గెట్ల కొనాలే..! | Get to buy ..! | Sakshi
Sakshi News home page

గెట్ల కొనాలే..!

Published Sat, Jun 7 2014 2:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

గెట్ల కొనాలే..! - Sakshi

గెట్ల కొనాలే..!

ఒక వంక కాయగూరలు కాగుతున్నాయి. పప్పు దినుసులు మండుతున్నాయి. నేనేం తక్కువా అంటూ బియ్యం ధరలూ  చుక్కలను తాకుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులను వెక్కిరిస్తున్నాయి. కళ్లెం వేసేవారు లేక అంతా దిక్కులు చూస్తున్నారు. ఆకలి చంపుకోలేక ఉన్న ధరకే కొని పరేషానవుతున్నారు. నానాటికీ బతుకులు దుర్భరమవుతుంటే బాధ పడుతున్నారు.
 
 సాక్షి, మహబూబ్‌నగర్: బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పెరుగుతున్న  ధరలు  పేద, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ బియ్యం (దొడ్డు) రకం ఒక మోస్తారుగా పెరుగుతుండగా.... సన్నరకం ధరలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా రెక్కొలొస్తున్నాయి. రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు  మార్కెట్ వర్గాల కథనం. పౌరసరఫరాల అధికారుల నిఘా సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరల పెరుగుదలకు దాచుకున్న బియ్యం  నిల్వలే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 
 తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలను పోల్చుకుంటే పాలమూరులో బియ్యం ధరల పెరుగుదల తక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నప్పటికీ... వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. జిల్లాలో ఏప్రిల్ మాసంలో పాత సన్నరకం బియ్యం (సోనామసూరి) క్వింటాల్ ధర రూ.4,200ల నుంచి రూ.4300ల వరకు ఉండగా ప్రస్తుతం ఆధర  రూ.4400 నుంచి రూ.4500 వరకు పెరిగింది. ఒక క్వింటాల్ బియ్యం ధర  నెలరోజుల వ్యవధిలోనే రూ.200ల వరకు పెరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొత్త సన్నరకం బియ్యం క్వింటాల్ ధర రూ.3000 నుంచి రూ.3100 ఉండగా ప్రస్తుతం ఆ ధర రూ.3300ల నుంచి రూ.3400ల వరకు పలుకుతోంది. దొడ్డురకం బియ్యంలో కూడా పెరుగుదల సృష్టంగా  కనిపిస్తోంది. పాతవి దొడ్డురకం బియ్యం ఏప్రిల్‌లో క్వింటాల్ ధర రూ.2900ల నుంచి రూ.3000 ఉండగా ప్రస్తుతం రూ.3,100 ధర పలుకుతోంది. దొడ్డు రకం కొత్త్త బియ్యం ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది బియ్యం పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి వచ్చి ఉన్నట్లయితే బియ్యం ధరలు  పెరిగి ఉండేది కాదని కొంత మంది వ్యాపార వర్గాలు  పేర్కొంటున్నారు. జిల్లాలోని పలువురు పెద్ద వ్యాపారులు, ముఖ్యంగా మిల్లర్లు  కావాలని మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు  వ్యక్తమవుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement