సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్‌ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఫాంహౌస్‌లో కొలతలు వేసిన అధికారులు.. సర్వేను పూర్తి చేశారు.
ఇప్పటికే బద్వేల్ ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేత కేసులో హైదరాబాద్ డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలంటూ వేసిన పిటిషన్‌ను గత బుధవారం(ఆగస్టు21) హైకోర్టు విచారించింది.
ఫామ్‌హౌజ్ కూల్చివేతలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రాను కోర్టు ఆదేశించింది. జీవో 99 ప్రకారమే కూల్చివేతలు చేపట్టాలని కోరింది. ఫామ్‌హౌజ్ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు ముందు ఫామ్‌హౌజ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలను పూర్తిగా పరిశీలించాలని హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సూచించింది.
జన్వాడ ఫామ్‌హౌజ్ వ్యవహారం కోర్టుకి ఎక్కిన వేళ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. ఆ ఫామ్ హౌజ్ తనది కాదని, నిబంధనలకు విరుద్ధంగా అది కట్టి ఉంటే తాను కూల్చివేయిస్తానని అన్నారాయన. ‘‘నా పేరుతో ఏ ఫాంహౌజ్ లేదు. నా ఫ్రెండ్ ఫాంహౌజ్ లీజ్‌కు మాత్రమే తీసుకున్నా. ఫాంహౌజ్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే నేనే కూలగొట్టిస్తా’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment