బ్రిటీష్ సోషలిస్ట్, థైసోఫిస్ట్, మహిళా హక్కుల న్యాయవాది, హోమ్ రూల్ కార్యకర్త, భారతీయ జాతీయవాద ప్రచారకురాలు అనీ బిసెంట్ ప్రపంచంలో అనేక విధాలుగా గుర్తింపు పొందారు. ఐరిష్ మహిళ అయినప్పటికీ ఆమె జీవితంలో అనేక సైద్ధాంతిక మార్పులు వచ్చాయి. మొదట్లో క్రైస్తవ మతంలోని కొందరి చెడులను బహిర్గతం చేశారు. తరువాత ఆమె భారతదేశపు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలయ్యారు.
అనీ బిసెంట్ 1847 అక్టోబర్ 1న లండన్‌లో జన్మించారు. తండ్రి వైద్యుడైనప్పటికీ ఆయనకు గణితం, తత్వశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. ఆమె తల్లి ఐరిష్ కాథలిక్ మహిళ. ఆమె ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. చిన్నతనంలోనే ఫ్రాన్స్, జర్మనీ వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. 20 ఏళ్ల వయసులో రెవరెండ్ ఫ్రాంక్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే అతనితో సైద్ధాంతిక విభేదాల కారణంగా వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక 26 ఏళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, రచనా వ్యాసంగాన్ని చేపట్టారు.
1989లో ఆమె థియోసఫీ భావజాలం వైపు మొగ్గు చూపారు. మార్క్సిజం నుండి ఆస్తికవాదం వైపు మళ్లారు. థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలిగా చేరి, ప్రపంచమంతటా థియోసాఫీని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆమెకు భారతదేశానికి వెళ్లాలనే కోరిక కలిగింది. 1893లో భారతదేశానికి వచ్చిన ఆమె చెన్నైలో థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. దీనిని థియోసాఫికల్ సొసైటీ అడయార్ అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి: 375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
Comments
Please login to add a commentAdd a comment