ఈ చిన్న పని చేస్తే ఆధార్‌ కార్డులు భద్రం! | How to Lock Aadhaar Biometrics Online and Why It Matters | Sakshi
Sakshi News home page

మీ ఆధార్‌ కార్డును ఎవరైనా వాడితే.. ఈ చిన్న పని చేయండి చాలు!

Published Wed, Mar 12 2025 7:57 PM | Last Updated on Wed, Mar 12 2025 8:32 PM

How to Lock Aadhaar Biometrics Online and Why It Matters

ప్రస్తుతం ఆధార్‌ కార్డుల దుర్వినియోగం, మోసాలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన ఆధార్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్న సంఘనలు చూస్తున్నాం. డిజిటల్ భద్రతకు పెద్దపీట వేస్తున్న ఈ కాలంలో వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరంగా మారింది.

భారతదేశ ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్లు, ఫేసియల్‌ రికగ్నిషన్‌ వివరాలు వంటి సున్నితమైన బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ఈ డేటాను ఇతరులు దుర్వినియోగం చేయకుండా రక్షించడానికి, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా లాక్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇలా లాక్ చేయండి..
మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయడం అనేది యూఐడీఏఐ వెబ్‌సైట్, ఎంఆధార్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేయవచ్చు.

యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో.. 
» యూఐడీఏఐ బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ పేజీని సందర్శించండి.

» మీ 12 అంకెల ఆధార్ నంబర్, ప్రదర్శించిన భద్రతా కోడ్‌ను నమోదు చేయండి.

» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ పొందడానికి "సెండ్ ఓటీపీ" పై క్లిక్ చేయండి.

» ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

» "ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్" అనే ఆప్షన్ ఎంచుకోండి.

» కన్‌ఫర్మ్‌ చేయండి. మీ బయోమెట్రిక్స్‌ విజయవంతంగా లాక్ అవుతాయి.

ఎంఆధార్ యాప్ ద్వారా..
» గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.

» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. 4 అంకెల పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.

» మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయడం ద్వారా మీ ఆధార్ ప్రొఫైల్‌ను యాడ్ చేయండి.

» "బయోమెట్రిక్ సెట్టింగ్స్" ఆప్షన్ కు నావిగేట్ చేయండి.

» బయోమెట్రిక్ లాకింగ్‌ను ఎనేబుల్‌ చేయడానికి, కన్‌ఫర్మ్‌ చేయడానికి స్విచ్ ను టోగిల్ చేయండి.

ఎస్ఎంఎస్ ద్వారా..
» మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి GETOTP అని  1947కు ఎస్ఎమ్ఎస్ పంపండి.

» రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

» LOCKUID <ఆధార్ నంబర్> <ఓటీపీ> ఫార్మాట్ లో 1947 మరో ఎస్ఎంఎస్ పంపండి.

» మీ బయోమెట్రిక్స్ లాక్ అయినట్లు సూచించే కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ మీకు వస్తుంది.

ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ ఎందుకు ముఖ్యమంటే..
»  మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల మీ వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్ లు, ఫేస్‌ రికగ్నిషన్‌ డేటాను మీ సమ్మతి లేకుండా ధ్రువీకరణ కోసం ఉపయోగించలేరు. ఇది గుర్తింపు (ఐడెంటిటీ) చోరీ  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

» ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డు జారీ వంటి ఆధార్ లింక్డ్ సేవలకు అనధికారిక యాక్సెస్‌ మోసానికి దారితీస్తుంది. బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల అదనపు భద్రత లభిస్తుంది.

» మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం ద్వారా, మీరు మీ వ్యక్తిగత డేటాను నియంత్రణలోకి తీసుకుంటారు. అనధికార ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా చూసుకుంటారు.

» ఒక వేళ మీరే మీ బయోమెట్రిక్స్‌ను ప్రామాణీకరణ కోసం ఉపయోగించాల్సి వస్తే, మీరు వాటిని అదే పద్ధతుల ద్వారా తాత్కాలికంగా అన్‌లాక్ చేయవచ్చు. తర్వాత ఇది దానంతటదే లాక్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement