దిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
Comments
Please login to add a commentAdd a comment