రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు.
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.
కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్‌లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్‌లో 50 శాతం పెరగవచ్చని అంచనా.
ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment