middle class
-
డిజైర్ డిజైన్స్..! మధ్యతరగతి వాళ్లు కూడా కొనేలా డైమండ్స్..
సౌందర్య రంగంలో వజ్రాలకు ఆదరణ, విలువ, గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విలాసవంతమైన జీవనానికి వజ్రాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటివి ఎన్ని ఉన్నా వజ్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే చాలామందికి డైమండ్ రింగ్ కొనుగోలు చేయాలనే ఆశ ఉంటుంది. ఈ నేపథ్యంలో మధ్య తరగతి కుటుంబాల్లో కూడా వజ్రాలపై ఆసక్తి పెరిగింది. వీటన్నింటి దృష్ట్యా ల్యాబ్‌లో తయారు చేస్తున్న కృత్రిమ వజ్రాలు (ల్యాబ్‌గ్రోన్ డైమండ్స్)కు డిమాండ్ పెరిగింది. సహజమైన వజ్రాలు.. ప్రత్యేకంగా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు చూసేందుకు ఒకేలా ఉండటం వీటి ప్రత్యేకత. ధర కూడా తక్కువ ఉండటంతో వీటికి విపరీతమైన ఆదరణ పెరిగింది. ప్రకృతి ప్రసాదంగా లభించే వజ్రాలు చాలా అరుదైనవి, తక్కువగా దొరుకుతాయి. ఈ వజ్రాలు భూమి పొరల్లోని అంతర్భాగంలో తయారు కావడానికి సుమారు 1 నుంచి 3 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుందని పరిశోధకులు చెబుతారు. ఇంతటి అరుదైనవి కాబట్టే వజ్రాలకు ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో అచ్చం వజ్రాలను పోలినవి.. ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అందుబాటులోకి రావడంతో వజ్రాల ప్రియులు అధికంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ వజ్రాలు కేవలం వారాలు, నెలల వ్యవధితో తయారు చేస్తున్నారు. సాధారణంగా ఈ రెండు రకాల వజ్రాలు శాస్త్రీయ రసాయణాల పరంగా ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ నాణ్యత, పదార్థ విశిష్టత దృష్ట్యా చాలా వ్యత్యాసం ఉంటుంది. వజ్రాల నిపుణులు, ఆభరణాల తయారీదారులు మాత్రమే వీటి మధ్య తేడాను గుర్తించగలరు. వీటి కటింగ్, పాలిషింగ్, సెట్టింగ్‌లో చాలా వైవిధ్యంతో పాటు శాస్త్రీయత పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సహజమైన వజ్రాలను కొనలేని వారు ఈ కృత్రిమ వజ్రాలపై మక్కువ చూపిస్తున్నారు. సహజ వజ్రాల్లో పరిమాణం పెరుగుతున్న కొద్దీ.. దాని క్యారెట్లను బట్టి ధర అంతకంతకూ పెరిగిపోతుంది. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు తక్కువ ధరకే అదే పరిమాణంలో లభిస్తుండటం విశేషం. సహజ వజ్రాల కంటే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు సుమారు 30 నుంచి 85 శాతం తక్కువ ధరల్లో లభిస్తుండటం విశేషం.అమాంతం పెరిగిన వ్యాపారం.. ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సామాజికంగా సౌందర్య రంగంలోని వజ్రాల ప్రాధాన్యత వల్ల ఫ్యాషన్ రంగంలో కూడా ఈ డైమండ్స్‌కు మంచి ప్రచారం లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ వజ్రాల వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది. ఈ వజ్రాల ప్రస్థానం 2000 సంవత్సరం నుంచి పుంజుకోగా.. ఐదేళ్ల నుంచి మరింత ఎక్కువగా పెరిగిందని బంజారాహిల్స్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. మొదట్లో ఉత్తరాది ప్రాంతాలకు చెందినవారే వజ్రాలు అధికంగా కొనుగోలు చేసేవారు. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్, బెంగళూరులో వీటి వ్యాపారం పుంజుకుందని సోమాజిగూడలోని మరో వజ్రాల వ్యాపారి పేర్కొన్నారు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం నగరంలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు ప్రత్యేక స్టోర్లు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ డైమండ్ బ్రాండ్లు సైతం వారి స్టోర్లలో ల్యాబ్ గ్రోన్ వజ్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సహజ వజ్రాలు, తయారు చేసిన వజ్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి నిపుణుల పరిశోధక పత్రాలు, డైమండ్ వెరిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్ విధానాలను వినియోగిస్తున్నారు. వజ్రాన్ని కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత ప్రయోగశాలలో సర్టిఫికేట్కు అనుగుణంగా లేజర్‌తో టెక్నాలజీతో ధృవీకరిస్తారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కే క్రేజ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అమ్మకాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా మా స్టోర్‌లో గతేడాదిలో మరింత ఎక్కువగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో పెద్ద సైజుల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సైజులో ఉండే సహజమైన వజ్రాలు కొనుగోలు చేయలేని వారు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువ ధరలకు లభించే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రెండు వజ్రాల మధ్య తేడాలను ప్రయోగశాలలోని ప్రత్యేక పరికరాలు ఉంటే తప్ప ఎవరూ గుర్తించలేరు. స్థానికంగా నిశ్చితార్థాలకు ఈ డైమండ్స్ ఎక్కువగా కొంటున్నారు. పార్టీలు, ఫ్యాషన్ వేర్, విభిన్న డిజైన్ల కోసం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. – స్వాతి షాగర్లమూడి, రీయా లైఫ్‌స్టైల్–మణికొండ (చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..) -
మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు
ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ కరుణించిందనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిగురించిందనే అనాలి. త్వరలో కొత్త చట్టం తెస్తున్నట్లు చెప్పారు. అందులో ఏం ఉంటుందనే ఆతృత, ఉత్కంఠకు తెరదించుతూ, మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించారు. ఆదాయ పన్నుకి సంబంధించి ముఖ్యమైన మార్పులు కొన్ని చేశారు. అవేమిటంటే.. ప్రస్తుతం రూ. 10 లక్షలు దాటితే 30 శాతం పన్ను ఉంటోంది. రూ. 10 లక్షలు దాటిన వారికి ఎంత ఉన్నా 30 శాతంగా ఉంది. ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ వస్తోంది. తాజా మార్పుల వల్ల రూ. 24 లక్షల వరకు 30 శాతం చొప్పున పడదు. ఇది చాలా పెద్ద ఉపశమనం. బేసిక్ లిమిట్‌ని రూ. 4,00,000కు పెంచారు. ఇది చిన్న ఉపశమనంలాగా కనిపించినా. శ్లాబులు మార్చారుకొత్త శ్లాబులు, పన్ను రేట్లు ఇలా ఉంటాయి. ఈ మార్పుల వల్ల రూ. 12,00,000 ఆదాయం ఉన్నవారికి పన్నుభారం ఉండదు. రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచారు. చాలా సాహసోపేతమైన, గొప్ప నిర్ణయం. వేతనజీవులకు ఈ లిమిట్‌ను రూ. 12.75 లక్షలు చేశారు. వీరికి స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో రూ. 75 వేలు మినహాయింపు లభిస్తుంది. ఇంత భారీ మినహాయింపు గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ ఇవ్వలేదనే చెప్పాలి. సాహసం చేశారు. కొన్ని లక్షల మందికి పన్నుండదు. ఇంతకు తగ్గట్లుగా టీడీఎస్ విషయంలో చాలా మంచి మార్పులు తెచ్చారు. హేతుబద్ధత పేరున న్యాయం చేకూర్చారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఆదాయం మీద టీడీఎస్ వర్తింపును రూ. 1,00,000కు పెంచారు. చివరగా పన్నుభారం విషయంలో మార్పులు ఉండకపోయినా ఇది ముఖ్య ఉపశమనం. ఇంటికి అద్దె చెల్లించే విషయంలో సంవత్సరానికి రూ. 2,40,000 దాటితే టీడీఎస్ ఉంది. ఇక నుంచి టీడీఎస్ రూ. 6,00,000 దాటితేనే వర్తిస్తుంది. ఈ రోజుల్లో నగరంలో నెలకు అద్దె రూ. 20,000కు తక్కువ ఉండటం లేదు. ఓనర్లు మాకు బ్లాక్‌లో ఇవ్వండి అని పేచీ.. టీడీఎస్ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకపై ఆ భయాల్లేవు. ఈ లిమిట్‌ని భారీగా పెంచినట్లు చెప్పవచ్చు. ఈ ఉపశమనంతో పాటు బ్లాక్ వ్యవహారాల జోలికి వెళ్లకుండా రాచమార్గంలో వెళ్లే అవకాశం కల్పించారు. మనలో చాలా మంది విదేశాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం/సర్దుబాటు/బదిలీలు చేస్తుంటాం. ప్రస్తుతం ఏటా రూ. 7,00,000 దాటితే టీడీఎస్ కంపల్సరీ. ఆ లిమిట్‌ని ఇప్పుడు రూ. 10,00,000కు పెంచారు. అంతే కాకుండా విద్య నిమిత్తం ఎంతైనా పంపవచ్చు. టీడీఎస్ లేకుండా. అయితే, ‘‘సోర్స్’ మాత్రం రుణం రూపంలో ఉండాలి. ప్రస్తుతం ఒక ఇంటి మీద యాన్యువల్ వేల్యూ నిల్‌గా భావించవచ్చు. ఇక నుంచి ఈ జాబితాలో మరొక ఇల్లును జోడించారు. ఏతావతా రెండిళ్ల మీద మినహాయింపు పొందవచ్చు. రూల్సు మేరకు ఈ రెండూ లభ్యమవుతాయి. ఆర్థిక మంత్రి సీతారామన్‌గారు మినహాయింపులు పెంచకపోయినా, 80సీ మొదలైన సెక్షన్లలో మినహాయింపులు ముట్టుకోకపోయినా, వాటికి రెట్టింపు/మూడింతలు ఉపశమనం ఇచ్చారు. వినియోగం వైపు మధ్యతరగతి వాళ్లు మొగ్గు చూపేలా మార్గనిర్దేశం చేశారు. వచ్చే వారం మరిన్ని తెలుసుకుందాం.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
లక్ష్యాల సాధన సాధ్యమేనా?
‘మిడిల్ క్లాస్ ఫీల్‌గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్‌కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట. అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి: Nirmala Sitharaman
-
బడ్జెట్: మేడమ్... మధ్య తరగతిని మర్చిపోకండి
బడ్జెట్ అనగానే ఎదురుచూపులు...భారీ ఆశలు... కోర్కెల చిట్టాలు...చివరకు నిట్టూర్పులు...ప్రతిసారీ మధ్యతరగతి వర్గం పరిస్థితి ఇదే...ఈసారైనా కాస్త మార్పు వస్తుందేమోనన్న ఆశ.2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత మూడోసారి కొలువు తీరిన మోదీ సర్కారు నుంచి వెలువడే ఈ బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించగల కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు.. సామాన్యులను ఇరకాటంలో పెట్టని విధంగా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.ఆర్ధిక వృద్ధి రేటు మందగించి.. రూపాయి నానాటికీ క్షీణిస్తూ... స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా...జరిగే నష్టాన్ని పూడ్చడం అంత తేలిక్కాదు. ఈనేపథ్యంలో వృద్ధికి పట్టుగొమ్మగా నిలిచే మధ్య తరగతి వర్గాలను... మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను మెప్పించడం ప్రధానం.దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పక చెల్లిస్తున్నది ఉద్యోగ వర్గాలే. వీళ్లకు టీడీఎస్ రూపంలో జీతం ఇచ్చేటప్పుడే పన్ను కోత జరుగుతుంది. మిగతా వర్గాల్లో పన్ను వసూళ్లు ఉన్నప్పటికీ వారికి దక్కే మినహాయింపులు వేరు. ఖర్చులు పెరిగిపోయి... వచ్చే ఆదాయాలు ఏమూలకూ సరిపోని ఈరోజుల్లో... తమను చిన్న చూపు చూడొద్దంటూ అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లించే మధ్య తరగతి, ఉద్యోగ వర్గాలు ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి.రాబోయే బడ్జెట్ నుంచి వీరు ఏమి ఆశిస్తున్నారో... ఏమి చర్యలు ప్రకటిస్తే బావుంటుందో చూద్దాం.1. సెక్షన్ 80 సీ: ఆదాయపు పన్ను చట్టంలోని ఈ సెక్షన్ రూ.1 .50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కల్పిస్తోంది. 2014 నుంచి చిన్న చిన్నవి తప్పిస్తే... ఈ సెక్షన్ లో పెద్దగా మార్పులే చోటు చేసుకోలేదు. ఈ పరిమితిని కనీసం రూ.2 లక్షల వరకైనా పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధిక ధరలు, ఖర్చుల నేపథ్యంలో... ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సంపాదించే ఆదాయం వచ్చింది వచ్చినట్లు ఖర్చు అయిపోతున్న నేపథ్యంలో సగటు జీవులు పొదుపు చేసే పరిస్థితులు సన్నగిల్లాయి. పొదుపు చేసే పరిస్థితులే లేనప్పుడు వారు ఇక పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతారు. పెట్టుబడులు రానప్పుడు ఆర్ధిక వ్యవస్థ పరుగులు ఎలా తీస్తుంది? కాబట్టి ఆర్ధిక మంత్రి ఇప్పటికైనా దశాబ్దానికి పైగా పడకేసిన మార్పుల్ని ఈ సెక్షన్ లో చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ట్యాక్ సేవింగ్ పథకాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లు వంటి పథకాల్లో పొదుపు పెరుగుతుంది. విస్మరించకూడని సెక్షన్ ఇది.2. సెక్షన్ 80డీ : రానురాను ఆరోగ్య సమస్యలు పెచ్చుమీరుతున్నాయి. చిన్న రోగం వచ్చిందంటే చాలు... వేలల్లో వెచ్చించాల్సి వస్తోంది. ఇక పెద్ద రోగాలయితే చెప్పనక్కర్లేదు... లక్షలు పెట్టాల్సిందే. కొంతవరకు బీమా ప్రయోజనాలు దక్కుతున్నప్పటికీ.. ఇప్పటికీ బీమాకు దూరంగా ఉంటున్న వర్గాలే ఎక్కువ. పన్ను చెల్లింపుదారులకు కొద్దో గొప్పో ప్రయోజనాన్ని కల్పిస్తోందీ సెక్షన్. వైద్య ఖర్చులపై వెచ్చించే మొత్తానికి ప్రస్తుతం వృద్ధులకు రూ.50,000, మిగతా వర్గాలకు రూ.25,000 వరకు పన్ను తగ్గింపు లభిస్తోంది. ఈమొత్తాన్నివృద్ధుల విషయంలో రూ. లక్షకు, మిగతా వారికి రూ.50,000 వరకు పెంచాల్సిన అవసరం ఉంది.3. సీనియర్ సిటిజెన్లు: ప్రభుత్వం ప్రతిసారీ వీరికి ఇతోధిక ప్రయోజనాలను కల్పిస్తూ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయినా అవి సరిపోవు. వీళ్ళు వయసు పెరిగి.. శ్రమ శక్తి తగ్గి... సంపాదనా సామర్ధ్యం మూలన పడి.. అనారోగ్యాలు పలకరిస్తూ.. కేవలం పెన్షన్ నో, అంతో ఇంతో దాచుకున్న డబ్బులనో.. లేదంటే పిల్లలు పంపే సొమ్ములనో నమ్ముకుని కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఈ వర్గాలకు పన్ను, వడ్డీ మినహాయింపులు అధిక మేలు చేస్తాయి. ప్రభుత్వం తప్పనిసరిగా వీరి విషయంలో ఉదారంగా వ్యవహరించాల్సిందే.4 హెచ్ఆర్ఏ: ఢిల్లీ, కోల్ కతా వంటి మెట్రో నగరాల్లోని ఉద్యోగులు తాము పొందే హెచ్ ఆర్ ఏ పై 50 శాతం వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి టైర్ - 2 నగరాలకు కూడా వర్తింపజేయాలి. ఈ నగరాలు కూడా టైర్-1 సిటీ లతో పోటీపడుతూ పరుగులు తీస్తున్నాయి. ఈ నగరాల్లోనూ జీవన వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఉద్యోగుల ఆదాయ ఉపశమన చర్యల్లో భాగంగా వీరికి కూడా హెచ్ఆర్ఏ లో 50% రిబేటు ప్రయోజనాన్ని కల్పించాలి. 5 . గృహ రుణాల వడ్డీ: మధ్యతరగతి వర్గాల ప్రధాన కల తమకంటూ ఓ సొంత ఇంటిని కట్టుకోవడం. వీరిలో 99% మంది బ్యాంకులు/ఇతర ఆర్ధిక సంస్థల రుణాలపైనే ఆధారపడతారు. వీరు చెల్లించే ఈఎంఐ లో పెను భారం మోపేది వడ్డీలే. గృహ రుణాల వడ్డీపై ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద రూ.2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో రూ. 50 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నా తక్కువలో తక్కువ రూ.4 లక్షల దాకా వార్షిక వడ్డీ లెక్క తేలుతుంది. కాబట్టి వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత స్థాయి నుంచి కనీసం రూ. 3 లక్షల వరకైనా పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.అన్నిటికంటే ప్రధానమైనది ఆదాయపు పన్ను రేట్లు. ట్యాక్ స్లాబుల్లో మార్పులు. వీటి గురించి తదుపరి ఆర్టికల్ లో చర్చించుకుందాం.-బెహరా శ్రీనివాస రావు ఆర్ధిక విశ్లేషకులు -
వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్‌పై ఆశలు
ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా భావించే మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం గణనీయమైన వినియోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లకు పరిష్కారం లభించేలా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీ ప్రజలు ఇబ్బంది పడుతున్న వినియోగ సంక్షోబానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.నిలకడగా వేతనాలుజీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా మధ్యతరగతి కార్మికుల వేతనాలు పెరగడం లేదు. స్థిరంగా ఉన్న వేతనాల వల్ల వారి కుటుంబాలు అత్యవసరం కాని వస్తువులపై ఖర్చు చేసేందుకు సరిపడా డిస్పోజబుల్ ఆదాయం(నిత్యావసర ఖర్చులు, వడ్డీలు, ఈఎంఐలు.. పోను చివరకు మిగిలే డబ్బు) ఉండడంలేదు. ఇది వినియోగం తగ్గడానికి దారితీస్తుంది.పెరుగుతున్న ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా అధిక స్థాయిలను తాకుతోంది. దానివల్ల నిత్యావసరాల ఖర్చు పెరిగి మధ్యతరగతి కుటుంబాలు సాధారణ కొనుగోళ్ల కంటే నిత్యావసర ఖర్చులకే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది.రుణ భారంమధ్యతరగతి కుటుంబాలు తనఖాలు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలతో సహా అధిక స్థాయి అప్పుల భారంతో కాలం వెల్లదీస్తున్నాయి. ఈ రుణం ఈఎంఐలు ఇతర వస్తువులు, సేవలపై ఖర్చులను తగ్గిస్తున్నాయి. దీనికితోడు మార్కెట్లో ఆన్లైన్ వేదికగా చాలా ప్లాట్‌ఫామ్‌లు అడ్డగోలుగా అప్పులు ఇస్తున్నాయి. మధ్యతరగతి దీనికి ఆకర్షింపబడుతుంది. కానీ అప్పులు తీర్చే సమయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆర్థిక మాంద్యంఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. దాంతో ప్రైవేట్ రంగంలో చాలామంది కొలువులు కోల్పోతున్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు తగ్గుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో శ్రామికశక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెటా, గూగుల్.. వంటి టాప్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇది మధ్యతరగతి ఆదాయాలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయా కుటుంబాలు వారి మునుపటి వినియోగ స్థాయిలను కొనసాగించడం కష్టమవుతుంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలుబడ్జెట్ సహాయపడుతుందా?రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 ఈ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించి మధ్యతరగతికి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కొన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.పన్ను ఉపశమనం: వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం లేదా ప్రామాణిక తగ్గింపును పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది.సబ్సిడీలు: ఆహారం, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసర వస్తువులకు సబ్సిడీలను ప్రవేశపెట్టడం లేదా వాటిని విస్తరించడం మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఉద్యోగాల కల్పన: మౌలిక సదుపాయాలు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు మధ్యతరగతి కార్మికులకు ఆదాయం పెరుగుతుంది.రుణ ఉపశమన కార్యక్రమాలు: గృహ రుణాన్ని నిర్వహించడానికి, దాన్ని భారాన్ని తగ్గించడానికి సహాయపడే కార్యక్రమాలను అమలు చేయడం వినియోగానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది.ద్రవ్యోల్బణ నియంత్రణ: ద్రవ్య విధాన సర్దుబాట్లు వంటి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు ధరలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతాయి. కొనుగోలు శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. -
Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్
-
Delhi Election: కేజ్రీవాల్ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. VIDEO | AAP National Convenor Arvind Kejriwal (@ArvindKejriwal) criticises the Centre's tax policies, calling it 'tax terrorism.'"People have to pay taxes while they are alive, but now the government has created a situation where they have to pay even after death. Amid this tax… pic.twitter.com/6LreZj30co— Press Trust of India (@PTI_News) January 22, 2025ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
"ధరలు చూసి కొనకుండానే వెళ్లిపోతున్నా.."
-
Budget 2024: అప్పట్లో ఇవే హైలెట్స్.. మళ్లీ ఉంటాయా?
బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి.. ➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. ➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు. ➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ➧ విద్య: విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మళ్లీ ఉంటాయా? సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
పాతికేళ్ల లోపే రూ.50 లక్షలకు భారతీయుల సగటు ఆదాయం
భారతదేశంలో మధ్య ఆదాయ వర్గం ఎదుగుదలపై 77వ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా విభాగం ఎస్బీఐ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ఎంతో ఆశావహంగా ఉంది. ఆర్థిక సంవత్సరాలు 2011, 2022 మధ్య పదేళ్ల కాలంలో దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్స్ ఆధారంగా దేశంలోని మధ్య తరగతి ఆదాయాలు పెరిగిన తీరును ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. ఈ నివేదికలోని గణాంకాల ప్రకారం ఆర్థిక సంవత్సరాలు 2013, 2022 మధ్య కాలంలో మధ్య తరగతి భారతీయుల సగటు ఆదాయం మూడు రెట్లు పెరిగింది. అంటే వారి ఆదాయం ఈ 11 సంవత్సరాల్లో రూ.4.4 లక్షల నుంచి రూ.13 లక్షలకు పెరిగింది. 21వ శతాబ్దం మొదటి దశాబ్దం తర్వాత భారతీయుల ఆదాయం పెరగడం గణనీయ పరిణామం. గడచిన పది సంవత్సరాల్లో దిగువ మధ్య తరగతి ప్రజలు ఉన్నత ఆదాయ వర్గం స్థాయికి ఎలా ఎదిగినదీ ‘కొత్త మధ్య తరగతి ఎదుగుదల’ అనే శీర్షికతో వచ్చిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వివరించారు. అలాగే ఇదే కాలంలో అసలు ప్రభుత్వానికి పన్నే చెల్లించాల్సిన అవసరం లేని విధంగా దాఖలు చేసే ఆదాయపన్ను రిటర్న్స్ సంఖ్య ఎలా పూర్తిగా మాయమైనదీ ఈ నివేదికలో పొందుపరిచారు. పట్టుదలతో లక్ష్య సాధనే భారతీయుల ప్రత్యేకత! 2047 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చిన నూరేళ్లకు ఇండియా పూర్తిగా అభివృద్ధిచెందిన దేశంగా అవతరిస్తుందన్న ఆకాంక్షను ప్రధానమంత్రి తన ఆగస్ట్ 15 ప్రసంగంలో ఢిల్లీ ఎర్రకోటపై వ్యక్తంచేశారు. మరో 24 ఏళ్లలో ‘వికసిత్ భారత్’ను చూస్తామన్న ప్రధాని కోర్కె 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులందరి మనసుల్లో ఉందంటే అతిశయోక్తి లేదు. ఆర్థిక సంవత్సరం 2047 నాటికి ఇండియాలో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య 85.3 శాతం పెరిగి 48 కోట్ల 20 లక్షలకు చేరుకుంటుందని కూడా ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. ఈ లెక్కన భారత్ ఒక మోస్తరు సంపన్నదేశంగా అవతరిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2023లో రూ 2 లక్షలు ఉందని భావిస్తున్న భారత ప్రజల తలసరి ఆదాయం 2047 నాటికి రూ.14.9 లక్షలకు పెరుగుతుందని అంచనా. అలాగే, మధ్య తరగతి భారతీయుల ప్రస్తుత సగటు ఆదాయం రూ.2 లక్షలు 24 ఏళ్ల తర్వాత 49.7 లక్షలకు పెరుగుతుందని ఎస్బీఐ పరిశోధనా బృందం అంచనా వేసింది. ఈ సంఖ్యా వివరాలు లేదా అంచనాలన్నీ భారీగా, అత్యంత ఆశాజనకంగా ఉన్నాయి. పెరుగుతున్న భారత జనసంఖ్య, ముఖ్యంగా పనిచేసే వయసులో ఉండే యువత జనాభా ఎక్కువ ఉన్న కారణంగా పై అంచనాలను నిజం చేయడం అసలు కష్టమే కాదు. మూడు దశాబ్దాల క్రితం మొదలైన ఎదగాలనే ఆకాంక్ష, సంపన్న దేశాల సరసన నిలబడాలనే బలమైన కోర్కె ఫలితంగా దేశాభివృద్ధితోపాటు జనం ఆదాయాలు పై స్థాయిలో పెరగడం కష్టమేమీ కాదు. 1947లోనే స్వాతంత్య్రం సంపాదించిన మన సోదర దేశం పాకిస్తాన్ తో పాటు, ఇతర దక్షిణాసియా, ఆసియా దేశాల పరిస్థితులతో పోల్చితే భారతదేశంలో అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. దేశంలో కొన్ని దశాబ్దాలుగా రాజకీయ, ఆర్థిక సుస్థిరత, చట్ట ప్రకారం సాగే పరిపాలన వంటి అంశాలు వచ్చే పాతికేళ్లలో ఇండియాను సంపన్న దేశాల జాబితాలో చేర్చుతాయనడంలో సందేహం లేదు. అనేక ఆటుపోట్లు, అననుకూల సంకేతాలు, పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమకాలీన ప్రపంచంలో భారతదేశం ఏకైక ఆశాజనక ప్రాంతమని అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి, వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు -
AP: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ చెల్లింపుదారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఆదాయాన్ని వెల్లడించి ప్రభుత్వానికి పన్ను చెల్లించే ట్యాక్స్ పేయర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగిందని, దేశవ్యాప్తంగా ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంతటి పెరుగుదల లేదని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ తెలియజేసింది. నిజానికి దేశవ్యాప్తంగా పెరిగిన ట్యాక్స్ పేయర్ల సంఖ్య 2015–2020 మధ్య 3.81 కోట్లుండగా... 2020–23 మధ్య మాత్రం 1 కోటి మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలానే ఉన్నా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ ఐదేళ్లలో కేవలం 5 లక్షల మందే ట్యాక్స్ పేయర్లు పెరిగినట్లు ఎస్బీఐ తెలియజేసింది. మొత్తంగా చూస్తే 2015– 2023 మధ్య రాష్ట్రంలో 23 లక్షల మంది ట్యాక్స్ పేయర్లు పెరిగారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజల ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, తక్కువ ఆదాయం ఉన్న వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఆదాయాల కేటగిరీల్లోకి వెళుతున్నారని... ఆదాయాన్ని వెల్లడించి పన్ను చెల్లిస్తుండటంతో ట్యాక్స్ పేయర్ల సంఖ్య పెరుగుతోందని సంస్థ తెలియజేసింది. ఫలితంగా 2023లో ఐటీ రిటర్నుల దాఖల్లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలు అగ్ర స్థానాల్లో నిలిచాయి. పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల ఆదాయం.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక మేరకు... 2014లో దేశంలో మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం రూ.4.4 లక్షలు. 2023 నాటికి అది రూ.13 లక్షలకు పెరిగింది. 2047 నాటికి ఇది రూ.49.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. గడిచిన పదేళ్లలో రూ.5 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.10 లక్షల ఆదాయ కేటగిరీలో పన్ను చెల్లించే వారు ఏకంగా 8.1 శాతం పెరిగారు. అలాగే రూ.10 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.20 లక్షల ఆదాయ కేటగిరీకి వెళ్లిన వారు 3.8 శాతం మంది. ఇక రూ.20 లక్షల ఆదాయ కేటగిరీ నుంచి రూ.50 లక్షల కేటగిరీకి చేరింది 1.5 శాతం. రూ.50 లక్షల కేటగిరీ నుంచి రూ.1 కోటి కేటగిరీకి 0.2 శాతం మంది, రూ.1 కోటికి పైగా ఆదాయ కేటగిరీలో 0.02 శాతం మంది పెరిగారని నివేదిక విశ్లేషించింది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుదల ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. దేశ జనాభా 2023లో 140 కోట్లుండగా 2047 నాటికి ఇది 161 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 53 కోట్లు. 2047 నాటికి 72.5 కోట్లకు పెరగవచ్చని అంచనా. అంటే.. మొత్తం జనాభాలో ప్రస్తుతం ఉద్యోగులు 37.9 శాతం ఉండగా 2047 నాటికి 45 శాతానికి పెరుగుతారని నివేదిక వెల్లడించింది. 2023లో ఐటీ పరిధిలోకి 31.3 కోట్ల మంది ఉద్యోగులు రాగా 2047 నాటికి 56.5 కోట్లకు ఈ సంఖ్య పెరగవచ్చని అంచనా. ట్యాక్స్ పేయర్లలో ఉద్యోగుల వాటా ప్రస్తుతం 59.1 శాతం ఉండగా 2047 నాటికి ఇది 78 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. -
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
మధ్యతరగతి మందహాసం! వచ్చే పాతికేళ్లలో రెండింతలకు పైగా వృద్ధి..
సాక్షి, హైదరాబాద్: దేశమేదైనా మధ్యతరగతి వివిధ రూపాల్లో నిర్వహించే పాత్ర ప్రత్యేకతను చాటుతు న్న విషయం తెలిసిందే. సమాజంలో కీలకమైన వ ర్గంగా పేరుబడిన ఈ నడిమి తరగతి క్రమంగా దే శాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి తగ్గట్టు గానే భారత్‌లోని మధ్యతరగతి 2047 నాటికి అంటే దేశం స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తిచేసుకునే నాటికి మొత్తం జనాభాలో 61 శాతానికి చే రుకోబోతున్నట్టుగా అధ్యయనాలు చెపుతున్నాయి. మనదేశంలో 2020–21లో 43.2 కోట్లున్న నడిమి తరగతి జనాభా 2030–31కల్లా 71.5 కోట్లకు, 20 47 నాటికి 102 కోట్లకు (ఆనాటికి... మొత్తం 166 కో ట్ల భారత జనాభాలో) పైగా చేరుకుంటుందని అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న దేశ మిడిల్‌క్లాస్ వచ్చే పాతికేళ్లలో రెండింతలకు పైగా వృద్ధి నమోదు చేస్తుందని అంటున్నారు. తాజాగా పీపుల్స్ రీసెర్చీ ఆన్ ఇండియాస్ కన్జుమర్ ఎకానమీ (ప్రైస్) ‘ద రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్‌క్లాస్’ నివేదికలో పలు ఆస క్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 25 రాష్ట్రాల్లోని 40 వేల కుటుంబాలకు పైగా చే సిన అధ్యయనం ఆధారంగా నివేదిక తయారు చేశారు. ఇదీ నివేదిక... దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగింపుతో పాటు ఆర్థిక సంస్కరణల అమలు ద్వారా ప్రతీ ఏడాది 6 నుంచి 7 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించడం కొనసాగిస్తే వచ్చే రెండు, రెండున్నర దశాబ్దాల కాలంలోనే భారత్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది. ధనికవర్గం సంపాదించే ఆదాయం ఎక్కువగానే ఉన్నా...జనాభారీత్యా భారత మధ్యతరగతి సంఖ్యాపరంగా అధికంగా ఉన్నందున ఆర్థికరంగాన్ని నడిపించడంలో ఈవర్గం కీలకపాత్ర పోషించనుందని ఇందులో పేర్కొన్నారు. ఈ దశాబ్ది చివరికల్లా తక్కువ ఆదాయం ఆర్జించే వర్గం కాస్తా క్రమంగా నడిమితరగతిలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. మధ్యతరగతిలో భారీగా పెరుగుదల, ధనికుల క్రీమీలేయర్‌గా అత్యున్నత స్థాయిలో నిలవడంతో అల్పాదాయ, ఇతర కిందిస్థాయి వర్గాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే...2030–31 కల్లా దేశంలోని ‘సూపర్‌రిచ్ హౌస్‌హోల్డ్స్’ ఐదింతలు పెరగడంతో పాటు, ఈ వర్గాలు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతాయని పేర్కొంది. మధ్యతరగతి పరిగణన ఎలా? మధ్యతరగతి అంటే ఏమిటి అన్న దానికి ప్రపంచవ్యాప్తంగాఒక స్పష్టమైన, ఒకేవిధమైన నిర్వచనమంటూ ఇంకా స్థిరపడలేదు. భారత్‌లో 2020–21 ధరల ఆధారంగా చూస్తే మాత్రం...ఏడాదికి రూ.1.09 లక్షల నుంచి రూ.6.46 లక్షల వార్షికాదాయం సంపాదించే వారిని లేదా కుటుంబ వార్షికాదాయంరూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉన్న వారినిమధ్యతరగతిగా పరిగణిస్తున్నారు. నిపుణులేమంటున్నారంటే... భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలు పెరిగేకొద్ది నడిమి తరగతి వర్గం(కేటగిరి) వృద్ధి చెందడం ద్వారా నాణ్యమైన వైద్య ఆరోగ్యసేవలు,విద్య, గృహ నిర్మాణరంగం, వినిమయ వస్తువులు తదితరాలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం కోసం విద్య, వైద్యంపై మరింత ఫోకస్‌ను పెంచాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఏతావాతా చూస్తే...మధ్యతరగతి జనాభా పెరుగుదల ద్వారా 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ విధంగా భారత్ వృద్ధికి, పురోగతి విషయంలో మధ్యతరగతికీలకపాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నారు. -
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్‌ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
New Tax Regime: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతికి మరింత మేలు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా మధ్యతరగతి వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. ఆర్బీఐ కేంద్ర బోర్డుతో సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడులు పెట్టే విధంగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం లేదని, పెట్టుబడులపై వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం వారికి కల్పించాలన్నారు. డబ్బు సంపాదించి, ఇంటిని నడిపించే వ్యక్తికి తన డబ్బును ఎక్కడ పెట్టాలో, ఎలా ఆదా చేసుకోవాలో బాగా తెలుసున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌కు అవకాశం కల్పించడంతోపాటు మారిన శ్లాబులు, పన్ను రేట్లతో సగటు పన్ను చెల్లింపుదారుడి చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. కొత్త బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నూతన పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి 50వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రతిపాదించారు. పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే రాయితీలతో కూడిన పన్ను విధానంలోనూ పన్ను శ్లాబ్ రేట్లను పునర్వ్యవస్థీకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల వరకు వార్షికాదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని, పన్ను విధానాన్ని సరళీకరిస్తామన్న మాటను నిలబెట్టుకుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై మంత్రి స్పందిస్తూ.. దేశంలోని నియంత్రణ సంస్థలు ఎంతో అనుభవం కలిగినవని, పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీ అంశంపై మాట్లాడుతూ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ఆస్తులపై నియంత్రణకు సంబంధించి ఉమ్మడి అభిప్రాయం కోసం జీ20 దేశాల సమావేశాల్లో చర్చిస్తామన్నారు. -
బడ్జెట్లు మనుషుల కోసం కాదా?
కేంద్ర బడ్జెట్లో పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తువుల ప్రస్తావనే అత్యధికం. ఈ ‘అమృత్ కాల్’ బడ్జెట్లో అమృతం ఉంది. అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు పార్లమెంటులో ఉంచే ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... పాత విధనాల సమీక్ష, కొత్త పథకాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగా నైనా ఉండేవి. 2015–16 నుంచి ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. ‘‘గత సంవత్సరం వందేళ్ళ భారత్’ పేరుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పునాదుల మీద ఆధారపడి ఈ ఏడాది బడ్జెట్ రూపొందింది. అభివృద్ధి ఫలాలను అన్ని ప్రాంతాలు, అందరు పౌరులకు ప్రత్యేకించి యువత, మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు అందిస్తూ సంపన్న సమ్మిళిత పురోగతిని సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.’’ ఫిబ్రవరి ఒకటవ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్న మాటలివి. ఇవి మాటలే. బడ్జెట్ ప్రసంగం మొదటి పేరాలోని పలుకులివి. మిగతా ప్రసంగంలో ఎక్కడా ఆ మాటలకు సంబంధించిన ప్రస్తావనా లేదు; నిధుల కేటాయింపు అంతకన్నా లేదు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ భాగం పరిశ్రమలు, పనిముట్లు, యంత్రాలు, కార్లు, ఇతర ప్రాణంలేని వస్తు వుల ప్రస్తావనే అత్యధికం. ‘అమృత్ కాల్’ బడ్జెట్ అని పేరుపెట్టుకున్న ఈ బడ్జెట్లో అమృతం చాలా ఉంది. అయితే అది మనుషులను బతికించేందుకు కాదు. మనుషులను నిరుపయోగంగా మార్చేసే సాంకేతిక విప్లవానికీ, ఆధునికీకరణ యంత్రాలకూ. అంటే ప్రాణంలేని వస్తువులకు నిరుపయోగ, నిష్ఫలామృతం. ప్రభుత్వాలుగానీ, సంస్థలుగానీ, ఏదైనా బడ్జెట్ తయారు చేసు కునేటప్పుడు ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని, భవిష్యత్ బాగుకోసం పథకాలు రాసుకుంటారు. మనవాళ్ళు కూడా గతంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. దానికే ‘ఎకనామిక్ సర్వే’ అని పేరుపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒకరోజు ముందు దీనిని పార్లమెంటు ముందుంచుతారు. ఎకనామిక్ సర్వే ఉద్దేశ్యం మంచిదే. అయితే 2014 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న సర్వే ఫార్మాట్ వేరు. ఆ తర్వాత దాని దారే వేరు. 2014–15 వరకు ‘సోషల్ సెక్టార్’ పేరుతో ఒక చాప్టర్ ఉండేది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, పిల్లలు, వారి సమస్యలు... ప్రగతి, పాత విధనాల సమీక్ష, కొత్త పథ కాల రూపకల్పన ఆలోచనలు సంక్షిప్తంగానైనా ఉండేవి. ఆశ్చర్యమేమి టంటే, 2015–16 నుంచి భారత ప్రభుత్వం ప్రకటిస్తున్న ఎకనామిక్ సర్వేలలో ఈ ‘సోషల్ సెక్టార్’ అధ్యాయం గల్లంతయ్యింది. దీనిని చాలా మంది ఆర్థిక వేత్తలు, బడ్జెట్ విశ్లేషకులు, ప్రతిపక్షాల పెద్దలతో సహా ఎవ్వరూ పట్టించుకున్నట్టు లేదు. అందరూ ఏదో లోకంలో ఉన్నారు. ‘అమృత్ కాల్’లో తేలియాడుతున్నారు. ఇది కేవలం అధ్యాయం గల్లంతు కావడం కాదు, ఆలోచనా సరళిలో లోపం. అందుకే ఈ బడ్జెట్లో గానీ, 2022 ఎకనామిక్ సర్వేలో గానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు, పిల్లలు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం, సమాజ స్థితిగతులు పట్టినట్టు కనిపించదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ దృష్టి కోణం భిన్నమైనది. సైద్ధాంతికంగానే వీళ్ళు ఈ దేశంలో కులమనే ఒక వ్యవస్థ ఉన్నట్టుగానీ, దానివల్ల ఏర్పడిన, కొనసాగుతున్న అసమానతలు, వివక్ష, అణచివేత ఉన్నట్టుగానీ భావించరు. అందరూ హిందువులే అనే భావన వారికి. అందుకే ఎస్సీ, బీసీల ఉనికి, వారి గురించిన ప్రత్యేక సామాజిక స్థితిగతులు వాళ్ల ఎన్నికల ప్రణాళికల్లో, బడ్జెట్లో అంతగా ప్రస్తావనకు రావు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఈ వర్గాల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలా లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను చాలా వాటిని నిర్వీర్యపరిచే పనికి కూడా పూనుకున్నారు. కేంద్రంలో ఎస్సీలు, బీసీలు, అనాథలు, దివ్యాంగుల కోసం కలిపి ఇప్పటికే ఒక మంత్రిత్వ శాఖ ఉన్నది. చాలామంది ప్రస్తుతం ఉన్న సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖను ఎస్సీల కోసమే ననుకుంటున్నారు. అది నిజం కాదు. అది ఎస్సీ, బీసీలకు కూడా. ఈ రెండు వర్గాలు కలిస్తే దాదాపు 65 శాతానికిపైగా ఉన్న సంగతిని కూడా ప్రభుత్వాలు మరచిపోయాయి. ఎస్సీ, బీసీలు కూడా మరిచి పోయారు. ఎస్సీ, బీసీలు కలిసి ఉన్న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోసం ఇప్పటి వరకు బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. 2015–16లో మొత్తం బడ్జెట్ 16 లక్షల 63 వేల కోట్లు కాగా, అందులో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 5,380 కోట్లు. అంటే ఇది 0.32 శాతం మాత్రమే. అదేవిధంగా 2016–17లో 17 లక్షల 90 వేల కోట్ల మొత్తం బడ్జెట్లో కేటాయించింది 5,752 కోట్లు మాత్రమే. ఇది కూడా 0.32 శాతం దాటలేదు. అట్లా 2017–18లో 0.33 శాతం, 2018–19లో 0.31 శాతం. అదేవిధంగా 2020–21లో 35 లక్షల 90æవేల కోట్ల బడ్జెట్లో ఈ మంత్రిత్వ శాఖకు కేటాయించింది కేవలం 8,065 కోట్లు. ఇది 0.23 శాతం. ప్రతి సంవత్సరం పెరగాల్సింది. కానీ దారుణంగా పడిపోయింది. ప్రతి ఏడాది ఆ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ దేశ బడ్జెట్ పెరుగుదలలో దానిశాతం పెరుగుతున్న దాఖలా లేదు. రాజ్యాంగం అందించిన హక్కు ప్రకారం ప్రారంభించిన– ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధుల వినియోగం కూడా దారుణంగా ఉంది. గతంలో దీనిని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌గా పిలిచే వాళ్ళు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్‌ను తొలగించి, దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పరిచారు. బడ్జెట్లో కూడా ప్లాన్, నాన్ ప్లాన్ పేర్లను తొలగించి రెవెన్యూ, క్యాపిటల్ అనే పదాలను మాత్రమే కొనసాగిస్తున్నారు. ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీల కోసం ప్లాన్ నిధుల నుంచి కేటాయించాల్సిన వాటిని ఎస్సీ కాంపోనెంట్గా, ఎస్టీ కాంపో నెంట్‌గా పిలుస్తున్నారు. అయితే జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. వాటి వివరాలను చూస్తే కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ఆదివాసీ వ్యతిరేకత అర్థం కాగలదు. గత ఎనిమిదేళ్ళలో ఎస్సీ కాంపోనెంట్ కింది కేటాయించిన నిధులు సగానికి పైగా దారి మళ్ళినట్టు వారి లెక్కల్లోనే కనిపిస్తున్నది. ఇప్పటికే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్షలు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలను బాధిస్తున్నాయి. పేదరికం, ఆరోగ్యం, విద్య విషయంలో మిగతా సమాజానికీ ఎస్సీ, ఎస్టీలకూ మధ్య అగా«థం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, యాంత్రీకరణ, ఆధునికీకరణ విధా నాలు ఈ వర్గాలను మొత్తంగానే సమాజ ప్రగతి నుంచి దూరం నెడు తున్నాయి. ఈ బడ్జెట్లో కొత్తదేమీ లేదుకానీ, కోట్లాది మంది యువతకు నైపుణ్యాల శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఈ నైపుణ్యాల శిక్షణ గురించిన గత అనుభవాలు అంత మంచి ఫలితాలను ఇచ్చినట్టు లేవు. సాంకేతిక, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన విద్యలు ప్రైవేట్ రంగంలో ఉంటాయి. ఇందులోకి ఎస్సీ, ఎస్టీ యువత వెళ్ళలేరు. ఎందుకంటే, అందులో రిజర్వేషన్లు లేవు. అందుకే బడ్జెట్లో భారత దేశ సమాజం కనిపించాలి. దేశంలో ఉన్న అసమానతలను తొలగించడానికి పూనుకోవాలి. కానీ ఆ ప్రయ త్నాలను ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపించడం లేదు. నా ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా లేదు. మొదట్లో చెప్పినట్లు దీనిని వాళ్లు అసలు సమస్యగానే చూడడం లేదు. ఇప్పుడు తమను తాము తరచి చూసుకోవాల్సింది ఆయా వర్గాలే. ప్రభుత్వాలు తమను పట్టించుకోకపోతే, ప్రజలు ఎందుకు ప్రభుత్వా లను పట్టించుకోవాలి? ఇదే ఇప్పుడు అందరూ ప్రశ్నించుకోవాల్సిన కీలకమైన సందర్భం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
సవాల్ మీద సవాల్.. ఆ వర్గాలకు వరాలు ఏ స్థాయిలో..?
ఊరటలు, ఊరడింపులు, ఉపశమనాల కోసం ఉద్యోగులు మొదలుకుని ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాల దాకా అందరూ ఏటా ఎదురు చూసే తరుణం మరోసారి రానే వచ్చింది. కరోనా కల్లోలం నుంచి బయటపడాం అనుకునేలోపే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రూపంలో మరో పిడుగు నెత్తినపడింది. ఆ వెంటే ఉద్యోగాల కోత.. తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని ఊపిరి సలపకుండా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి నెలకొంది. ఒకవైపు ప్రపంచం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భారత్ బడ్జెట్‌కు సిద్ధమైంది. సాధారణంగా బడ్జెట్ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. కానీ, ఈసారి పేద, మధ్యతరగతి ఆశలపైనే ప్రధాన దృష్టి నెలకొంది. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ వర్గాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇందుకు మరో కారణం లేకపోలేదు.. తరుముకొస్తున్న ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్ర సర్కార్‌కు సార్వత్రిక ఎన్నికలు 2024 కంటే ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇది. సాధారణంగా పేద,మధ్య తరగతి వర్గాలే ఓటు బ్యాంక్‌లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఈ తరుణంలో ఆర్థిక క్రమశిక్షణ వైపు మొగ్గితే.. ప్రజాకర్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా కసరత్తులు చేసినట్లు స్పష్టమవుతోంది. పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో.. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారైనా స్వల్ప ఊరటైనా దక్కుతుందా? అనేది చూడాలి. అయితే.. ఎన్నికల వేళ పేద, మధ్య తరగతి వర్గాలకు పలు తాయిలాలూ ఉంటాయంటున్నారు. ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించకపోయినా ఉద్యోగులకు ఎంతో కొంత ఊరటనిచ్చేలా 80సి పన్ను మినహాయింపుల పెంపు వంటి చర్యలుండవచ్చని చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివాటిపై పలు వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ద్రవ్యోల్బణ ప్రభావం ఆదాయ పన్ను ఊరటపై ఎప్పట్లాగే వేతన జీవులు మరోసారి ఆశలు పెట్టుకోగా, భయపెడుతున్న ద్రవ్యల్బోణం కట్టడికి తీసుకోబోయే చర్యలపై ఆర్థిక నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో.. రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ ఉన్న వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగా ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం.. ఈసారి కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు.. తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలున్నందున ప్రజలపై మరీ భారం మోపలేని పరిస్థితి. పైపెచ్చు ఎన్నో కొన్ని తాయిలాలు ప్రకటించాల్సిన అనివార్యత. వీటన్నింటినీ సంతృప్తి పరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడమనే ప్రధానాంశంతో ఆర్థిక పద్దుకు రూపమివ్వడంలో నిర్మలా సీతారామన్ ఏ మేరకు నెగ్గుకొచ్చారో చూడాలి. -
మధ్య తరగతికి చేరువ కండి
మధ్య తరగతికి మరింత చేరువ కావాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వారికి లబ్ధి చేకూర్చిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత వివరంగా తెలియజేయాలన్నారు. ఆదివారం ఇక్కడ మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. బుధవారం సమర్పించబోయే కేంద్ర బడ్జెట్ గురించి చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు పేద, అణగారిన వర్గాలకు ఎనలేని లబ్ధి చేకూర్చడంతో పాటు మధ్యతరగతి ప్రజల జీవితాన్ని ఎంతో సుఖమయం చేశాయని మోదీ అన్నారు. ఈ విషయాలన్నింటినీ వారికి అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా మంత్రులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... స్వాతంత్య్ర అమృతోత్సవ వేళ బ్రిటిష్ వలస పాలనకు సంబంధించిన చిహ్నాలన్నింటినీ ఒక్కొక్కటిగా తప్పిస్తూ ముందుకు సాగుతున్నట్టు ప్రధాని చెప్పారు. భేటీలో మూడు అంశాలపై మంత్రులకు ప్రజెంటేషన్లు ఇచ్చారు. మోదీ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పాలనలో సామాజిక, ఆర్థిక రంగాలకు సంబంధించిన పనితీరుపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ గౌబా సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్య, విద్యా రంగాల్లో సాధించిన ప్రగతిని కూడా వివరించారు. చిన్న, మధ్య తరహా నగరాల్లోనూ ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌ల స్థాపన తదితరాలను ఉటంకించారు. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయిల్లోనూ విద్యార్థుల చేరిక, కొనసాగింపు శాతం బాగా పెరిగాయని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మానవ వనరులతో పాటు అన్నిరకాల వసతులనూ మెరుగు పరిచామన్నారు. ఇక కేంద్రం ప్రారంభించిన పలు ప్రాజెక్టుల వివరాలపై పరిశ్రమలు, అంతర్గత వర్తక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మంత్రులకు మరో ప్రజెంటేషన్ ఇచ్చారు. మోదీ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మాధ్యమాలను మరింత మెరుగ్గా ఎలా వాడుకోవచ్చో సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తన ప్రజెంటేషన్‌లో వివరించారు. -
మధ్యతరగతి విస్ఫోటం
డి.శ్రీనివాసరెడ్డి: మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు! ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది! ఏటా 14 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట! సింహభాగం ఆసియాదే... ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్ డేటా లాబ్ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్ క్లాస్ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది. యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్... ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది. దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు. మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్ క్లాస్ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియాస్ కన్సూ్యమర్ ఎకానమీ (ప్రైజ్) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది! -
ఇది మనుషులు పట్టని అభివృద్ధి
రానున్న వందేళ్ల భారతావనికి మార్గం వేసేదని ఘనంగా చాటిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సరే... ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా అందులో భాగమని ప్రకటించారు సరే... అయితే ఆచరణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవు. చేసినవి కూడా సరిగ్గా ఖర్చు చేయలేదని గత నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. ఆ వర్గాల ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. ఢిల్లీ సర్కార్ బడ్జెట్ సమర్పణ జరిగి పోయింది. స్పందనలు, ప్రతిస్పందనలు హోరెత్తాయి. అధికార పక్షం శభాష్ అంటే, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కొంతమంది తటస్థంగా ఉండే విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు నిజాలు మాట్లాడితే పట్టించుకున్నవారు లేరు. ఇప్పటికే పది రోజులు దాటిపోయింది. ఇక ఆ తర్వాత అందరూ మరిచి పోతారు. మళ్ళీ వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ దాని ఊసు ఎత్తేవారుం డరు. ప్రభుత్వాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. విమర్శ లను పట్టించుకోరు. ముఖ్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ కేటాయింపులు చాలామంది విశ్లేషకులకు పట్టవు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం యథావిధిగా కేటాయింపులు జరిపింది. నాకు తెలిసి ఒక ఆలోచనతో, ప్రణాళికతో చేసిన కేటాయింపులు ఇవి కావని తెలుస్తూనే ఉంది. గత సంవత్సరం రెండు పైసలు ఇస్తే, ఈ సంవత్సరం మూడు పైసలు ఇచ్చి, మధ్యలో దానిని రెండున్నర పైసలు చేసి, ఖర్చు అంతకన్నా తక్కువ చేసి, చేతులు దులుపుకొంటారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆ కేటాయింపుల తతంగం చూస్తే అర్థమవుతుంది. కేంద్రంలో కూడా సబ్‌ప్లాన్ హెడ్ ఒకటి ఉంటుంది. అయితే దానిని పేరు మార్చారు. గతంలో బడ్జెట్లో ప్లాన్, నాన్‌ప్లాన్ అనే వర్గీకరణ ఉండేది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్‌ను ఏర్పరిచిన తర్వాత ప్లాన్ అనే పేరు లేదు. అందువల్ల జనాభా దామాషా ప్రకారం కేటాయించాల్సిన నిధులను, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కేటాయింపులు (అలోకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్స్)గా పేరు మార్చారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లెక్కలు ఘనంగానే ఉన్నాయి. భారతదేశం మొత్తం బడ్జెట్ 39,44,909 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో షెడ్యూల్డ్ కులాలకు 1,42,342 కోట్ల రూపాయలుగా, షెడ్యూల్డ్ తెగలకు 89,265 కోట్లుగా నిర్ణయించారు. నిజానికి జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు కేటాయించా ల్సింది ఒక లక్షా 82 వేల 976 కోట్ల రూపాయలు. ఆ కేటాయించిన దానిలో కూడా ప్రత్యక్షంగా ఎస్సీలకు చేరే నిధులు 53,795 కోట్లు. ఈ కేటాయింపులు మొత్తం బడ్జెట్లో 37 శాతం మాత్రమే. మిగతా మొత్తంలో ఎస్సీలకు నేరుగా చేరేవి చాలా తక్కువ. దాదాపు సగానికి పైగా మంత్రిత్వ శాఖలకు అసలు కేటాయింపులే లేకపోవడం విచార కరం. అదేవిధంగా ఎస్టీలకు నిజానికి 98,664 కోట్లు కేటాయించాల్సి ఉంది. కేటాయించిన మొత్తంలోనూ వారికి నేరుగా చేరేవి 43 వేల కోట్లు మాత్రమే. కొన్ని మంత్రిత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు అందరితో పాటు కేటాయిస్తారు. కానీ వాటి లెక్కలు, వివరాలు... ఎవరైతే ప్రయోజనం పొందాలో వారి వివరాలు ఏమీ ఉండవు. ఉదాహరణకు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద అమలు జరుగుతున్న ఫసల్ బీమా యోజనకు 2022–23 సంవత్సరానికి ఎస్సీలకు 2,667 కోట్లు, ఎస్టీలకు 1,381 కోట్లు కేటాయించారు. ఇవి కాకిలెక్కలు తప్ప నిజ మైన ప్రయోజనమేదీ వీటివల్ల లేదని, గత బడ్జెట్లపైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికను బట్టి అర్థమవుతుంది. కాగ్ 2017లో ఇచ్చిన నివేదికలో పేర్కొన్న విషయాలను చూస్తే మన కళ్ళు తెరుచుకుంటాయి. ‘‘ఎస్సీ, ఎస్టీ రైతుల ప్రయోజనం కోసం 2011–12 నుంచి 2015–16 వరకు 2,381 కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందిన వివరాలు లేవు. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ మహిళా రైతుల కోసం శ్రద్ధ వహించాలని చేసిన సూచనను మంత్రిత్వ శాఖ పట్టించుకోలేదు.’’ అదేవిధంగా ఉన్నత సాంకేతిక విద్య కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు కూడా వినియోగం కాలేదని కాగ్ తెలియజేసింది. ఇప్పటికే ఐఐటీ సంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య అత్యల్పం. ఎస్సీలకు కేటాయించిన సీట్లలో 75 శాతం, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 95 శాతం ఖాళీగా ఉన్నట్టు కాగ్ తన నివేదికలో తెలిపింది. అదేవిధంగా పీజీ కోర్సులలో కూడా ఇదే విధమైన ఖాళీలు ఉన్నట్టు 2021లో కాగ్ నివేదిక స్పష్టం చేస్తున్నది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న సఫాయి కర్మచారి సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వివరాలు కూడా బడ్జెట్ లెక్కల్లో లేవని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కోవిడ్ సమయంలో సఫాయి కార్మికులు ఏ విధమైన సాహసం చేశారో మనందరికీ తెలుసు. అటువంటి వాళ్ల కోసం కేటాయించిన అరకొరా నిధులను కూడా సరిగ్గా వినియోగించకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. 2016–17లో స్వయం ఉపాధి కింద 9 కోట్లు కేటాయిస్తే, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. 2017–18లో అయిదు కోట్లు ఖర్చు చేశారు. అదేవిధంగా 2020–21లో వంద కోట్లు కేటాయించామని గొప్పలకు పోయారు. అయితే అందులో ఖర్చు చేసింది కేవలం 16.60 కోట్లు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి డిపార్ట్మెంట్ కథా ఇదే. అందుకే ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి ఒకవేళ ప్రభుత్వానికి ప్రాధాన్యత అయితే, వీటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కావాలి. కేవలం బడ్జెట్లో అంకెలు చూపెడితే సరిపోదు. అందుకోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధుల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తేవాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టం, మరిన్ని సానుకూల అంశాలతో 2017లో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ వల్ల ప్రయోజనం చేకూరింది. అయితే ఆశించిన స్థాయిలో ఆ ప్రయోజనాలు అందాయా అంటే, లేదనే చెప్పాలి. కానీ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చట్టం అమలులో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో భిన్నమైన పథ కాలు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీల కోసం నెలకొల్పి, నిర్వహిస్తోన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు దేశంలోనే మార్గదర్శకంగా నిలిచాయి. కర్ణాటకలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరహాలో సబ్‌ప్లాన్ చట్టం అమలులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ చట్టం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈ బడ్జెట్‌కు ఒక ప్రత్యేకత ఉందని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది వందేళ్ళ భారత్‌కు మార్గంవేసే బడ్జెట్ అని చెప్పారు. భవిష్యత్ భారతావనికిది ఆరంభం అన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కూడా ఒకటిగా ప్రకటించారు. అయితే ఆచ రణలో గానీ, కేటాయింపుల్లో గానీ ఎటువంటి ప్రత్యేకతలూ లేవు. విమర్శలకు భయపడి మాత్రమే ఎస్సీ, ఎస్టీల పేర్లు చేర్చారు తప్ప ఇందులో ఎటువంటి చిత్తశుద్ధి లేదన్నది కఠిన వాస్తవం. భవిష్యత్‌లో యువత ఎదుర్కోబోయే నిరుద్యోగం ఈ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలవనుందనడంలో సందేహం లేదు. దీనికి ముందుగా బలవబో తున్నది ఎస్సీ, ఎస్టీలే. డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం కష్టం. అందుకోసం ఇప్పటి నుంచే ఒక సమగ్రమైన కార్యాచరణ కావాలి. కోవిడ్ మహమ్మారి వల్ల చాలా రంగాల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. మానవ రహిత అభివృద్ధి, రోబోలు, సాంకే తిక ప్రయోజనం ఉన్న అభివృద్ధి వైపు పారిశ్రామిక వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. దానికి ప్రభుత్వాల దగ్గర ఎటువంటి కార్యక్రమం లేదు. కేవలం దేశ సంపదను పెంచి, నిజమైన సంపదగా ఉన్న మను షులను వదిలేస్తే, అది ఎటువంటి దేశాభివృద్ధి అవుతుందో నిపుణులు ఆలోచించాలి. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషు లోయ్’’ అన్న గురజాడ మాటలను హిందీలోకి అనువాదం చేసి, మన దేశాధినేతలకు ఎవరైనా వినిపిస్తేనైనా కళ్ళు తెరుస్తారేమో చూడాలి. మల్లెపల్లి లక్ష్మయ్య ,వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
కరోనా ఎఫెక్ట్; మిడిల్‌క్లాస్ మటాష్!
వాషింగ్టన్ : కరోనా సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక కష్టాలు భారత్‌లో మధ్య తరగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. దాదాపుగా 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువకు పడిపోయారని నివేదికలో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం గత ఏడాది కరోనా విజృంభించిన సమయంలో రోజుకి రూ. 724 నుంచి రూ.1449 వరకు సంపాదించే వారిలో 3.2 కోట్ల మంది తమ సంపాదనని కోల్పోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు. కరోనా సంక్షోభం రాకముందు 9.9 కోట్ల మంది ఉండే మధ్య ఆదాయ వర్గం ఆ తర్వాత ఏడాది కాలంలోనే 6.6 కోట్లకు తగ్గిపోయింది. 2011–19 మధ్య కాలంలో దాదాపుగా 5.7 కోట్ల మంది మధ్య ఆదాయ వర్గాల్లో చేరారు. రోజుకి రూ.140 అంత కంటే తక్కువ సంపాదన ఉన్న వారు 7.5 కోట్ల మందిగా ఉన్నారు. ఈ ఏడాది చమురు ధరల్లో భారీ పెరుగుదల చాలా మందిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వేతనాల్లో కోతలు, ఉద్యోగాలు కోల్పోవడంతో చాలా మంది బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వివరించింది. చదవండి: రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు: సుప్రీంకోర్టు తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హైకోర్టు -
మండే మంచుకొండ నాన్న
తిట్టే నాన్న... దండించే నాన్న... కర్ర తీసుకొని వెంటబడే నాన్న... ఎప్పుడూ కోపంగా ఉండే నాన్న.. ఎన్నడూ దగ్గరకు పిలువని నాన్న... కాని ఆ మనసులో మంచుకొండ ఉంటుంది. ఆ గుండెల్లో ఎంతో ఆర్తి ఉంటుంది. ఆ హృదయంలో పిల్లల గురించి బెంగ ఉంటుంది. మధ్యతరగతి నాన్నను సినిమా అప్పుడప్పుడు సరిగ్గా చూపిస్తుంటుంది. ఇటీవలి సినిమా ‘మిడిల్‌క్లాస్ మెలోడీస్’ చూసిన ప్రేక్షకులు తమ తండ్రుల కబుర్లలో మునుగుతున్నారు. తెలుగు సినిమాల్లో మధ్యతరగతి నాన్నల స్పెషల్ ఇది. గుంటూరు వెళ్లి హోటల్ పెట్టాలనుకుంటాడు కొడుకు. తండ్రికి ఇంత పొడుగున పొడుచుకొచ్చింది కోపం. ‘ఏం... ఇది హోటలు కాదా... ఇక్కడ సరిగ్గా అఘోరించవచ్చుగా’ అంటాడు పల్లెటూళ్లో తాను నడుపుతున్న హోటల్ని చూపిస్తూ కొడుకును పట్టుకొని. కొడుక్కు మీసాలు వచ్చాయి. కండలు పెరిగాయి. ఏదో నిరూపించాలని అనుకుంటున్నాడు. తండ్రికి జుత్తు నెరిసింది. అనుభవం వచ్చింది. కొడుకు ఎక్కడ నష్టపోతాడో అని సంశయిస్తున్నాడు. కాని ఆ ముక్క మెత్తగా చెప్పడు. ఆ ముక్కను నేరుగా చెప్పడు. తిట్టి కొట్టబోయి అదిలించబోయి చెబుతుంటాడు. కొడుక్కు తండ్రిని చూస్తే ఎంత భయమంటే ఒక్కోసారి ఎదిరించేసేంత భయం. లోకంలో చూసేవారందరికీ ఆ తండ్రికి ముక్కు మీద కోపం అని తెలుస్తూ ఉంటుంది. కాని లోకంలో అందరికీ ఆ తండ్రి మనసులో చాలా ప్రేమ ఉందని కూడా తెలుస్తూ ఉంటుంది. కొడుక్కూ తెలుసు. కాని పైకి జరిగేదంతా నాటకమే. ఇటీవల ‘ఓటిటి’ ప్లాట్‌ఫామ్‌పై విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో తండ్రి ‘కొండలరావు’ పాత్రను చూసి చాలామంది తమ తండ్రుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గత కాలపు తండ్రి 1980ల ముందు వరకూ మధ్యతరగతి తండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక ప్రశాంతత ఉండేది. కాని 1980ల తర్వాత తండ్రుల మీద ఒత్తిడి పెరిగింది. ఆడపిల్ల అయితే కట్నం టెన్షన్... మగపిల్లాడు అయితే ఉద్యోగం టెన్షన్. బొటాబొటి జీతంతో కుటుంబాన్ని లాగాలంటే ఎలాగో తెలియక తండ్రులు చిర్రుబుర్రుమంటూ ఉండేవారు. వారికి తమ మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సమయం ఉండేది కాదు. అలాంటి మూడ్ రేర్‌గా ఉండేది. పిల్లలు ఏం చెప్పాలన్నా తల్లికే చెప్పుకునేవారు. ఈ తండ్రులు 2000 సంవత్సరం తర్వాత ముఖ్యంగా ఈ కాలంలో దాదాపుగా తగ్గిపోయారు గాని ఇవాళ ముప్పైల్లో నలభైల్లో ఉన్నవారంతా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లోని తండ్రులను చూసినవారే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మీసాలు వచ్చినా తండ్రి చేతి దెబ్బలు తిన్నవారే. ‘అమ్మో.. నాన్నొచ్చాడు’ అని ఆయన గుమ్మంలో చెప్పులు విడుస్తుంటే దొడ్డి గుమ్మం నుంచి పారిపోయే కొడుకులు ఉన్నారు. ఆ కాలంలో తండ్రులు ఎక్కువగా కూతుళ్లతో అంతో ఇంతో సంభాషించేవారు. కొడుకులతో నిత్యం ఘర్షణే. ఈ ఘర్షణను ‘ఆకలి రాజ్యం’ సినిమా చూపించింది. ఆ సినిమాలో తండ్రిగా రమణమూర్తి, కొడుకుగా కమల హాసన్ చివరి వరకూ ఘర్షణలోనే ఉంటారు. వారి మధ్య సయోధ్య రాదు. చివరకు ఆ తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కొడుకును తలుచుకుని ‘కూటి కోసం కూలి కోసం’ అని వేదనాభరితంగా పాడతాడు కాని దగ్గర పడితే గుండెలకు హత్తుకోడు. తండ్రుల కన్నీరు తెలుగు సినిమాలలో మిడిల్ క్లాస్ తండ్రులను సహజత్వానికి దగ్గరగా అతి తక్కువ సందర్భాలలో చూపిస్తుంటారు. చిరంజీవి నటించిన ‘మగ మహరాజు’లో ఉదయ భాస్కర్, ‘విజేత’లో సోమయాజులు అలాంటి తండ్రులుగా కనిపిస్తారు. రెండు సినిమాలలోనూ కొడుకుల ప్రయోజకత్వం మీద నమ్మకం లేక ఇంటి భారం తాము మోయాలనుకున్న తండ్రులే వారు. ఆ తర్వాత మధ్యతరగతిలో అతి స్నేహం ప్రదర్శించే త్రివిక్రమ్ మార్కు తండ్రులు (నువ్వే కావాలి), అతి చనువు చూపదగ్గ శ్రీను వైట్ల మార్కు తండ్రులు (ఆనందం), ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకునే పూరి జగన్నాథ్ మార్కు తండ్రులు (ఇడియట్) వచ్చారు. కాని ‘7/జి బృందావన్ కాలనీ’ వచ్చి మిడిల్ క్లాస్ తండ్రి అలాగే భగభగలాడుతున్నాడని చూపించింది. ఆ సినిమాలోని తండ్రి చంద్రమోహన్ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కొడుకు రవికృష్ణ బాధ్యత తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కొడుక్కు ఎంతకూ బాధ్యత తెలియదు. తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రమోహన్ చివరకు రవికృష్ణ ఉద్యోగం తెచ్చుకున్నా సరే తిడతాడు. ‘ఇంతకాలం తిట్టాను. కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమ చూపిస్తే మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటే...’ అని భార్య దగ్గర చెప్పి కళ్ల నీళ్లు పెట్టుకునే సన్నివేశం అందరికీ గుర్తుంటుంది. 7/జి బృందావన్ కాలనీ తండ్రి కోపానికి అర్థమే వేరులే ఇళ్లల్లో కూతుళ్లు గుండెల మీద కుంపటిలా కూచుని ఉన్నారు అని గతంలో అనేవారు గాని ఇంకా బాధ్యత తెలుసుకోని కొడుకు అసలైన కుంపటి అని మధ్యతరగతి తండ్రి భావిస్తాడు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేష్ బాధ్యత తెలుసుకోడు. భార్య చనిపోయి ఇంటిని, ఉద్యోగాన్ని చూసుకుంటున్న తండ్రి గురించి ఆలోచించడు. గాలివాటుకు పోతుంటాడు. ప్రేమగా ఒక్కమాట మాట్లాడింది లేదు. కాని ఆ తండ్రి చనిపోతేనే ఆయన విలువ తెలుసుకుని విలవిలలాడతాడు. ఇక చిన్న కొడుకు ప్రయోజకుడయ్యి పెద్ద కొడుకు వృథాగా ఉంటే ఆ తండ్రి అవస్థ ఎలా ఉంటుందో ‘రఘువరన్’లో చూశాం. నీదీ నాదీ ఒకే కథ తన మర్యాద పోకుండా కొడుకు మర్యాద చెడకుండా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం చాలా కష్టమైన పని అని ఆ తండ్రీ కొడుకులు తెలుసుకుని మాటల్లో చేతల్లో దాగుడుమూతలు ఆడుతూ ఉంటారు. కొడుకును చిన్న మాట అనకుండా ‘మనం కష్టపడ్డాం వాణ్ణన్నా సుఖపడనీ’ అనుకునే తండ్రిని ‘కొత్త బంగారు లోకం’లో, కొడుకులు తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే అని హాయిగా నవ్వేస్తూ తిరిగే ‘సీతమ్మ వాకిట్లో’... తండ్రిని కూడా చూశాం. కాని మధ్యతరగతి తండ్రికి కొడుకు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, వాటిని అందుకోకపోతే ఆ తండ్రి హర్ట్ అవుతాడని కనీసం వాటి కోసం కొడుకు ప్రయత్నించాల్సిందేనని ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాలోని తండ్రి మళ్లీ మనకు చెబుతాడు. అయితే ఆ సినిమాలోని కొడుకు ‘నా స్థాయి ఇంతే. నా బతుకు ఈ మాత్రమే. దానిని నువ్వు స్వీకరించు’ అని చివరి వరకూ డిమాండ్ పెడుతూనే ఉంటాడు. ఫుల్ బనియన్,.. భుజాన టవల్ కాలం ఎంత మారినా ఒంటి మీద ఫుల్ బనియన్, భుజాన టవల్ ఉండే మధ్యతరగతి తండ్రి మారడు. ఆ తండ్రి తన ఇంటిని మర్యాదతో గౌరవంతో నడపడానికి అవస్థ పడక మానడు. పిల్లలు ఎదిగొచ్చి ఆ మధ్యతరగతి మర్యాదలను కొనసాగించాలని, నలుగురిలో ఉన్నంతలో పరువూ మర్యాదతో బతికేలా స్థిరపడాలని తాపత్రయ పడే తండ్రికి కాలదోషం ఉండదు. ఆ తండ్రి నిత్యసజీవుడు. తండ్రులకు కొడుకులు అర్థం కావడం, కొడుకులు తండ్రిని అర్థం చేసుకునే స్థాయికి ఎదగడం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నడిమధ్యన కొన్ని పాత్రలు స్క్రీన్ మీద వారిని రిప్రజెంట్ చేసి తళుక్కున మెరుస్తుంటాయి. ఆ క్షణంలో మనకు మన పెరటి చెట్టు కాయ వొకటి తెంపి కొరికినట్టుగా మనసు రుచితో నిండుతుంది. ఇటీవల సినిమా తండ్రులను చూస్తే కలుగుతున్న భావన అదే. – సాక్షి ఫ్యామిలీ -
మధ్యతరగతి జమాఖర్చులు
అద్దె డబ్బు, కరెంటు బిల్లు, పిల్లాడి స్కూలు ఫీజుకాదేది మధ్యతరగతి కష్టానికి అనర్హం.మర్యాద నిలబెట్టుకుంటూ పైపై బింకాన్నినటిస్తూ జీవితాన్ని లాగించడమేమధ్యతరగతివాడి కర్తవ్యం.అందులో కొన్ని సరదాలు ఉంటాయి.గులకరాయిని కొండరాయి అనుకునేఆందోళనలూ ఉంటాయి.నవ్వులూ పూస్తాయి.ఏ దిక్కూ లేని మధ్యతరగతి వాడికి నవ్వే దిక్కుఅని చెప్పిన సీరియల్ ‘వాగ్లే కీ దునియా’. మనదేశంలో మధ్యతరగతి కష్టాలు ఇన్నీ అన్నీ కావు. కొన్ని అయ్యో అనిపించేవి ఉంటాయి. మరికొన్ని మనసారా నవ్వుకునేవిగా ఉంటాయి. ఇంత చిన్నవి కూడా కష్టాలేనా అనిపించేవీ ఉంటాయి. శ్రీనివాస్ వాగ్లే కుటుంబపు కష్టాలు కూడా అలాంటివే. వాగ్లే కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 1988–90నాటి కాలానికి వెళ్లి బుల్లితెరపై వచ్చిన ‘వాగ్లే కీ దునియా’ చూడాలి. ఇక్కడ వాగ్లే అనే అతను ఒక మధ్యతరగతి మనిషి. మనలాంటివాడు. మన ఇరుగుపొరుగు మనిషిలాంటి వాడు. వాగ్లే ఇంటి పని వాగ్లే ఓ ఆదివారం ఉదయం తీరికగా కూర్చుని పేపర్ చదువుతుంటాడు. పాడైన గడియారాన్ని షాపులో ఇచ్చి బాగు చేయించమని భార్య అంటే డబ్బులు వేస్ట్ అని, పైగా అందులోని ఒరిజనల్ సామాగ్రి షాప్‌వాడు తీసుకొని డూప్లికేట్వి వేస్తాడని, యాంటిక్ పీస్ అని.. తనే దానిని రిపేరు చేయడానికి పూనుకుంటాడు. గడియారం భాగాలను విడదీయడానికి స్క్రూ డ్రైవర్ కోసం ఇల్లంతా తుకుతాడు. చివరకు అటక మీద ఉండి ఉంటుందని పైకి ఎక్కి, పనికి రావని అటెక్కించిన సామాన్లన్నీ పనికి వస్తాయని భావించి ఒక్కోటి కిందకు దించుతాడు. పాత సామాన్లను ఏమీ చేయలేక, అటు చెత్త సామాన్లవాడికి అమ్మకుండా తిరిగి వాటిని అటకెక్కించి అలసిపోతాడు. చివరకు గడియారం పీస్‌ను సామాన్లల్లో ఎక్కడ పెట్టాడో గుర్తుకు రాదు. పొరపాటున అటక మీద పెట్టానేమోనని అనుమానంతో తిరిగి సామానంతా కిందకు దించే పని పెట్టుకుంటాడు. ఈ వాగ్లేలో ప్రేక్షక జనం తమని తాము చూసుకున్నారు. మనసారా నవ్వుకున్నారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్ పెద్ద కొడుకు బ్యాడ్మింటన్ ఆడటానికి వెళుతున్నాడని తెలిసి ఇంటికి వచ్చాక ‘అమ్మకు సాయపడాలి కదా’ అంటూ మందలిస్తాడు వాగ్లే. తను కాలేజీ రోజుల్లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ అని, కుమారుల ఇద్దరికీ గుర్తు చేసి ఇంట్లోనే సామానంతా ఒక పక్కకు జరిపి ఇంటినే గ్రౌండ్ చేస్తాడు. కొడుకు స్కూల్లో గేమ్‌లో పాల్గొంటున్నాడని తెలిసి ఇంట్లో అంతా బయల్దేరుతారు. అప్పటికే గేమ్‌లో ఎలా పాల్గొనాలో ఎన్నో జాగ్రత్తలు చెబుతాడు కొడుక్కి. గేమ్‌లో కొడుకు సరిగా ఆడటం లేదని, గ్రౌండ్ దాటి బయటకెళ్లిపోతాడు. గేమ్ ముగిశాక అంతా బయటకు వస్తుంటారు. తండ్రి ఎవరికీ కనపడకూడదని ఒక దగ్గర దాక్కొని ఉండటం చూసిన మనోజ్ తన ఫ్రెండ్‌కి వచ్చిన కప్పు తీసుకొని తనకే వచ్చిందని చెప్పడంతో వాగ్లే చాలా ఆనందపడిపోతాడు.తమకన్నా పిల్లలు బాగా రాణించాలని తామే దగ్గరుండి ఆటపాటలు నేర్పించాలని తపించిపోయే తల్లిదండ్రులు వాగ్లేలో చూసుకున్నారు. సరదాగా నవ్వుకున్నారు. పనిమనిషి హడావిడి వాగ్లే భార్య రాధిక ఇంటి పని ఒక్కత్తే చేసుకోవడం కష్టంగా ఉందని పనిమనిషిని మాట్లాడుతుంది. వాగ్లే కూడా అందుకు సరేనంటాడు. మొదటి రోజు అన్ని పనులు చకచకా చేసేసిన పనిమనిషి మరుసటి రోజు నుంచి ఆలశ్యంగా వస్తుంది. పనిమనిషి కోసం ఎదురు చూసి రాధిక ఇంటి పని అంతా తనే చేసుకుంటుంటుంది. చివరి సమయంలో వచ్చిన పనిమనిషి ఆలశ్యానికి కారణం కూడా చెప్పకుండా పని చేసుకుపోతుంది. వాగ్లే, రాధిక ఆమెను ఏమీ అనలేకపోతారు. పనిమనిషి భర్త మాత్రం సమయానికి వచ్చి జీతం డబ్బులు దబాయించి తీసుకెళతాడు. వాగ్లే అతని భార్య రాధిక దిగాలుగా చూస్తుంటారు.పనిమనుషులతో తంటాలు పడే కుటుంబాలలో ప్రతి ఒక్కరికీ కాస్త అటూ ఇటుగా ఇది తెలిసిన విషయమే. ఈ ఎపిసోడ్‌తో వాగ్లే కుటుంబంలో తమ కుటుంబాన్ని కలిపేసుకున్నారు సీరియల్ చూస్తున్న ప్రేక్షకులు. పెన్ తెచ్చిన జబ్బు వాగ్లే చిన్న కొడుకు రాజు తన అన్న మనోజ్ దగ్గర పెన్ తీసుకుంటాడు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక ఇస్తానని బతిమాలి తీసుకుంటాడు. చిట్ట చివరకు సరే అంటాడు మనోజ్. స్కూల్ నుంచి వచ్చాక పెన్ కనిపించక రాజు టెన్షన్ పడుతుంటాడు. మనోజ్ వచ్చి తమ్ముడిని పెన్ ఇవ్వమంటాడు. అప్పటికే అన్న ఏమంటాడో అని భయపడుతున్న రాజు చూస్తున్నాను ఇస్తా, అంటాడు. ఆడుకొని వచ్చేసరికి పెన్ తీసి పెట్టాలి లేకపోతే అని బెదిరించి వెళతాడు. భయంతో తల్లి ఇచ్చిన పాలు కూడా తాగకుండా తండ్రి ఇచ్చిన బిస్కెట్ తినకుండా దిగాలుగా కూర్చుంటాడు. దాంతోపిల్లాడికి జబ్బు చేసిందని వాగ్లే, రాధిక భయపడతారు. రగ్గు నిండుగా కప్పి పడుకోబెడతారు. తనకేమీ కాలేదని చెప్పినా వినకుండా డాక్టర్ దగ్గరకు తీసుకెళతారు. డాక్టర్ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. ఆ రష్లో పిల్లవాడిని వదిలేసి డాక్టర్ వాగ్లేకి టెస్ట్ చేసి, జబ్బు ఏమీ లేదని బలానికి టానిక్ రాసిస్తాడు. పైగా వాగ్లేని టెస్ట్ చేసినందుకు ఇరవై రూపాయలు తీసుకుంటాడు. ఇంట్లో పిల్లల మధ్య గొడవలు, వారి అనారోగ్యాలు,పెద్దల హడావిడి ఈ ఎపిసోడ్లో కనిపిస్తుంది. మరో ఎపిసోడ్లో వాగ్లే దీపావళి పండక్కి కర్టెన్ల కోసం ఫ్యాబ్రిక్‌ను కొంటాడు. తమ దగ్గరున్న డబ్బుకన్నా పది రెట్ల ఫ్యాబ్రిక్ కోసం పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఆ కుటుంబం కర్టెన్స్ వద్దనుకొని సోఫా కవర్స్‌ను కొనుగోలు చేయడాన్ని ఇష్టపడుతుంది. ఇవే కాదు మొత్తం నలభై నాలుగు ఎపిసోడ్లలో గుర్తుండిపోయే సన్నివేశాలు ఎన్నో. మధ్యతరగతిలో నిత్యం ఎన్నో ఇష్టమైన ఇక్కట్లు, గడిచిపోయాక తలుచుకుని నవ్వుకునే కష్టాలు ఉంటాయి. వాటిని అందంగా సాహిత్యంలో చాలామంది రాశారు. టీవీలో ఈ సీరియల్ ఆ పని చేసింది. అప్పడూ, ఇప్పుడూ బుల్లితెరపై కామన్ మ్యాన్ అంటే ‘వాగ్లే కి దునియా’ గుర్తుకురాక మానదు. – ఎన్.ఆర్ వాగ్లే ప్రపంచం ►వాగ్లే కి దునియా పూర్తి కామెడీ సీరియల్. వాగ్లే ధరించే ఖాదీ కుర్తాలు, ఆఫీసుకి వెళితే వేసుకెళ్లే కోటు–టై, కాన్వాస్ షూస్, బ్యాగీ ప్యాంట్స్, రాధిక కట్టే కాటన్ చీరలు.. మధ్యతరగతిని ప్రతిబింబిస్తుంటాయి ►ఆర్కేలక్ష్మణ్ తన మునివేళ్లతో భారతీయ మధ్యతరగతి నాడిని పట్టుకున్నాడు. కామన్ మ్యాన్ ఫీచర్‌ని తన స్కెచ్‌తో ఈ కార్టూనిస్ట్ సృష్టిస్తే దర్శకుడు కుందన్ షా బుల్లితెరకెక్కించారు. అప్పటికే ‘జానే భి దో యారో’, ‘ఏ జో హై జిందగీ’, ‘నుక్కడ్’ను పరిచయం చేసిన కుందన్ షా ‘వాగ్లే కీ దునియా’తో మరోమారు అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ►మధ్యతరగతి మనిషి వాగ్లేగా అందరినీ ఆకట్టుకున్నవాడు అంజన్ శ్రీవాత్సవ్. ఇతని భార్యగా భారతి అచేర్కర్ నటించారు. సినీ నటుడు షారుఖ్ ఖాన్ ఇందులో ఒక ఎపిసోడ్లో అతిథి పాత్రలో కనిపిస్తారు. షారుఖ్ అప్పటికే ఫౌజీ సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్నారు ►2012లో వాగ్లే టీమ్ ‘డిటెక్టివ్ వాగ్లే’ పేరుతో మరోసారి బుల్లితెర మీద ప్రత్యక్షమైంది. ఇందులోనూ అంజన్ శ్రీవాత్సవ్ వాగ్లే రోల్‌ను పోషించారు. అతని భార్యగా సుల్భా ఆర్యా నటించారు. -
36,220–36,778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై అంచనాలు, ప్రపంచ ఆర్థికాభివృద్ధి గమనం తదితర అంశాలపై మార్కెట్ దృష్టి నిలపవచ్చు. తాజా బడ్జెట్ ప్రతిపాదనలపై విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్ కదలికలు ఉండొచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, సెన్సెక్స్ సాంకేతికాలు... ఫిబ్రవరి 1తో ముగిసిన వారం తొలిరోజున 35,565 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పతనమైన బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం బడ్జెట్ సమర్పణ తర్వాత 36,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 444 పాయింట్లు లాభపడి 36,469 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలు సెన్సెక్స్ సమీప ట్రెండ్‌కు కీలకం. ఆ రోజునాటి కనిష్టస్థాయి అయిన 36,220 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తుండగా, నిరోధం ఆ రోజునాటి గరిష్టస్థాయి అయిన 36,778 పాయింట్ల వద్ద ఎదురవుతున్నది, ఈ శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు సెన్సెక్స్ వచ్చేవారం కదలవచ్చు. 36,220 పాయింట్ల స్థాయిని కోల్పోతే వేగంగా 35,740 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ రెండో మద్దతును కోల్పోయి, ముగిస్తే 35,565–35,380 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం 36,778 పాయింట్ల స్థాయిని అధిగమించి, ముగిస్తే అప్‌ట్రెండ్ బలోపేతమై 37,050–37,200 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపై 37,500 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక శ్రేణి 10,813–10,983 గతవారం తొలిరోజున 10,630 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ తదుపరి క్రమేపీ పెరుగుతూ వారాంతంలో 10,983 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 114 పాయింట్ల లాభంతో 10,894 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలైన 10,813–10,983 పాయింట్ల శ్రేణిని నిఫ్టీ ఎటు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. 10,813 పాయింట్ల స్థాయిని కోల్పోయి, ముగిస్తే 10,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతును సైతం వదులుకుంటే వేగంగా 10,630–10,535 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,983 పాయింట్ల స్థాయిని దాటగలిగితే పటిష్టమైన అప్ట్రెండ్లోకి మార్కెట్ మళ్లవచ్చు. కొద్ది వారాల నుంచి పలు దఫాలు గట్టి అవరోధాన్ని కల్పిస్తున్న ఈ స్థాయిపైన నిఫ్టీ వేగంగా 11,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,220 పాయింట్ల స్థాయి కూడా నిఫ్టీకి కష్టసాధ్యం కాదు. -
ఎన్నికల వేళ బీజేపీ బ్రహ్మాస్త్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల వేళ మధ్యతరగతికి భారీ ఊరట ఇచ్చేలా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ 2.5 లక్షల రూ 5 లక్షలకు పెంచారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులను బడ్జెట్ సంతృప్తిపరిచింది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ 40 వేల నుంచి 50 వేలకు పెంచారు. ఇక రూ 5 లక్షల వరకూ వార్షికాదయంపై ఎలాంటి పన్ను చెల్లించనవసం లేదు. కాగా, రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. రూ 10 లక్షల ఆదాయంపై 30 శాతం ఆదాయపన్ను విధిస్తారు కాగా, మధ్యతరగతితో పాటు నిజాయితీగా పన్ను చెల్లించే వర్గాలకు ఊరటగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఐటీ మినహాయింపు పరిమితి పెంపుతో 3 కోట్ల మంది వేతన జీవులు, పింఛన్‌దారులకు ఊరట లభిస్తుంది. -
మధ్యతరగతికి కొంత ఊరట!
► 5 లక్షల లోపు ఆదాయంపై పన్ను 5 శాతానికి తగ్గింపు ► రిబేట్ మాత్రం రూ.5,000 నుంచి రూ. 2,500కు తగ్గింపు ► బేసిక్ లిమిట్లో ఎటువంటి మార్పులూ చేయని జైట్లీ ► పన్ను ఆదాయం రూ.50 లక్షలు దాటితే 10 శాతం సర్‌చార్జీ ► రూ.5 లక్షలలోపు వేతన జీవులకు సింగిల్ పేజీ ట్యాక్స్ రిటర్నులు ► తొలిసారి రిటర్నులు దాఖలు చేస్తున్న వారికి స్క్రూటినీ ఉండదు ఎవరి ఆదాయంపై ఎంత పన్ను ఉంటుందో చూస్తే... అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రేట్లు భారీగా తగ్గుతాయని ఆశించిన వేతన జీవులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరీ ఎక్కువగా కాకున్నా కొంత ఊరటనిచ్చారు. బేసిక్ లిమిట్ జోలికి వెళ్లకపోయినా... ఏడాదికి రూ.10 లక్షల వరకూ వేతనం ఉండే మధ్య తరగతి వేతన జీవులందరికీ మరికొంత మొత్తం జేబులో మిగిలేలా చర్యలు తీసుకున్నారు. మినహా యింపులన్నీ పోను... పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.2.5 లక్షలు దాటి రూ.5 లక్షల మధ్యలో ఉంటే... దానిపై ఇప్పటిదాకా విధిస్తున్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆ రకంగా వారు చెల్లిస్తున్న పన్ను లో 50 శాతాన్ని మిగిల్చారు. అయితే ఒకచేత్తో ఇస్తూనే మరో చేత్తో తీసుకున్న మాదిరిగా సెక్ష న్ 87ఏ కింద ఇస్తున్న ట్యాక్స్ రిబేట్‌ను (చెల్లించాల్సిన పన్నును తగ్గించడం) సగానికి సగం తగ్గించేశారు. పైపెచ్చు దాని పరిధిని కూడా కుదించారు. ఇప్పటి వరకు రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ. 5,000 ట్యాక్స్ రిబేట్ లభించేది. అంటే చెల్లిం చాల్సిన పన్నులోంచి రూ.5,000 మినహా యించి మిగిలింది చెల్లించాల్సి ఉండేది. దాన్ని రూ.2,500కు కుదించారు. పైపెచ్చు ఈ రిబేటు కేవలం రూ.3.50 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు. ఇప్పుడు రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను భారం పడదు. కానీ వీరు రిటర్నులు తప్పనిసరిగా వేయాలి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం గనక రూ.3 లక్షలు దాటి రూ.3.50 లక్షల లోపు ఉంటే వారిపై రూ.2,500 పన్ను పడుతుంది. ఇదివరకు వీరు రిబేటు పోను రూ.5,000 చెల్లించాల్సి వచ్చేది. సెక్షన్ 80సీ కింద పొదుపు, వ్యయాలపై లభించే రూ.1.50 లక్షల మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే రూ.4.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ పడే అవకాశం లేదు. రూ.5,00,000 దాటిన వారందరికీ రూ.12,500 వరకు పన్ను భారం తగ్గుతుంది. అధికాదాయం... సర్‌చార్జీ వడ్డింపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం కనుక రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉంటే 10 శాతం సర్‌చార్జీని కొత్తగా వడ్డించారు. గతేడాది కోటి రూపాయలు దాటిన వారిపై విధించిన 15 శాతం సర్‌చార్జీని కొనసాగి స్తున్నట్లు ప్రకటించారు. అలాగే రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు సులభంగా రిటర్న్స్ దాఖలు చేసేలా సింగిల్‌పేజీ రిట ర్న్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థికమంత్రి ప్రక టించారు. అదే విధంగా తొలిసారి రిటర్నులు దాఖలు చేసిన వారిని స్క్రూటినీ చేయబోమని ఆర్థికమంత్రి హామీనిచ్చారు. బేసిక్ లిమిట్ రూ. 4 లక్షల వరకు పెరుగుతుందని, సెక్షన్ 80సీ పరిమి తితో పాటు గృహ రుణాలకు చెల్లించే వడ్డీపై లభించే రాయితీ పరిమితిని పెంచుతారని ఉద్యోగులు వేసిన అంచనాలేవీ నిజం కాలేదు. కాగా ఈ బడ్జెట్ ప్రతిపాదనల వల్ల కేంద్రం నికరంగా రూ.15,500 కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని జైట్లీ చెప్పారు. కాగా, ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీ ఆర్)లు ఆలస్యమైతే పదివేల రూపాయల జరిమానా విధించాలని బడ్జెట్లో ప్రతిపాదిం చారు. అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే...! ఉద్యోగులతో పాటు వ్యాపారేతర ఆదాయం కలిగిన వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి వృత్తి నిపుణులకు కూడా ఈ పన్ను శ్లాబులు వర్తిస్తాయి. అయితే ఈ పన్ను విధించేది ట్యాక్సబుల్ ఇన్‌కమ్‌పైనే. అంటే... మీరు సంపాదించే మొత్తం ఆదాయం నుంచి తొలుత వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపుల్ని తీసేస్తారు. అంటే పీఎఫ్‌కు చెల్లించేది, హెచ్ఆర్ఏ/ ఇంటి అద్దెగా మినహాయించేది, ఇక సెక్షన్ 80సీ కింద వివిధ పథకాల్లో చేసే ఇన్వెస్ట్మెంట్లు (గరిష్ఠంగా ఇది రూ.1.5 లక్షల వరకూ చేయొచ్చు), ఇతర సెక్షన్ల కింద వర్తించే వైద్యబీమా ఖర్చులు, వైద్య ఖర్చులు... ఇవన్నీ మినహాయించాక నికరంగా మిగిలేదే ట్యాక్సబుల్ ఇన్కమ్. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఇది గనుక రూ.3 లక్షల లోపు ఉంటే రిబేట్ సాయంతో రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని ఉండదు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, 5 నుంచి 10 లక్షల మధ్య ఉండే మొత్తానికి 20 శాతం, 10–50 లక్షల మధ్య ఉండే మొత్తానికి 30 శాతం పన్ను చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. -
మెరుపుల్లేని బడ్జెట్
రైల్వే బడ్జెట్‌లాంటి పెద్ద పద్దును విలీనం చేసుకుని బుధవారం పార్లమెంటు ముందుకు వచ్చిన సాధారణ బడ్జెట్ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినంత వరకూ క్షేత్ర స్థాయి వాస్తవాలను అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఆ నిర్ణయానికి తన బడ్జెట్ ప్రతిపాదనలు కొనసాగింపేనని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడంతోపాటు దానివల్ల నరకయాతన అనుభవించిన సాధారణ ప్రజలకూ, నష్టపోయిన చిన్న వ్యాపారులకూ కొంత ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశారు. ఆ పని చేస్తూనే రద్దు నిర్ణయం వల్ల గొప్ప మేలు జరిగిందని సమర్ధించుకోవడం మోదీ ప్రభుత్వ విధానం కొనసాగింపే. జైట్లీ బడ్జెట్ ప్రసంగం కంటే ఆర్థిక సర్వే తయారు చేసిన కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ నివేదిక క్షేత్ర వాస్తవికతకు దగ్గరగా ఉంది. నోట్ల రద్దు నిర్ణయం వల్ల జాతీయోత్పత్తి రేటు తగ్గి నట్టు సుబ్రమణియన్ అంగీకరించారు కానీ జైట్లీ దబాయింపు ధోరణినే కొనసా గించారు. నోట్లరద్దు వల్ల కలిగిన నష్టం తాలూకు వివరాలు మాత్రం వెల్లడించ లేదు. ఈ చర్యవల్ల బ్యాంకులలో జమ అయిన మొత్తాల వివరాలను అధ్యయనం చేసి పన్ను వసూళ్ళ వ్యవస్థను విస్తరించి బలోపేతం చేస్తామంటున్నారు. నగదు రహిత ఆర్థికవ్యవస్థ నిర్మాణానికి దోహదం చేసే దారులు వేస్తామంటున్నారు. ప్రత్యేకంగా చెప్పకపోయినా నోట్లరద్దు వల్ల మనస్తాపం కలిగిన పేదప్రజలను శాంతింప జేసే ఉద్దేశంతోనే గ్రామీణ ఉపాధి కల్పన పథకం ఖర్చు పెంచాలని ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచబోతున్నట్టు చెప్పారు. ఆదాయంపన్నులో రాయితీ కూడా ఈ ఉద్దేశంతో ప్రకటించిందే. పార్టీలు సేకరించే విరాళాల విషయంలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేసినందుకు ఆర్థికమంత్రిని అభినందించాలి. ఇప్పటిదాకా రూ. 20 వేల వరకూ నగదు రూపంలో వచ్చే విరాళాలకు దాతల వివరాలు చెప్పనక్కరలేదు. ఇకమీదట ఆ పరిమితి రూ. 2 వేలకు తగ్గుతుంది. అయితే నగదు వివరాలు చెప్పనక్కరలేదనే నిబంధన ఉన్నప్పుడు దానిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఇంతవరకూ కోట్ల రూపాయల నల్లధనాన్ని విరాళాలుగా తీసుకొని తలా రూ.20వేల చొప్పున వందలమంది పేర్లు దాతలుగా రాయడం పరిపాటి. ఇప్పుడు వేల పేర్లు రాయగలరు. ఆ పేరు గలవారు ఉన్నారో లేదో, నిజంగా వారు విరాళం ఇచ్చారో లేదో తెలుసుకునే వ్యవస్థ లేనంతవరకూ అది నల్లధనం పెరగ డానికే దోహదపడుతుంది. ఆదాయంపన్నులో రాయితీ ఇవ్వడం ఉద్యోగవర్గా లనూ, మధ్యతరగతినీ సంతోషపెట్టే చర్య. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకూ, వ్యాపార సంస్థలకూ పన్ను రాయితీలు ఇవ్వడం కూడా ఆహ్వానించదగిన ప్రతి పాదన. దేశంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. సాలీనా రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు అవుతున్నా మోదీ ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగాల సంఖ్య లక్షలలోనే. మెలకువలను (స్కిల్స్) నేర్పి ఉపాధి కల్పించే పథకం ప్రయోజనకరమైనదే కానీ దాని విస్తృతి పరిమితమైనది. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా, వ్యవ సాయ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరగాలి. బడ్జెట్ ప్రతిపాదనలలో అది కనిపించదు. గ్రామీణరంగంలో ప్రభుత్వం ఖర్చు పెంచుతుందనీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందనీ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపైనా, గ్రామీణ రహదారులపైనా, విద్యుదీకరణపైనా ఖర్చు చేస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని ఐదేళ్ళలో రెట్టింపు చేస్తామని కూడా ప్రకటించారు. ఎట్లా చేస్తారో వివరించలేదు. నిజంగా అన్నదాతను ఆదుకోవాలన్న సంకల్పం ఉంటే వారిని రుణ విముక్తులను చేయాలి. రైతులు కోరుకుంటున్నదీ అదే. 1998 నుంచి దేశంలో రైతులు ఆర్థికంగా చితికిపోయి, అప్పుల ఊబిలో దిగబడి దిక్కుతోచక లక్షల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. మొదట ఈ దుస్థితి విదర్భ, తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతా లలోనే ఉండేది. ఇప్పుడు కోస్తాంధ్ర, పంజాబ్ వంటి సాగునీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో కూడా ఎరువులపైనా, క్రిమిసంహారక ఔషధాలపైనా శక్తికిమించి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు బలన్మరణం చెందు తున్నారు. వీరిని ఆదుకోవడానికి జైట్లీ చేసిందేమీ లేదు. దళితులకూ, మహిళలకూ, మైనారిటీలకూ బడ్జెట్ ప్రతిపాదనలలో రాయితీలు ఉన్నాయంటూ గట్టిగా వినబడినా అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాబోలు వాటిని ప్రకటించలేదు. వాస్తవానికి నోట్ల రద్దు ఫలితంగా బ్యాంకులకు వచ్చి చేరిన ధనంలో కొంత భాగం రిజర్వ్‌బ్యాంక్‌కి బాండ్లు ఇవ్వడం ద్వారా కేంద్రం స్వీకరించి జనధన్‌యోజన ఖాతాలలో జమచేస్తుందంటూ ఊహాగానాలు సాగాయి. ఆ పని చేయకుండా నిగ్రహం ప్రదర్శించినందుకు అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులోని హామీలను, ముఖ్యంగా ప్రత్యేక హోదా హామీని ఆర్థికమంత్రి ప్రస్తావించకపోవడం, విశాఖ రైల్వే జోన్ ఊసు ఎత్తకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి నిరాశకు గురి చేసింది. ప్రజల హృదయాలకు చేసిన గాయాలు మాన్పడానికి ప్రభుత్వాలు బడ్జెట్ ప్రతిపాదనలను వినియోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ జైట్లీ అలాంటి ప్రయత్నమే చేయలేదు. దీన్ని చంద్రబాబు కనీసం ప్రశ్నించకపోగా బడ్జెట్‌కు అభినందనలు తెలుప డమే దురదృష్టకరం. అమరావతి నిర్మాణంకోసం భూములను ప్రభుత్వానికి అప్ప గించిన (ల్యాండ్‌పూలింగ్) రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాణిజ్య భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంపైన పన్ను (మూలధనంపైన పన్ను) ఉండ బోదని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన ఆచరణలో ఎవరికి ప్రయోజనకరమో చూడ వలసి ఉంటుంది. ఈ రాయితీవల్ల కొంతమందికి ప్రయోజనం సిద్ధించినా అది ప్రజలందరూ కోరుకునే ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాజాలదు. మొత్తానికి ఏ మెరుపులూ లేని, ఎవరికీ పెద్దగా సంతృప్తి కలిగించని సాదా సీదా బడ్జెట్‌గా ఇది మిగిలిపోయింది. -
సామాన్యుడిపై ధరాఘాతం
-
ఫీజులుం
తిరుపతిలో ఉంటున్న ఓ చిరు వ్యాపారి కృష్ణమూర్తి తన కుమార్తెను సెంట్రల్ సిలబస్ స్కూల్లో 5వ తరగతిలో చేర్చేందుకు ఓ ప్రయివేటు పాఠశాలకు వెళ్లాడు. అడ్మిషన్ ఫీజు రూ.15 వేలు, ట్యూషన్ ఫీజు రూ.50 వేలు, వ్యాను ఫీజు రూ.10 వేలు, పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం అంతా కలపి మరో రూ.10వేలు.. మొత్తం కలిపితే ఏడాదికి రూ.80 వేలు చెల్లించాలన్నారు. దీంతో ఆయనకు దిక్కుతోచలేదు. - చుక్కలు చూపిస్తున్న ప్రయివేటు స్కూళ్లు - బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు చిత్తూరులో నివాసం ఉంటున్న వెంకటరెడ్డి ఇటీవల ఉద్యోగ రీత్యా మదనపల్లె నుంచి వచ్చి చిత్తూరులో ఉంటున్నారు. తన కుమారుడిని నర్సరీలో చేర్చేందుకు ఓ కార్పొరేట్ పాఠశాలకు వెళితే ఫీజు రూ.23,000, అడ్మిషన్ ఫీ రూ.5 వేలు, వ్యానుకు మరో రూ.7 వేలు, విద్యార్థుల కిట్ పేరుతో మరో రూ.5వేలు.. ఇలా మొత్తంగా రూ.40 వేలు అవుతుందని చెబితే ఆయన కంగు తిన్నారు. తిరుచానూరు: సామాన్య మధ్య తరగతికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలని అనుకోవడం సాధారణమే. తాము బాగా చదువుకోకపోవడం వల్లే కష్టాలు పడుతున్నామని, తమలా తమ పిల్లలు కష్టాలు పడకూడదనే నెపంతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరి ఆసక్తిని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యం వేలాది రూపాయల ఫీజుల రూపంలో చుక్కలు చూపుతూ క్యాష్ చేసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా... జిల్లాలోని తిరుపతి, చిత్తూరు నగరాలు, ప్రధా న పట్టణాల్లోని పలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా టెక్నో, ఒలంపియాడ్, గ్లోబల్, ఐఐటీ వంటి పేర్లతో తల్లిదండ్రులను బురిడి కొట్టిస్తోంది. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల వెనుక ఇలాంటి పేర్లను ఏర్పాటుచేయకూడదు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా పలు పాఠశాలలు వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పేర్లను చూసి తల్లిదండ్రులు మోసపోతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ అధికారులకు పాఠశాలలు తెరిచినా ఇంకా సెలవు మత్తులో నుంచి మేలుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్‌కేజీకే ఎంబీబీఎస్ ఫీజులు : కొత్తగా పిల్లలను పాఠశాలలో చేర్పించే తల్లిదండ్రులకు పాఠశాలల యాజమాన్యాలు చుక్కలు చూపిస్తోంది. తమ పాఠశాలలో అత్యాధునిక వసతులున్నాయంటూ ఎల్కేజీకి ఎంబీబీఎస్ ఫీజులను వసూలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్కేజీ పిల్లలకు ఏడాదికి సుమారుగా రూ.10వేలు ఫీజు, దీనికి తోడు డొనేషన్, అడ్మిషన్ ఫీజు, పుస్తకాలు, వ్యాను, యూని ఫాం, బూట్లు, షాక్సులంటూ అదనంగా మరో రూ.10వేలు వరకు దండుకుంటున్నారు. కార్పొరేట్, సెంట్రల్ సిలబస్ స్కూళ్లలో భారీ స్థాయిలో వసూలు చేస్తున్నారు. 1నుంచి 5వ తరగతి వరకు దాదాపు ఏడాదికి రూ.50వేలుకుపైగా ఖర్చవుతోంది. 6నుంచి 10వ తరగతి వరకు ఏడాదికి సుమారుగా రూ.60నుంచి రూ.80వేలు వరకు తల్లిదండ్రులు ఖర్చు పెట్టాల్సి ఉంది. సంఘంలో గౌరవం కోసం స్తోమతకు మించి ఫీజులు చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అర్హత లేని వారితో విద్యాబోధన : వేలాది రూపాయలు ఫీజుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు దానికి తగ్గ ఉపాధ్యాయులను నియమించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో విద్యాబోధనలో అనుభవం, అర్హత లేని వారికి నామమాత్రపు వేతనాలతో సరిపెట్టుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పాఠశాలల నోటీసు బోర్డులో ఉపాధ్యాయుల అర్హత, ఫీజుల వివరాలు, పాఠశాల గుర్తింపు వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేకపోయినా యథేచ్ఛగా పాఠశాలలు నడుపుకుంటున్నాయి. -
ఆకాశయానంలో పేదరాలు.
-
మధ్యతరగతి మౌనం వీడాలి
విశ్లేషణ - కొత్త కోణం ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. కార్పొరేట్ రంగం నేడు వేగంగా గ్రామాలను, వ్యవసాయాన్ని, కులవృత్తులను ధ్వంసం చేస్తోంది. దళితులు, గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. మేధావులంటే పండితులే కావాల్సిన అవసరంలేదు. పండితులంతా మేధావులూ కానవసరంలేదు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగి, అవస రమైతే అధికారాన్ని ప్రశ్నించగలిగిన వారే మేధావులు. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ఇటీవల ఒక సభలో పాండిత్యం ఉంటే మేధావులు అవుతారనేది అబద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రముఖ జర్నలిస్టు నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం చేస్తూ ఆమె భారత మేధావుల తీరు పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అధికారాన్ని ప్రశ్నించకపోవడం దేశ ప్రగతికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అది కేవలం ఆందోళన మాత్రమే కాదు పచ్చి వాస్తవం కూడా. చనిపోవడానికి ముందు సోక్రటీస్ ప్రశ్నించేవాడే మేధావి పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మొదలుకొని ఎంతో మంది మేధావులు అధికారాన్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించే హక్కు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డారు. మన దేశంలో ప్రత్యక్షంగా అలాంటి ధిక్కార సంప్రదాయానికి గౌతమ బుద్ధుడిని మూలపురుషునిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అల్లకల్లోలం రాజ్యమేలు తున్న కాలంలో ఆయన అందుకు కారకులైన వారిని నిలదీ శాడు. అంతేకాదు ప్రత్యామ్నాయాలను చూపి, సమాజ విముక్తికి మార్గం చూపించాడు. బౌద్ధం ఆ రోజుల్లో ఒక విప్లవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రశ్నించడంతోనే బుద్ధుడి సామాజిక జీవితం మొదలైంది. ఆయన వృద్ధుడిని, రోగిని, శవాన్ని, పేదవాడిని చూసి సన్యాసం తీసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథ అసత్యం. ఆయన జన్మించిన శాక్య తెగకు, పొరుగున ఉన్న కొలియ తెగలకు మధ్య రోహిణి నది నీటి కోసం ఘర్షణలు సాగేవి. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఆయన దేశం వదిలిపెట్టి పోవాల్సివచ్చింది. ఆ విధంగా ఇంటిని వదలిన గౌతముడు సమాజాన్ని ఆకళింపు చేసు కొని, పరిష్కార మార్గాలను కనుగొని బుద్ధుడిగా మారాడు. ఆయన ఆరోజు శాక్య గణసభను ప్రశ్నించి ఉండకపోతే, సుఖాలను త్యజించి సమాజం కోసం తపించకపోతే ఏం జరిగేదో చెప్పలేం. అదేవిధంగా భారత స్వాతంత్య్ర పోరా టానికి పునాదులు వేసిన దాదాభాయి నౌరోజి, మహదేవ్ గోవింద్ రనడే లాంటి వారి ప్రశ్నల కొడవళ్లే భారత జాతిని జాగృతం చేశాయి. ఆ ప్రశ్నల నుంచే గాంధీ నెహ్రూ లాంటి నాయకులు ఉద్భవించారు. భారత కుల సమా జాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించిన అంబేద్కర్ అంటరానితనాన్ని రూపు మాపకపోతే ఈ సమాజానికి నిష్కృతిలేదని భావించారు. ధైర్యంగా దాన్ని ధిక్కరించారు, తిరుగుబాటు చేశారు. లేకపోతే మన రాజ్యాంగం అంటరాని తనాన్ని నిషేధించి ఉండేదేకాదు. చరిత్రనిండా మేధావులు అధికారాన్ని, అధి కార భావజాలాన్ని ధిక్కరించిన ఉదాహరణలెన్నో. సమాజం నేడు ఈ స్థాయి లో అభివృద్ధి చెందడానికి కారణం ఎందరో మేధావులు చేసిన త్యాగాలే. పన్నులు కట్టే దెవరు? రాయితీలు ఎవరికి? మేధావులకు ఒక ముఖ్యవనరు అయిన మధ్యతరగతి నేడు సమాజ శ్రేయస్సు గురించిగాక, తమ బాగుకోసం మాత్రమే ఆలోచిస్తోంది. అంతేకాదు, దేశ సంపదను, వనరులను గుప్పిట పట్టిన కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, సమాజంలో నిరాదరణకు గురవుతున్న, వివక్షకు బలౌతున్న వర్గాల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ ధోరణి మరింతగా పెరిగింది. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్యతరగతి వర్గాన్ని మార్కెటీకరణ వెలుగు జిలుగులు అమితంగా ఆకర్షిస్తు న్నాయి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వర్గాలు మరింతగా వ్యక్తిగత ప్రయో జనాలకు అంటిపెట్టుకునేలా వారికి రాయితీలను ఇస్తున్నాయి. ఇటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతికి మధ్యన పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నా యి. ఇటీవల జరిగిన ఒక సర్వేలో దేశంలోని నూటికి 80 శాతం మంది కేవలం రోజుకు 25 రూపాయల ఆదాయం, ఖర్చుతో జీవిస్తున్నట్టు తేలింది. దీన్ని బట్టి దేశంలోని పేదల జీవన విధానానికి, సంపన్నుల జీవన విధానానికి మధ్యనున్న అంతరం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో తేలిపోతోంది. ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నాటి నుండి నేటి వరకు మేధావులు, పట్టణ మధ్య తరగతి వర్గాలు విమర్శలను గుప్పిస్తూనే ఉన్నాయి. నిజానికి అర్హులైన కూలీ లలో సగం మంది మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయో గించుకున్నవారికి కూడా నిర్దేశించిన దానిలో సగం దినాలు మాత్రమే పని లభించిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అదేవిధంగా ఆహార భద్రతా చట్టం విషయంలోనూ మధ్యతరగతి చాలా తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిం ది. కొందరు దీన్ని ప్రజాధన దుర్వినియోగం అన్నారు. మరికొందరు తాము కడుతున్న పన్నులతో ఖజానాకు సమకూరిన ధనాన్ని సంక్షేమ కార్యక్రమాల పేరిట వృథా చేస్తున్నారని వాపోయారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అవు తుంది. నిజానికి పన్నులు కడుతున్నదెవరు? ప్రయోజనం పొందుతు న్నదెవరు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మధ్యతరగతి, ధనికులు ప్రత్యే కించి చెల్లించే ఆదాయం పన్ను కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే. మిగిలిన 85 నుంచి 90 శాతం రాబడి ప్రజలందరూ కొనుగోలు చేసే వస్తువుల మీద వేసే కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా చేకూరుతోంది. అం దులో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్య తరగతుల నుండే వస్తోంది. నిజా నికి పన్నుల్లో అధిక భాగాన్ని చెల్లిస్తున్న 80 శాతం జనాభా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు బాగా తక్కువగా ఉంటోంది. కానీ ఎక్కువ భాగం కార్పొరేట్, ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల సౌకర్యాల కోసమే ఖర్చవుతోంది. అందుకే మధ్యతరగతి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోంది. రంగుల కలల నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం మూడు కాలాలు పచ్చగా ఉండే పంట పొలాలను ధ్వంసం చేసి వేలాది మంది పల్లె ప్రజలను వీధుల్లోకి గెంటేస్తుంటే పల్లెల నుండి ఎదిగి వచ్చిన మధ్యతరగతి ధనిక వర్గాలు సైతం మౌనం వహిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ పట్ల కూడా ఈ వర్గాల్లో కదలిక లేకపోవడం విచారకరం. ఇది భవిష్యత్తులో చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తేనే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. ఇది మొత్తం సమాజ పురోభివృద్ధినే దెబ్బతీస్తుంది. అందుకే మధ్యతరగతి పై అంతస్తులకు ఎదిగిన వర్గం పాలకులను ప్రశ్నించడం అవసరం. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆధిపత్యాన్ని నెరపుతున్న కార్పొరేట్ రంగం మధ్యతరగతి వర్గానికి కొన్ని తాయిలాలు ఇస్తూ వారిలోని ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రభావం తాత్కాలికమే. ఇదే మధ్యతరగతి వర్గం సమాజంలో సాగుతున్న అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇటీవల సాగిన తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి వర్గం నిర్వహించిన పాత్ర కీలకమైనది. అయితే భవిష్యత్తులో, తెలంగాణ నిర్మాణంలో కూడా వారు అదే పాత్రను పోషిస్తారో, లేదో చూడాల్సిందే. గ్రామాల్లోని రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను కార్పొరేట్ రంగం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామాలను, వ్యవసాయాన్ని, కుల వృత్తులను ధ్వంసం చేసే పనిని కార్పొరేట్ రంగం అతివేగంగా సాగిస్తోంది. అదే సమయంలో తరతరాలుగా అంటరానితనానికి గురైన దళితులు, సమాజానికి దూరంగా బతుకుతున్న గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారాలంటే కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ నం: 9705566213 -
ఆదాయపన్ను పరిమితి పెంచే చాన్స్?
జీతాల మీద బతికే వేతనజీవులు, మధ్యతరగతి ప్రజల మీద పన్నుల భారం మరీ ఎక్కువగా పడకుండా ఉండేందుకు ఆదాయపన్ను పరిమితిని పెంచే యోచనలో ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. పన్నుల రూపేణా వాళ్ల దగ్గర నుంచి సొమ్ము లాక్కోవడానికి బదులు వాళ్ల జేబుల్లోనే ఎక్కువ డబ్బు ఉండనిస్తే.. వాళ్లు మరింత ఖర్చుపెట్టే అవకాశం వస్తుందని, తద్వారా పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని జైట్లీ అన్నారు. దీనివల్ల పన్నుల విస్తృతి మరింత పెరగుతుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సమానంగా పరోక్షపన్నులు కడతారని, తాను గానీ, తన అటెండర్ గానీ ఎవరు ఏది కొన్నా ఒకే స్థాయిలో పన్ను కట్టాల్సి ఉంటుందని చెప్పారు. వాడకం ఎక్కువయ్యే కొద్దీ కట్టే పన్ను పెరుగుతుందని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ పరోక్షపన్నులు చెల్లిస్తూనే ఉంటారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే మొత్తం చెల్లించే పన్నుల్లో సగానికి పైగా పరోక్షపన్నులేనని జైట్లీ వివరించారు. ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, సేవాపన్ను.. అన్నీ అందరూ తెలియకుండానే కడతారని తెలిపారు. ఇక ఆదాయపన్ను విషయానికొస్తే.. ఇన్నాళ్లూ పన్ను కట్టకుండా ఎగ్గొట్టేవాళ్లను కూడా పన్ను పరిమితిలోకి తేవడానికే దాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరిలో ఆయన తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. గత బడ్జెట్లో ఆదాయపన్ను పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. -
ఆటకు సిద్ధం
బిజీ సిటీలైఫ్‌లో బతుకమ్మను పేర్చే తీరిక ఎవరికుంది. ఓపిక కూడదీసుకుని బతుకమ్మను తీర్చిదిద్దాలన్నా.. పెరిగిన ధరలతో ఆకాశంలో ఉన్న పూలను మధ్యతరగతి మగువలు అందుకోలేకపోతున్నారు. వీరి కోసమే.. వచ్చాయి రెడీమేడ్ బతుకమ్మలు. గంటలకు గంటలు కూర్చొని బతుకమ్మను తయారు చేసే పనిలేకుండా.. తీరొక్క రీతిగా ముస్తాబైన ఆర్టిఫిషియల్ బతుకమ్మలు అంగట్లో దొరుకుతున్నాయి. పూల పండుగ బతుకమ్మను మధ్యతరగతి కుటుంబీకులు జోష్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్న పూల ధరలు.. మిడిల్‌క్లాస్‌కు బతుకమ్మ సంబురాల్ని భారంగా మారుస్తున్నాయి. చటాక్ పూలకు రూ.70 వరకూ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వర్గానికి వరమే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ. దీనికి గంపలకొద్దీ పూలు అక్కర్లేదు. ఇంట్లో వృథాగా ఉన్న కార్డ్బోర్డ్, చవకగా దొరికే థర్మాకోల్, పేపర్ పూలు, వెజిటబుల్ కలర్స్‌తో తయారైన కాగితం పూలతో ఈ బతుకమ్మ తయారు చేయొచ్చు. డిజైనర్ బతుకమ్మలు ఈ మధ్య నగరవాసులు ప్రతీదానికి డిజైనర్ సెలెక్షన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మల విషయంలో కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ మెథడ్‌తో అలాంటి డిజైనర్ బతుకమ్మల తయారీ వెరీ ఈజీ. ఖర్చు కేవలం 60 రూపాయలే. రోజుకో రకం తయారు చేసుకోవచ్చు. లేదంటే ఒకే బతుకమ్మను తొమ్మిది రోజులూ పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున సిటీలోని ప్రధాన కూడళ్లలో నిలువెత్తు రెడీమేడ్ బతుకమ్మలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. షాిపింగ్ మాల్స్ దగ్గర్నుంచి ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కడైనా.. ఈ రెడీమేడ్ బతుకమ్మలను అలంకరించుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ పండుగ సందర్భంగా ఈ రెడీమేడ్ బతుకమ్మలను తయారుచేసే వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రకృతికి నో ఫికర్ ఈ రెడీమేడ్ బతుకమ్మలతో పర్యావరణానికి ఎలాంటి చేటు ఉండదంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అరుణ్‌జ్యోతి ఎస్ లోఖండే. థర్మకోల్, కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదంటున్నారామె. తొమ్మిది రోజుల పండుగ అయిపోయాక ఈ రెడీమేడ్ బతుకమ్మను ఇంట్లోనే అలంకరించుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ప్రకృతిని కాపాడినవారం అవుతామంటున్నారు అరుణ్‌జ్యోతి. డబ్బుకి డబ్బు ఆదా.. ‘పూల కాస్ట్ ఎక్కువైపోయింది. మూడు వందలు పెడితేకాని పావుకిలో పూలు రావట్లేదు. ఆ పూలతో బుజ్జి బతుకమ్మే తయారవుతోంది. పదిమందిలో ఆడేటప్పుడు కాస్త ఆకర్షణగా ఉండాలంటే కనీసం రూ.1,500 ఖర్చు చేయాల్సిందే. తొమ్మిది రోజులూ అంత డబ్బంటే మాటలుకాదు. అందుకే ఈ రెడీమేడ్ బతుకమ్మలను కొనుక్కుంటున్నాం. డబ్బుకి డబ్బు ఆదా.. శ్రమా అదా.. పండుగ చేసుకున్న భాగ్యమూ దక్కుతోంది’ అని చెప్పింది ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సరిత. జ్ఞాపకంగా.. ‘రేట్ లెక్కచేయకుండా పూలు కొని బతుకమ్మను పేర్చినా అందరూ వచ్చి ఆడేసరికి ఆ పూలు వాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ ఎంత లేటయినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండుగ అయిపోయినా ఓ జ్ఞాపకంగా షోకేస్‌లో దాచుకోవచ్చు’ అని వివరించింది అన్నానగర్ నివాసి మహేశ్వరి. -
ఫ్యామిలీ బడ్జెట్
ఇంటి బడ్జెట్ ను నిర్వహించే గృహిణుల ముందు ఎంతటి ఆర్థిక మంత్రులైనా బలాదూరే! ప్రభుత్వ బడ్జెట్లో విశేషంఏముంటుంది? ముందుగా ఖర్చుల చిట్టా తయారు చేసుకోవడం, దానికి తగ్గ ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రజల ‘పన్ను’లూడగొట్టడం తప్ప! ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి సుంకాల వంటి వంకలు చాలానే ఉంటాయి. సామాన్యుల బడ్జెట్ అలా కాదు కదా! ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులకు కత్తెర వేసుకోవాలి. సర్కారు వారి దయ వల్ల ‘ప్రత్యక్షం’గా.. ‘పరోక్షం’గా ‘పన్ను’పోటును పంటి బిగువున భరించాలి. నిత్యావసరాల ‘ధరా’ఘాతానికి విలవిల్లాడుతూనే బతుకు బండిని నెట్టుకు రావాలి. సంసారమంటే అంతటితోనే సరిపోతుందా? కానే కాదు! ఎప్పటికప్పుడు వచ్చిపడే అవసరాలుంటాయి, ఆపదలు ఉంటాయి. అనుకోకుండా జబ్బుచేస్తే చాలు, డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతుంది. నెలాఖరుకి చేతిలో చిల్లిగవ్వ మిగలడమే గగనం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇంటిని నడిపేందుకు గృహిణులు అక్షరాలా ‘ఫ్యామిలీ సర్కస్’ చేస్తున్నారు. మిడిల్‌క్లాస్ పిసినారులం.. నా పేరు ప్రమీల. ఎస్సార్ నగర్లో ఉంటాం. మొన్న నాగార్జున ఇంటర్వ్యూలో నెలకు నాలుగు వేలు సంపాదించేవారు కూడా ఉన్నారట అని బాధపడటం చూశాను. మా అబ్బాయికి నాలుగు వేలే వస్తాయి. వాడికి పెళ్లయ్యింది. పిల్లలు. నేనూ. అందరం కలసి సొంతింట్లో ఉంటాం. కానీ నాలుగు వేలతో బతగ్గలమా? నేను స్కూల్ టీచర్‌గా పని చేస్తూ ఆరు వేలు తెస్తున్నాను. చిన్న పోర్షన్ అద్దెకిస్తే మూడువేలు వస్తున్నాయి. అంతా కలిపి పదిహేను వేలు కూడా కావు. కానీ మాకు కనీసం పదిహేను వేలు కావాలి. సరుకులకు ఐదారు వేలు. కాయగూరలకు మూడు వేలు. పాలకు 1,500, కరెంటు బిల్లు 1,500, పేపరు కేబులూ.. మంచినీళ్లు కూడా కొనుక్కోవాలి. అదో 500. మా అబ్బాయికి, నాకు పెట్రోలు ఖర్చు ఐదారువేలు దాటుతోంది. పైగా నేను ఆస్తమా పేషెంటుని. నెలకు వెయ్యి ఖర్చు చేయకపోతే ఊపిరాడదు. ఇక పిల్లలకు జ్వరం, జలుబు అంటే నాలుగైదు వందలు పోతాయి. ఇవి కాకుండా పండుగలు, బంధువులు వస్తే గుడ్లు తేలేయాల్సిందే. సినిమాలకు, షికార్లకు వెళ్లకుండా ప్రతి రూపాయిని అత్యవసరానికి ఖర్చు పెట్టుకుంటూ మహా పిసినారుల్లా బండిలాగాల్సి వస్తోంది. లేదంటే ఏడాది తిరిగే లోపు ఇంటి ఖర్చులకే లక్షల అప్పులు చేసి అవి తీర్చలేక జబ్బులు తెచ్చుకుంటున్నవారున్నారు. ఆడవాళ్లు ప్రతి ఒక్క ఖర్చు దగ్గరా మగవారితో పోట్లాడుతూ ఇంటిని రావణకాష్టం చేసుకోవడం కూడా చూస్తున్నాను. ఇవి బతుకులా అండీ.. ఎప్పటికి మనం బాగుపడగలం. బంధువుల్ని ఇంటికి రాకుండా ఆపగలమేమో .. చెప్పా పెట్టకుండా వచ్చే రోగాల్ని ఆపగలమా? జాలి, కనికరం లేకుండా గుంజే డాక్టర్లను మార్చగలమా. ఏదో బతికేస్తున్నాం కానీ.. నా మటుకు ఇది పెద్ద వండరేనండీ. ప్రభుత్వాలు మన చేత చేయిస్తున్న సర్కస్ ఇది. - ప్రమీల, టీచర్, ఎస్సార్ నగర్ ఇవాళ జీతమొస్తే... నిన్నే అయిపోతుందండీ చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుందండీ. ఐదు వేలంటే.. అదొక జీతమా అండీ? ఎన్నిసార్లు లెక్కెట్టినా ఐదే ఉండే ఆ వెయ్యి కాగితాల్ని చూసి ఒక్కోసారి ఏడుపొచ్చేస్తదండీ. మా ఆయన వాచ్మెన్ అండీ. మాదాపూర్ అయ్యప్పకాలనీలో అపార్ట్మెంట్లోనండీ. అందులోనే మాకో గదిచ్చారు. నేనూ మా ఆయన. మాకిద్దరు ఆడపిల్లలండీ. ఒకదానికి పెళ్లయ్యిందండీ. ఇంకోదానికి ఎప్పుడూ ఒళ్లు బాగోదండీ. మా ఆయన ఐదు సంపాదిస్తాడు. అదే మూలకండీ? నేనూ ఒళ్లొంచి నాలుగిళ్లలో పని చేసి ఒక మూడు వేలు సంపాదిస్తానండీ. అంటే మొత్తం ఎనిమిది. వాచ్మెన్ గాబట్టి ఇంటద్దె, కరెంటు లేకపోయినా మిగతావన్నీ ఆ ఎనిమిదితోనే సరిపెట్టుకోవాలండీ. కానీ ఎలాగండీ? బ్రహ్మదేవుడిక్కూడా సాధ్యపడదండీ. ఇంటి సరుకులకే మూడు వేలా? కాయగూరలకు వెయ్యి. ఆసుపత్రికి నెలకీ, రెండు నెలలకీ వెయ్యో.. రెండు వేలో దోసిట్లో పోసి రావలసిందే కదండీ. ఇంక ఎవరైనా చుట్టాలొస్తే చికెనో మటనో అంటారు. ఏమున్నా లేకపోయినా మర్యాదలు తప్పవు కదండీ. అదో ఖర్చు. పెళ్లి చేసి పంపాక చేతులు దులుపుకున్నట్టు కాదుగదండీ. ఆడపిల్ల అమ్మగారింటికి రాకుండా ఎట్టా కుదురుద్దండీ? అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి వస్తూపోతుండాల్సిందే. మనమరాలికి అంతో ఇంతో ఖర్చు పెట్టాల్సిందే. ఆ మధ్యన ఊరి నుంచి చుట్టాలొచ్చి సిన్మాకెల్దాం అన్నారు. మనింటికొచ్చిన చుట్టాలతోటి మనం టికెట్టు పెట్టిస్తామా? అయ్యో.. వొదినా ఈ ఊళ్లో టికెట్లు మూడ్రోజుల ముందే ఇచ్చేస్తారు అని తప్పించుకున్నామండీ. అసలు మాటేమిటంటే అండీ.. ఈ బతుకులో సినిమా సాధ్యమా అండీ. ఊరుగాని ఊళ్లో బతుకుతున్నాం. సొంత ఊరి నుంచి ఎప్పుడు ఏ కబురొస్తుందో అని ఎప్పుడూ ఒకే దడండీ. ఒక మంచికైనా.. ఒక చెడ్డకైనా పోవాల్సిందే కదా. పోవాలంటే ఎవరి దగ్గరైనా చార్జీలకు చేయి సాపాల్సిందే కదా. ఆదాయం పది రూపాయలు పెరిగితే .. ఖర్చులు పాతిక రూపాయలు పెరుగుతున్నాయి. పోనీ ఈ పని కాదు ఇంకో పని చేసుకుందాం అంటే.. బయట అద్దెలు చూశారు గదండీ. అవి అద్దెలు కాదండీ మాలాంటోళ్లని మింగేసే అగ్గిగుండాలు. ఇదండీ మా బతుకు. ఎవరితో చెప్పుకుంటామండీ. మీతో చెప్పుకుందామంటే మీకేమైనా తక్కువ బాదుంటాదా అండీ! - లక్ష్మి, వాచ్మెన్ భార్య, మాదాపూర్ మినిమమ్ 25 థౌజండ్స్ ఈ సిటీలో ఓ సామాన్యుడు అప్పు లేకుండా బతకాలంటే తక్కువలో తక్కువ పాతికవేలు కావాలి. అంతకు తక్కువ సంపాదిస్తున్నాడంటే అతడు అశాంతితో ఉన్నాడనే. నేను చూస్తున్నాను కదా.. మా ఇంట్లో ఎంత జాగ్రత్తగా చేసినా నెలకు పాతిక వేలు అవుతోంది. నా పేరు సునంద. క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాను. భర్త చనిపోయాడు. ఈ మధ్యనే కోడలు కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలు, మనవలతో ఇంట్లో ఐదుగురం ఉంటాం. ఇంటి అద్దె ఆరువేల రూపాయలు. రేషన్ పది వేలవరకూ అవుతుంది. కాయగూరలు మూడు వేలు, కరెంటు బిల్లు రెండు వేల రూపాయలు. పాలకు 1,500. పేపరు, కేబుల్, వాటర్ బిల్లులు 600 వరకూ ఉంటాయి. జ్వరం, జలుబులైతే నెలకు ఐదారొందలవుతుంది. ఏదైనా చిన్న చిన్న వైద్యాల అవసరం పడిందంటే నెలకు రెండు మూడు వేలకు పైగా ఆసుపత్రి ఖర్చు ఉంటుంది. ఇవి కాకుండా పండుగలపుడు, బంధువులొచ్చినపుడు ఖర్చు నాలుగైదు వేలకు తక్కువవదు. మా ఇంట్లో సినిమాలకు, షికార్లకు పెద్దగా వెళ్లం కాబట్టి సరిపోతుంది. లేదంటే వాటి బిల్లులు కూడా తక్కువగా లేవు. మా పక్కింటివారు ఎప్పుడు ఐమాక్స్ వెళ్లొచ్చినా వెయ్యి నుంచి పదిహేను వందలవుతుందని చెబుతుంటారు. ఇక ఏడాదికి నాలుగైదు సార్లయినా షాపింగ్ తప్పదు. అలాంటివాటికి పొదుపు చేసిన డబ్బునే వాడుతుంటాం. ఒక్కోసారి బడ్జెట్ దాటితే మాత్రం వచ్చే నెల లోటు బడ్జెట్‌కి సిద్ధపడాలి. - సునంద, క్యాటరర్, సనత్‌నగర్. రెండు పదుల పేదవాడు... మొన్నటివరకూ పాతికవేల జీతమంటే ఉన్నవాడి కింద జమకట్టేవారు. ఇప్పుడది పేదవాడి బడ్జెట్‌గా మారిపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని భయమేస్తుంది. భర్త చేతినిండా సంపాదిస్తున్నా.. ఇచ్చిన రూపాయిని ఎలా ఖర్చుపెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియక అయోమయంలో పడుతున్న మహిళల ఇబ్బంది గురించి నాకు బాగా తెలుసు. నేను సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. ఇంటి సరుకులు స్వయంగా వెళ్లి కొనుక్కుంటాను. వంట సరుకులకు ఒకో నెల పదివేలవుతుంది. ఉన్నట్టుండి బిల్లు పదిహేనువేలు వస్తుంది. చెప్పాపెట్టకుండా.. పెరిగే ధరలు మాకే ఇబ్బంది కలిగిస్తే.. సామాన్య మహిళల సంగతేంగాను. ఆ మధ్యనెవరో చెప్పారు.. ఉల్లిపాయల ధర పెరిగినపుడు ఉల్లివాడటం తగ్గించేస్తే సరి అని. నాకు నిజమేననిపించింది. అంతకంటే ఏం చేయగలం. ఉల్లిపాయ లేకుండా కూరలు వండితే వచ్చే నష్టమేమీ లేదు కదా! ధరలను ఎలాగూ నియంత్రించలేం. కనీసం ఖర్చుల్లోనైనా రూపాయి, రెండు రూపాయలు మిగుల్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. చీటికీ మాటికీ ఆస్పత్రి బాటపట్టకుండా పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అకస్మాత్తుగా వచ్చే జబ్బులు వస్తూనే ఉంటాయి. పెద్ద జబ్బుల వైద్యం ఖర్చు భరించే శక్తి సామాన్యులకు కాదు కదా.. ఓ మోస్తరువారు కూడా తట్టుకోలేకపోతున్నారు. పేదలు, సామాన్యుల వైద్యం కోసం, ఆహారం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. పేదవాడికి మిగిలేది అర్ధాకలి, అర్ధాయుష్షు! విద్యను కూడా లక్షలు పోసి కొనుక్కునే పరిస్థితి పేదవాడ్ని మరింత కుంగదీస్తోంది. - జయసుధ, మాజీ ఎమ్మెల్యే -
జైట్లీ బడ్జెట్‌కి మధ్య తరగతి జై కొట్టేనా?!
-
భారీగా పెరిగిన రైలు టికెట్ల ధరలు
-
గెట్ల కొనాలే..!
ఒక వంక కాయగూరలు కాగుతున్నాయి. పప్పు దినుసులు మండుతున్నాయి. నేనేం తక్కువా అంటూ బియ్యం ధరలూ చుక్కలను తాకుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులను వెక్కిరిస్తున్నాయి. కళ్లెం వేసేవారు లేక అంతా దిక్కులు చూస్తున్నారు. ఆకలి చంపుకోలేక ఉన్న ధరకే కొని పరేషానవుతున్నారు. నానాటికీ బతుకులు దుర్భరమవుతుంటే బాధ పడుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణ బియ్యం (దొడ్డు) రకం ఒక మోస్తారుగా పెరుగుతుండగా.... సన్నరకం ధరలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా రెక్కొలొస్తున్నాయి. రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాల కథనం. పౌరసరఫరాల అధికారుల నిఘా సరిగ్గా లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరల పెరుగుదలకు దాచుకున్న బియ్యం నిల్వలే కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మిగతా జిల్లాలను పోల్చుకుంటే పాలమూరులో బియ్యం ధరల పెరుగుదల తక్కువగా ఉందని అధికారులు పేర్కొంటున్నప్పటికీ... వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. జిల్లాలో ఏప్రిల్ మాసంలో పాత సన్నరకం బియ్యం (సోనామసూరి) క్వింటాల్ ధర రూ.4,200ల నుంచి రూ.4300ల వరకు ఉండగా ప్రస్తుతం ఆధర రూ.4400 నుంచి రూ.4500 వరకు పెరిగింది. ఒక క్వింటాల్ బియ్యం ధర నెలరోజుల వ్యవధిలోనే రూ.200ల వరకు పెరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొత్త సన్నరకం బియ్యం క్వింటాల్ ధర రూ.3000 నుంచి రూ.3100 ఉండగా ప్రస్తుతం ఆ ధర రూ.3300ల నుంచి రూ.3400ల వరకు పలుకుతోంది. దొడ్డురకం బియ్యంలో కూడా పెరుగుదల సృష్టంగా కనిపిస్తోంది. పాతవి దొడ్డురకం బియ్యం ఏప్రిల్‌లో క్వింటాల్ ధర రూ.2900ల నుంచి రూ.3000 ఉండగా ప్రస్తుతం రూ.3,100 ధర పలుకుతోంది. దొడ్డు రకం కొత్త్త బియ్యం ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది బియ్యం పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వచ్చి ఉన్నట్లయితే బియ్యం ధరలు పెరిగి ఉండేది కాదని కొంత మంది వ్యాపార వర్గాలు పేర్కొంటున్నారు. జిల్లాలోని పలువురు పెద్ద వ్యాపారులు, ముఖ్యంగా మిల్లర్లు కావాలని మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
మళ్లీ పెట్రో పిడుగు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మళ్లీ పెట్రో పిడుగు పడింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ధరలు పెంచేస్తున్నారు. జూన్ 16, 29, జూలై 15, ఆగస్టు 1, 31వ తేదీల్లో వరుసగా పెట్రోల్ ధరలు పెరిగాయి. నెల రోజులు గడువక ముందే మరోసారి భారీ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. తాజాగా పెట్రోల్‌కు లీటర్‌పై రూ.2.50, డీజిల్‌పై 50 పైసలు పెరి గింది. వీటికి పన్నులు అదనం కానున్నాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుంది. జిల్లాపై రూ.97.50 లక్షల భారం.. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వల్ల అదనంగా వాహనదారులు 97.50 లక్షల భారం భరించవలసి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు 76.87 పైసలు, డీజిల్ రూ.55.01పైసలు ఉంది. పెరిగిన ధరలతో పెట్రోలురూ.80, డీజిల్56 రూ పాయలు కానుంది. జిల్లా వ్యాప్తంగా 62 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటిలో రో జుకు సుమారు లక్ష లీటర్ల పెట్రోలు, లక్షా 50వేల లీటర్ల డీజిల్ విక్రయమవుతుంది. -
చుక్కల్లో...మిర్చి, ఉల్లి ధర
భువనగిరి, న్యూస్‌లైన్: కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఉల్లిగడ్డ ధర ప్రస్తుతం రూ.50, మిర్చి రూ.64 పలుకుతుంది. దీనికి తోడు బియ్యం రేటు రోజురోజుకు పెరిగిపోతోంది. సంచుల్లో డబ్బులు తీసుకుపోయి జేబుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రాబోతుందన్న భయం జనాలను వెంటాడుతోంది. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కూరగాయలను పరిమితంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. నెల బడ్జెట్లో ఇప్పుడు కూరగాయలకు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. వారంలో రెండు రోజులు గుడ్లు, ఒక రోజు పప్పు, మరో రోజు చికెన్ లేదా మటన్, ఇలా సర్ధుబాటు చేసుకుని మిగిలిన రోజులకు కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. కలిగిన వారు సైతం కూరగాయలను ఫ్రిజ్‌ల నిండా నింపుకునే పరిస్థితికి టాటా చెప్పి మితంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక పేదలు చింతపులుసు, కారంతో రోజులు గడిపేస్తున్నారు. కూరగాయల పంటలు మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయి. ఈ దశలో మండిపోతున్న ధరలు రైతుల పంటలు మార్కెట్లోకి వ చ్చేటప్పుటికి ఉండడం లేదు. దీంతో రైతులు కూరగాయల ధరలపై నిరుత్సాహంగా ఉంటున్నారు. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు ఆశతో సాగు ప్రారంభిస్తున్నారు. భువనగిరి డివిజన్ పరిధిలో రైతులు పలు రకాల కూరగాయలు పండిస్తారు కానీ ఇప్పుడవన్నీ పంట దశలోనే ఉన్నాయి. రూ.42కు చేరిన సన్న బియ్యం బీపీటి పాత బియ్యం కేజీ రూ.42లకు చేరింది. నాలుగు నెలల క్రితం అత్యధికంగా కిలో రూ.30 పలికిన ఫైన్ బియ్యం ఇప్పుడు కిలోకు రూ.10 పైనే పెరిగింది. దీంతో పేద, మధ్యతరగతి, సామాన్య జనం సన్న బియ్యం కొనుగోలు చేయాలంటే ధరలు చూసి హడలిపోతున్నారు. సన్న బియ్యం ఆశను తీర్చుకోలేని జనం దొడ్డు బియ్యం, నూకలతోనే సరిపెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నారు. రూ.160లకు కిలో చికెన్ కిలో చికెన్ ధర రూ.140 నుంచి రూ.160లకు పెరిగింది. 15 రోజుల క్రితం వరకు రూ.130, రూ.140 కిలో ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.160కి చేరింది. శ్రావణమాసం అయినప్పటికీ చికెన్ ధరల పెరుగుదల ఆగడం లేదు. గత 15 రోజులుగా చికెన్ ధర ఇలాగే కొనసాగుతుంది. -
మండుతున్న కూరగాయలు
దర్శి, న్యూస్‌లైన్ : కూరగాయలు భయపెడుతున్నాయి. ఆకాశాన్నంటిన ధరలతో పేదలు బెంబేలెత్తుతున్నారు. ప్రస్తుత మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు కేజీకి *30 పైనే పలుకుతున్నాయి. పేదలు అధికంగా కొనుగోలు చేసే పచ్చిమిర్చి మూడు రోజుల క్రితం వరకూ కేజీ *20 అమ్మగా శుక్రవారం *60కు చేరింది. ఎప్పుడూ లేని విధంగా కాకర కిలో *40కి చేరటం గమనార్హం. పచ్చడి మెతుకులు కూడా తినలేకపోతున్నామని పేదలు వాపోతున్నారు. ఇక మధ్య తరగతి జనం కూరగాయలను పరిమతంగా కొనుగోలు చేసి పొదుపుగా వాడుకుంటున్నారు. ఫ్రిజ్‌ల నిండా కూరగాయలు నింపుకునే రోజులు పోయాయని గృహిణులు ఆవేదన చెందుతున్నారు. కనీసం *200 లేనిదే సంచి నిండటం లేదంటున్నారు. నెల బడ్జెట్లో కూరగాయలకు ఇప్పుడు అధికంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఒకరోజు పప్పు, రెండు రోజులు గుడ్లు వండుకుంటూ ఆదివారం మినహాయించి మిగిలిన రెండు రోజులకు మాత్రమే కూరగాయలు కొంటున్నారు. మరికొద్ది రోజుల్లో కొత్తగా పండిన కూరగాయలు మార్కెట్‌కు రానున్న తరుణంలో ధరలు మండిపోతున్నాయి. తీరా కూరగాయలు మార్కెట్‌కు వచ్చే సరికి ధరలు ఉండటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమైక్య ఉద్యమం సెగ ఇటీవల సాగుతున్న సమైక్య ఉద్యమాల ప్రభావం ధరల పెరుగుదలకు ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. సకాలంలో లారీలు రావడం లేదనే సాకుతో టోకు వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే లారీలను ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చే క్యారెట్, క్యాలీఫ్లవర్ సక్రమంగా సరఫరా కావటం లేదు. ఘాటెక్కిన మిర్చి పచ్చిమిర్చి సరఫరా తగ్గింది. మూడు రోజుల వరకు కేజీ *20 మించని ధర శుక్రవారం దర్శి మార్కెట్లో *60 పలికింది. చిల్లర దుకాణంలో పచ్చి మిరపగాయలు అమ్మటం మానుకున్నారు. ధర ఎక్కువగా ఉండటం.. కొనేవారు అంతరేటా అంటుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఊరటనిచ్చిన అల్లం గత వారం వరకు కేజీ అల్లం *250 నుంచి *300 పలికింది. ప్రస్తుతం ధర దిగివచ్చి కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం కిలో *100.