సాక్షి, హైదరాబాద్: దేశమేదైనా మధ్యతరగతి వివిధ రూపాల్లో నిర్వహించే పాత్ర ప్రత్యేకతను చాటుతు న్న విషయం తెలిసిందే. సమాజంలో కీలకమైన వ ర్గంగా పేరుబడిన ఈ నడిమి తరగతి క్రమంగా దే శాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. దీనికి తగ్గట్టు గానే భారత్‌లోని మధ్యతరగతి 2047 నాటికి అంటే దేశం స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తిచేసుకునే నాటికి మొత్తం జనాభాలో 61 శాతానికి చే రుకోబోతున్నట్టుగా అధ్యయనాలు చెపుతున్నాయి.
మనదేశంలో 2020–21లో 43.2 కోట్లున్న నడిమి తరగతి జనాభా 2030–31కల్లా 71.5 కోట్లకు, 20 47 నాటికి 102 కోట్లకు (ఆనాటికి... మొత్తం 166 కో ట్ల భారత జనాభాలో) పైగా చేరుకుంటుందని అంచనా వేస్తు న్నారు. ప్రస్తుతం 31 శాతంగా ఉన్న దేశ మిడిల్‌క్లాస్ వచ్చే పాతికేళ్లలో రెండింతలకు పైగా వృద్ధి నమోదు చేస్తుందని అంటున్నారు.
తాజాగా పీపుల్స్ రీసెర్చీ ఆన్ ఇండియాస్ కన్జుమర్ ఎకానమీ (ప్రైస్) ‘ద రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్‌క్లాస్’ నివేదికలో పలు ఆస క్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 25 రాష్ట్రాల్లోని 40 వేల కుటుంబాలకు పైగా చే సిన అధ్యయనం ఆధారంగా నివేదిక తయారు చేశారు.
ఇదీ నివేదిక...
దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగింపుతో పాటు ఆర్థిక సంస్కరణల అమలు ద్వారా ప్రతీ ఏడాది 6 నుంచి 7 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించడం కొనసాగిస్తే వచ్చే రెండు, రెండున్నర దశాబ్దాల కాలంలోనే భారత్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా అవతరిస్తుందని ఈ నివేదిక అంచనా వేస్తోంది.
ధనికవర్గం సంపాదించే ఆదాయం ఎక్కువగానే ఉన్నా...జనాభారీత్యా భారత మధ్యతరగతి సంఖ్యాపరంగా అధికంగా ఉన్నందున ఆర్థికరంగాన్ని నడిపించడంలో ఈవర్గం కీలకపాత్ర పోషించనుందని ఇందులో పేర్కొన్నారు. ఈ దశాబ్ది చివరికల్లా తక్కువ ఆదాయం ఆర్జించే వర్గం కాస్తా క్రమంగా నడిమితరగతిలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు.
మధ్యతరగతిలో భారీగా పెరుగుదల, ధనికుల క్రీమీలేయర్‌గా అత్యున్నత స్థాయిలో నిలవడంతో అల్పాదాయ, ఇతర కిందిస్థాయి వర్గాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. ఇదిలాఉంటే...2030–31 కల్లా దేశంలోని ‘సూపర్‌రిచ్ హౌస్‌హోల్డ్స్’ ఐదింతలు పెరగడంతో పాటు, ఈ వర్గాలు అధికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతాయని పేర్కొంది.
మధ్యతరగతి పరిగణన ఎలా?
మధ్యతరగతి అంటే ఏమిటి అన్న దానికి ప్రపంచవ్యాప్తంగాఒక స్పష్టమైన, ఒకేవిధమైన నిర్వచనమంటూ ఇంకా స్థిరపడలేదు. భారత్‌లో 2020–21 ధరల ఆధారంగా చూస్తే మాత్రం...ఏడాదికి రూ.1.09 లక్షల నుంచి రూ.6.46 లక్షల వార్షికాదాయం సంపాదించే వారిని లేదా కుటుంబ వార్షికాదాయంరూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్యలో ఉన్న వారినిమధ్యతరగతిగా పరిగణిస్తున్నారు.
నిపుణులేమంటున్నారంటే...
భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలు పెరిగేకొద్ది నడిమి తరగతి వర్గం(కేటగిరి) వృద్ధి చెందడం ద్వారా నాణ్యమైన వైద్య ఆరోగ్యసేవలు,విద్య, గృహ నిర్మాణరంగం, వినిమయ వస్తువులు తదితరాలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడం కోసం విద్య, వైద్యంపై మరింత ఫోకస్‌ను పెంచాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఏతావాతా చూస్తే...మధ్యతరగతి జనాభా పెరుగుదల ద్వారా 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ విధంగా భారత్ వృద్ధికి, పురోగతి విషయంలో మధ్యతరగతికీలకపాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment