు
ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు గజం రూ.20 వే లకు విక్రయం రామకృష్ణాపురం, ఇందిరానాయక్ నగర్లో ఆక్రమణలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు విజయవాడ : బుడమేరు కబ్జా కోరల్లో చిక్కుకుంది. విజయవాడ 53వ డివిజన్ పరిధిలోని రామకృష్ణాపురం ప్రాంతంలో ఈ కబ్జా దర్జాగా సాగిపోతోంది. ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇప్పటికే 40 ప్లాట్లు అమ్మేశారు. గజం రూ.20 వేలు వంతున ఒక్కో ప్లాటు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల చొప్పున విక్రయించేశారు. కొనుగోలు చేసినవారు ప్రహరీలు కట్టుకోవటం, మట్టి తోలి బుడమేరును పూడ్చేయటం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందిరానాయక్ నగర్ ప్రాంతంలోనూ బుడమేరును కబ్జా చేసి ప్లాట్ల అమ్మకాలు చేపట్టినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే అండ! నగరంలోని ఒక టీడీపీ ఎమ్మెల్యే అండతో ఈ అక్రమ తంతు యథేచ్ఛగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకూ వాటాలు వెళుతున్నాయని సమాచారం. బుడమేరు కాలువలో డ్రెయినేజీ నీరుతో పాటు వరద నీరు కూడా వస్తుంది. సత్యనారాయణపురం పైభాగానికి వచ్చేసరికి వెడల్పు సుమారు అర కిలోమీటరు వరకు ఉంటుంది. ఇక్కడే ఈ కబ్జాలు జోరుగా జరుగుతున్నాయి. రానురానూ కాలువను పూడ్చి ఇళ్లు కట్టుకుంటున్నారు. పలు ప్రాంతాలకు ముప్పు వరదల సమయంలో బుడమేరు ఉగ్రరూపం దాల్చినప్పుడు భగత్‌సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, పాయకాపురం, ప్రకాష్ నగర్లు మునకకు గురవుతుంటాయి. కబ్జాలు ఎక్కువ కావడంతో బుడమేరు మార్గం కుంచించుకుపోవటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుత కబ్జాలతో ముంపు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
పార్వతీపురంలో జపాన్ బృందం పర్యటన
విజయనగరం జిల్లా పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది. స్థానిక ఇరిగేషన్ అధికారులతో సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. అనంతరం జీఎం వలస మండలంలోని వట్టిగడ్డ, చిన్న బంధ, దొర బంధ సాగునీటి ప్రాజెక్ట్‌లను పరిశీలించారు. -
అన్ని ప్రశ్నలకూ ఆయనే సమాధానం
► మంత్రుల్ని, చైర్‌పర్సన్‌ను ఓవర్టేక్ చేసే యత్నం ► అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ► విస్మయపరచిన ఎమ్మెల్యే అప్పలనాయుడు తీరు ► మంత్రి మృణాళినికీ ఆగ్రహం తెప్పించిన వైనం సాక్షి ప్రతినిధి, విజయనగరం :జిల్లా పరిషత్ సమావేశం మొత్తాన్ని ఆయన భుజస్కంధాలపైనే మోస్తున్నట్టు తెగ హడావుడి చేశారు. సభ్యుల ప్రశ్నలన్నింటికీ తానే సమాధానం చెప్పేందుకు యత్నించారు. అధికారులకూ వకాల్తా పుచ్చుకుని వారివ్వాల్సిన సమాధానాలనూ ఆయనే ఇచ్చేశారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఒక దశలో మంత్రి మృణాళిని సైతం ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేయడం విశేషం. ఆయనెవరో కాదు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు. అంగన్వాడీ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పోస్టుల్ని ఇష్టానుసారంగా అమ్ముకుని, అర్హులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతులు కూడా న్యాయబద్ధంగా జరగలేదని మరికొందరు నేతలు అధికారుల్ని ప్రశ్నించారు. దీనిపై ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ రాబర్ట్స్ సమాధానం ఇవ్వాల్సి ఉన్నా అప్పలనాయుడు అడ్డుతగిలి అంగన్వాడీ నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని, ఎక్కడా అక్రమాలు చోటు చేసుకోలేదని వాదించారు. అధికారుల్ని అడిగితే ఈయన సమాధానం చెప్పడమేంటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకాభిప్రాయం కుదరకుండానే బొబ్బిలి నియోజకవర్గంలో కొన్నిచోట్ల ఎన్నికలు జరిగిపోయినట్టు, తామే ఎన్నికైనట్టు కొందరు టపాసులు కాల్చుకుంటున్నారని ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని, వాస్తవ పరిస్థితులేంటో చెప్పాలని ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఇరిగేషన్ అధికారి సమాధానం చెప్పే లోపు ఎమ్మెల్యే అప్పలనాయుడు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరిగాయని, ఎమ్మెల్యే రంగారావు చెప్పినది సరికాదని ఖండించారు. దీంతో ప్రతిపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బొబ్బిలి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామంపై ఆయనకేం తెలుసని, అన్నీ తానై మాట్లాడటం సరికాదని అభ్యంతరం చెప్పారు. దీనిపై ఇరిగేషన్ అధికారి వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయన కూడా ఎమ్మెల్యే చెప్పినదే వల్లెవేసి కూర్చోవడంతో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడితే ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లో తిరగలేరని, ఇబ్బంది పడతారని ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర హెచ్చరించారు. మరొక సందర్భంలో మంత్రి మృణాళిని మాట్లాడుతుండగా జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణితో సైగలతో మాట్లాడే యత్నం చేశారు. దీంతో మంత్రి అసహనంతో ‘ అప్పలనాయుడూ... సైగలు చేసి మాట్లాడొద్దు.. మీరిద్దరూ అలా మాట్లాడటం వల్ల డిస్ట్రబెన్స్గా ఉంటుంది. సమావేశం తప్పుదారి పడుతుంది’ అని గట్టిగాచెప్పారు. అనుకోని ఝలక్‌తో అప్పలనాయుడు షాక్ తిని వెనక్కు తగ్గారు. -
2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాం
అనంతపురం : 2016 లోగా హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ గడవులోపే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పురోగతిని దేవినేని ఉమా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సన్నాలు..సై
బాపట్ల : సన్న బియ్యం సై కొడుతున్నాయి. మూడు నెలల్లో కిలో బియ్యం ధర రూ.32 నుంచి రూ.38కు చేరింది. ఈ నెలాఖరుకు రూ.50లకు చేరే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఖరీఫ్, రబీ సీజన్లలో పంట దిగుబడి తగ్గడం, ఈ ఏడాది వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడమే ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. గత ఏడాది నీటి ఎద్దడి కారణంగా కర్నూలు ప్రాంతంలో సన్నబియ్యం దిగుబడి సక్రమంగా లేకపోవటంతో బాపట్ల బీపీటీకి డిమాండ్ వచ్చిపడింది. ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో సాగర్ ఆయకట్టుకింద సుమారు 1.25 లక్షల హెక్టార్లలో పంట వేయకపోవటంతో ధాన్యానికి డిమాం డ్ ఏర్పడింది. అంతేకాకుండా ఎగుమతులు జోరందుకోవటంతో రైతులు ధాన్యం అమ్మేందుకు ముందుకు రావటంలేదు. మరింత ధర కోసం వేచి చూస్తున్నారు. దీనికితోడు మన రాష్ట్రంలో ధాన్యాన్ని మిల్లులో ఆడిస్తే ఐదుశాతం వ్యాట్, రెండు శాతం సెస్ రూపంలో చెల్లించాల్సి ఉంది. దీంతో వ్యాపారులు నేరుగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేందుకే ఇష్టపడుతున్నారు. అక్కడ బియ్యంపై పన్ను లేదు... కొత్త రాష్ట్రమైన తెలంగాణతోపాటు క ర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో బియ్యంపై పన్ను లు లేకపోవటంతో ఇక్కడి వ్యాపారులు నేరుగా ధాన్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. అక్కడి రైస్‌మిల్లులు ఇక్కడి నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని మర ఆడించి బియ్యా న్ని అమ్ముకుంటున్నాయి. ఈ కారణంతో మన రాష్ట్రాంలోని రైస్‌మిల్లులకు పనిలేకుండా పోయింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గింది... ఈ ఖరీఫ్‌లో గుంటూరు, ప్రకాశం జిల్లా లో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. ప్రకా శం జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 48.50 వేల హెక్టార్లు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 1.28లక్షల ఎకరాలు, గుం టూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీ ర్ణం 2.27 లక్షలు కాగా, రబీ సాధారణ విస్తీర్ణం 70వేల ఎకరాలుగా ఉంది. అయితే సాగర్ ఆయకట్టుతోపాటు, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి కారణంగా పంటలు పండించవద్దని వ్యవసాయాధికారులు, ఇరిగేషన్ అధికారులు పలు సూచనలు, సలహాలు ఇవ్వటంతో సుమారు రెండు జిల్లాల్లో 1.25 లక్షల హెక్టార్లలో భూమి సాగు కాలేదు. దీంతో ఈ ఏడాది ధాన్యం దిగుబడి తగ్గుతుందని ముందుగానే అంచనా వేసిన వ్యాపారులు తమ వద్ద నిల్వ ఉన్న ధాన్యానికి ధరలు పెంచి ఎగుమతులు చేస్తున్నారు. ప్రస్తుతం బియ్యం ధరలు ఇలా ... సన్న బియ్యం తినే వారి సంఖ్య పెరిగిపోవటంతో బీపీటీలపై మోజుపెరిగింది. ఎక్కువ మంది ఈ బియ్యంవై పే మొగ్గుచూపుతున్నారు. బీపీటీ రకం 75 కిలోల బస్తా గత నెలలో రూ.1300 నుంచి రూ.1350 ఉండగా ప్రస్తుతం రూ.1650-రూ.1700 మధ్య పలుకుతోంది. అదే పాత ధాన్యం అయితే రెం డు వేల రూపాయలకు కూడా అమ్ముతున్నారు. ఇదేవిధంగా 2716 రకం రూ.1050 నుంచి రూ.1300కు, 74 ర కం రూ.1200 నుంచి 1500కు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో కూడా ఎక్కువగా సన్న రకం ధాన్యం పండుతుంది. అయితే అక్కడ కూడా నీటి ఎద్దడి కారణంగా పంట లేకపోవటంతో ఎగుమతులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారు. బాపట్లలో కేంద్రీకృతమైన వ్యాపారం గతంలో హైదరాబాద్‌కు గుంటూరు, కర్నూలు నుంచి రోజు 100లారీలకుపై గా బియ్యం ఎగుమతులు జరుగుతుం డేవి. కృష్ణాపరివాక ప్రాంతంలో పంట దెబ్బతినటం, తమిళనాడు, మహారాష్ట్ర లో ధాన్యం పండకపోవటంతో ధాన్యం వ్యాపారులు బాపట్లవైపుచూస్తున్నారు. ఇక్కడ పండే సన్నాలకు మంచి గిరాకీ ఉంది. హైదరాబాద్, కర్నూలు, నల్లగొండ, విశాఖపట్నం, తమిళనాడు, క ర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన వ్యా పారులు బాపట్ల ప్రాంతంలో మకాం వేసి కొనుగోళ్లు ప్రారంభించారు. -
చెరువులో మునిగి విద్యార్థి మృతి
రాంక్యాతండాలో విషాదం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమని స్థానికుల ఆగ్రహం రఘునాథపాలెం : సెలవు రోజు సరదాగా చెరువు వైపు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని రాంక్యా తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని రాంక్యాతండాకు చెందిన గుగులోత్ ధర్మ, అరుణ దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్(7) ఉదయం అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద ఈర్లపుడి చెరువు వైపు వెళ్లాడు. ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకుంటూ చెరువులోకి ఈతకు దిగారు. ఈ క్రమంలో చెరువులో మిషన్ కాకతీయ పథకంలో తవ్వకాలు చేసిన పెద్ద గుంతలో అరుణ్‌కుమార్ మునిగి చనిపోయూడు. వ్యవసాయ పనులకు వెళ్లిన అతడి తల్లిదండ్రులు కుమారుడి రాకకోసం ఎంత చూసినా రాకపోవడంతో చిన్నారులను ఆరా తీశారు. అరుణ్ చెరువులో మునిగినట్లు ఇద్దరు చిన్నారులు చెప్పడంతో గ్రామస్తులు వారు చూపించిన ప్రాంతంలో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూడగానే మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారిని ఎంపీపీ మాలోత్ శాంత, సర్పంచ్ దేవ్లీ, మాజీ సర్పంచ్ అఫ్జల్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు లక్ష్మణ్‌నాయక్, పాపారావు, జాటోత్ నగేష్ తదితరులు ఓదార్చారు. బాలుడి మృతితో రాంక్యాతండాలో విషాదం అలుముకుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు తవ్వకం సమయంలోనే పెద్ద గుంతలు తీస్తుంటే రైతులు, గ్రామస్తులు ఇలా చెరువు లోపల పెద్ద గుంతలు తీయడం వల్ల పశువులు, వ్యక్తులు చనిపోయే అవకాశం ఉందని చెప్పినా పెడచెవిన పెట్టి అడ్డదిడ్డంగా తవ్వి చిన్నారిని బలిగొన్నారని ఆరోపించారు. -
అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
హైదరాబాద్: రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు కల్లెక్టర్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు . జీడిపల్లి వద్ద జూలై 23 న ప్రాజెక్టుల నిర్మాణ పనులపై సమీక్ష జరిపామంటూ, ఇప్పటివరకు ఎంత పని జరిగింది ? ఎప్పటికి పూర్తి చేస్తారు ? అని ప్రశ్నించారు . 23 రోజుల్లో జరిగిన పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. భూ సేకరణ, పూడికతీత , కాంక్రీట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనుల పూర్తికి సహకరించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని , కొంతకాలం వారిని బ్లాకు లిస్టులో పెట్టాలని ఆదేశించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ.700 కోట్లు ఖర్చుచేశామంటూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు భూసేకరణకు రూ.1028 కోట్లు వ్యయం చేసిన విషయం గుర్తు చేశారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇన్ పుట్ సబ్సిడీని రైతులకు వెంటనే పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు . అనంతపురం జిల్లాలో ఆగస్టు 5 నుంచి పంపిణీ చేయాలని సూచించారు. అన్ని చెరువులను నీటితో నింపాలని.. దీనివల్ల భూగర్భజలాలు పెరిగి బోర్లు రీఛార్జి అవుతాయన్నారు. సమావేశంలో జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ , సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, ఛీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
గడ్డుకాలం
చీమకుర్తి : వరుణుడు కరుణించి ఎడతెరిపి లేకుండా రెండు వారాల పాటు మహారాష్ట్ర, కర్నాటకలో భారీవర్షాలు కురిస్తే తప్ప రానున్న రోజులు రైతులకు గడ్డుకాలమే. తాగటానికి నీళ్లు అంతంత మాత్రమే కాగా వ్యవసాయానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించటం లేదు. రామతీర్థం రిజర్వాయర్, నాగార్జునసాగర్ డ్యామ్‌లోని నీటి నిల్వలే ఇందుకు తార్కాణం. చీమకుర్తి ఇరిగేషన్ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం...రామతీర్థం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 85.34 మీటర్లు (1.53 టీఎంసీలు) కాగా దాని డెడ్‌స్టోరేజీ 74.93 మీటర్లు(0.26 టీఎంసీ). ప్రస్తుతం రిజర్వాయర్‌లో కేవలం 75 మీటర్లు మాత్రమే సాగర్ జలాలున్నాయి. వారం రోజుల పాటు ఒంగోలు సమ్మర్ స్టోర్ ట్యాంక్‌లకు తాగునీరు ఇవ్వడం వలన దాదాపు వచ్చే సెప్టెంబర్ వరకు ఒంగోలుకు తాగునీటి అవసరం ఉండకపోవచ్చని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒంగోలులోని రెండు సమ్మర్‌స్టోర్ ట్యాంక్‌లకు కలిపి 5,800 మిలియన్ లీటర్లు నీటి అవసరం కాగా వారం రోజులుగా 3 వేల మిలియన్ లీటర్ల నీటిని వదిలారు. ఇంకా నీటి అవసరం ఉన్నప్పటికీ రెండు నెలల పాటు సర్దుకుపోవడానికి అవకాశం ఉంది. అయితే జిల్లాలోని తాగునీటి చెరువులు, ఇతర ట్యాంక్‌లకు కలిపి 1.5 టీఎంసీల అవసరం ఉందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఇండెంట్ ఇచ్చారు. ఆ నీటిని సరఫరా చేసే పరిస్థితిలో చీమకుర్తి రామతీర్థం రిజర్వాయర్ లేదని స్థానిక అధికారులు వెల్లడిస్తున్నారు. నాగార్జున సాగర్‌లో నీటిమట్టం ఆదివారం నాటికి నీటిమట్టం 510.5 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగర్‌లో అది డెడ్‌స్టోరేజీ మట్టం. కాబట్టి సాగర్ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. కోర్టు ఉత్తర్వులో లేక సీఎంల స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్ప తాగునీటికి సాగర్ నుంచి వదలరు. రానున్న రోజుల్లో జిల్లాలో తాగునీటికి కష్టకాలం ఏర్పడే ప్రమాదం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్న గణాంకాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. తాగునీటికే అలా ఉంటే ఇక వ్యవసాయానికి నీటిని ఏమిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమై రెండు నెలలైంది. వరినార్లు పోసుకునే గడువు రావడంతో రైతులు చెరువులు, రామతీర్ధం రిజర్వాయర్లు, కాలువల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాగునీటి కొరతతో రైతులు వరినార్లు పోసుకోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలనే సూచన ఉన్నతాధికారుల నుంచి చేయించేందుకు ఇరిగేషన్ అధికారులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఒత్తిడి మేరకు రేపో మాపో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలంటూ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
లిఫ్టు ఇరిగేషన్ నీటిని ఆపివేయాలి
అధికారులపై టీడీపీ నేతల ఆగ్రహం తాడేపల్లి రూరల్ : యూటీకే లిఫ్టు ఇరిగేషన్ నీటిని తక్షణమే నిలిపివేయాలని, పంట పొలాల సాగు ఆపివేయాలని తెలుగుదేశం నేతలు అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఉండవల్లి యూటీకే లిఫ్టు ఇరిగేషన్‌కు శుక్రవారం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైతులు పంట కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, తదితర నాయకులు సంఘటనా స్థలానికి వచ్చి ఎవరిని అడిగి నీళ్లు వదిలారంటూ ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. ఉండవల్లి యూటీకే లిఫ్టు ఇరిగేషన్ స్వచ్ఛందంగా రైతులే నడుపుతున్నారన్న విషయం కూడా తెలియని నాయకులు హడావుడిగా లిఫ్టు ఇరిగేషన్ వద్దకు వచ్చి అధికారులపై ఫోనులో కేకలు వేశారు. అధికారులు మాత్రం అది మా పరిధిలోది కాదంటూ చెప్పారు. -
వారికి పొగ...వీరికి సెగ
► అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన నోటీసులు ► కారాలు నూరుతున్న 25 వేల కాల్వగట్ల నివాసితులు ► విపక్షాల ఆందోళనలతో ‘దేశం’ నేతలు ఉక్కిరిబిక్కిరి సాక్షి, విజయవాడ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. కాల్వగట్ల ఆధునీకరణ, సుందరీకరణ పేరుతో ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులు కాల్వగట్లవాసులకు నోటీసులివ్వడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నగరంలో పర్యటించి కాల్వగట్లను సుందరీకరించాలంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు బుడమేరు మధ్య కట్ట, రైవస్ కెనాల్, బందరు కాల్వలకు రెండువైపులా నివాసముంటున్నవారి గుడిసెలు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు. గుణదల, పటమట, రామవరప్పాడు, బుడమేరు కట్టపై ఉంటున్న కొంతమంది పేదలకు నోటీసులివ్వడంతో ప్రజలు, విపక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని, వారికి అండగా నిలబడతామని వైసీపీ, వామపక్షాల నేతలంటున్నారు. ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాలోనే పేదలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గద్దె, వంశీ, బొండాలకు సెగ.. జిల్లాలో 25 వేలు, నగరంలో 10 వేల కుటుంబాలు కాల్వగట్లపై పూరిగుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. సుమారు నలభై ఏళ్లుగా అలా నివసిస్తున్నవారిని తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో కంగుతిన్న పేదలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, బొండా ఉమామహేశ్వరరావులకు ఈ సెగ బాగా తగులుతోంది. తమను ఇళ్లు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ మంత్రికి తెలియకుండానే తమకు నోటీసులిచ్చారా.. అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పేదల ఇళ్లు తొలగించకుండా చూస్తామంటూ ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీమోహన్ కలెక్టర్‌ను కలిసి పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాత ఇళ్లు తొలగించాలంటూ కోరాల్సి వచ్చింది. మంత్రి దేవినేని ఉమాపై ఒత్తిడి తెచ్చి నోటీసులు నిలుపుదల చేయించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రే పథకం ఏమైంది...? రాజీవ్ ఆవాస్ యోజన కింద కాల్వగట్లపై పేదల ఇళ్లను తొలగించి అక్కడే బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మించి ఇవ్వాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిని అమలు చేయాలని పేదలు కోరుతున్నారు. ఇరిగేషన్ స్థలాల్లో పలు భవనాలు ♦ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ♦ బందరు రోడ్డులో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు పాత కెనాల్ గెస్ట్‌హౌస్ స్థలాన్ని లీజుకు ఇవ్వడంతో బహుళ అంతస్తుల సముదాయాలు నిర్మించారు. ♦ అమెరికన్ హాస్పిటల్ వద్ద కళాశాలలు, ఇంకా అనేక భవనాలున్నాయి. ♦ కాల్వకట్టల సుందరీకరణ, ఆధునీకరణకు ఈ భవనాలు అడ్డురానప్పుడు చిరు వ్యాపారుల దుకాణాలు, పేదల నివాసాలే అడ్డు వస్తాయా.. అని జనం నిలదీస్తున్నారు. తొలుత ఆయా భవనాలను తొలగించిన తర్వాతే పేదల జోలికి వెళ్లాలని విపక్షాల నేతలు చెబుతున్నారు. -
కృష్ణా జలాల వాదన లపై ప్రభుత్వం కసరత్తు
సుప్రీం కోర్టు న్యాయవాదితో నీటిపారుదలశాఖ అధికారుల చర్చలు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల కేటాయింపు వివాదంపై రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 29న సుప్రీంకోర్టులో కృష్ణా జలాలపై తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్ణాటకల వాదనలను కోర్టు విననున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో అధికారులు మంగళవారం చర్చలు జరిపారు. గతంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్.. తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలకు జరిపిన కేటాయింపులపై సమీక్ష జరపాల్సి ఉందని చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలు వాడుకుంటున్నప్పుడు కేటాయింపులు సైతం ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని జరగాల్సి ఉంటుందని అధికారులు సుప్రీం న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీసేదిలా ఉందని, నదీ పరీవాహకం మేరకు కేటాయింపులు జరపలేదనే వివరాలను గణాంకాలతో సహా వైద్యనాథన్‌కు అధికారులు అందించారు. ఈ చర్చల సందర్భంగా న్యాయవాది వైద్యనాథన్‌కు తోడుగా మరో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేను కూడా నియమించేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్త్తం చేసినట్లు తెలిసింది. -
సోయి లేకనే..
నారింజ నుంచి నీరంతా వృథా పొలాలన్నీ బీళ్లు.. తాగు నీటికీ తిప్పలు మన నీటితో సాగు చేసుకుంటున్న పక్క రాష్ర్టం కారంజ ప్రాజెక్ట్‌కు జలకళ.. ‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు పక్క రాష్ట్రానికున్న సోయి మనకు లేకుండా పోయింది. మనం వృథాగా వదిలేసిన నీటి ఆధారంగా కర్ణాటక పాలకులు ఓ ప్రాజెక్టునే నిర్మించారు. వేలాది ఎకరాల్లో సాగు చేయడమే కాదు తాగు నీటికీ వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా మన నారింజ ప్రాజెక్టు వెలవెలబోతుండగా పక్క రాష్ర్టంలోని కారంజలో జలకళ సంతరించుకుంది. మహానేత వైఎస్ హయాంలో నారింజ నీటి నిల్వ కోసం ప్రణాళిక రచించినా ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో గద్దెనెక్కిన పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇక్కడి రైతులు కన్నీటి సాగు చేస్తుండగా.. జనం తాగు నీటికోసం పరితపిస్తున్నారు. శనివారం ‘సాక్షి’ బృందం నారింజ.. కారంజ ప్రాజెక్టులను సందర్శించగా ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్ టౌన్ : మనం దాచుకోలేక వృథాగా వదిలేసిన వాగు వరద నీటిని పక్క రాష్ట్రం ఒడిసిపట్టుకుంది. పక్కా ప్రణాళికతో కారంజ ప్రాజెక్టు కట్టింది. వేల ఎకరాలకు సాగునీరు... రెండు పెద్ద పట్టణాలకు తాగు నీటిని అందిస్తోంది. ఏడాదికి సగటున 6 టీఎంసీల నీరు మెతుకు సీమ నుంచి కారంజ ప్రాజెక్టులో చేరుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం చొరవ ఫలితంగా ఆ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వేసవి రాకముందే పల్లెల గొంతు ఎండిపోతున్న వేళ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందకు ‘సాక్షి’ బృందం శనివారం జహీరాబాద్‌లోని నారింజ వాగు పరీవాహక ప్రాంతంలో పర్యటించింది. కొత్తూరు వద్ద నారింజ ప్రాజెక్టును, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని కారంజ ప్రాజెక్టులను పరిశీలించింది. నారింజ నుంచే కారంజకు.. కోహీర్ మండలం బిలాల్పూర్లో పుట్టిన నారింజ వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా నేరుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లిపోయి తిరిగి మళ్లీ తెలంగాణలోకే వస్తుంది. చిరాగ్పల్లి వద్ద మన రాష్ట్ర సరిహద్దును దాటి దాదాపు 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రవహించి కర్ణాటకలోని కారంజ ప్రాజెక్టును నింపుతుంది. ప్రాజెక్టు నిండిన తరువాతమళ్లీ తిరిగి జహీరాబాద్‌కే వచ్చి మంజీరలో కలుస్తుంది. వర్షాల ఉధృతిని బట్టి ఏడాదికి కనీసం 5 నుంచి 7 టీఎంసీల నీళ్లు వృథాగా పోయి ఇందులో కలుస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం.. జహీరాబాద్, ఝరాసంగం నేలలు ఎర్ర నేలలు అయినందున ఇక్కడ ఒక్క టీఏంసీ నీటితో 8 వేల ఎకరాలు సాగు చేయవచ్చు. వృథాగా పోతున్న నీటిలో కనీసం సగమైనా అంటే 3 టీఎంసీల నీటినైనా ఆపలిగితే 24 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. కొత్తూరు రెగ్యులేటరీ.. 1970లో జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద రూ.కోటి వ్యయంతో నారింజ వాగుపై రెగ్యులేటరీ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం దీన్ని ఆధునికీకరించినా ఎడమ కాలువ కింద ఉన్న కొత్తూరు, బూర్ధిపాడు, బూచినెల్లి, చిరాగ్పల్లి, సత్వార్, మిర్జాపూర్, మల్కాపూర్, తదితర గ్రామాలకు రెండు కాలాలకు తాగు, సాగు నీరు అందేది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ చిన్ననీటి వనరు పూర్తిగా ఎండిపోయింది. పశువులు కూడా నీళ్లు తాగే పరిస్థితి లేదు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నీటికోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే ప్రతి కుటుంబంలో ఒకరికి పూర్తిగా తాగు నీరు మోయడానికే సరిపోతుంది. నాణ్యమైన అల్లం, ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటి వాణిజ్య పంటలు పండే భూములు నీళ్లు లేక బీడుగా మారాయి. సేద్యం మీద మమకారం చంపుకోలేని రైతులు అక్కడక్కడా కంది, మొక్కజొన్న పంటలతో నెట్టుకొస్తున్నారు. కారంజ కింద పచ్చని పొలాలు.. నారింజ వాగు వరద మీద ఆధార పడే కర్ణాటక ప్రభుత్వం బీదర్ జిల్లా హల్హళ్లి ప్రాంతంలో కారంజ ప్రాజెక్టును కట్టింది. మొత్తం 13 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అవసరమైతే 0.374 టీఎంసీ డెడ్ స్టోరేజీ వరకు నీటిని వినియోగించుకునే విధంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టు డ్యాం గరిష్ట ఎత్తు: 589.15 మీటర్లు కాగా ప్రస్తుతం 578.55 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో ఏడాది పొడవునా నీళ్లు ఉంటాయి. దీంతో అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడి రైతులు చెరుకుతోపాటు అల్లం, ఉల్లి, వెల్లుల్లి పంటలు వేశారు. రబీ సీజన్‌కు 14 వేల హెక్టార్లకు సాగు నీటిని అందించాలని అక్కడి ప్రభుత్వం సంకల్పించినా ఈ ఏడాది నారింజ వాగుకు సరిగా వరద నీరు చేరక పోవడంతో కారంజ పూర్తిగా నిండలేదు. అయినప్పటికీ ప్రాజెక్టు కింద 20 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో చెరుకు, ఉల్లి తోటలు విస్తారంగా కనిపించాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం సాగు కోసం నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. నారింజ నీరు కర్ణాటక రాష్ట్రానికి చేరక ముందే ఒడిసిపట్టుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లోనే సంకల్పించారు. సర్వే చేసి, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అప్పట్లోనే ఆదేశించారు. పాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్సార్ అప్పటికప్పుడు నారింజ వాగును మైనర్ ఇరిగేషన్ విభాగం నుంచి మేజర్ ఇరిగేషన్ విభాగానికి బదలాయించారు. వాగు వద్ద వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్, గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు. ఈ లెక్కన నారింజ వాగు నుంచి ఏడాదికి 5 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కర్ణాటకకు తరలిపోతోంది.వాగు కర్ణాటకలోకి ప్రవేశించడానికంటే ముందే సింగూరుకు మళ్లిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని జహీరాబాద్ నియోజకవర్గం రైతులకు అందించవచ్చని గుర్తించారు. వాగును మళ్లించడానికి జహీరాబాద్ మండ లం అల్గోల్ గ్రామం అనువైన ప్రాంతంగా గుర్తించారు. అల్గోల్ గ్రామం నుంచి కాలువ తవ్వకాలు మొదలు పెట్టి ఝరాసంగం మండలం మేదపల్లిలోని కొత్త చెరువులకు కలపాలి. అక్కడి నుంచి జీర్లపల్లి చెరువు మీదుగా దుబ్బ వాగుకు కలపాలి. అక్కడి నుంచి నీటిని సింగూరులోకి మళ్లించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ మొత్తం కాలువ దూరం కేవలం 15.35 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నిర్ధారించారు. ప్రాజెక్టు పనులు, కాలువ నిర్మాణం కోసం రూ 67.66 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. ఇలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులు వైఎస్సార్ ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత జరిగిన పరిణామంతో ఈ ప్రతిపాదనల ఫైల్ అటకెక్కింది. ఆ తరువాత గద్దెనెక్కిన వారెవరూ నారింజ వాగు వైపు చూడకపోవడంతో ఇక్కడి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ నారింజపై దృష్టిసారించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
-
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
గుంటూరు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు రెండువైపులా మోహరించారు. మరోవైపు అధికారులకు బందోబస్తుగా పోలీసులు భారీగా తరలి వచ్చారు. నాగార్జున సాగర్ నుంచి కుడికాల్వకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు యత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు నాగార్జున సాగర్ డ్యాం ఉన్నతాధికారులతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మార్చి నెలాఖరుకల్లా సాగర్ కుడికాల్వకు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే వేలాది ఎకరాలకు నష్టం తప్పదని ఆయన ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. -
ఇరిగేషన్ అధికారులతో వైఎస్ జగన్ భేటీ
-
టీడీపీ ఆధిపత్యం.. రైతుకు శాపం
ఆత్మకూరురూరల్ : అన్నదాత అవసరం కన్నా.. టీడీపీ నేతలకు ఆధిపత్యమే ముఖ్యమైంది. ఒక పక్క చేతికందే దశలో ఉన్న పంటలు సాగునీటి కొరత కారణంగా ఎండిపోతుంటే.. మరో పక్క తమకు తెలియకుండా ఎత్తిపోతల నీటి పథకాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ ఇరిగేషన్ అధికారులను దబాయించి మరీ సాగునీటి విడుదలకు మోకాలడ్డు వేసిన పరిస్థితి మండలంలోని మురగళ్లలో నెలకొంది. దీంతో గ్రామ రైతాంగం సాగునీటి కష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రూ.8.7 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసింది. నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి పైపులైన్ల ద్వారా పెన్నానది నీటిని గ్రామ చెరువులోకి తరలించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం పూర్తయితే తమ భవిష్యత్ కూడా మారుతుందని ఆశించి రైతాంగం తమ వంతుగా శ్రద్ధ వహించి త్వరగా నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేశారు. అధికారులు పలుమార్లు పరిశీలించి సూచనలు చేశారు. 20 రోజుల క్రితం ఏపీఎస్ఐడీసీ జేఎండీ, ఇతర ఉన్నతాధికారులు స్కీమ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో స్కీమ్ ప్రారంభం చేస్తామని ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ ప్రమేయం లేకుండా మాట మత్రమైనా చెప్పకుండా స్కీమ్‌ను ఎలా ప్రారంభిస్తారని గ్రామస్తులను, అధికారులపై శివలెత్తారు. జిల్లా మంత్రి, సంబంధిత శాఖ మంత్రి వచ్చి ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని, అప్పటి వరకు వేచి ఉండాలని రైతులకు తెగేసి చెప్పి నీటి విడుదలకు మోకాలడ్డుకున్నారు. నెల క్రితమే స్కీమ్ నిర్మాణం పూర్తయినా, అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినా ప్రారంభాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులకు తీరేదెప్పుడో.. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో అంటూ రైతులు నిట్టూరుస్తున్నారు. -
మిషన్ కాకతీయ షురూ !
- మొదటి విడతలో 50 చెరువులకు టెండర్లు - ఈ-ప్రొక్యూర్మెంట్లో నోటిఫికేషన్ - 11 నుంచి ఆన్లైన్లో షెడ్యూళ్లు వరంగల్ రూరల్ : చిన్ననీటి వనరుల పునరుద్ధరణలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 5,865 చెరువులుండగా అందులో 1,415 చెరువులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి విడత చేపట్టిన చెరువులన్నింటికి ఒకేసారి టెండర్లు నిర్వహించేందుకు సాంకేతికపరంగా ఇబ్బందులున్నందున జిల్లాలో 50 చెరువులకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ.38.08 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 50 చెరువులకు ఆన్లైన్లో ఈ-ప్రొక్యూర్‌మెంటు ద్వారా టెండర్లు నిర్వహించేందుకు అధికారులు వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఓటీకి అందించారు. రూ.కోటి వరకు ఖర్చయ్యే చెరువులకు పరిపాలన మంజూరు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం జిల్లాస్థాయిలోని నీటిపారుదల శాఖ ఎస్ఈకు ఇస్తూ జీఓ జారీ చేసింది. దీంతో నవంబర్ 27 నాడే మొదటి విడత టెండర్లు నిర్వహించే చెరువులకు నిధులు కేటాయిస్తూ పరిపాలన మంజూరు ఇచ్చారు. దీంతో ఇరిగే షన్ అధికారులు ఆయా చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి,టెండర్ల ప్రక్రియ నిర్వహించే సంస్థలకు సమర్పించారు. ఈ ఎస్టిమేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సమయం పడుతుండడంతో ఈ నెల 11 నుంచి ఈ-ప్రొక్యూర్మెంట్లో కాంట్రాక్టర్లకు బిడ్ డాక్యుమెంట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. రూ.38.08 కోట్లతో 50 చెరువుల పునరుద్ధరణ ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఈ ఏడాది చేపట్టనున్న 1,415 చెరువులకు ఎస్టిమేట్లు తయారు చేసే పనిలోపడ్డారు. అందులో 276 చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు కాగానే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో అందజేశారు. రూ.కోటికి తక్కువ ఉన్న చెరువులకు సంబంధించిన ఎస్టిమేట్లను సర్కిల్ కార్యాలయంలో స్క్రూట్నీ చేశారు. స్న్రూట్నీ పూర్తయినా 50 చెరువులకు రూ.38.08 కోట్లతో టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మిగిలిన 1,089 చెరువుల ఎస్టిమేట్లను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. -
కేసీఆర్‌తో ఇరిగేషన్ అధికారుల భేటీ
-
‘క్యాంప్’పై కన్ను
* ఖరీదైన భూములపై పెద్దల చూపు * ఎన్నెస్పీ స్థలాల కోసం యత్నం * తమకే కేటాయించాలని ఉద్యోగుల డిమాండ్ * బహిరంగ వేలం వేస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు * ‘సేవా’ ముసుగులో తన్నుకు పోయే కుట్రలు * రాష్ట్రస్థాయిలో కేటాయింపుల కోసం రియల్టర్ల ఎత్తులు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఖరీదైన ప్రభుత్వభూములపై బడాబాబుల కన్నుపడింది. రాజకీయ నేతల తో ఉన్న కాస్తోకూస్తో పరిచయాలనే పెట్టుబడిగా ఎన్నెస్పీ భూములను కొల్లగొట్టేందుకు కొందరు పెద్దలు, మరికొందరు రియల్టర్లు విశ్వయత్నాలు చేస్తున్నారు. చేతికి మట్టి అంటకుండా సేవా ముసుగులో ఎన్నెస్పీ భూములను హస్తగతం చేసుకునేందుకు కుటిలయత్నాలు చేస్తున్నారు. నగరంలోని ఎన్నెస్పీ క్యాంపులో గల క్వార్టర్స్ భూములను విక్రయించాలని ప్రభుత్వ అధికారులు నుంచి ప్రకటన వెలువడిందో లేదో ఈ రాబందులు తమ యత్నాలను ముమ్మరం చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మంత్రాంగం మొదలుపెట్టారు. రాజకీయ అండ తోడైతే తిరుగులేదన్న భావనతో రియల్టర్లు అందివచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు యత్నిస్తున్నారు. సేవా ముసుగులో... బహిరంగవేలమైతే తమ ఆటలు సాగుతాయో, లేదోననే ఉద్దేశంతో కొందరు రియల్టర్లు నిబంధనలను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు పాట్లు పడుతున్నారు. సేవా సంస్థలు, సామాజిక సేవా సంఘాల పేరుతో వేలానికి ముందే ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ సేవా కార్యక్రమాలను గుర్తుచేస్తూ ఎప్పుడో రిజిస్టరైన తమ సేవా సంస్థల కాగితాల దుమ్ముదులుపుతున్నారు. ఈ ధూళి కాగితాలే కోట్ల రూపాయల విలువైన భూమిని తెచ్చిపెడతాయనే విశ్వాసంతో కొందరు బడాబాబులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమ అర్జీలు కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నాయనే పేరుతో వాటికి సత్వరం మోక్షం లభించేలా చూడాలని రాజధానికి వెళ్లి అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. విధివిధానాలు ఖరారు కాకముందే... ఎన్నెస్పీ భూముల విక్రయానికి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేయకముందే మొదలైన ఈ హడావిడిని చూసి క్వార్టర్లలో ఉంటున్న ఉద్యోగులు కంగారు పడుతున్నారు. దశాబ్దాల పాటు ఎన్నెస్పీకి సేవలందించిన తమకు ఎక్కడా సొంత గూడులేదని, తాము నివసిస్తున్న క్వార్టర్లను తమకే ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుత ఉద్యోగులు కూడా ఇదే విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల హామీలపై ప్రశ్నిస్తున్నారు. క్వార్టర్లను కాజేసే యత్నం... ఖమ్మం కార్పొరేషన్ నడిబొడ్డున నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 94 ఎకరాల 29 కుంటల భూమి ఉంది. సాగర్ కాలువల నిర్మాణాన్ని పురస్కరించుకొని దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ భూమిని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు కేటాయించింది. ఖమ్మం కేంద్రంగా సాగర్ కాలువల నిర్మాణంలో పాల్గొన్న ఉద్యోగులు, కార్మికులకు ఇందులో కొన్ని క్వార్టర్లను నిర్మించి ఇచ్చారు. మొత్తం 722 క్వార్టర్లను నిర్మించారు. వీటిలో ఇప్పటికే 512 క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. మరో 8 క్వార్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. మిగిలిన 202 క్వార్టర్లలో మాత్రమే ఉద్యోగులు నివసిస్తున్నారు. వీటిలో ఇప్పటికే దాదాపు 10 క్వార్టర్లలో పలు పార్టీలకు చెందిన నేతలు క్యాంపు కార్యాలయాల పేరుతో తిష్టవేశారు. వీరిని ఖాళీ చేయించే విషయంలో ఎన్నెస్పీ, రెవెన్యూ అధికారులు చేతులు ఎత్తేశారు. తాజాగా ఎన్నెస్పీ అధికారుల చేతుల్లో ఉన్న భూములను కాపాడుకోవడం వారికి తలకుమించిన భారంగా మారింది. కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాల్లో ఇప్పటికే 5 ఎకరాల 31 కుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారికంగా చెబుతున్నారు. ఇవి కాకుండా 39 ఎకరాల 2 గుంటల భూమి పలు కారణాలు చూపి ప్రభుత్వం నుంచి ఇతరులు కేటాయింపులు చేయించుకున్నారు. నగరం విస్తరించడం.. ఎన్నెస్పీ క్యాంప్ నగరం నడిబొడ్డు అవడంతో ఈ స్థలాలపై బడాబాబుల కన్ను పడింది. ఏదో రకంగా వీటిని దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా ఈ స్థలాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందనే ప్రతిపాదనలు ఇరిగేషన్ అధికారులు ముందుకు తీసుకువచ్చారు. ఎటువంటి ఆక్రమణలు లేకుండా ఉన్న 40 ఎకరాల భూమిని వేలం వేసేందుకు కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల సుమారు రూ.400 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. తెరచాటు యత్నాలు... ఎన్నెస్పీ స్థలాలపై ఎప్పటినుంచో కన్ను వేసిన పెద్దలు ఇప్పుడు వేలం ప్రతిపాదనలతో ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. బహిరంగ వేలంలో దక్కించుకోవడం కన్నా చక్రం తిప్పి ఏదో ఒక రకంగా కేటాయింపులు చేసుకోవచ్చుననే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నేతలు, బడా కాంట్రాక్టర్లు ఓ మంత్రి సహకారాన్ని కోరుతూ మంతనాలు కూడా ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓ బడా కార్పొరేట్ సంస్థ, అలాగే రియల్ఎస్టేట సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఉన్నతస్థాయిలో ఈ భూములను తమకు కేటాయించేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే క్వార్టర్లలో సుమారు 50 ఏళ్లుగా ఉంటూ పద వీ విరమణ పొందిన ఉద్యోగులు, మాజీ కార్మికు లు మాత్రం ఈ క్వార్టర్స్‌ను తమకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన క్వార్టర్లను తమకు కేటాయిస్తే ఆ స్థలంలో ఇళ్లు నిర్మించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజోపయోగం పక్కదోవ... ఖమ్మంలోని విలువైన ప్రభుత్వ భూములను ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని గతంలో అనేకమంది కలెక్టర్లు ప్రయత్నించారు. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి రావడం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఇరుకుగా ఉండటంతో దానిని ఎన్నెస్పీ క్యాంప్‌లోకి మార్చాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా.. దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి విస్తరించడంతో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మించాలని గత కలెక్టర్ భూములను పరిశీలించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చకుండా బడాబాబులు పావులు కదిపారు. ఇలా ఏదో ఒక ప్రజపయోగ కార్యక్రమం చేపడుదామన్న ప్రతిసారీ వివిధ కారణాలను చూపి పెద్దలు అడ్డుకుంటున్నారు. -
ఘాట్లు చూడకుండా కళ్లు మూసుకున్నారా..
సాక్షి, రాజమండ్రి : ‘పుష్కరాలకు సంబంధించి ఆరేడు సమావేశాలయ్యాయి. ఇంతవరకూ ఘాట్లు చూడకుండా కళ్లు మూసుకున్నారా?’.. ఇరిగేషన్ అధికారులపై కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆగ్రహం ఇది. పుష్కర సన్నాహాలపై వివిధ శాఖల సవరించిన ప్రతిపాదనలను స్వీకరించేందుకు శుక్రవారం ఆమె రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రతిపాదనలు ఇచ్చేందుకు మరో వారం గడువు కావాలని ఇరిగేషన్ అధికారులు కోరడంతో కలెక్టర్ మండిపడ్డారు. ‘మీ ఎస్ఈ ఎక్కడ? ముఖ్యమైన సమావేశమన్నా వేరే క్యాంపులేంటి?’ అని అసహనం వ్యక్తం చేశారు. వరదల కారణంగా ఘాట్లు పరిశీలించలేక పోయామనడంతో ‘వరదలు ఇప్పుడొచ్చాయి. అంతకు ముందు ఏం చేస్తున్నారు?’ అని నిలదీశారు. వారి అలసత్వం వల్ల ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు సంజాయిషీ చెప్పుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతోందన్నారు. రాత్రింబవళ్లు పనిచేసైనా సోమవారంలోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. -
రాళ్లవాగు నీళ్లు వృథా
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీ ప్రభాత్‌నగర్ శివారులో ఉన్న రాళ్లవాగు పికప్ డ్యాం నిండుకుండలా ఉంది. కానీ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పొలాలు ఎండిపోతున్నాయి. చివరి భూములకు నీరందక బీళ్లుగా దర్శమిస్తున్నాయి. రాళ్లవాగు పికప్ డ్యాం కింద మూడు వేల ఎకరాల సాగు భూమి ఉంది. కుడి కాల్వ కింద 1500 ఎకరాలు, ఎడమ కాల్వ కింద 1500 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. మరమ్మతులు చేయకపోవడంతో... ఇటీవల ఈ డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరింది. కానీ డ్యాం తూములకు మరమ్మతులు చేయకపోవడంతో వాటి నుంచి నీరు వృథాగా పోతోంది. మరోవైపు డ్యాం లీకై కూడా నీళ్లు వృథాగా పోతున్నాయి. కుడి ఎడమ కాల్వల చుట్టూ చెట్లు అల్లుకుపోయి లోపల సిల్టు పేరుకుపోయింది. దీంతో కాల్వ ద్వారా భూములకు పూర్తిస్థాయిలో నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సక్రమంగా నీరు సరఫరా కాకపోవడంతో వందలాది ఎకరాల పొలాలు బీళ్లుగా మారినట్లు రైతులు తెలిపారు. పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు... డ్యాం నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయని అనేకసార్లు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలానికి ముందే మరమ్మతులు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీజన్లో నీరు అందడం లేదని రైతులు అంటున్నారు. ఈ లీకుల కారణంగా డ్యాంలోని నీరంతా వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ ఈఈ బజారన్నను వివరణ కోరగా.. రాళ్లవాగు పికప్ డ్యాం కోసం మూడు నెలల క్రితం రూ. 2 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, మంజూరు కాగానే కాల్వలు, తూములకు మరమ్మతులు చేస్తామని అన్నారు. -
కడపకు ఎక్కిళ్లు
ఓ వైపు జాడలేని వాన చినుకులు.. మరోవైపు ఆగని ఇసుకాసురుల ఆగడాలు.. వెరసి భూగర్భ జలం అడుగంటింది. చుక్కనీరు లేక పెన్నానది బోసి పోయింది. ఇంకేముంది కడప నగరానికి నీటి గండం పొంచి ఉంది. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తలెత్తే నీటి ఎద్దడి సమస్య ఆగస్టులోనే ఎదురుకావడంతో ప్ర‘జల’కు కలవరం మొదలైంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు నీటి సరఫరా కానీ దుస్థితి తలెత్తింది. కడప కార్పొరేషన్: కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. దీంతో నగరంలో పలు ప్రాంతాలకు వారం రోజులుగా నీరు సరఫరా ఆగిపోయింది. నీరు రాక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు బోర్లు ఫెయిల్.. పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స పర్ డే) లు సరఫరా చేసేవారు. వారం క్రితం వరకూ 47.60 ఎంఎల్డీల నీరు సరఫరా చేసేవారు. ప్రస్తుతం పెన్నాలో చుక్కనీరు కూడా లేకపోవడం.. లింగంపల్లె,గండి వాటర్ వర్క్స్‌లో ఒక నిమిషానికి 4వేల లీటర్ల నీటిని పంప్ చేయగలిగిన రెండు 60 హెచ్‌పీ బోర్లు ఫెయిల్ కావడంతో 36 ఎంఎల్డీలకు పడిపోయింది. ఫలితంగా నగరంలో 25 శాతం ప్రాంతాలకు తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడింది. గంజికుంట కాలనీ, ప్రకాష్‌నగర్, నకాష్, ఖలీల్‌నగర్, ఎన్టీఆర్ నగర్లతోపాటు నగర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికి అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. మరో వా రం రోజులపాటు ఇలాగే కొనసాగితే మిగిలిన బోర్లు కూడా పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. అధికారులతో మాట్లాడుతున్నాం: పెన్నా పూర్తి గా ఎండిపోయిన విషయమై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నాం. నిన్న రాజోలి ఆనకట్టనుంచి 2 వేల క్యూసెక్కులు వదిలామని చెబుతున్నారు. రెండు రోజుల్లో ఆ నీరు గండి, లింగంపల్లెలకు చేరే అవకాశముంది. సోమవారం మేయర్‌తో కలిసి ఆదినిమ్మాయపల్లె వద్దకు వెళ్లి చూసి తదుపరి చర్యలు తీసుకుంటాం. -ఓబులేసు, కమిషనర్, కడప -
కృష్ణా డెల్టాకు 20 నుంచి నీళ్లివ్వండి
ఈఎన్సీకి కృష్ణా ఇరిగేషన్ అధికారుల లేఖ సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణాడెల్టా తాగునీటి అవసరాల కోసం ఈ నెల 20 నుంచి మూడో విడత తాగునీటిని విడుదల చేయాలని కృష్ణా జిల్లా ఇరిగేషన్ అధికారులు శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌ను కోరారు. ఈ మేరకు అధికారులు గురువారం నీటి విడుదల వివరాలతో కూడిన ప్రతిపాదనల్ని హైదరాబాద్‌కు పంపారు. కృష్ణాడెల్టాకు తొలుత కేటాయించిన 10 టీఎంసీల నీటిలో ఇప్పటివరకు రెండు విడతలుగా 7.12 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఇటీవల జరిగిన కృష్ణా వాటర్ బోర్డు సమావేశంలో మిగతా 2.88 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాలని, ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీతో పాటు బోర్డుకు చైర్మన్‌గా ఉన్న పాండ్యా సూచించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కృష్ణాడెల్టా ఎస్ఈ శ్రీనివాస్ రెండు రోజుల కిందట షెడ్యూల్‌ను పంపారు. వీటిని పరిశీలించిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 18 నుంచి మూడో విడత నీటిని తీసుకోవాల్సిందిగా సూత్రప్రాయంగా తెలిపారు. అయితే ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నిల్వ ఉన్న నీటిని తూర్పు, పశ్చిమ కాల్వలకు పూర్తిస్థాయిలో విడుదల చేశాక, డ్యాం నుంచి నీటిని తీసుకోవాలని ఇక్కడి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం తాజాగా ఈఎన్సీకి మరో లేఖ రాశారు. ఈ నెల 20 నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 6 రోజుల పాటు నీటిని విడుదల చేస్తే డెల్టా తాగునీటి అవసరాలు తీరగలవని ఆ లేఖలో పేర్కొన్నారు. -
నల్ల చెరువులో ఆక్రమణలు
కొత్త చామలాపల్లి (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్:చామలాపల్లి పంచాయతీ పరిధిలో కొత్త చామలాపల్లి గ్రామ ఆయకట్టు భూములకు నీరందిస్తున్న నల్ల చెరువును క్వారీ యజమానులు మట్టితో కప్పేస్తున్నారు. క్వారీ లారీల రాకపోకలకు వీలుగా రహదారి పనులు చేపట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువు కొమ్ము వద్ద గల మదుముకి నీరు వెళ్లే ఆస్కారం లేకుండా క్వారీ సిబ్బంది శుక్రవారం అర్థరాత్రి జేసీబీతో రోడ్డు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జేసీబీని రైతులు తమ అధీనంలోకి తీసుకుని కొత్త చామలాపల్లి గ్రామంలో ఉంచారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతులు తెలియజేసిన సమాచారం మేరకు విలేకరులు శనివారం ఉదయం నల్లచెరువు వద్ద జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నల్ల చెరువుకు ఆవల ఒడ్డున రెండు క్వారీలున్నాయని తెలిపారు. ఆ క్వారీలకు సంబంధించిన లారీలు చుక్కవానిపాలెం గ్రామం మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉందని చెప్పా రు. అయితే క్వారీ యజమానులు మాత్రం క్వారీ రాతిమట్టితో నల్ల చెరువును కప్పేసి రహదారి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. చెరువు కబ్జాకు గురవ్వడం వల్ల తమ పొలాలకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు పనులు అడుడ్డుకున్నా, రహదారికడ్డంగా చెట్లు, రాళ్లు పడేసినా జేసీబీలతో వాటిని తొలగించి మరీ పనులు చేపడుతున్నారని రైతులు తొత్తడి ప్రకాశరావు, టి.స్వామినాధం, టి.సన్యాసిరావు, తొత్తడి ఎర్నిబాబు, టి.స్వామినాయుడు, గుమ్మడి ఆనందరావు, టి.ముత్యాలనాయుడు, టి.సింహాద్రిదేముడు, టి.పైడితల్లి, టి.చినఅప్పారావు, గుమ్మడి అప్పలనాయుడు, జుత్తాడ బుచ్చి అప్పారావు, తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు గట్టుపై నుంచి భారీ లారీలు తిరుగుతున్నందు వల్ల ఇప్పటికే రెండు మదుములు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్వారీ యజమానులు నిర్మించిన రహదారిని ధ్వంసం చేసి పొలాలకు నీరందేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా చెరువులో రహదారి నిర్మించి వాహన రాకపోకలు సాగించడం చట్ట విరుద్ధమన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్వారీ యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సాగునీటి కోసం రైతుల ఆమరణ దీక్ష
వాకాడు, న్యూస్‌లైన్ : సాగునీటి కోసం మండలంలోని కోడివాక ఆయకట్టు రైతులు పలువురు ఆదివారం సాయంత్రం నుంచి స్థానిక స్వర్ణముఖి బ్యారేజీ అతిథి గృహం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ స్వర్ణముఖి బ్యారేజీకి తెలుగుగంగ నీరు వచ్చినప్పటి నుంచి కొందరు అధికార పార్టీ నేతలు అధికారులను వారి గుప్పెట్లో పెట్టుకుని వారికి అనుకూలమైన గ్రామాల చెరువులకు మాత్రమే సాగునీటిని విడుదల చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం నుంచి కల్లూరు చెరువుకి నీరు విడుదల చేసి కోడివాక చెరువుకు సరఫరా చేస్తామని గూడూరు ఆర్డీఓ చెప్పారని, అయితే ఇరిగేషన్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిడితో మంగళవారం నుంచి విడుదల చేస్తామని చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లూరు చెరువుకు దిగువన ఉన్న కోడివాక, దుర్గవరం, ముట్టెంబాక, తిరుమూరు, దుగరాజపట్నం, చీమలపాడు గ్రామాల్లో పంటలు ప్రస్తుతం పొట్ట, వెన్నుదశలో ఉన్నాయన్నారు. సుమారు నాలుగు వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముందు ఆర్డీఓ మధుసూదన్‌రావు ఆదేశాల మేరకు ఇరిగేషన్ ఈఈ అప్పరావు, డీఈ రాజగోపాల్ కృష్ణమాచార్య ఆయకట్టు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి కొద్ది సేపు చర్చించారు. బ్యారేజీలో ఉన్న సాగునీటిని దృష్టిలో ఉంచుకుని రైతులందరికీ విడతల వారీగా నీరు అందిస్తామని, మంగళవారం నుంచి 7 రోజులు పాటు కల్లూరు చెరువుకు విడుదల చేస్తామని ఈఈ అప్పరావు చెప్పారు. మూడు రోజులు ఆగితే పంటలు పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా వదిలి వేయాల్సి వస్తుందని రైతులు మండి పడ్డారు. ఆధికారుల హామీతో దీక్ష విరమణ రైతులు ఆమరణ దీక్షకు పూనుకోవడంతో ఇరిగేషన్ అధికారులు స్పందించి మంగళవారం నుంచి నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు దీక్ష విరమించారు. -
పర్యాటకులకు నిరాశే
బాల్కొండ, న్యూస్‌లైన్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగన రూ.6 కోట్లతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పనులు పూర్తి కావడంతో గత నెల 29న భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కలిసి పార్కును ప్రారంభించారు. కానీ ఈ ప్రారంభం అధికారులకు, పాలకులకు మాత్రమే. ఇంత వరకు ఒక్క పర్యాటకున్ని కూడా లోపలికి అనుమతించలేదు. కారణం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పవచ్చు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి పర్చేందుకు పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తి చేసి పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లు దాటినా పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా అధికారులు పార్కును ఎవరు పర్యవేక్షించాలోనన్న అలోచనే చేయలేదు. తీరా పనులు పూర్తయ్యాక పర్యవే క్షణ చేసేందుకు తమ వద్ద సిబ్బంది లేరంటూ ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. ఈ విషయం అధికారులకు ముందే తెలిసినా ఏరోజూ ఆవైపుగా ఆలోచన చేయలేదు. పార్కు సస్యశ్యామలంగా పచ్చదనంతో ఉండాలంటే ప్రతీరోజు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. దీంతో ప్రాజెక్ట్ అధికారులు ప్రస్తుతం ఏదైన ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు టెండర్ ద్వారా అప్పగించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బాధ్యతలను త్వరగా అప్పగిస్తే పార్కు సందర్శిస్తామంటూ పర్యాటకులు కోరుతున్నారు. ఇన్నాళ్లు ఏం చేశారు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పనులు అంటేనే అధికారులకు ఒకింత నిర్లక్ష్యం ఉంటుందని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. పార్కు పనులు సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా ఏడాది కాలంలో పూర్తి కావల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. నాలుగేళ్లుగా పార్కును ఎలా తీర్చి దిద్దుతారో అధికారుల వద్ద పుటాలు పటాలున్నాయి. పార్కు ప్రారంభానికి ముందే ఎజె న్సీ ద్వారానో. లేక టూరిజం శాఖకో పార్కు పర్యవేక్షణ అప్పగించేలా మాత్రం అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదు. పూర్తయిన తర్వాతనైనా పార్కు ప్రారంభానికి సత్వర చర్యలు ఎందుకు చేపట్టడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కు సమస్యను పరిష్కరించి, సందర్శనకు అనుమతివ్వాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇలాగైతే కుదరదు
సాక్షి,నెల్లూరు : ‘పనులు ఏళ్ల తరబడి చేస్తే ఎలా? రైతులకు సకాలంలో నీళ్లెలా ఇస్తాం? కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? ఇలా అయితే కష్టం’ అంటూ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు మండిపడ్డారు. కాంట్రాక్టర్లతో పాటు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ నేతృత్వంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఈఎన్సీ, నిపుణుల కమిటీ సభ్యులతో పాటు ఆ శాఖ స్థానిక అధికారులు నిర్మాణంలో ఉన్న పెన్నా, సంగం బ్యారేజీలను పరిశీలించారు. పనులు ఏళ్ల తరబడి సాగుతుండటంపై అసంతృప్తి చెందారు. నెల్లూరులోని రంగనాయకులపేట వద్ద పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని రూ.156 కోట్ల నిధులతో చేపట్టారు. ఇప్పటి వరకు 62 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు నత్తనడకన సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు జూన్‌లోపు పూర్తి చే యాలని కాంట్రాక్టర్లతో పాటు స్థానిక అధికారులను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తవకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.128 కోట్లతో చేపట్టిన సంగం బ్యారేజీ పనులు ఇప్పటి వరకు కేవలం 16 శాతమే పూర్తయ్యాయి. చాలా రోజులుగా నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల విషయంలో కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారుల మధ్య ఏకాభిప్రాయం లేనందునే పనులు నిలిచినట్లు సమాచారం. తాము రూపొందించిన డిజైన్ మేరకు పని చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈఎన్సీ సూచనల ప్రకారం రూపొందించిన డిజైన్ మేరకు పని చేయాలని అధికారులు పట్టుబట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వివాదంపై పలు ధపాలు చర్చలు జరిగినా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఛీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ, నిపుణుల కమిటీ సభ్యులు సంగం బ్యారేజీ డిజైన్‌ను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించారు. డిజైన్ వివాదంపై ఉన్నతాధికారులు మరో మారు కాంట్రాక్టర్‌తో సమావేశమై నిబంధనల మేరకు పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో చేపట్టిన రెండు బ్యారేజీల నిర్మాణ నాణ్యత, పనితీరు, డిజైన్లపై తనిఖీ బృందం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ఇరిగేషన్ టెండర్లలో గోల్మాల్!
పలమనేరు, న్యూస్‌లైన్: వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదనే చందంగా తయారైంది పలమనేరు ఇరిగేషన్ అధికారులు తీరు. నిబంధనలను పక్కనబెట్టి టెండర్ల ప్రక్రియను గోప్యంగానే పూర్తి చేసి, తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం పనులు వచ్చేలా అధికారులే మేనేజ్ చేసేశారు. రూ.75 లక్షల పనులకు జరిగిన టెండర్ల ప్రక్రియ గోల్మాల్ అయ్యిందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమను టెండర్లలో పాల్గొననీయకుండా ఇంత రాజకీయం చేయాల్సిన అవసరమేమిటంటూ కొందరు కాంట్రాక్టర్లు స్థానిక అధికారులను నిలదీయడంతో ఈ విషయం శుక్రవారం వెలుగుచూసింది. పలమనేరు ఇరిగేషన్ శాఖ పరిధిలోని వి.కోట మండలంలో రూ.75 లక్షల పనులకు ఆ శాఖ గత నెలలో టెండర్లు పిలిచింది. ఈ నిధులతో చెరువు కట్టల అభివ ృద్ధి, సప్లై చానెళ్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉండడం, ఆపై సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. మూడు రోజుల క్రితం టెండర్లు వేయాల్సిందిగా ప్రకటన జారీ చేశారు. 10 పనులకు సంబంధించి 41 మంది టెండర్లు వేశారు. అంచనాలు తక్కువగా కోడ్ చేసిన పది మందికి టెండర్లు ఓపెన్‌చేసి ఈ పనులను రెండ్రోజుల క్రితం అప్పగించారు. ఈ పది మంది కాంట్రాక్టర్లు ఎవరో కూడా నోటీస్ బోర్డులో తెలుపనే లేదు. ఇదిలావుండగా వి.కోట మండలానికి చెందిన మరికొందరు కాంట్రాక్టర్లు తాము టెండర్లు వేస్తామంటూ స్థానిక ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ కాళ్లావేళ్లాపడ్డారు. ఆయన స్పందిస్తూ ఈ ప్రక్రియ ముగిసిందని తేల్చేశారు. గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో టెండర్ల ప్రక్రియ ముగిసిందని ఆ శాఖ ఈఈ పేర్కొనడంతో వీరంతా ఆయనతో వాగ్వాదానికి దిగారు. ‘మీకు కావాల్సిన కాంట్రాక్టర్లకు మాత్రం మీరే దగ్గరుండి ఫిక్సింగ్‌లు జరిపించి, మాకు అన్యాయం చేస్తారా’ అంటూ వాగ్వాదానికి దిగారు. శుక్రవారం ఆ కాంట్రాక్టర్లు శ్రీని వాసులు, మునెప్ప, శీన తదితరులు కార్యాలయంలో జరుగుతున్న టెండర్ల అక్రమాలను విలేకరులకు వివరించారు. మరోవైపు రూ.లక్షకు పైన అంచనా విలువ గల ప్రభుత్వ పనులను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో టెండర్లు పిలవాల్సి ఉంది. సీల్డ్ కవర్ టెండర్లు పిలవడం, రహస్యంగా ప్రకటన చేసి ప్రక్రియ ముగించడం చూస్తుంటే వ్యవహారం వెనుక అధికారుల హస్తం ఉందనే విషయం తెలుస్తోంది. దీనిపై ఆ శాఖ ఈఈ సత్యనారాయణప్పను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. బంద్ కారణంగా ఈ పనులను త్వరగా చేపట్టాలనే ఉద్దేశంతో ముగించేశామన్నారు. ఇందులో గోల్మాల్ ఏమీ లేదని చెప్పారు.