ఇరిగేషన్ అధికారుల తీరుపై పెండెం ఆగ్రహం
పిఠాపురం : క్రమం తప్పకుండా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అర్ధాంతరంగా ఎందుకు ఆపారో చెప్పి, వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఆయన గురువారం పిఠాపురం మండలంలో వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఏలేరు నీటిపై ఆధారపడి పిఠాపురం, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 3,500 ఎకరాల్లో చెరకు, మిరప, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు సాగు చేశామని,15 రోజులకొకసారి వంతుల వారీగా నీరు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు.
దీంతో దొరబాబు ఏలేరు నీటిపారుదల శాఖాధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువైన పంటలు ఎండిపోతుంటే పట్టించుకోపోవడం దారుణమన్నారు. పంటలు ఎండిపోతున్నా నీటి విడుదలను ఎందుకు ఆపారో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. వెంటనే నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పెండెం హెచ్చరించారు.
ఏలేరు నీటిని ఎందుకు ఆపారు?
Published Fri, May 13 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement