న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.
ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
VIDEO | AAP National Convenor Arvind Kejriwal (@ArvindKejriwal) criticises the Centre's tax policies, calling it 'tax terrorism.'
"People have to pay taxes while they are alive, but now the government has created a situation where they have to pay even after death. Amid this tax… pic.twitter.com/6LreZj30co— Press Trust of India (@PTI_News) January 22, 2025
ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు
1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.
5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.
6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.
7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.
అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి..
Comments
Please login to add a commentAdd a comment