ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : కరోనా సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక కష్టాలు భారత్‌లో మధ్య తరగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. దాదాపుగా 3.2 కోట్ల మంది మధ్య తరగతి నుంచి దిగువకు పడిపోయారని నివేదికలో పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం గత ఏడాది కరోనా విజృంభించిన సమయంలో రోజుకి రూ. 724 నుంచి రూ.1449 వరకు సంపాదించే వారిలో 3.2 కోట్ల మంది తమ సంపాదనని కోల్పోయారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక నిరుపేదలుగా మారారు. కరోనా సంక్షోభం రాకముందు 9.9 కోట్ల మంది ఉండే మధ్య ఆదాయ వర్గం ఆ తర్వాత ఏడాది కాలంలోనే 6.6 కోట్లకు తగ్గిపోయింది. 2011–19 మధ్య కాలంలో దాదాపుగా 5.7 కోట్ల మంది మధ్య ఆదాయ వర్గాల్లో చేరారు. రోజుకి రూ.140 అంత కంటే తక్కువ సంపాదన ఉన్న వారు 7.5 కోట్ల మందిగా ఉన్నారు.
ఈ ఏడాది చమురు ధరల్లో భారీ పెరుగుదల చాలా మందిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. వేతనాల్లో కోతలు, ఉద్యోగాలు కోల్పోవడంతో చాలా మంది బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లడానికి మొగ్గు చూపిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వివరించింది.
చదవండి:
రిజర్వేషన్లను ఇంకెన్ని తరాలు కొనసాగిస్తారు: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment