టెక్నాలజీ పెరడగడంతో ప్రతిదీ డిజిటలైజేషేన్ అవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అవినీతితో పాటు అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే సర్కారు అందించే సేవలను ఆన్‌లైన్ వైపు తీసుకెళ్లడంతో పాటు అనుసంధానం ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి ఎంతో ముఖ్యమో చెప్పక్కర్లేదు. అందుకే వీటిని అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కేంద్రం ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఉన్న గుడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గతంలో ఉన్న జూన్ 30 గడువును పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అంతోదయ అన్న యోజన, ప్రాధాన్య గృహ పథకం కింద లబ్ధిదారులకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడం తప్పనిసరి. తెల్లకార్డు ఉన్నవారు ముందుగా తమ రేషన్‌కార్డును డిజిటలైజ్ చేసి, ఆ తర్వాతే ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంపై దృష్టి సారిస్తోంది. రేషన్ కార్డుకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్డును దుర్వినియోగం చేసి వివిధ చోట్ల 2-3 రేషన్‌కార్డులు పొందిన వారు చాలా మంది ఉన్నారు.
రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడానికి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలి. లేదా ఆన్‌లైన్‌లో కూడా రేషన్ కార్డుకి ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఈ కింది పాటిస్తే సరిపోతుంది.
►మీ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
►రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలని ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి.
►ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, నమోదిత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
►అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
►ఓటీపీ ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది.
చదవండి: ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్‌లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు!
Comments
Please login to add a commentAdd a comment