బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి..
➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను
చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు.
➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్‌లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు.
➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు.
➧ విద్య: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించారు.
➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్‌లో అనేక చర్యలు ప్రకటించారు.
మళ్లీ ఉంటాయా?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్‌లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment