మళ్లీ పెట్రో పిడుగు
Published Sun, Sep 1 2013 2:29 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మళ్లీ పెట్రో పిడుగు పడింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలు మరింత దుర్భరం కానున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో ఇలా ఎప్పుడుపడితే అప్పుడు ధరలు పెంచేస్తున్నారు. జూన్ 16, 29, జూలై 15, ఆగస్టు 1, 31వ తేదీల్లో వరుసగా పెట్రోల్ ధరలు పెరిగాయి. నెల రోజులు గడువక ముందే మరోసారి భారీ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరగడం పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. తాజాగా పెట్రోల్‌కు లీటర్‌పై రూ.2.50, డీజిల్‌పై 50 పైసలు పెరి గింది. వీటికి పన్నులు అదనం కానున్నాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతుంది.
జిల్లాపై రూ.97.50 లక్షల భారం..
పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వల్ల అదనంగా వాహనదారులు 97.50 లక్షల భారం భరించవలసి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోలు లీటరు 76.87 పైసలు, డీజిల్ రూ.55.01పైసలు ఉంది. పెరిగిన ధరలతో పెట్రోలురూ.80, డీజిల్56 రూ పాయలు కానుంది. జిల్లా వ్యాప్తంగా 62 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. వీటిలో రో జుకు సుమారు లక్ష లీటర్ల పెట్రోలు, లక్షా 50వేల లీటర్ల డీజిల్ విక్రయమవుతుంది.
Advertisement
Advertisement