Philosopher
-
ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు
‘దేవుడు చెడును ఆపాలని కోరుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే, అతను సృష్టి లయలను తన అధీనంలో ఉంచుకున్నవాడు కాదు. అతను సమర్థుడే, కానీ ఆపాలని కోరుకోవడం లేదా? అయితే అతను పగ, ద్వేషమూ గలవాడన్న మాట! అతను చెడును ఆపాలని కోరుకునేవాడు, పైగా సమర్థుడూ అయితే... మరి చెడు ఎందుకు రాజ్యమేలుతోందీ?– సమాధానం కావాలి! పోనీ, అతను చెడును ఆపాలని కోరుకోవడమూ లేదు – పైగా సామర్థ్యమూ లేదా? ఇక ఎందుకండీ ఆయనకు ఆ దేవుడనే బిరుదూ?’ అని ప్రశ్నించాడు ఎపిక్యురస్ (క్రీస్తు పూర్వం 341–270) అనే పురాతన గ్రీకు తత్త్వవేత్త. ‘ఎపిక్యురిజమ్’కు ఆయనే సిద్ధాంతకర్త. ఆయన రచనలు సుమారు మూడు వందల రాత ప్రతులున్నట్లు తెలిసింది. ఆయనపై డెమోక్రైటస్ అరిస్టిప్పస్, పైరో లాంటి వారి ప్రభావం ఉంది. ఎపిక్యురస్ బోధనలు తొలి దశలో సైన్సుకు ఆధారమయ్యాయి. ఎందుకంటే ఆయన రుజువుల్ని యథార్థాలనే నమ్మాలన్నాడు. క్రీ.పూ. 800–200 మధ్య కాలాన్ని ఏగియల్ యుగంగా పరిగణించారు. ఆ యుగంలో వైజ్ఞానిక ధోరణితో ఆలోచించి శాస్త్రయుగ కర్తగా నిలిచినవాడు ఎపిక్యురస్! గ్రీస్‌లో లాగానే ఇలాంటి ఆలోచనా ధోరణి గల వారు ఇండియా, చైనా, ఇరాన్ లాంటి దేశాల్లో ఉన్నారని కార్ల్ జాస్పర్స్ (1883–1969) అనే జర్మనీ తత్వవేత్త పరిశీలనలో తేలింది. ఆయన పరిశీలనల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ శకానికి పూర్వమే మన భారత్‌లో చార్వాకులు, హేతువాదులు విస్తరించి ఉన్నారు. సమాజానికి ప్రశ్నించడం నేర్పారు.ఎపిక్యురస్ ఆనాటి మేధావులందరితో విభేదించినా, డెమోక్రైటస్ (క్రీ.పూ. 460–370) వెలుగులోకి తెచ్చిన అటమిక్ థియరీని బలపరిచాడు. ఈ విశ్వం అతి సూక్ష్మమైన అణువులతో రూపొందిందనీ, అవి ఒకదానితో ఒకటి ఢీ–కొట్టుకుంటూ, విడిపోతూ, మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయనీ, ఇవి నాశనం కావనీ, వీటి వల్లనే ‘పదార్థం’ ఏర్పడుతుందనీ డెమోక్రైటస్ భావించాడు. ఈ ‘ఆటమిక్ థియరీ’ని ఎపిక్యురస్ గట్టిగా నమ్మాడు. అయితే డెమోక్రైటస్ ఈ సిద్ధాంతం తనదని చెప్పుకోలేదు. తనకు గురుతుల్యుడైన లుసిప్పస్ (క్రీ.పూ. 5వ శతాబ్దం) ప్రతిపాదించాడనీ, తను కేవలం ఆ ఆటమిక్ థియరీని వెలుగులోకి తెచ్చానన్నాడు. లుసిప్పస్ తత్వవేత్త. మెటాఫిజిస్ట్ ఆటమిక్ ధియరీ ఎవరిదైనా కావచ్చు. కానీ అది వాస్తవం! ఆనాడు డెమోక్రైటస్ ప్రభావం ఎపిక్యురస్ పైనే కాదు, ఆధునిక కాలపు కార్ల్మార్క్స్పైనా ఉంది. ఎపిక్యురస్‌కు కొంచెం అటు ఇటుగా దృష్టి సారిస్తే, మనకు మిలోస్‌కు చెందిన డయగోరస్, సైరిన్కు చెందిన థియడోరస్లు కనిపిస్తారు (క్రీ.పూ. 5వ శతాబ్దం) వీరిలో డయగోరస్ గ్రీకు కవి, హేతువాది. థియడోరస్ నాటి గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన పేరుతోనే ‘స్పైరల్ ఆఫ్ థియడోరస్’ అనే గణిత సూత్రం ఉంది. పశ్చిమాన పరిస్థితి అలా ఉంటే, మన తూర్పు దేశాల్లో బౌద్ధం, జైనం, టోయిజం వంటివి వ్యాపించి విగ్రహారాధనను నిరసించాయి. డయగోరస్ తర్వాత– థియడోరస్, యుథిమిరస్ వెలుగులోకి వచ్చారు. గ్రీస్‌లో నిరీశ్వర వాదం ఆ రోజుల్లో పెద్ద నేరం! తత్త్వవేత్త సోక్రటీస్ (క్రీ.పూ. 399)కు శిక్ష పడింది కూడా ఆ విషయం గురించే! నాటి సమాజం గుడ్డిగా నమ్ముతున్న దేవుళ్ళను సోక్రటీస్ తిరస్కరించాడు. అతని ప్రభావంలో పడి యువత చెడిపోతోందని పాలకులు అతనికి మరణశిక్ష విధించారు. ఆ ఆ శిక్షను నింపాదిగా, నిబ్బరంగా స్వీకరించాడు. ఫ్రెంచ్ విప్లవ నేపథ్యంలో యూరోప్‌లో హేతువాదం బాగా పుంజుకుంది. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం యూరోప్ సమాజంపై బాగా పడిన తర్వాత, విశ్వాసానికి – విశ్వసనీయతకు ఘర్షణ జరిగింది. క్రైస్తవ రహిత సమాజం రూపుదిద్దుకో నారంభించింది.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక ఉద్యమాల వల్ల అక్కడి సమాజంలో ‘స్వేచ్ఛాలోచన’ బాగా స్థిరపడింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 1917 రష్యా విప్లవం ప్రభావంతో సమాజంలో హేతువాదం బాగా పెరిగింది. అందువల్ల మార్క్సిస్టు – లెనినిస్టుల ప్రభుత్వం ఏర్పడింది. సమాజంలో హేతుబద్ధత పెంచాలంటే, లక్షల సంఖ్యలో కార్యకర్తలు నడుం బిగించాలి. వేల సంఖ్యలో రచయితలు కలాలు పట్టాలి. అప్పుడు గానీ, వైజ్ఞానిక స్పృహ గల ప్రభుత్వాలు ఏర్పడవు. అమాయకులంతా మాయమాటలు చెప్పే మోసగాళ్ళనే నమ్ముతారు. దీనికి పరిష్కారమెక్కడుందీ? వాస్తవాలు తెలుసుకోవడంలో ఉంది. నిజాల్ని జీర్ణించుకోవడంలో ఉంది. డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత -
అనీ బిసెంట్ భారత్ ఎందుకు వచ్చారు?
బ్రిటీష్ సోషలిస్ట్, థైసోఫిస్ట్, మహిళా హక్కుల న్యాయవాది, హోమ్ రూల్ కార్యకర్త, భారతీయ జాతీయవాద ప్రచారకురాలు అనీ బిసెంట్ ప్రపంచంలో అనేక విధాలుగా గుర్తింపు పొందారు. ఐరిష్ మహిళ అయినప్పటికీ ఆమె జీవితంలో అనేక సైద్ధాంతిక మార్పులు వచ్చాయి. మొదట్లో క్రైస్తవ మతంలోని కొందరి చెడులను బహిర్గతం చేశారు. తరువాత ఆమె భారతదేశపు ఆధ్యాత్మికత వైపు ఆకర్షితురాలయ్యారు. అనీ బిసెంట్ 1847 అక్టోబర్ 1న లండన్‌లో జన్మించారు. తండ్రి వైద్యుడైనప్పటికీ ఆయనకు గణితం, తత్వశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. ఆమె తల్లి ఐరిష్ కాథలిక్ మహిళ. ఆమె ఐదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. చిన్నతనంలోనే ఫ్రాన్స్, జర్మనీ వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె 17 సంవత్సరాల వయస్సులో తన తల్లి వద్దకు తిరిగి వచ్చింది. 20 ఏళ్ల వయసులో రెవరెండ్ ఫ్రాంక్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే అతనితో సైద్ధాంతిక విభేదాల కారణంగా వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక 26 ఏళ్లకే భర్తకు విడాకులు ఇచ్చి, రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. 1989లో ఆమె థియోసఫీ భావజాలం వైపు మొగ్గు చూపారు. మార్క్సిజం నుండి ఆస్తికవాదం వైపు మళ్లారు. థియోసాఫికల్ సొసైటీలో సభ్యురాలిగా చేరి, ప్రపంచమంతటా థియోసాఫీని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఆమెకు భారతదేశానికి వెళ్లాలనే కోరిక కలిగింది. 1893లో భారతదేశానికి వచ్చిన ఆమె చెన్నైలో థియోసాఫికల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు. దీనిని థియోసాఫికల్ సొసైటీ అడయార్ అని పిలుస్తారు. ఇది కూడా చదవండి: 375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది? -
మానవ గమనంలో ఒక మజిలీ
తుపాకి గుండు చేసిన కన్నాల ఆధారంగా నేరం ఎలా జరిగిందో ఊహించి, అన్వేషించి నిర్ధారణ చేయడం వంటిది – సైంటిఫిక్ మెథడ్! తొలిసారి సైన్స్ మెథడ్‌ను ప్రతిపాదించింది ఫ్రాన్సిస్ బేకన్! వైజ్ఞానిక పరిశోధనకు, అప రాధ పరిశోధనకూ సామ్యముంది. శాస్త్రవేత్త ఇన్వెస్టిగేటివ్ ఇన్స్పెక్టర్ లాంటి వాడే కానీ, అపరాధ పరిశోధక కథారచయిత వంటివాడు కాదు. కథా రచయిత ముందుగానే తన కథా పరిణామాన్ని మనస్సులో ఉంచుకుని, తదనుకూలంగా ఆధారాలనూ, సన్నివేశాలనూ సృష్టించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ‘ఫ్రాన్సిస్ బేకన్’ పూర్వపు విజ్ఞానవేత్తలందరూ ఈ తరగతికి చెందినవారు. ఒక భావాన్ని ముందుగానే సిద్ధాంతీకరించుకుని తన దృక్పథంలోకి వచ్చిన అంశాలను తదనుగుణంగా సమర్థించుకోవడం వారి పద్ధతి. ఆ విధంగా పొందు కుదరనివి అసహజమనీ, అసంబద్ధాలనీ తోసిపుచ్చడం వారి ఆచారం– ఇదీ 1955లో ‘సైన్స్ ఇన్ అవర్ లైవ్స్’ అనే పుస్తకంలో సైన్స్ రచయిత రిచ్చీ కాల్డర్ అభిప్రాయం! కనుకనే మానవ గమనంలోనే ఫ్రాన్సిస్ సైన్స్ పద్ధతి ఒక మజిలీగా మలుపు తిప్పింది. ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించే దృష్టి మారిపోయింది ఆయన కారణంగానే. ఆధునిక విజ్ఞాన పద్ధతికి ఆద్యుడుగా ఫ్రాన్సిస్‌ను పరిగణి స్తారు. బేకన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. లాయర్ చదువు తర్వాత రాజకీయాలలో రాటుదేలి జీవిత చరమాంకంలో ‘నేచురల్ ఫిలాసఫీ’ మీద దృష్టి పెట్టి చిరస్మరణీయమైన కృషి చేశారు. (చదవండి: అణచివేతను ధిక్కరించిన అరుణపతాక) 1561 జనవరి 22న లండన్‌లో జన్మించిన ఫ్రాన్సిస్ బేకన్ మతం, న్యాయం, రాజకీయాలలోనే కాకుండా సైన్స్ విషయాలలో కూడా నిష్ణాతులు. తండ్రి పొందిన ఛాన్స్లర్ పదవి సాధించినవాడు ఫ్రాన్సిస్. ఆయన తల్లి గ్రీకు, లాటిన్, ఇటలీ, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులు. 1581లో హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడై, తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో కూడా సభ్యుడై మొత్తంమీద 37 ఏళ్లు పార్లమెంటు మెంబ ర్గా కొనసాగారు. రాజకీయంగా ఎత్తు పల్లాలు బాగా ఎరి గిన ఫ్రాన్సిస్ బేకన్ ఆర్థికంగా కూడా సమస్యలు ఎదు ర్కొన్నారు. అటార్నీ జనరల్ (1613–17)గా, లార్డ్ ఛాన్సలర్ (1617–21)గానూ ఆయన వ్యవహరించారు. ఆలోచనా ధోరణిలో, పరిశీలనా పద్ధతిలో అంతకు ముందున్న ప్లేటో, అరిస్టాటిల్ వంటి వారిని బేకన్ విభేదించి తన మార్గంలో ముందుకు పోయారు. చాలా రకాలుగా కృషి చేసిన ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించిన ‘కో ఆపరేటివ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్’ భావన తర్వాత కాలంలో రాయల్ సంస్థ ఏర్పడటానికి దోహదపడింది. చివరి దశలో ప్రయోగాలు చేస్తూ న్యూమోనియా సోకి 1626 ఏప్రిల్ 9న కన్ను మూశాడు. వారు ప్రతిపాదించిన సైన్స్ పద్ధతి తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త) - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
సమతామూర్తి విగ్రహావిష్కరణకు శ్రీరామనగరం ముస్తాబు
-
శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. ► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని ► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు శరవేగంగా రహదారుల విస్తరణ ► ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఎన్‌హెచ్ 44 నుంచి పెద్దషాపూర్ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్‌పేట్ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ► ఎన్ 44 మదనపల్లి క్రాస్ రోడ్డు నుంచి ముచ్చింతల్ మీదుగా చిన్న తూప్రాన్ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా.. తాగునీరు ► రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్ ప్రధాన లైన్ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఆవుపేడతో పిడకలు సిద్ధం ► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు. పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్.. ► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. వెదురు బొంగులు.. తాటి కమ్మలతో.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. ► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు. -
ఉత్త ప్యాంగసియన్ ఆశ.. ఇంతకీ ఎవరు ఇతను?
ఆశావాదం మంచిదే కాని అతి ఆశావాదంతోనే సమస్య. అతి ఆశావాదం వాస్తవాలను చూడనివ్వదు. భ్రమజనిత ప్రపంచంలో పెడుతుంది. ఏదైనా ఐడియా లేదా ప్లాన్‌లో వాస్తవం తక్కువై, ఆశావాదం మరీ ఎక్కువైంది అనుకోండి ‘ఉత్త ప్యాంగసియన్ ఐడియా’ అంటారు. అతి ఆశావాదులను ‘ప్యాంగసియన్’ అంటారు. ఇంతకీ ఎవరు ఇతను? ఫ్రెంచ్ ఫిలాసఫర్, రైటర్, హిస్టారియన్ వొల్టేర్ 1759 లో ‘కాండీడ్’ అనే నవల రాశాడు. అనేక దేశాల్లో ఈ పుస్తకం నిషేధానికి గురైంది. ఆ కాలంలో ఎలా ఉన్నప్పటికీ ప్రపంచ సాహిత్యంలోని గొప్ప పుస్తకాల్లో ఒకటిగా పేరుగాంచింది. (చదవండి: పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది) ఈ నవలలో ‘ప్యాంగ్లాస్’ అనే తత్వవేత్త అతిఆశావాది. నెత్తి మీద బండ పడినా, కొండ పడలేదు కదా! అని సర్దుకుపోయే తత్వం. తన అతి ఆశావాదాన్ని నెగ్గించుకోవడానికి వాస్తవాలతో సంబంధం లేని ఎన్ని వాదనలైనా చేస్తాడు. చివరికి తాను బిచ్చమెత్తుకునే విషాదపరిస్థితి వచ్చినప్పటికీ తన ఆతిఆశావాదాన్ని మాత్రం వదలడు! తన కంటే సీనియర్ అయిన ఒక జర్మన్ తత్వవేత్తను దృష్టిలో పెట్టుకొని వొల్టేర్ సెటైరికల్‌గా ఈ పాత్రను సృష్టించాడు. (చదవండి: లెట్స్ సీ వాట్ ఐ కెన్ డూ.. అదే ఆమె మంత్రం!) -
లక్ష్యమంటే లోతైన జ్ఞానానికి మెట్టు..
తత్వవేత్త, సామాజికవేత్త పాండురంగ శాస్త్రి ఆథావలే జీవితం, శాస్త్రీజీ అని, దాదాజీ అని ప్రేమగా పిలుచుకునే ఆథావలే దృష్టిలో లక్ష్యమంటే ఒక ప్రాజెక్టునో లేదా బడ్జెట్‌నో పూర్తి చేయడానికి నిర్దేశించుకునేలాంటిది కాదు. సువిశాలమైన, లోతైన జ్ఞానానికి మెట్టు. సరైన లక్ష్యం మానవ జీవితాన్ని మార్చేస్తుంది. వందేళ్ల క్రితం ఆనాటి బొంబాయి నగరంలో ఒక సనాతన కుటుంబంలో పుట్టిన దాదాజీ వేదాలను అధ్యయనం చేశారు. మార్క్స్‌ను చదివారు. తత్త్వవేత్తలైన సోక్రటీస్ నుంచి రస్సెల్ వరకు లోతుగా అధ్యయనం చేశారు. వేదాలను నేటి ఆధునిక జీవన విధానానికి అన్వయించుకునే విధంగా సరళమైన భాషలో రచనలు చేశారు. సామాన్యులకు కూడా వేద విజ్ఞానాన్ని అందించాలని తపన పడ్డారు. విశ్వాసం, కులం, వయసు, సమర్థత, రాజకీయ అనుబంధాలకు అతీతంగా సర్వమానవాళికీ వర్తించేలా కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. దేనినైనా నమ్మడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకోవడానికీ, తెలిసిన దానిని అమలు పరచడానికి ఎంతో వ్యత్యాసం ఉందని, ఆచరణ అన్నింటికన్నా ముఖ్యమైనదని చెప్పిన దాదాజీని, ఆయన శిష్యులను స్వాధ్యాయులు అని పిలిచేవారు. నేటి ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్న పర్యావరణ పరిరక్షణ, జీవ సమతుల్యతల ఆవశ్యకత గురించి దాదాజీ ఏనాడో చెప్పారు. దాదాపు 20 గ్రామాలలో వృక్షాలు నాటించి, అవి పెరిగి పర్యావరణాన్ని పచ్చగా మార్చడం, తద్వారా మానవ జీవితాలు ఏ విధంగా ఫలప్రదం అవుతాయో గ్రామస్థులు స్వయంగా తెలుసుకునేలా చేశారు. ఆయన బోధలన్నీ విశ్వమానవుల ఆత్మగౌరవానికి తోడ్పడేవే. అక్టోబర్ 19 ఈ గౌరవనీయ తాత్వికుడి శతజయంతి. ఆరోజును ఆయన అనుయాయులు మానవాళి ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకున్నారు. -
కాస్త ఆలస్యం
జర్మనీకి చెందిన ఇమ్మాన్యూల్ కాంట్ ఓ తత్త్వవేత్త. ఈయన వద్దకు ఓరోజు ఓ మహిళ వచ్చింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశ. అయితే ఆయనేమీ ప్రేమ చక్రవర్తికాదు. ప్రేమకు ఆయన ఆమడదూరంలో ఉండేవాడు. నియమనిష్టలకు కట్టుబడి బతుకుతున్న వ్యక్తి. కానీ ఇవేవీ తెలియని ఆ యువతి తన మనసులోని మాట చెప్పింది. అయితే కాంట్ తీరు వేరుగా ఉండేది. రాత్రి పదైతే చాలు అప్పటికప్పుడు చేస్తున్న పనిని సైతం పక్కన పెట్టేసేవారు. ఎప్పుడూ లెక్కలేస్తూ ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైనా సరే టైము పదైందంటే చాలు ఏదీ చెప్పకుండా వెళ్లిపోయి నిద్రపోతారు. ఆయన దగ్గర ఓ పనివాడు ఉండేవాడు. అతను అక్కడున్న అతిథులకు చెప్పేవాడు.. అయ్యగారు పడుకుండిపోయారని. అప్పుడు వాళ్లు వెళ్లిపోయేవారు. కాలం పట్ల చాలా నిక్కచ్చిగా ఉంటాడు కాంట్. మహా పట్టింపు. ఆయన తీరు నచ్చక ఆయన గుణం తెలిసిన కుటుంబసభ్యులు కాంట్‌ను విడిచిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. ఉదయం అయిదు గంటలకు లేవడం ఆయన అలవాటు. అది చలి కాలమైనా ఎండాకాలమైనా కావచ్చు. ఆరోగ్యం బాగులేకపోయినా సరే బాగున్నా సరే అయిదు గంటలకు లేవవలసిందే. ఐదైతే పక్కమీద ఒక్క సెకను కూడా ఉండరు. అన్నింటినీ కాలంతో చూసే అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళ ముందుకు రావడమేంటీ.. ఆశ్చర్యమే! ఆయనంటే ఎందుకు ఇష్టమో చెప్పింది కూడా. ఆమె మాటలతో ఆలోచనలో పడ్డారు కాంట్. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే అందులోని కష్టసుఖాలను ఆయన గణించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ పుస్తకం కూడా రాశారు. కష్టాలకు వంద మార్కులు, ఇష్టాలకు 101 మార్కులు వేసుకున్న ఆయన ఆపైన సరేనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని కలిసి జరిగినదంతా చెప్పారు. ఆయన మాటలు విని తండ్రి పెద్దగా నవ్వాడు. ‘‘నువ్వు కాస్తంత ఆలస్యం చేశావు. అయిదేళ్లు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చేసుకుందామనుకున్న ఆ యువతికి ఎప్పుడో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు’’ అని తండ్రి చెప్పాడు. ఇమ్మాన్యూల్ కాంట్ శోకతప్తుడయ్యాడు. – యామిజెన్ -
జెరెమి బెంథాం.. ప్రజెంట్ సార్..
ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది.. ఇలాంటి ముఖ్యమైన మీటింగ్‌లకు ఎవరు అటెండ్ అయినా.. కాకున్నా ‘ఈయన’ తప్పనిసరిగా హాజరవుతాడు. ఫొటోలో ఉన్నవాళ్లలో కాస్త తేడాగా కనిపిస్తున్నాడే.. ఆ ఆయనే.. టోపీ పెట్టుకుని.. సరిగ్గా గుర్తుపట్టేశారే.. మనోడు కాస్త ఓల్డ్ ఫ్యాషన్డ్ లెండి.. అందుకే అప్పటి కాలం దుస్తులు.. అయితే.. మీటింగ్‌కు ఠంచనుగా వస్తాడన్న మాటే గానీ.. ఒక్క ముక్క మాట్లాడడు.. ఎవరేమన్నా బదులివ్వడు.. ముఖ్యమైన నిర్ణయాలపై జరిగే ఓటింగ్‌లోనూ పాల్గొనడు.. ఎందుకంటారా? ఎందుకంటే.. మనోడు బతికిలేడు కాబట్టి.. చచ్చి ఇప్పటికే 186 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి.. జెరెమి బెంథాం.. 18వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్త, సామాజిక సంస్కరణల ఉద్యమకారుడు.. అప్పట్లో ఈయనకు చాలా పేరుండేది. భావప్రకటన హక్కు, వ్యక్తిగత, ఆర్థిక స్వాతంత్య్రం, మహిళలకు సమాన హక్కులు, బానిసత్వం రద్దు ఇలా చాలా వాటిపై తన గళాన్ని గట్టిగా వినిపించడమే కాకుండా.. వాటి కోసం పోరాడేవాడు. అంతేనా.. వన్యప్రాణులకు హక్కులుంటాయని వాదించిన తొలితరం ఉద్యమకారుల్లో జెరెమి ఒకడు. మేధావిగా కీర్తి గడించాడు. యూనివర్సిటీ కాలేజ్ లండన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. 1832లో మరణించాడు. అయితే.. చనిపోయే ముందు అతడో చిత్రమైన వీలునామా రాశాడు.. ఏమిటా వీలునామా? జెరెమి నాస్తికుడు.. పునర్జన్మలు వంటివి నమ్మడు. దీంతో ఖననం చేయొద్దని చెప్పేశాడు. తన మృతదేహం కూడా సమాజానికి ఉపయోగపడాలని భావించి.. చనిపోయిన తర్వాత దాన్ని పరిశోధనల నిమిత్తం వాడుకోవచ్చని చెప్పాడు. అయితే.. తన శరీరాన్ని కోశాక.. అందులోని అస్థిపంజరాన్ని తీసి.. దానికి తానెప్పుడూ ధరించే దుస్తులు వేసి.. తాను కూర్చునే కుర్చీలోనే కూర్చోబెట్టాలని కోరా డు. తన తలను మాత్రం ప్రత్యేక రసాయనాలతో సంరక్షించి.. దానికి తగిలించాలని చెప్పాడు. అయితే.. ఆ సందర్భంగా జరిగిన కొన్ని తప్పిదాల వల్ల దాన్ని సరిగా సంరక్షించడం వీలు కాలేదు. దీంతో మైనంతో అతడి తలను తయారుచేసి పెట్టారు. అదెలా ఉన్నా.. ఎండుగడ్డితో నింపిన ఆ బొమ్మలో ఉన్న అస్థిపంజరం మాత్రం అప్పటి జెరెమి బెంథాందే కావడం గమనార్హం. స్టోర్ రూమ్‌లో ఉన్న తల ఇంతటితో మనోడి వీలునామా ఆగిందా లేదే.. ఇంకా ఉంది.. అదేంటంటే.. తన మిత్రులు, శిష్యులు నిర్వహించే ముఖ్యమైన పార్టీలు, సమావేశాలకు తనను కూడా తీసుకెళ్లాలని షరతు పెట్టాడు. దీంతో కాలేజీలో జరిగే ప్రతి సమావేశానికి ‘అతడు’ హాజరవుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే.. కాలేజీ వాళ్లు దీన్ని ఖండిస్తున్నారు. ‘యూనివర్సిటీ కాలేజ్ లండన్ 100, 150వ వార్షికోత్సవాలప్పుడు జరిగిన ముఖ్యమైన కౌన్సిల్ సమావేశాలకు మాత్రమే అతడు ‘వచ్చాడు’. చివరి సారిగా 2013లో వర్సిటీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి రిటైర్మెంట్ సందర్భంగా జరిగిన భేటీకి హాజరయ్యాడు’ అని వర్సిటీ ప్రతినిధి తెలిపారు. మిగతా టైములో జెరెమి కాలేజ్‌లో ఉన్న ఓ చెక్క బీరువాలో ఉంటాడు. ముఖ్యమైన భేటీ ఉంటే.. కాలేజీ సిబ్బంది వచ్చి అతడిని తీసుకెళ్తారు. ఆ మధ్య వరకూ అతడి ఒరిజినల్ తల అతడి కాళ్ల వద్దే ఉండేది. అయితే.. కాలేజీలోని పెంకి కుర్రాళ్లు.. దాన్ని దొంగిలించి.. తిరిగి ఇవ్వడానికి డబ్బులివ్వాలంటూ వర్సిటీ వాళ్లనే బెదిరించేసరికి.. జెరెమి తలను జాగ్రత్తగా స్టోర్ రూంలో దాచిపెట్టారట. ప్రస్తుతం మనోడు.. కాలేజీలోని ఆ చెక్క బీరువాలోనే చెక్క భజన చేస్తున్నాడు.. మరో మీటింగ్‌కు వెళ్లడానికి వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు.. – సాక్షి సెంట్రల్ డెస్క్.. -
జీవితపు కొత్త సరిహద్దు
ఆజన్మం ఈ క్షణంలో బతకడాన్ని కొంతమంది గ్లోరిఫై చేస్తారెందుకు? (‘ఈ రోజే నాకు ముఖ్యం’. ‘రేపటి గురించి ఆలోచించను’.) ఈరోజు గురించే ఆలోచించేవాళ్లయితే... ఇవ్వాళ్టికోసం నిన్న డ్రెస్ ఎందుకు ఉతుక్కోవాలి? ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలి? గ్యాస్ కోసం ఫోన్ ఎందుకు చేయాలి? ‘ఈ క్షణం’ అని వాచ్యంగా చెబుతున్నది కాకుండా- దీనికి మించినదేదో తీసుకోవాలన్న అవగాహన నాకుంది. కానీ, నాకు అనిపిస్తున్నదేమంటే- పట్టింపు లేనట్టుగా ఉండటంలో ఒక ఫిలాసఫర్లాగా కనబడతాం; ఒక యోగిక్ గ్లామర్ ఏదో అందులో ఉంది; అంతే తప్ప మళ్లీ అన్నీ కావాలి! పోనీ, ఈ క్షణంలో జీవించడం, అంటున్నప్పుడు- రేపు చనిపోయినా సరే, అన్న భావనైనా దృఢంగా ఉంటుందా! మృత్యుభయాన్ని ఏ కొంతైనా అనుభవించినవాళ్లు అలా మాట్లాడగలరా? ఇటీవల కొన్ని అకాల మరణాలను చూస్తున్నాను. తీవ్రమైన వెన్నునొప్పి బాధించినప్పుడు- అలాంటి ‘మృత్యుభయం’ నాక్కలిగింది! శరీరం చిన్నగా కంపిస్తుంది. శ్వాసవేగం తగ్గుతుంది. కొక్కెం వేసి బలంగా లాగితే తప్ప ముందుకు రాదన్నట్టుగా ఊపిరి బరువుగా వస్తుంది. స్థిరత్వాన్ని పొందడంలో మనసు విఫలమవుతుంది. నిర్లిప్త దృశ్యాల సమాహారం కదలాడుతుంది. గుండెలు పొడిబారుతాయి. చెవులు వేడెక్కుతాయి. చర్మానికీ లోపలి భాగాలకూ సంబంధం తెగిపోయినట్టు ఉంటుంది. అరికాళ్ల నుంచి మెదడుదాకా ఏదో ఖాళీతనం! ‘డిగ్రీ’లో నేనో ఆటోగ్రాఫ్ బుక్ డిజైన్ చేశాను. అందులో ఒక కాలమ్ ఇలా ఉంటుంది: ‘మీరెప్పటిదాకా బతకాలనుకుంటున్నారు?’ జీవితం మీద పెద్ద అంచనాలేమీ లేవన్న కసిని చాటాలనేమో! 2010 వరకు ఉంటే చాలని రాసినవాళ్లు కూడా ఉన్నారు. మనిషి ఆయుఃప్రమాణం వందేళ్లని చెప్పుకోవడంలో ఇంకా అర్థం లేదు. ఎన్నాళ్లీ వందేళ్ల మిత్? మా తరం వాళ్లం ‘అరవై’ అనే హద్దుకే సరిపెట్టుకోవాలేమో! కాలుష్యం, ఒత్త్తిళ్లు, విషపుతిళ్లు, రివిజనిజం లేని నాగరికతలను ఈ ‘తగ్గింపు’కు కారణంగా చూపించడం తేలికే! కానీ, ఏది ఎందుకు జరుగుతుందో- అది అందుకే జరుగుతుంది; తిరిగి, ఏది ఎందుకు విరుగుతుందో- అది అందుకే విరుగుతుంది. కాకపోతే, వాటి ప్రభావాన్ని విధిగా భరించాల్సినవాళ్లముగా ఈ ‘నిర్ణయం’ తీసుకోక తప్పడం లేదు. కాబట్టి, రేపెప్పుడో రాజిరెడ్డి అర్ధంతరంగా కన్నుమూస్తే- ఈ కొత్త నిష్పత్తి ప్రకారం, 36 ఏళ్లు కాదు, ‘అరవై శాతం’ బతికాడనే అర్థం! ఇది కొంత దుఃఖం కలిగిస్తున్నమాట నిజమే! కొంతేమిటి, చాలానే దుఃఖం కలిగిస్తోంది. కానీ ఇంతకంటే వాస్తవం భిన్నంగా ఉండబోదని నమ్మకంగా అనిపిస్తున్నప్పుడు దీన్ని నిరాకరించడం ఎలా? మొన్న దసరాకు ఊరెళ్లినప్పుడు- మా కొత్త లింగయ్య తాత- చాలా ఏళ్ల కిందటి తన ‘ఆత్మహత్య అనుభవం’ చెప్పాడు. ఆయన అలాంటి దుడుకు సాహసానికి ఒడిగట్టబోయాడని అంతకుముందు తెలీదు. ‘‘పెద్ద గత్తరకు ముందు- నా.లు.గెడ్లు దొడ్లెకురికచ్చి సచ్చినై. గడ్డికుప్ప గాలింది. రెండు ఇంజిన్లు కరాబైనై. నాలుగెకరాల పంట పెట్లెండింది. ‘ఛీ, ఇగ బతుకద్దురా’ అనుకున్న. పగ్గం దెచ్చుకున్న. ఎవలకు జెప్పలె. ఈళ్లందరు (రాత్రి) నిదుర వోయినంక ఎటన్న వోయి ఏసుకుందమనుకున్న. అ.ట్ల. ఒరిగిన. అటే నిద్ర వట్టింది. ఇద్దరచ్చిండ్రు. ఇద్దరు లాగులే ఏసుకున్నరు. నలుపు వర్ణంలున్నరు. ‘వారీ ఈ పగ్గం దీస్కపోతన్నం,’ అన్నరు. ‘నీకింక ముందట మంచిరోజులున్నై,’ అని జెప్పిన్రు. తెల్లారి జూస్తే- ఇంట్లేసిన పగ్గం దొడ్లుంది!’’ తన లోపలి బతకాలన్న కాంక్షను కల ఊతంగా తిరిగి బలోపేతం చేసుకునివుంటాడా! అలాంటి కారణమేదైనా గట్టిగా లాగేదాకా, నేను ఈ ‘అరవై’లోనే ఉండిపోకతప్పదు! కలనీ, మెలకువనీ కలిపేస్తోన్న ఆ పగ్గం గురించిన ప్రశ్నలు మాత్రం- ఆయనకూ, నాకూ మధ్యగల విశ్వాసభేదాల్లోకి తీసుకెళ్లాయి. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు; నేను నిజమని నమ్మాల్సిన బలవంతం లేదు. సెలవు. పోనీ, ఈ క్షణంలో జీవించడం, అంటున్నప్పుడు- రేపు చనిపోయినా సరే, అన్న భావనైనా దృఢంగా ఉంటుందా! మృత్యుభయాన్ని ఏ కొంతైనా అనుభవించినవాళ్లు అలా మాట్లాడగలరా? - పూడూరి రాజిరెడ్డి