
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.
సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment