
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఇంధనంతో పాటు కూరగాయల ధరలు మండుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పథకాన్ని మరో 6 నెలల పాటు పొడిగించే యోచనలో ఉంది. ఇందులో చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పారదర్శకంగా అమలయ్యేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
రద్దు దిశగా రేషన్ కార్డులు
రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది.
రూల్స్ ఏంటో చూద్దాం..
మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సరెండర్ చేయాలి.
మరిన్ని నెలలు ఉచిత రేషన్
మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment