
గద్వాల రూరల్: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిరి్మంచిన ర్యాలంపాడు రిజర్వాయర్ కట్ట లీకేజీలపై అధికారులు దృష్టిసారించారు. రిజర్వాయర్ కట్టకు బీటలు పడి పెద్ద ఎత్తున లీకేజీ ఏర్పడిన సంఘటనపై సోమవారం ‘సాక్షి’లో ‘ర్యాలంపాడు’కి బీటలు శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. లీకేజీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కట్ట నుంచి ఎక్కడెక్కడ లీకేజీలున్నాయి? ఎంత పరిమాణంలో నీరు వృథా అవుతోంది.. తదితర అంశాలపై చర్చించారు.
రిజర్వాయర్ పరిస్థితిపై ఇటీవల ఇద్దరు సీఈల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికను పరిశీలించారు. ఇదిలా ఉంటే లీకేజీలకు మరమ్మతు చేయాలంటే.. ముందుగా ర్యాలంపాడులోని నీటిని బయటకు పంపాల్సి ఉంటుందని, అయితే దీనివల్ల ప్రస్తుతం 1.36 లక్షల ఎకరాల్లో సాగవుతున్న పంటలు దెబ్బతింటాయని గద్వాల జిల్లా ఇరిగేషన్ ఇంజనీర్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఈ సీజన్‌కు సాగునీటిని అందించి వచ్చే యాసంగిలో జలాశయంలోని నీటిని పూర్తిగా బయటకు తోడేసేందుకు వీలుపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment