లిఫ్టు ఇరిగేషన్ నీటిని ఆపివేయాలి | Tdp leaders fires on authorities | Sakshi
Sakshi News home page

లిఫ్టు ఇరిగేషన్ నీటిని ఆపివేయాలి

Published Sat, Jul 11 2015 1:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

లిఫ్టు ఇరిగేషన్ నీటిని ఆపివేయాలి - Sakshi

లిఫ్టు ఇరిగేషన్ నీటిని ఆపివేయాలి

అధికారులపై టీడీపీ నేతల ఆగ్రహం
 
 తాడేపల్లి రూరల్ : యూటీకే లిఫ్టు ఇరిగేషన్ నీటిని తక్షణమే నిలిపివేయాలని, పంట పొలాల సాగు ఆపివేయాలని తెలుగుదేశం నేతలు అధికార దర్పం ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఉండవల్లి యూటీకే లిఫ్టు ఇరిగేషన్‌కు శుక్రవారం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రైతులు పంట కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, తదితర నాయకులు  సంఘటనా స్థలానికి వచ్చి ఎవరిని అడిగి నీళ్లు వదిలారంటూ ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు.

ఉండవల్లి యూటీకే లిఫ్టు ఇరిగేషన్ స్వచ్ఛందంగా రైతులే నడుపుతున్నారన్న విషయం కూడా తెలియని నాయకులు హడావుడిగా లిఫ్టు ఇరిగేషన్ వద్దకు వచ్చి అధికారులపై ఫోనులో కేకలు వేశారు. అధికారులు మాత్రం అది మా పరిధిలోది కాదంటూ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement