భారత్‌లో చేపల వినియోగం పెరిగిందని అధ్యయనంలో వెల్లడయ్యింది. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఈ మేరకు భారతదేశంలో చేపల వినయోగం, సంబంధిత ఆహార పొకడలపై అధ్యయనం నిర్వహించగా..సరికొత్త నివేదికలును అందించింది. ఆ ఫలితాల్లో ఇటీవల కాలంలో చేపల వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు వెల్లడించింది. భారత దేశంలో చేపల వినియోగం: ప్యాటర్న్, ట్రేండ్ అనే వాటిని బేస్ చేసుకుని స్టడీ చేయగా గణనీయమైన వృద్ధి కనిపించింది.
ఈ స్టడీని ఇండియన కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐసీఏఆర్), మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, భారత ప్రభుత్వం అండ్ వరల్డ్ ఫిష్ ఇండియా కలిసి నిర్వహించాయి. కాల పరిమిత 2005-2006 నుంచి 2019-2020 వరకు చేపల వినియోగం ఎలా ఉందనే దానిపై అధ్యయనం చేయగా, చేపల వినియోగంలో భారతేశంలో గణనీయమైన వృద్ధి కనిపించిందని తేలింది. అందుకు జనాభ పెరుగుదల, పెరిగిన సంపద, మారుతున్న పరిస్థితులు కారణం అని పేర్కొన్నారు అధికారులు.
ఇక భారతదేశంలో చేపల తినే జనభా 73.6 మిలియన్ల(66%) నుంచి 966.9 మిలియన్లకు(71.1%)కు చేరింది. ఇది సుమారు 32% పెరుగుదలను సూచిస్తోంది. అలాగే 2019-2020లో 5.95% మంది ప్రజలు ప్రతిరోజూ చేపలను తీసుకోగా, 34.8% మంది కనీసం వారానికి ఒకసారి మిగలిన 31.35% అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారని అధ్యయనంలో తేలింది. కాగా, త్రిపురలో అత్యధికంగా (99.35%), హర్యానాలో అత్యల్పంగా (20.55%) చేపలను వినయోగిస్తున్నారు.
తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, గోవాలలో అత్యధికంగా చేపలు తినే వాళ్ల సంఖ్య (90% కంటే ఎక్కువ) ఉంది. దీనికి విరుద్ధంగా, పంజాబ్, హర్యానా రాజస్థాన్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు అత్యల్పంగా ఉన్నాయి (30% కంటే తక్కువ). అయితే, దేశంలోని ఉత్తరాన ఉన్న రాష్ట్రం జమ్మూ కాశ్మీర్‌లో చేపలు తినేవారి సంఖ్య అత్యధికంగా పెరగడం గమనార్హం. అలాగే కేరళ, గోవాలలో కూడా రోజువారీ చేపల వినియోగదారుల శాతం అత్యధికంగా ఉందని స్టడీ పేర్కొంది. అంతేగాక పురుషుల కంటే స్త్రీలు చేపల తక్కువుగా తింటున్నారని అధ్యయనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment