Aadhaar
-
క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ యాప్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఇన్స్టంట్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడీతో కొత్త యాప్ పని చేస్తుందని చెప్పారు. ఈ యాప్‌తో సులభంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. భారత పౌరులు తమ ఆధార్ కార్డును కొన్ని సందర్భాల్లో భౌతికంగా చూపించడానికి బదులుగా వారి గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.‘కేవలం ఒక ట్యాప్‌తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే ఇతరులతో పంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇది వారికి తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది. న్యూ ఆధార్ యాప్ (బీటా టెస్టింగ్ దశలో ఉంది) ద్వారా వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా ఉంటుంది. యూజర్లు తమ వివరాలు నిర్ధారించేటప్పుడు వారి ఆధార్‌ను డిజిటల్‌గా ధ్రువీకరించవచ్చు. యూపీఐ లావాదేవీల మాదిరిగా కేవలం క్యూఆర్‌ను స్కాన్ చేయడం ద్వారా ఇదంతా సులువుగా చేయవచ్చు’ అని మంత్రి తెలిపారు.ఆధార్ ఫేస్ అథెంటికేషన్దేశంలో యూపీఐ చెల్లింపులకు విస్తృతంగా వినియోగించే క్యూఆర్ కోడ్ల మాదిరిగానే ఆధార్ ధ్రువీకరణకు ‘పాయింట్స్ ఆఫ్ అథెంటికేషన్(వెరిఫికేషన్ భాగస్వాములు)’ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ యాప్‌ల మాదిరిగానే కొత్త ఆధార్ యాప్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే వారి ఫేస్ వెరిఫై ఆప్షన్ వస్తుంది. ఇది ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఈ యాప్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్, సమాచార మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఇది భౌతిక ఫోటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది. ఇకపై హోటల్ రిసెప్షన్లు, షాపులు, ప్రయాణాల సమయంలో ఆధార్ ఫొటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..బీటా వెర్షన్ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉందని మంత్రి అన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇది విస్తృతంగా అమలైతే, పౌరులు ఇకపై వారి భౌతికంగా తమ ఆధార్ లేదా ఫోటోకాపీని ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యాప్‌కు సంబంధించి నిర్దిష్ట యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూఐడీఏఐ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. -
క్షణాల్లో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు..
ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk. This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025 -
UPI లాంటి మరో విప్లవం.. ఆధార్ సృష్టికర్త అంచనా
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తరహాలో తదుపరి విప్లవాన్ని భారత ఇంధన రంగం చూస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా ఎదిగేందుకు వీలుగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను విస్తృతంగా అమలు చేస్తున్న విషయాన్ని పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ వివరించారు."మనం సాధారణంగా తక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాం.. నిల్వ చేస్తుంటాం. మీరు ఎల్పీజీ సిలిండర్ కొంటున్నారంటే ప్యాకేజింగ్ చేసిన ఇంధనాన్ని కొంటున్నట్టు. కానీ విద్యుత్ మాత్రం గ్రిడ్ నుంచి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాళ్లం. విద్యుత్ అందుబాటులో లేకపోతే జనరేటర్ కొనుక్కోవడమో, నూనె దీపాలు వెలిగించడమో చేస్తుంటాం'' అని నీలేకని చెప్పుకొచ్చారు.ఇప్పుడు ‘రూఫ్ టాప్ సోలార్ ఉండటం వల్ల ప్రతి ఇంటికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈవీ బ్యాటరీ ఉండటం వల్ల ప్రతి ఇల్లు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి, ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారు, అమ్మకందారు అలాగే కొనుగోలుదారు కూడా. కాబట్టి, యూపీఐ మాదిరిగా, మీరు ఇప్పుడు విద్యుత్‌ను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు" అన్నారాయన. ఇంధన ఉత్పత్తి, వినియోగం వికేంద్రీకరణ వల్ల లక్షలాది మంది సూక్ష్మ ఇంధన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, ఇది ఆర్థిక ఆవిష్కరణలు, వృద్ధికి దోహదపడుతుందని నీలేకని అన్నారు.యూపీఐ విజయ ప్రస్థానందశాబ్దం క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతన్నాయి. గత జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లు దాటాయి. అలాగే వాటి విలువ రూ .23.48 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు దేశాల్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
పోయిన పాన్, ఆధార్ నంబర్లు తెలుసుకోండిలా..
దేశంలో నివసించే ప్రజలకు అత్యంత కీలకమైన కార్డులు రెండు ఉన్నాయి. అవి ఒకటి ఆధార్ కార్డు, రెండోది పాన్ కార్డు. ప్రతిరోజూ ఏదో ఒక పని కోసం ఈ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ రెండు డాక్యుమెంట్లు లేకపోతే అనేక పనులు నిలిచిపోతాయి.అందుకే ఈ రెండు డాక్యుమెంట్లు మీ దగ్గర ఉండటం చాలా ముఖ్యం. కొంతమంది ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లను పోగొట్టుకుంటుంటారు. వాటి నంబర్లు కూడా తెలియవు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి గురించి మీరు ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏమిటి.. సులభమైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ నెంబర్ రీట్రీవ్ చేసుకోండిలా..యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి'రిట్రీవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ' ఆప్షన్ కోసం చూడండి.క్యాప్చా కోడ్‌తోపాటు మీ పూర్తి పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఆధార్‌తో లింక్ చేసిన ఈ-మెయిల్ ఐడీ వివరాలను నమోదు చేయండిమీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ముందుకు సాగడం కోసం దానిని నమోదు చేయండి.విజయవంతంగా వెరిఫికేషన్ చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ మీకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే, సహాయం కోసం ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాలి.పాన్ నెంబర్ పొందండిలా..ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ సందర్శించండి'నో యువర్ పాన్'పై క్లిక్ చేయండిమీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ నమోదు చేయండి.అథెంటికేషన్ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.వెరిఫికేషన్ తర్వాత మీ పాన్ నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. -
పోలీసులమంటూ ఫోన్.. ముసలావిడ దగ్గర రూ.20 కోట్లు స్వాహ
దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. సంబంధిత అధికారులు ఈ సైబర్ మోసగాళ్ల వలలో పడిపోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రతో రోజూ ఏదో ఓ మూల.. ఇలాంటి ఒక కేసు నమోదవుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 20 కోట్లు కోల్పోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళకు, కొందరు మోసగాళ్లు ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతున్నట్లు కాల్ చేసి చెప్పారు. స్కామర్లు.. పోలీస్ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.. అక్కడ నుంచి స్కామ్ ప్రారంభమైంది. ఆధార్ కార్డును చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో ఆమెను డిజిటల్ అరెస్ట్ చేశారు. కేసును పరిష్కరించడానికి అనేక బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని బలవంతం చేశారు.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను హెచ్చరించారు. అయితే జరుగుతున్న మోసాన్ని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే రూ. 20.25 కోట్లు కోల్పోయింది. ఫిర్యాదు స్వీకరించిన తరువాత.. ఏ ఖాతాలకు డబ్బు బదిలీ అయిందనే విషయాలను పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేసి, మోసగాళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.ఇదీ చదవండి: తగ్గుతూనే ఉన్న బంగారం రేటు: నేటి ధరలు ఇవే..డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఆధార్ స్కామ్ నుంచి సురక్షితంగా ఉండటం ఎలా?పోలీసులు లేదా యూఐడీఏఐ అధికారులు.. ఎప్పుడూ మీ వ్యక్తిగత వివరాలను, ఓటీపీ వంటి వివరాల కోసం ఫోన్ చేయరు. కాబట్టి ఎవరైనా కాల్ చేసి ఇలాంటి వివరాలను అడిగారంటే.. తప్పకుండా వాళ్ళు మోసగాళ్లు అని తెలుసుకోవాలి. మీకు అలాంటి కాల్స్ వస్తే.. వెంటనే డిస్కనెక్ట్ చేసి, 1947కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. -
మా డేటా లీక్ అవుతోంది!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక అవసరానికి మన కీలక వివరాలైన ఆధార్, పాన్ కార్డు, ఈ–మెయిల్, ఫోన్ నంబర్.. వీటిలో ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. అయితే ఇలా మనం ఎంతో నమ్మకంగా ఇతర సంస్థలతో పంచుకునే డేటా కొన్ని మార్గాల్లో లీకవుతున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత వివరాలకు సంబంధించి డేటా లీకేజీలపై ప్రజాభిప్రాయం కోసం లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి. ఆధార్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ.. ఇలా ఏదో ఒక రకమైన తమ డేటా పబ్లిక్ డొమైన్‌లోకి లీకైనట్టుగా సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వెల్లడించారు. డేటా లీకేజీకి ఈ–కామర్స్ వెబ్సైట్లు, టెలికం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పేమెంట్ యాప్‌లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కారణమై ఉండొచ్చని వారు పేర్కొన్నారు. మరో 50 శాతం మంది తమ ఆధార్ లేదా పాన్‌కార్డుల వివరాలు లీకయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు. డేటా లీకేజీ 2022లో 72 శాతంగా ఉండగా.. 2025 ఫిబ్రవరి నాటికి అది 87 శాతానికి చేరినట్టుగా లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. 2024 అక్టోబర్‌లో ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారుల్లో 31 మిలియన్ల మంది డేటా లీకవడం.. ఇటీవల జరిగిన కుంభమేళా సమయంలో సంబంధం లేకుండానే ఎన్నో రకాల ఆఫర్ల పేరిట ఎస్ఎంఎస్లు రావడంతో డేటా లీకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఇటీవల దేశవ్యాప్తంగా 375 జిల్లాల్లో 36 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
ఈ చిన్న పని చేస్తే ఆధార్ కార్డులు భద్రం!
ప్రస్తుతం ఆధార్ కార్డుల దుర్వినియోగం, మోసాలు పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న సంఘనలు చూస్తున్నాం. డిజిటల్ భద్రతకు పెద్దపీట వేస్తున్న ఈ కాలంలో వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించుకోవడం చాలా అవసరంగా మారింది.భారతదేశ ప్రత్యేక గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు, ఫేసియల్ రికగ్నిషన్ వివరాలు వంటి సున్నితమైన బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ఈ డేటాను ఇతరులు దుర్వినియోగం చేయకుండా రక్షించడానికి, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను ఆన్లైన్లో ఎలా లాక్ చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇలా లాక్ చేయండి..మీ ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయడం అనేది యూఐడీఏఐ వెబ్సైట్, ఎంఆధార్ యాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేయవచ్చు.యూఐడీఏఐ వెబ్సైట్లో.. » యూఐడీఏఐ బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ పేజీని సందర్శించండి.» మీ 12 అంకెల ఆధార్ నంబర్, ప్రదర్శించిన భద్రతా కోడ్‌ను నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ పొందడానికి "సెండ్ ఓటీపీ" పై క్లిక్ చేయండి.» ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.» "ఎనేబుల్ బయోమెట్రిక్ లాకింగ్" అనే ఆప్షన్ ఎంచుకోండి.» కన్ఫర్మ్ చేయండి. మీ బయోమెట్రిక్స్ విజయవంతంగా లాక్ అవుతాయి.ఎంఆధార్ యాప్ ద్వారా..» గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎంఆధార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. 4 అంకెల పాస్‌వర్డ్‌ను సెట్ చేయండి.» మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయడం ద్వారా మీ ఆధార్ ప్రొఫైల్‌ను యాడ్ చేయండి.» "బయోమెట్రిక్ సెట్టింగ్స్" ఆప్షన్ కు నావిగేట్ చేయండి.» బయోమెట్రిక్ లాకింగ్‌ను ఎనేబుల్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి స్విచ్ ను టోగిల్ చేయండి.ఎస్ఎంఎస్ ద్వారా..» మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి GETOTP అని 1947కు ఎస్ఎమ్ఎస్ పంపండి.» రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.» LOCKUID <ఆధార్ నంబర్> <ఓటీపీ> ఫార్మాట్ లో 1947 మరో ఎస్ఎంఎస్ పంపండి.» మీ బయోమెట్రిక్స్ లాక్ అయినట్లు సూచించే కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు వస్తుంది.ఆధార్ బయోమెట్రిక్స్ లాక్ ఎందుకు ముఖ్యమంటే..» మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల మీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లు, ఫేస్ రికగ్నిషన్ డేటాను మీ సమ్మతి లేకుండా ధ్రువీకరణ కోసం ఉపయోగించలేరు. ఇది గుర్తింపు (ఐడెంటిటీ) చోరీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.» ఆర్థిక లావాదేవీలు లేదా సిమ్ కార్డు జారీ వంటి ఆధార్ లింక్డ్ సేవలకు అనధికారిక యాక్సెస్ మోసానికి దారితీస్తుంది. బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం వల్ల అదనపు భద్రత లభిస్తుంది.» మీ బయోమెట్రిక్స్ ను లాక్ చేయడం ద్వారా, మీరు మీ వ్యక్తిగత డేటాను నియంత్రణలోకి తీసుకుంటారు. అనధికార ప్రయోజనాల కోసం దుర్వినియోగం కాకుండా చూసుకుంటారు.» ఒక వేళ మీరే మీ బయోమెట్రిక్స్‌ను ప్రామాణీకరణ కోసం ఉపయోగించాల్సి వస్తే, మీరు వాటిని అదే పద్ధతుల ద్వారా తాత్కాలికంగా అన్‌లాక్ చేయవచ్చు. తర్వాత ఇది దానంతటదే లాక్ అవుతుంది. -
మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులున్నాయి? ఇలా తెలుసుకోండి
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎంత తెలిసినవారైనా తప్పకుండా మోసపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే సిమ్ కార్డును కొనుగోలు చేసే సమయంలో తప్పకుండా చెల్లుబాటు అయ్యే చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. దీనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తారు. ఈ ఆధారాలను ఉపయోగించి కొందరు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు.ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న సమయంలో.. ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి సిమ్ కార్డు ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి పేరుతో తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు.ఆర్ధిక నేరాలను తగ్గించడానికి.. ఆధార్ సమాచారాన్ని దుర్వినియోగం కాకుండా చూడటానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ (DoT) టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAF-COP) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు లేదా ఫోన్ నెంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవచ్చు.ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యాయో చెక్ చేయడం ఎలా?సంచార్ సతి అధికారిక వెబ్సైట్ (www.sancharsaathi.gov.in) ఓపెన్ చేయాలి.వెబ్‌సైట్‌ను కిందికి స్క్రోల్ చేస్తే.. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కనిపిస్తుంది. దానికి కింద మొబైల్ కనెక్షన్లను చూడటానికి ఆప్షన్ ఎంచుకోవాలి.మొబైల్ కనెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తరువాత.. మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది.అక్కడ మీ 10 అంకెల మొబైల్ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.దానికి కింద అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత మీ ఫోన్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.ఓటీపీ ఎంటర్ చేసిం తరువాత మీ ఆధార్ కార్డ్‌కి ఎన్ని నెంబర్స్ లింక్ అయ్యాయో డిస్ప్లే మీద కనిపిస్తాయి.అక్కడ మీరు అనవసరమైన నెంబర్లను బ్లాక్ చేసుకోవచ్చు.సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొనేసి.. వినియోగించిన తరువాత పడేస్తుంటారు. ఇలాంటి నెంబర్లను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడకు చెందిన ఒకే వ్యక్తి కార్డుతో 658 సిమ్ కార్డులు యాక్టివేట్ అయినట్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. టెలికామ్ అధికారులు వీటిని మొత్తం బ్లాక్ చేశారు.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!సిమ్ కార్డులను ఉపయోగించిన తరువాత, ఎక్కడపడితే అక్కడ పడేయడం మంచిది కాదు. వాటిని కొంతమంది మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అంతే కాకుండా మీ ఆధార్ కార్డు లేదా ఇతర డాక్యుమెంట్స్ ఉపయోగించే తెలియనివారికి ఎట్టిపరిస్థితుల్లో సిమ్ కార్డులను కొనుగోలు చేసి ఇవ్వొద్దు. వారు ఏదైనా నేరాలకు పాల్పడితే.. దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. -
ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.50 వేల లోన్
బ్యాంకులలో రుణాలు పొందడం అంత సులువు కాదు. హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాలి.. సవాలక్ష డాక్యుమెంట్లు సమర్పించాలి. అయితే ఇవన్నీ లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి రూ.50 వేలు లోన్ పొందే అవకాశం ఉంది. అదే పీఎం స్వనిధి యోజన పథకం.కోవిడ్ (COVID-19) మహమ్మారి బారిన పడిన వ్యాపారాలకు మద్దతుగా ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారుల స్వావలంబన కల్పించాలన్నది ఈ పథకం ఉద్దేశం. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఆధార్ కార్డుతో రుణాన్ని పొందవచ్చు.ఇది ఎలా పని చేస్తుందంటే..చిరు వ్యాపారులకు ప్రారంభంలో రూ.10,000 వరకు రుణం ఇస్తారు. వారు ఈ లోన్ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే, తదుపరిసారి రూ.20,000 రుణం పొందవచ్చు. దీన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించిన తర్వాత రూ.50,000 లోన్ అందుకోవచ్చు.ఆధార్ కార్డు తప్పనిసరిపీఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు తమ ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించాలి.ఎలా దరఖాస్తు చేయాలి?పీఎం స్వనిధి వెబ్సైట్ ప్రకారం.. రుణగ్రహీతలు తప్పనిసరిగా లోన్ అప్లికేషన్ ఫారమ్ (LAF)ని పూరించడానికి అవసరమైన సమాచార పత్రాలను అర్థం చేసుకోవాలి.ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ఆధార్ ధ్రువీకరణ కోసం మొబైల్ నంబర్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయడం తప్పనిసరి. దీంతోపాటు రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుండి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల (ULB) నుండి సిఫార్సు లేఖను పొందవలసి ఉంటుంది.మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి ఫారమ్‌ను తప్పనిసరిగా పూరించాలి. ఇతర పత్రాలు అవసరం లేదు.ఈ పథకంలో రుణం పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు. అర్హత ప్రమాణాలను సరిచూసుకుని తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి.ఈ మూడు దశలను అనుసరించిన తర్వాత పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్‌లో లేదా వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.మరి వడ్డీ రేటు ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకానికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (SFB), సహకార బ్యాంకుల వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం ఉంటాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు (NBFC) వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటాయి. ఎంఎంఫ్ఐలు (non NBFC) ఆర్బీఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర కేటగిరి సంస్థలకు ప్రస్తుతం ఉన్న ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పథకం కింద వడ్డీ రేట్లు వర్తిస్తాయి. -
ఆధారం..జాగారం!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఏ చిన్న పని కావాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. స్కూళ్లలో అడ్మిషన్ నుంచి ఉద్యోగం పీఎఫ్ వరకు, మొబైల్ సిమ్‌కార్డు నుంచి ట్రైన్ టికెట్ వరకు ఆధార్ కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలను పొందాలనుకునే ఆధార్ తప్పనిసరి. అలాంటి ఆధార్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రతిచోటా సమస్యలే. ఆ మార్పులు, చేర్పుల కోసం జనం తిప్పలు పడుతున్నారు. ఆధార్‌లో మార్పుచేర్పులు, అప్డేషన్కు ఉన్న పరిమితుల కారణంగా.. అవి దాటితే కచ్చితంగా ప్రాంతీయ కార్యాలయానికి రావాల్సిందే. దీనితో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి జనం క్యూకడుతున్నారు. తెల్లవారుజాము నుంచే టోకెన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. రోజుకు 150 టోకెన్లు మాత్రమే ఇస్తుండటంతో మిగతావారు ఉసూరుమనాల్సి వస్తోంది. ప్రధానంగా విద్యార్థుల ఆధార్ కార్డులో అప్డేషన్ సమస్యగా మారింది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకున్నవారు... నిర్ధారిత వయసు దాటాక బయోమెట్రిక్‌ను అప్డేట్ చేయించుకోవాల్సి రావడమే దీనికి కారణం.అప్డేట్కు పరిమితులతో... భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధార్ రికార్డుల్లో మార్పులు, చేర్పులపై కొన్ని నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆధార్ కార్డులో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటివి అప్డేట్ చేసుకునేందుకు పరిమితులు పెట్టింది. ఆధార్ కార్డులో పేరును రెండుసార్లు మాత్రమే అప్ డేట్ చేసుకోవచ్చు. ఇంటిపేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ఇందుకోసం తగిన ధ్రువపత్రాలను సమర్పించాలి.. పుట్టిన తేదీని కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. అదికూడా నమోదు సమయంలో ఇచ్చిన తేదీకి మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. ఇందుకోసం తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాలి. జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా అప్డేట్ చేసుకోవచ్చు. దీనిపై పరిమితి లేదు. జారీ అయి పదేళ్లు దాటిన ఆధార్ కార్డుల్లో ఫొటో అప్డేట్ తప్పనిసరి.రీజనల్ ఆఫీసులోనే మార్పులు.. నిర్దేశిత పరిమితి వరకు ఆన్లైన్లో తగిన ధ్రువపత్రాలను సమర్పించి ఆధార్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. పరిమితి దాటితే యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వాటికి తగిన ఆధారాలను జత చేయడంతోపాటు ఎందుకు వివరాలు మార్చాల్సి వస్తోందనేది స్పష్టంగా పేర్కొనాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నా.. దానిపై అవగాహన లేక జనం ఇబ్బందిపడుతున్నారు. అంతేకాదు ఈ దరఖాస్తులకు తగిన ఆధారాలను చేయాలి, ఏమేం సమర్పించవచ్చన్నది తెలియడం లేదని జనం వాపోతున్నారు. దీనితో నేరుగా ప్రాంతీయ కార్యాలయానికి వస్తున్నామని పేర్కొంటున్నారు.9 ఏళ్ల పాపకు 16 ఏళ్ల వయసు వేశారు మాది ఏపీలోని కర్నూలు జిల్లా నందవరం గ్రామం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటా. నా కూతురు పేరు ఇందు. ఆమె వయసు తొమ్మిదేళ్లే. కానీ ఆధార్ కార్డులో 16 ఏళ్లు అని వచ్చిoది. దీనితో ప్రభుత్వ అమ్మ ఒడి పథకం అందలేదు. మూడుసార్లు కర్నూలులో ప్రయత్నించినా ఆధార్‌లో మార్పు జరగలేదు. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాలంటే వచ్చాం. రెండు, మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఏం చేయాలో తెలియడం లేదు. – హుసేనమ్మ, నందవరం గ్రామం,కర్నూలు జిల్లానాలుగేళ్లుగా తిరుగుతున్నాం మాది మహబూబ్‌నగర్ జిల్లా కాకర్లపాడు గ్రామం. నా కూతురు మాధవి ఇంటర్ చదువుతోంది. తన ఆధార్‌లో పేరు తప్పుగా ఉండటంతోపాటు బయోమెట్రిక్ తప్పుగా చూపిస్తోంది. నాలుగేళ్ల నుంచి స్థానికంగా ప్రయత్నం చేశాం. తెలిసిన వారు చెబితే ప్రాంతీయ కార్యాలయానికి వచ్చాం. తప్పులు సవరించాలంటే ఏం చేయాలనేది ఎవరూ చెప్పడం లేదు. – భారతమ్మ, కాకర్లపాడు, మహబూబ్‌నగర్ అక్క బయోమెట్రిక్ తమ్ముడికి.. తమ్ముడి బయోమెట్రిక్ అక్కకు.. చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరూ అక్కాతమ్ముళ్లు. కర్నూలు జిల్లా సీ బెళగాల్ మండలం చెందిన కృష్ణ దొడ్డి గ్రామానికి చెందినవారు. వీరి ఆధార్‌కార్డుల్లో అక్క మమత బయోమెట్రిక్‌ను తమ్ముడికి, తమ్ముడు గోవర్ధన్ బయోమెట్రిక్‌ను అక్క ఆధార్‌కు అనుసంధానం చేశారు. దీన్ని సరిచేసుకునేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.ఇప్పటికే హైదరాబాద్‌లోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌లో ఉన్న యూఐడీఏఐ ప్రాంతీయ ఆఫీస్‌కు మూడు సార్లు వచ్చామని.. ప్రతీసారి ఈ– మెయిల్ పెట్టామని చెప్తున్నారే తప్ప, సమస్య మాత్రం పరిష్కారం కాలేదని చెబుతున్నారు.ఈ చిత్రంలోని విద్యార్థి పేరు మహమ్మద్ అబ్దుల్ గనీ. ఆరేళ్ల ›వయసులో ఉన్నప్పడు 2011లో అతడి తల్లిదండ్రులు ఆధార్ నమోదు చేయించారు. రెండేళ్ల క్రితం ఫోటో అప్డేట్ చేయించారు. ప్రస్తుతం ఘనీ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ అవసరం ఉండటంతో వేలిముద్ర ఇచ్చాడు. అది మిస్ మ్యాచ్ అని వస్తుండటంతో.. ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అప్డేషన్కు ప్రయత్నిoచాడు. కానీ ఆ బయోమెట్రిక్‌తో వేరేవారి పేరుతో ఆధార్ ఉన్నట్లుగా చూపిస్తోంది. యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి ప్రయత్నించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. -
ఉచిత ఆధార్ అప్డేట్ గడువు పొడిగింపు
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఉచిత అప్డేట్ గడువును వచ్చే ఏడాదికి పొడిగించింది. గతంలో తెలిపిన విధంగా ఉచిత ఆధార్ అప్డేట్కు ఈ రోజు చివిరి తేదీ. కానీ దాన్ని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. ఈమేరకు ఆధార్ అధికారిక ఎక్స్ లింక్‌లో వివరాలు పోస్ట్ చేసింది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (2025, జూన్ 14) లోపు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ.50 అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.#UIDAl extends free online document upload facility till 14th June 2025; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAl has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/wUc5zc73kh— Aadhaar (@UIDAI) December 14, 2024ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఆధార్ ఉచిత అప్డేట్.. రేపే లాస్ట్ డేట్!
మైఆధార్ పోర్టల్‌లో ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా.. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 'డిసెంబర్ 14' చివరి రోజుగా ప్రకటిస్తూ 'యూఐడీఏఐ' (UIDAI) వెల్లడించింది. అయితే పేర్కొన్న గడువు సమీపిస్తోంది. ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. అయితే ఈ డేట్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేదా? అనేది రేపు తెలుస్తుంది.యూఐడీఏఐ వెల్లడించిన గడువు (డిసెంబర్ 14) లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.● అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
ఆధార్ లాక్/అన్‌లాక్ గురించి తెలుసా?
ఆధార్ కార్డు జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ప్రభుత్వ పథకాలను అప్లై చేయడానికి ఇలా.. అన్నింటికీ ఆధార్ అవసరమవుతోంది. ఆధార్ నమోదు సమయంలోనే వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీష్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి వేలి ముద్ర వేయగానే మన డీటైల్స్ అన్నీ తెలిసిపోతాయి.వేలి ముద్ర వేయగానే అన్ని వివరాలు తెలిసిపోతుండటం వల్ల, సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ లాక్ & అన్‌లాక్➤యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన 'ఎంఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక వ్యక్తి ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.➤యూఐడీఏఐ ఎంఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు 'ఎంఆధార్'ను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.➤ఎంఆధార్ యాప్‌ను యాక్సెస్ చేసిన తరువాత ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.➤అయితే ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ కనిపిస్తుంది. ఆధార్ లాక్ చేయడానికి 'బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ లాక్ అవుతుంది.➤అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.ఆధార్ లాక్ వల్ల ఉపయోగాలువ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పడకుండా ఉండటానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఉపయోగపడుతుంది. దీంతో మీరు మోసాలకు బలికాకుండా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!
ఆధార కార్డు అప్డేట్ కోసం.. 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' పలుమార్లు గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. కాగా ఇప్పుడు పొడిగించిన గడువు (డిసెంబర్ 14) సమీపిస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు చేయాలనుకునేవారు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.డిసెంబర్ 14 లోపల ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఇప్పటి వరకు స్థాన చలనం చేయకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➜మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➜లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➜నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➜రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➜అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➜మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➜అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు.ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం.ఇదీ చదవండి: ఈ ఒక్క ఐడీ ఉంటే చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు! -
రేపటి నుంచి ఇవన్నీ మారుతాయి: తప్పక తెలుసుకోండి
నవంబర్ నెల ముగిసింది. రేపటి (డిసెంబర్ 1) నుంచి ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు ఎల్పీజీ ధరలు, ఏటీఎం కార్డు, పాన్ ఆధార్ లింక్, పెట్రోల్ ధరలు వంటి వాటిమీద ప్రభావం చూపుతాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎల్పీజీ ధరలుప్రతి నెల మాదిరిగానే ఆయిల్ మార్కెట్ కంపెనీలు 1వ తేదీ ఎల్పీజీ సిలిండర్ (కమర్షియల్, డొమెస్టిక్) ధరలను సవరిస్తాయి. ప్రతి నెలలోనూ కమర్షియల్ సిలిండర్ ధరలలో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. డిసెంబర్ 1న జరిగే మార్పులు కూడా బహుశా మునుపటి మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.TRAI గడువుడిసెంబర్ 1, 2024న.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ & ఫిషింగ్ సందేశాలను తగ్గించే లక్ష్యంతో కొత్త ట్రేస్బిలిటీ నిబంధనలను అమలు చేస్తుంది. ఈ నిబంధనలు ఓటీపీ సేవలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఓటీపీ డెలివరీలలో ఆలస్యం ఉండదని ట్రాయ్ ధృవీకరించింది.SBI క్రెడిట్ కార్డ్డిసెంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు.. డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ వివరాలకు ఉచిత అప్డేట్ చేసుకోవడానికి గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) పొడిగించింది. కాబట్టి కార్డ్ హోల్డర్లు ఇప్పుడు డిసెంబరు 14 వరకు ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా ఎటువంటి ఛార్జీలు లేకుండా తమ పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనంటే ప్రాసెసింగ్ ఫీజు ఉండే అవకాశం ఉంది.ఆలస్యంగా ఐటీఆర్ దాఖలుజూలై 31 గడువులోగా 2023-24 (FY 24) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) ఫైల్ చేయడంలో విఫలమైన వ్యక్తులు.. డిసెంబర్‌లోగా తమ ITRని సమర్పించే అవకాశం ఉంది. ప్రారంభ గడువును కోల్పోయిన వారు ఇప్పుడు డిసెంబర్ 31 వరకు అపరాధ రుసుముతో ఆలస్యంగా ITRని ఫైల్ చేయవచ్చు. -
ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు, కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి. దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 చివరి రోజు. ఇప్పటికే.. పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం, మళ్ళీ గడువును పెంచుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆధార్ అప్డేట్ అనేది అవసరమా?.. ఇది ఎందుకు పనికొస్తుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక నగరం నుంచి మరో నగరానికి మారితే? లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే.. అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా.. పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు.ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించిన ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అయితే ఇకపైన లేదా డిసెంబర్ 14 తరువాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం. ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే కంటే ఎక్కువ ఉద్యోగాలు!.. జెప్టో ఫౌండర్ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం ఎలా?➠మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి➠లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.➠నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.➠రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.➠అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.➠మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.➠అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్డేట్ను ట్రాక్ చేయవచ్చు. -
మాస్క్డ్ ఆధార్ కార్డు గురించి తెలుసా?: ఇది చాలా సేఫ్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొంతమంది.. ఇతరుల ఆధార్ కార్డు నెంబర్‌ను కొన్ని అనధికార కార్యకలాపాలకు వినియోగిస్తారు. అసలు ఆ వ్యక్తికే తెలియకుండా ఈ చర్య జరిగిపోతుంది. కాబట్టి మన ఆధార్ కార్డు నెంబర్ సురక్షితంగా ఉండాలంటే.. మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎక్కడ, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఆధార్ కార్డు దుర్వినియోగానికి చరమగీతం పాడటానికి కేంద్రం ఈ మాస్క్డ్ ఆధార్ కార్డును తీసుకువచ్చింది. ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం లేని.. లేదా ఈకేవైసీ మాత్రమే ఇవ్వాల్సిన చోట మాస్క్డ్ ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ తరహా ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. మాస్క్డ్ ఆధార్ కార్డుసాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ముందు ఉన్న ఎనిమిది అంకెలకు మాస్క్ ఉంటుంది. అంటే.. ఆ ఎనిమిది నెంబర్లు కనిపించవన్నమాట. దీనిని ఉపయోగించడం వల్ల ఇతరులు మీ ఆధార్ నెంబర్‌ను దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేయడం ఎలా?•మాస్క్డ్ ఆధార్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక UIDAI వెబ్సైట్ ఓపెన్ చేయాలి.•వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి.•తరువాత 12 ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని కింద ప్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.•ఆలా చేసిన తరువాత రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అక్కడ మాస్క్డ్ ఆధార్ కావాలా? అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.•ఆలా చేసిన తరువాత మీకు మాస్క్డ్ ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. దీనిని పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరికపాస్వర్డ్ ఏమిటంటే•మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అయిన తరువాత పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేసుకోవాలి.•పాస్వర్డ్ ఏమిటంటే.. ఉదాహరణకు మీ పేరు RAGHURAMARAJU అనుకుందాం. మీరు పుట్టిన సంవత్సరం 1994 అనుకుంటే..•మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం కలిపితే అదే పాస్వర్డ్ (RAGH1994) అవుతుంది. దీనిని ఉపయోగించి మాస్క్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. -
డిసెంబర్ 14 డెడ్‌లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!
ఆధార్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారమిది. ఆధార్ కార్డు తీసుకుని చాలా కాలమైనా అప్డేట్ చేయనివారి ఆధార్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయవచ్చు. కాబట్టి అలాంటి ఆధార్ కార్డులను గడువులోపు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం.ఆధార్ కార్డ్‌లు జారీ చేసి పదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమైనవారు తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఉచిత ఆన్లైన్ సదుపాయాన్ని అందించింది. ఇందుకు అనేకసార్లు గడువును పొడిగించింది. కానీ ఇప్పటికీ వేలాది మంది ఈ పని చేయలేదు. ఇలాంటి ఆధార్ కార్డులను ప్రభుత్వం రద్దు చేయవచ్చు. దీని కోసం, మీరు 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.ఆధార్ అప్డేట్ ఆవశ్యకతప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు అన్నింటికీ ఉపయోగించే ఆధార్ కార్డు ప్రస్తుతం ముఖ్యమైన గుర్తింపు కార్డుగా మారింది. పదేళ్లలో మీ చిరునామా, ఫోటో మారి ఉండవచ్చు. ఆ సమాచారాన్ని ఆధార్‌లో అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.డిసెంబర్ 14 ఆఖరి గడువు?పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. ఈ గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. మొదట మార్చి 14, ఆపై జూన్ 14, ఆ తర్వాత సెప్టెంబర్ 14 గడువు విధించగా ఇప్పుడు డిసెంబర్ 14 వరకూ అవకాశం ఇచ్చింది. అయితే ఇదే చివరి గడువు అని భావిస్తున్నారు.ఆధార్ కార్డును అప్డేట్ చేయండిలా..⇒ 'MyAadhaar' పోర్టల్‌కి వెళ్లి లాగిన్ చేసి, మీ ఆధార్ నంబర్ , మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.⇒ అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. మీ గుర్తింపు, చిరునామా కోసం కొత్త పత్రాలను అప్లోడ్ చేయండి.⇒ ఈ సర్వీస్ ఉచితం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని వీలైనంత త్వరగా దీన్ని అప్డేట్ చేసుకోండి.ఆధార్ కార్డ్ అప్డేట్కు అవసరమైన పత్రాలురేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, జన-ఆధార్ కార్డ్, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, లేబర్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, సీజీహెచ్ఎస్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి. -
ఇక పోలీస్ వద్ద ‘ఆధార్’
సాక్షి, అమరావతి: ఆధార్ డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేవాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వేలిముద్రలకు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఆధార్ డేటాను పర్యవేక్షించే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)ను ఇప్పటికే ఆదేశించింది. యూఐడీఏఐ చట్ట ప్రకారం ఆధార్ డేటా అత్యంత గోప్యంగా ఉంచాలి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కీలక డేటా కావడంతో ఈ మేరకు కఠిన నిబంధనలను రూపొందించింది. ఆధార్ డేటాలోని ప్రాథమికమైన వేలి ముద్రలు, ఐరీష్ స్కాన్లను ఇతరులకు అందుబాటులోకి తేకూడదని ఆధార్ చట్టంలోని సెక్షన్ 29 (1) స్పష్టం చేస్తోంది. కాగా హైకోర్టు అనుమతితో కొంత పరిమిత డేటాను పోలీసులు పొందేందుకు సెక్షన్ 33 (1) అవకాశం కల్పిస్తోంది. దాంతో నిర్దిష్టమైన కేసుల దర్యాప్తు కోసం పోలీసులు హైకోర్టు అనుమతితో ఆధార్ డేటాను పరిశీలిస్తున్నారు. కానీ నేర పరిశోధన తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రధానంగా గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వలస కూలీలు, నిరుపేదలకు ఎలాంటి పత్రాలు ఉండడం లేదు. అందుకే ఆధార్ డేటాను తమకు అందుబాటులోకి తేవాలని వివిధ రాష్ట్రాల పోలీసు శాఖలు కేంద్ర హోం శాఖను కోరుతున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆధార్ డేటాను అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకోసం అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని భావిస్తోంది. -
Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది. ‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. -
ఆధార్ తరహాలో అపార్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆధార్ కార్డు తరహాలోనే ఇక ముందు విద్యార్థులకు అపార్ కార్డులు రానున్నాయి. విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు వెళ్లినా.. ఉపకార వేతనాలు రావాలన్నా అపార్ కార్డు ఉండాల్సిందే. కేంద్రం జాతీయ విద్యావిధానంలో భాగంగా ఆధార్ తరహాలోనే వన్ నేషన్ స్టూడెంట్ పేరిట ప్రభుత్వ , ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో కేజీ టు పీజీ వరకు దేశంలోని ప్రతి విద్యార్థికి 12 అంకెలతో కూడిన ఒక ప్రత్యేక ఐడీని అపార్ (ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కేటాయించనున్నారు. ఇది దేశంలో ప్రతి విద్యార్థికి అందించే గుర్తింపు నంబర్. ఇప్పటికే విద్యార్థి వివరాలు యూ డైస్ ప్లస్‌లో నమోదు చేసిన నేపథ్యంలో అందులోనే తల్లిదండ్రులు సూచించిన సవరణలు చేసి ఆన్లైన్లో అపార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ప్రధానోపాధ్యాయుడి ధ్రువీకరణ తప్పనిసరి. ఆధార్ అనుసంధానమైన చరవాణికి ఓటీపీ వచ్చిన తర్వాత గుర్తింపు నంబర్ జారీ అవుతుంది. ఒకసారి ఆన్లైన్లో కార్డు వెలువడిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు.జిల్లాలో 1423 పాఠశాలలుజిల్లా వ్యాప్తంగా 1,423 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథఽమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత 191, ఉన్నత పాఠశాలలు 205, కస్తూర్బాలు 20, ఆదర్శ పాఠశాలలు 10, గురుకుల పాఠశాలలు 46, ప్రైవేట్ పాఠశాలలు 442 ఉన్నాయి. వాటిలో 50 లక్షలకు పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఒక ఐడీ, కళాశాల స్థాయిలో మరో ఐడీ ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా అందించే అపార్ కార్డులోనే అన్ని వివరాలు పొందు పరిచి ఉండనున్నాయి. అపార్ కార్డును జీవిత కాలం ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి కి సంబంధించిన పేరు, వయస్సు, లింగం, క్యూ ఆర్ కోడ్,తో పాటు, విద్యార్థి సాధించిన విజయాలు, ఉపకార వేతనాలు, మెమోలు, ధ్రువపత్రాలు, దీనికి ఆధార్ కార్డు కూడా అనుసంధానం ఉండటంతో కుటుంబ వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో నంబర్ లేదా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి.ఇవీ ప్రయోజనాలుఅపార్ కార్డు విద్యార్థి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. అలాగే..విద్యార్థి బ్యాంక్ ఖాతా డీజీ లాకర్‌తో అనుసంధానమై ఉంటుంది. విద్యా సంస్థలలో ఒక చోట నుంచి మరోచోటుకు ప్రవేశాల నిమిత్తం వెళ్లినప్పుడు, ప్రవేశ పరీక్షల్లో వివరాల నమోదులో ధ్రువీకరణ సులభంగా అవుతుంది. ఉపకార వేతనాలు, ఉద్యోగాల భర్తీ సమయంతో పాటు చాలా సందర్భాలలో అపార్ కార్డు కీలకం కానుంది. సర్టిఫికెట్లు పోతే కూడా డీజీ లాకర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.అపార్ కార్డే కీలకంకేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ స్టూడెంట్ నేపథ్యంలో అపార్ కార్డును తీసుకొచ్చింది. ఆధార్ తరహాలోనే భవిష్యత్‌లో విద్యార్థులకు అపార్ కార్డే కీలకం కానుంది. ఈ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అపార్కార్డుకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. వేరే పాఠశాలలకు వెళ్లాలన్నా, పై చదువులకు కూడా ఈ అపార్‌కార్డు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.–వెంకటేశం, డీఈవో -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. శనివారంతో గతంలో ఇచి్చన గడువు ముగియడంతో ఉడాయ్ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది. పదేళ్ల కిందటి ఆధార్ కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్డేట్లను ఉచితంగా చేసుకొనేందుకు గడువును మరో మూడునెలల పాటు.. డిసెంబర్ 14 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పొడగించింది. ఆన్లైన్లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మై ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయి మార్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు వివరాలను అప్డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఒకవేళ డిసెంబర్ 14లోగా ఉచితంగా అప్డేట్ చేసుకోలేని వారు... తర్వాత 50 రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. -
ఆధార్ ఫ్రీ అప్డేట్: యూఐడీఏఐ కీలక నిర్ణయం
ఆధార్ కార్డులోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ 'మై ఆధార్' (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంది. ఆన్లైన్ పోర్టల్ యూఐడీఏఐ వెబ్సైట్లో పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను డిసెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15 నుంచి పొడిగిస్తూ.. మార్చి 14, ఆ తరువాత జూన్ 14, సెప్టెంబర్ 14కు పొడిగిస్తూ.. ఇప్పుడు తాజాగా ఈ తేదీని డిసెంబర్ 14కు పొడిగించారు.ఇదీ చదవండి: ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే.. ఆన్లైన్లో ఆధార్ అప్డేట్➤మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి➤క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.➤మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.➤మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.➤'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.➤మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి➤ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.➤'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.➤14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది.#UIDAI extends free online document upload facility till 14th December 2024; to benefit millions of Aadhaar Number Holders. This free service is available only on #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar. pic.twitter.com/ThB14rWG0h— Aadhaar (@UIDAI) September 14, 2024 -
గ్యాస్ నుంచి ఆధార్ వరకు.. వచ్చే నెలలో మార్పులు
ఆగస్ట్ నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రజల ఆర్థిక స్థితిని నేరుగా ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన మార్పులు సెప్టెంబర్ నుండి జరగబోతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరల నుండి ఆధార్ అప్డేట్ వరకు రానున్న మార్పులు, కొత్త క్రెడిట్ కార్డ్ నియమాలు మీ బడ్జెట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ చూద్దాం..ఎల్పీజీ ధరలుప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడం సర్వసాధారణం. ఈ సర్దుబాట్లు వాణిజ్య, డొమెస్టక్ గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతాయి. గత నెలలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది. జూలైలో రూ.30 తగ్గింది. మరోసారి సెప్టెంబర్‌లో ఎల్పీజీ సిలిండర్ల ధర మార్పుపై అంచనాలు ఉన్నాయి.సీఎన్జీ, పీఎన్జీ రేట్లుఎల్పీజీ ధరలతో పాటు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), సీఎన్జీ, పీఎన్జీ ధరలను కూడా సవరిస్తాయి. అందువల్ల, ఈ ఇంధనాల ధరల సవరణలు కూడా సెప్టెంబర్ మొదటి రోజున జరుగుతాయి.ఆధార్ కార్డ్ ఉచిత అప్‌డేట్ఆధార్ కార్డ్‌లను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. ఈ తేదీ తర్వాత, ఆధార్ కార్డ్‌లకు నిర్దిష్ట అప్డేట్లు చేసుకునేందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఆధార్ అప్డేట్ల కోసం గతంలో జూన్ 14 వరకే గడువు విధించగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.క్రెడిట్ కార్డ్ నియమాలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ యుటిలిటీ లావాదేవీల ద్వారా ఆర్జించే రివార్డ్ పాయింట్లపై సెప్టెంబర్ 1 నుండి పరిమితిని ప్రవేశపెడుతోంది. ఇకపై ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా 2,000 పాయింట్లను మాత్రమే పొందగలరు. థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా చేసిన విద్యాపరమైన చెల్లింపులకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సెప్టెంబర్ 2024 నుండి క్రెడిట్ కార్డ్‌లపై చెల్లించాల్సిన కనీస చెల్లింపును తగ్గిస్తోంది. అలాగే పేమెంట్ విండో 15 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా, యూపీఐ, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో రూపే క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్లు ఇతర చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్ల మాదిదే రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు.మోసపూరిత కాల్స్ నియమాలుమోసపూరిత కాల్స్, సందేశాలపై సెప్టెంబర్ 1 నుండి కఠినమైన నిబంధనలు ఉండవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 140 మొబైల్ నంబర్ సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలిమార్కెటింగ్ కాల్స్, వాణిజ్య సందేశాలను సెప్టెంబర్ 30 నాటికి బ్లాక్‌చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (DLT) ప్లాట్‌ఫారమ్‌కి మార్చడానికి ట్రాయ్ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.డియర్నెస్ అలవెన్స్కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెప్టెంబరులో డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపును ప్రకటించనుందని ఊహాగానాలు ఉన్నాయి. ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచవచ్చు. అంటే ప్రస్తుతం 50% ఉన్న డీఏ 53 శాతానికి పెరిగే అవకాశం ఉంది. -
ఒక్క క్లిక్‌తో ఆధార్ సెంటర్ లొకేషన్ తెలుసుకోండిలా
మీకు దగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మ్యాప్‌లో ఆధార్ సెంటర్ లొకేషన్ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్ మ్యాప్ నావిగేష్ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్‌తో సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌కు ‘భువన్ ఆధార్’ అని పేరు పెట్టారు.దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్ఆర్ఎస్సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్ మ్యాప్ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్డేట్ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్ ఆధార్’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్‌ను ప్రతీ 15 రోజులకు అప్డేట్ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. #BhuvanAadhaarPortal #EaseOfLivingBhuvan Aadhaar Portal is facilitating Ease of Living by routing easy navigation to your nearest #authorized #Aadhaar Centre.To locate your nearest #AadhaarCentre visit: https://t.co/3Kkp70Kl23 pic.twitter.com/e7wEar5WXi— Aadhaar (@UIDAI) August 21, 2024 -
1.83 కోట్ల మంది ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సిందే!
సాక్షి, అమరావతి: ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికీ.. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 1,83,74,720 మంది తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అలాంటి వారు 18 ఏళ్ల వయసు దాటిన అనంతరం మరోసారి కొత్తగా తమ వేలిముద్రలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అలాంటి వారు 48,63,137 మంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. దీనికి తోడు.. ఎవరైనా ఆధార్‌కార్డు పొందిన తర్వాత పదేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా ఆధార్‌లో అంతకు ముందు పేర్కొన్న అడ్రస్‌తో పాటు ఫొటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉండగా.. ఆ కేటగిరిలో 1,35,07,583 మంది వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.ఐదు రోజులపాటు ఆధార్ ప్రత్యేక క్యాంపులు ఇటీవల జన్మించిన వారికి తొలిసారి ఆధార్‌కార్డుల జారీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఆధార్ కార్డులు తీసుకుని నిబంధనల ప్రకారం తమ వివరాలను మరోసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన 1.83 కోట్ల మంది కోసం ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు ప్రభుత్వం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది.దేశవ్యాప్తంగా ఆధార్ జారీచేసే యూఐడీఏఐ సంస్థ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతరెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆ«ధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.అవసరమైనచోట కాలేజీలు, పాఠశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని.. తగిన ప్రచారం కల్పించడానికి కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్‌ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
40 రోజుల చిన్నారికి ఆధార్
నస్పూర్: దేశంలోనే ఆధార్‌కార్డు కలిగిన పిన్న వయసు్కరాలిగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఐజల్ ఫాతిమా రికార్డు సృష్టించింది. నస్పూర్ కాలనీలో నివసించే సింగరేణి ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ పాషా, సమీరా తబస్సుమ్ దంపతులకు.. ఈ ఏడాది జనవరి 12న ఐజల్ ఫాతిమా జన్మించింది. చిన్నారికి ఫిబ్రవరి 21న ఆధార్ కార్డు మంజూరైంది. దేశంలో జన్మించిన 40 రోజులకే ఆధార్‌కార్డు పొందిన తొలి వ్యక్తిగా ఐజల్ ఫాతిమా గుర్తింపు పొందినట్లు.. మహ్మద్ అఫ్జల్ పాషా తెలిపారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ కుమార్తె చోటు సాధించినట్లు ఆ సంస్థ నిర్వాహకులు సోమవారం తెలియజేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇదే రికార్డు.. పుట్టిన 43 రోజులకు ఆధార్ కార్డు పొందిన నిజామాబాద్ జిల్లా వాసి ఆద్య పేరిట నమోదైందన్నారు. -
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా ఆధార్ సేవలు కొన్ని గంటలుగా నిలిచిపోయాయి. ఆధార్‌కు సంబంధించిన విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సర్వర్ మొరాయించింది. దీంతో ఆధార్ సంబంధిత ఓటీపీలు, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడింది.ఆధార్ డౌన్లోడ్, ఇతర సేవల కోసం యూఐడీఏఐ వెబ్సైట్లో ప్రయత్నిస్తుంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని వస్తోందని పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. బ్యాంకులు, రిజిస్ట్రేషన్ వంటి శాఖల్లో ఆధార్ అనుసంధానిత సేవలకు సంబంధించి ఓటీపీలు కూడా రావడం లేదని వాపోతున్నారు. #Aadhaar #gvt must if time internal server Error why? When we need that time sooing now a days pic.twitter.com/rs1LDr7GhA— dipullb comedyn (@SinhaDipu59035) July 11, 2024 -
ఉచితంగా ఆధార్ అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14ను చివరి తేదీగా యూఐడీఏఐ వెబ్సైట్లో పేర్కొంది.ఆధార్ కార్డ్ ఫ్రీ అప్డేట్ మై ఆధార్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకునేందుకు రూ .50 రుసుము వసూలు చేస్తారు. ఆన్లైన్ పోర్టల్‌లో యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ గడువును పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఈ తేదీని 2023 డిసెంబర్ 15గా నిర్ణయించారు. తరువాత మార్చి 14, ఆ తరువాత జూన్ 14 తాజాగా సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు.ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకోండిలా..» స్టెప్ 1: మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి https://myaadhaar.uidai.gov.in/ కి లాగిన్ అవ్వండి» స్టెప్ 2: క్యాప్చా ఎంటర్ చేసి 'లాగిన్ యూజింగ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.» స్టెప్ 3: మీ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.» స్టెప్ 4: మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు.» స్టెప్ 5: 'డాక్యుమెంట్ అప్డేట్' ఎంచుకోండి. రెసిడెంట్ ప్రస్తుత వివరాలు కనిపిస్తాయి.» స్టెప్ 6: మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను అంటే పేరు, చిరునామా, ఫోటో, ఇతర మార్పులను ఎంచుకోండి» స్టెప్ 7: ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేదా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్‌ను ఎంచుకోండి. అవసరమైన డాక్యుమెంటును అప్లోడ్ చేయండి.» స్టెప్ 8: 'సబ్మిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.» స్టెప్ 9: 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (యూఆర్ఎన్) జనరేట్ అవుతుంది. -
ఆధార్ - రేషన్ కార్డు లింక్.. మరో అవకాశం
ఆధార్ - రేషన్ కార్డు ఇంకా లింక్ చేసుకోని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. వాస్తవానికి వీటిని లింక్ చేసుకోవడానికి గడువు జూన్ 30తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గడువును గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకలను అడ్డుకోవడానికి ఆధార్ - రేషన్ కార్డును తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. వీటి అనుసంధానం వల్ల అర్హులకు ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటు అవసరమైన పత్రాలను అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో లింక్ పూర్తి చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా ఆధార్ - రేషన్ కార్డు లింక్ చేయవచ్చు. -
డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్‌కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్‌గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్‌ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.డిజీలాకర్ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, రేషన్‌కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్‌లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.వినియోగం ఇలా..ప్లేస్టోర్ నుంచి ఫోన్లో డిజీలాకర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్‌లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్‌కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్‌కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్‌లో సెర్చ్ సింబల్‌పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకొని హాల్‌టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్‌కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..ఇతర పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలంటే..కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్‌లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్‌పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్‌గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్‌లో ప్రతీ యూజర్‌కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు. -
ఆధార్ కార్డ్ గడువు మరో వారం రోజులు మాత్రమే..
-
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు. ఆధార్ కార్డులో మార్పుల కోసం..ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదం కాదు.. అల్లుడే చంపేశాడురోడ్డు ప్రమాదంలో కుమారి, ఆమె కుమార్తెలు కన్నుమూశారనే సమాచారంతో కుమారి తల్లిదండ్రులు, బంధువులు ఏన్కూరు మండలం రంగాపురం తండా నుంచి పెద్దసంఖ్యలో పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుమార్తె, మనవరాళ్ల మృతదేహాలను చూసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే, ఇది రోడ్డు ప్రమాదం కాదని తమ అల్లుడే ముగ్గురిని హత్య చేశారని కుమారి తల్లిదండ్రులు హరిసింగ్ – పద్మ ఆరోపించారు. ముగ్గురి మృతదేహాలపై ఎక్కడా రక్తం వచ్చిన దాఖలు లేవని వారు పేర్కొన్నారు. అంతేకాక డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ మాత్రమే గాయాలతో బయటపడడం ఏమిటని ప్రశ్నించారు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఐదేళ్ల క్రితం రూ.24 లక్షల కట్నంగా ఇచ్చి వివాహం జరిపించామని, కానీ ఇద్దరు అమ్మాయిలే జన్మించడంతో మగపిల్లాడు లేడని తరచుగా తమ కుమార్తెను వేధించేవాడని ఆరోపించారు. అంతేకాక వివాహేతర సంబంధాలతో నిత్యం వేధించేవాడని వాపోయారు. గత 20 రోజుల క్రితం కూడా ఓ యువతితో కేరళ వెళ్లొచ్చాడని, ఈనెల 25న వివాహ వార్షికోత్సవానికి కేక్ తీసుకురావాలని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈమేరకు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కుమారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీహరి తెలిపారు. అలాగే, ప్రమాదంపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. -
జీఎస్టీ నమోదుకు ఆధార్ బయోమెట్రిక్!
న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్‌లను ధృవీకరించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. -
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
మే 13, 2024.. సోమవారం. రెండు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ. ప్రతీ ఓటరు ఓటేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సందర్భం. ఈ నేపథ్యంలో ఓటుకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓటు వేయడానికి అమల్లో ఉన్న పద్ధతులేంటీ? అన్న విషయాలు తెలుసుకుందాం.ఓటరు జాబితాలో పేరుందా?మీరు ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం మీ పేరు ఓటరు జాబితాలో ఉందా? ఎన్నికల సంఘం వెబ్సైట్లో మీ పేరు లేదా ఎపిక్ నెంబర్ లేదా అడ్రస్‌తో చెక్ చేసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వెబ్సైట్లో మీరు సులభంగా చెక్ చేసుకోవచ్చుఎపిక్ డౌన్లోడ్ చేసుకోండిఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) ఉండడం మంచిది. మీ పేరు జాబితాలో ఉంటే మీ ఎపిక్‌ను మీరు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://voterportal.eci.gov.in/login వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలు నమోదు చేయగానే డౌన్లోడ్ అప్షన్ వస్తుంది. అయితే మీ మొబైల్ నెంబర్ అనుసంధానం కాకపోతే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోలేరు.ఎపిక్‌లో లోపాలుంటే... ఇక కొందరి ఓటరు కార్డుల్లో స్వల్ప తేడాలు (అడ్రస్ మార్పు, ఫోటో పాతది ఉండడం లేదా పేరు అక్షరాల్లో మార్పులు) ఉండొచ్చు. దానికి ఎలాంటి కంగారు లేదు. ఎపిక్ వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పిస్తారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారు కావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుంది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది.♦ ఆధార్‌కార్డు ♦ ఉపాధి హామీ కార్డు♦ జాబ్ కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్♦ పాన్‌కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్‌పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ)పోలింగ్ స్లిప్పులుపోలింగ్కు కొన్ని రోజుల ముందే పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేస్తారు. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరు. కానీ ఇందులో.. పార్ట్ నెంబర్, ఓటరు సీరియల్ నెంబరు ఉంటాయి. ఈ వివరాలతో ఓటరు జాబితాలో మిమ్మల్ని సులభంగా గుర్తిస్తారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదున్నా.. మీకు ఓటు హక్కు కల్పిస్తారు. కాబట్టి పోలింగ్ స్లిప్పు ఉంటే మీ పని చాలా సులభం.పోలింగ్ బూత్‌లో మీ ఓటు ఎలా వేసుకోవాలంటే.?పోలింగ్ బూత్‌లోకి వెళ్లగానే మీ దగ్గరున్న పోలింగ్ స్లిప్పును చూపించండి. లేదా మీ ఓటరు సీరియల్ నెంబర్, పార్టు నెంబరు చెప్పండి.ఈ వివరాలను బట్టి ఒక్క నిమిషంలో ఓటర్ వివరాలను ధృవీకరిస్తారువివరాలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తరువాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు వేస్తారు.మీ వివరాలను (ఓటరు ఐడీ నెంబరు) ఫారం 17Aలో నమోదు చేస్తారు.ఓటరు జాబితాలో బొటనవేలి ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు.ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి అనుమతిస్తారు.ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటేసే EVM మెషీన్, దాని పక్కనే VVPAT యంత్రమూ ఉంటుంది.(మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ VVPAT)ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు ఒక పక్క.... వారికి కేటాయించిన గుర్తులు మరో వైపు... వీటి పక్కన్నే నీలి రంగు బటన్ ఉంటాయి.మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కన్నే ఉన్న నీలి రంగు బటన్‌ను నొక్కితే మీ ఓటు నమోదైనట్లు లెక్క.బటన్ నొక్కిన తరువాత అయిదు సెకన్ల పాటు చిన్న శబ్ధం వినిపిస్తుంది.ఆ వెంటనే VVPAT మెషీన్‌పై పచ్చటి లైట్ వెలుగుతుంది.VVPATపై ఉండే స్క్రీన్‌పై చూస్తే... మీరు ఓటేసిన అభ్యర్థి తాలూకూ గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితపు స్లిప్ ఏడు సెకన్లపాటు కనిపిస్తుంది.ఏడు సెకన్ల తరువాత ఈ స్లిప్ కాస్తా బాక్స్‌లోకి పడిపోతుంది.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు రెండూ జరుగుతున్నాయి కాబట్టి.. పోలింగ్ బూత్‌లో రెండు ఈవీఎంలు, రెండు వీవీ పాట్లు ఉంటాయి. ఒక ఓటు మాత్రమే వేసి రెండో ఓటు మరిచిపోవద్దు. ఓపిగ్గా.. రెండు ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో ఓటరుగా మీ బాధ్యతను నిర్వర్తించుకోవాలి.మీ ఓటు గురించి మీకు ఎలాంటి అనుమానాలున్నా.. మాకు ఈ మెయిల్ రాయగలరు. info@sakshi.com మీ సందేహాలకు సంబంధించి ఎన్నికల అధికారులతో మాట్లాడి సమాధానం ఇవ్వగలం. -
అలర్ట్: ఆధార్-పాన్ లింక్ అవ్వకపోతే రెండింతలు టీడీఎస్
ఆధార్-పాన్ లింక్ ఇంకా చేయనివారికి ఐటీ శాఖ కీలక సమాచారం అందించింది. మే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను శాఖ తెలియజేసింది.ఐటీ శాఖ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్‌తో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) లింక్ అవ్వకపోతే సాధారణంగా వర్తించే రేటుకు రెండింతల టీడీఎస్ కోతలుంటాయి. లావాదేవీ సమయంలో పాన్ ఇన్ఆపరేటివ్లో ఉన్న ట్యాక్స్‌పేయర్లకు టీడీఎస్/టీసీఎస్ షార్ట్ డిడక్షన్/కలెక్షన్ ఎగవేతకు పాల్పడ్డారన్న నోటీసులు వస్తున్నట్టు సీబీడీటీ తెలిపింది.ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఇలా నోటీసులు అందుకున్న వారికి సీబీడీటీ స్పష్టత ఇచ్చింది. 31 మార్చి 2024 నాటికి ముందు చేసిన లావేదావేలకు సాధారణ రేటుకే టీడీఎస్/టీసీఎస్ వసూలుంటుందని స్పష్టం చేసింది.కాగా 2022 జూన్ 30 వరకు ఆధార్‌తో పాన్ అనుసంధానం ఉచితంగానే జరిగింది. జూలై 1 నుంచి 2023 జూన్ 30 వరకు రూ.1,000 ఆలస్య రుసుముతో అనుమతించారు. ఆ తర్వాత లింక్ అవ్వని పాన్ కార్డులు జూలై 1 నుంచి ఇన్‌ఆపరేటివ్‌లోకి వెళ్లాయి. ఇవి ఆపరేటివ్ కావాలంటే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే. కానీ 30 రోజుల సమయం పడుతుంది. ఆధార్, పాన్ లింక్ కాకపోతే ఐటీ రిఫండ్ ఉండదు. లింక్ చేసుకున్న తర్వాత రిఫండ్ వచ్చినప్పటికీ ఆలస్యమైన రోజులకు ఐటీ శాఖ వడ్డీ చెల్లించదు. -
ఎన్పీఎస్ కొత్త రూల్.. ఎలా లాగిన్ చేయాలో తెలుసా..
కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25)లో అనేక ఆర్థిక సంస్థల నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) లాగిన్ అయ్యే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అన్ని అకౌంట్లు ఆధార్‌తో లింక్ అవుతున్న తరుణంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్‌ను ప్రవేశపెట్టింది. దాంతో పాత విధానంలోకాకుండా కొత్త పద్ధతిలో ఎన్పీఎస్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఎలా లాగిన్ చేయాలంటే.. ఎన్పీఎస్ వెబ్సైట్లో పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్)/ ఇంటర్నెట్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (ఐపీఐఎన్)తో లాగిన్ కావాలి. తర్వాత పీఆర్ఏఎన్/ ఐపీఐఎన్ టాబ్‌పై క్లిక్ చేయాలి. ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉండే క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి. తర్వాత తెరుచుకునే విండోలో ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేస్తే ఎన్పీఎస్ ఖాతా ఓపెన్ అవుతుంది. ఇదీ చదవండి: ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం -
ఆధార్.. అప్‘లేట్’
సాక్షి, హైదరాబాద్: ఆధార్‌కార్డు అప్డేట్కు ‘తిరస్కరణ’తిప్పలు తప్పడం లేదు. ఒకటి రెండుసార్లు చేర్పులుమార్పులు చేసుకుంటే ఆ తర్వాత ఆప్డేషన్ ప్రక్రియ తిరస్కరణకు గురవుతోంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రానికి పరుగులు తీసి పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థుల ఆధార్‌కార్డులో అప్డేషన్ సమస్యగా తయారైంది. చిన్నప్పుడు ఆధార్ నమోదు చేసుకోవడంతో ఆ తర్వాత బయోమెట్రిక్ గుర్తింపు సమస్యగా మారింది. మరోవైపు చిన్నచిన్న తప్పిదాలు సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. చిన్నదానికి కూడా హైదరాబాద్‌కు తరలిరావడం పేదలకు భారంగా మారుతోంది. ఏదీ..ఎలా మార్చుకోవచ్చు అంటే... ఆధార్‌కార్డు అనేది గుర్తింపును చూపే ముఖ్యమైన సాధనంగా మారింది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా అవసరం. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) 2019లో ఆధా ర్కార్డులో చేర్పులు మార్పులపై కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డులో ఓ వ్యక్తి తన పేరు, జన్మదినం, జెండర్ వంటి వాటిని మార్చుకోవడం అప్డేట్ చేసుకునేందుకు పరిమితి విధించింది. ► యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఆధార్‌కార్డులో పేరును కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంటి పేరు, స్పెల్లింగ్ తప్పిదాలను సరిచేసుకోవచ్చు. ► ఆధార్ కార్డులో డేట్ఆఫ్బర్త్ కేవలం ఒకసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. దీనికీ కొన్ని షరతులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్ సమయంలో ఇచి్చన తేదీకి కేవలం మూడేళ్లు మాత్రమే తగ్గించుకోవచ్చు. అలాగే ఎంతైనా పెంచుకోవచ్చు. డేట్ మార్చుకోవాలనుకునే వారు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆధారాలు సమరి్పంచాలి. ► ఆధార్ కార్డులో జెండర్ వివరాలు ఒక్కసారి మాత్రమే మార్చుకోవచ్చు. ► ఆధార్ కార్డుపై ఉండే ఫొటోను మాత్రం ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. ఆధార్ నమోదు కేంద్రంలో ఫొటో అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మార్చుకోవడం కుదరదు. ► అడ్రస్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించి చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాలి. ప్రాంతీయ కార్యాలయంలోనే ఆధార్‌కార్డులో పేరు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్ వివరాలను పరిమితికి మించి మార్చేందుకు వీల్లేదు. పరిమితి దాటిన తర్వాత ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ప్రత్యేక పద్ధతి ఉంటుంది. ఇందుకు ప్రాంతీయ కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ–మెయిల్, పోస్ట్ ద్వారా కూడా ప్రాంతీయ కార్యాలయాలకు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. యూఆర్ఎన్ స్లిప్, ఆధార్ వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలను జత చేస్తూ ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా స్పష్టంగా వివరించాలి. జూన్ 14 వరకు ఉచిత అప్డేట్కు అవకాశం పదేళ్లు దాటిన ఆధార్‌కార్డుల అప్డేట్ తప్పనిసరి. ఆధార్ జారీ తర్వాత చాలామంది అప్డేట్ చేసుకోలేదు. వీరి కోసం యూఐడీఏఐ ఉచితంగానే..ఆధార్ కార్డులో తప్పులను సరిచేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కలి్పంచింది. కొంతకాలంగా గడువు పొడిగిస్తూ వస్తోంది. ఈసారి జూన్ 14 వరకూ ఆన్లైన్లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. చిరునామా, పేర్లలో అక్షర దోషాలు సరిచేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్ సమరి్పంచి ఆప్డేట్ చేసుకోవాలి. అప్డేట్కు ప్రయత్నిస్తే తిరస్కరించి రద్దు చేశారు అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాను. దరఖాస్తు నింపి ఇవ్వగా అప్లోడ్ చేశారు. కొద్ది రోజులకు రిజెక్ట్ అయ్యిందనే మెసేజ్ వచి్చంది. మళ్లీ దరఖాస్తు చేయగా ఆధార్ రద్దు అయ్యిందని చెప్పారు. హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ చెక్ చేసి కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. – అక్షర, స్టూడెంట్, కామారెడ్డి జిల్లా నెలరోజుల నుంచి తిరుగుతున్నా... ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైంది. సరిచేసుకునేందుకు రీజినల్ కార్యాలయం చుట్టూ నెల రోజులుగా తిరుగుతున్నా. సరైన పత్రాలు సమర్పించి అప్లోడ్ చేయించినా కార్డు రాలేదు. – సాయికుమార్, వికారాబాద్ జిల్లా పేరు మారడం లేదు ఆధార్ కార్డులో పేరు మార్చుకునేందుకు రెండు నెలల నుంచి రీజినల్ కార్యాలయానికి తిరుగుతున్నాను. వచి్చన ప్రతిసారి కావాల్సిన పత్రాలు సమరి్పంచినా కార్డులో పేరు మాత్రం మారడం లేదు. – బాషా, కర్నూలు -
ఎన్ఆర్ఐ, ఓసీఐల కోసం కొత్త ఫామ్స్.. సులభమైన ఆధార్ ఎన్రోల్మెంట్
ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేట్ ఫామ్‌లు యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి. ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి. 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి. -
ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం మరో ఛాన్స్ - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం మార్చి 14 వరకు గడువును ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆ గడువును 2024 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుండంతో యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫ్రీ సర్వీస్ మై ఆధార్ (#myAdhaar) పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనే వారు ఈ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మీ ఆధార్ కార్డును ఎలా అప్డేట్ చేసుకోవాలంటే.. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన వన్-టైమ్ పాస్వర్డ్ (OTP)ని ఉపయోగించి లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తరువాత మీకు డాక్యుమెంట్ అప్డేట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఏ వివరాలను అప్డేట్ చేసుకోవాలో దాన్ని సెలక్ట్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. చివరగా సబ్మిట్ చేయడానికి ముందు మీ వివరాలను ద్రువీకరించుకోవాలి. కేవలం myAadhaar పోర్టల్ మాత్రమే జూన్ 14 వరకు డాక్యుమెంట్ల ఆధార్ అప్డేట్లను ఉచితంగా అందిస్తుంది. ఫిజికల్ ఆధార్ కేంద్రాలలో ఈ దీని కోసం రూ. 50 ఫీజు వసూలు చేస్తారు. 50 రూపాయలకంటే ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తే ఆపరేటర్ మీద చర్యలు తీసుకుంటారు. #UIDAI extends free online document upload facility till 14th June 2024; to benefit millions of Aadhaar holders. This free service is available only on the #myAadhaar portal. UIDAI has been encouraging people to keep documents updated in their #Aadhaar pic.twitter.com/eaSvSWLvvt — Aadhaar (@UIDAI) March 12, 2024 -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్‌ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్‌లను పాలీ వినైల్ క్లోరైడ్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్‌లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్‌ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్‌ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
8 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి యూపీఐ, ఆధార్ కీలకం.. ఎలాగో తెలుసా..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) వల్ల 2030 నాటికి ఇండియా ఆర్థిక వ్యవస్థ 8 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంలో కీలకంగా పనిచేయనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. యూపీఐ, డీపీఐల ద్వారానే ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించగలదని నాస్కామ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలియజేస్తుంది. గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్‌తో కలిసి నాస్కామ్ ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. డీపీఐలు భారతదేశ జనాభాలో 97 శాతం మందిపై ప్రభావం చూపుతున్నాయి. మెచ్యూర్డ్ డీపీఐల వల్ల 31.8 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరిగింది. ఇది 2022లో భారతదేశ జీడీపీలో 0.9 శాతానికి సమానం. ఇదీ చదవండి: ప్లేస్టోర్‌కు పోటీగా ఫోన్‌పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే.. డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ విధానంలో ఆధార్‌ను పరిచయం చేయడం ద్వారా దాదాపు 15.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక ప్రయోజనాలు దక్కాయి. యూపీఐ వల్ల నగదు లావాదేవీలు, పేపర్ వాడకం తగ్గింది. దాంతో కాలుష్యమూ తగ్గినట్లు నివేదికలో తేలింది. పేపర్వాడకం తగ్గడం వల్ల లాజిస్టిక్స్, రవాణా రంగంలో 2022లో 3.2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. -
ఆధార్‌ను తొలగిస్తున్న కేంద్రం: మమత
సూరి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందనివ్వడం లేదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధార్ కార్డుతో పనిలేకుండానే సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బిర్భూమ్ జిల్లా సూరిలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం మమత మాట్లాడారు. ‘జాగ్రత్తంగా ఉండండి. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌లోని చాలా జిల్లాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉచిత రేషన్, లక్షీభండార్ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేసేందుకు ఇలాంటి చర్యలకు దిగుతోంది. ఆధార్ లేదనే కారణంతో పథకాలను ప్రజలకు అందకుండా నిలిపివేయవద్దని అధికారులను ఆదేశించాను. బెంగాల్ ప్రజలు భయపడొద్దు. మీకు అండగా నేనున్నాను’ అన్నారు. ఆధార్ కార్డుల తొలగింపు వెనుక కుట్ర ఉందని తెలిస్తే ఒక్క కూడా దాన్ని లింక్ చేయడానికి అనుమతించబోనన్నారు. ఆధార్ కార్డులు తొలగించిన వారి వివరాలతో పోర్టల్‌ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని కారణంగా బ్యాంకులు లావాదేవీలను నిరాకరించినట్లయితే సహకార బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సేవలను వాడుకోవాలని ప్రజలకు ఆమె సూచించారు. -
ఈసీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్లైనేదీ పెట్టలేదని పేర్కొంది. -
ఆధార్ కార్డు రద్దు చేసుకునే అవకాశం - ఎప్పుడు.. ఎలా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని ప్రకటించింది. అయితే ఇప్పుడు యూఐడీఏఐ ప్రకారం.. కొత్త ఫామ్ ఉపయోగించి 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్ నెంబర్ సైతం రద్దు చేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త ఆధార్ రూల్స్ ప్రకారం, ఆధార్ కార్డు ఉన్న వారు 18 ఏళ్ళు నిండిన తరువాత కార్డుని రద్దు చేసుకోవచ్చు. దీనికోసం యూఐడీఏఐ ఫామ్-9ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ రెగ్యులేషన్స్ 2016 ప్రకారం.. కొన్ని సందర్భాల్లో మాత్రమే రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఆధార్ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లను కలిగి ఉన్న సందర్భంలో.. ఒక ఆధార్ నెంబర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకటి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అందులో కూడా ఏవైనా మార్పులు.. చేర్పులు వంటివి చేఉకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ఫోటోపై ఫోటో వచ్చినప్పుడు ఆధార్ కార్డులో ఫోటొపైన ఫోటో వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసుకునే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో కొత్త ఫోటో గ్రాఫ్ తీసుకోకుండానే పాత ఫోటోను వినియోగించడం, లేదా బయోమెట్రిక్ సమాచారం లేకుండానే ఆధార్ నమోదు చేసిన సందర్భంలో వినియోగదారుడు ఆధార్ కార్డును రద్దు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని సంగ్రహించకుండా ఉండటానికి పెద్దలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లవాడిగా నమోదు చేసుకుని ఉంటే.. అలాంటి ఆధార్ నెంబర్ కూడా రద్దు చేసుకోవచ్చు. షెడ్యూల్ VI 27(1)(c) ప్రకారం, ఆధార్ నంబర్ హోల్డర్ అయిన నివాసి, పద్దెనిమిది సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, అతని/ఆమె ఆధార్ నంబర్‌ను రద్దు చేయడానికి ప్రాంతీయ అధికార కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో కార్డు రద్దు చేస్తారు. ఆధార్ నెంబర్ రద్దు చేసుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ హోల్డర్‌కు అథారిటీ అందించే సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్మెంట్స్ అద్దెకు.. నెలకు లక్షల్లో సంపాదన ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ 5 లేదా 15 సంవత్సరాలు నిండిన ఆధార్ నంబర్ హోల్డర్ అతని/ఆమె బయోమెట్రిక్ సమాచారాన్ని అప్డేట్ చేయడంలో విఫలమైతే, అతని/ఆమె ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత అప్డేట్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవచ్చు. -
పంచకుండా పడేశారు
కుల్కచర్ల (వికారాబాద్): పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు అందివ్వాల్సిన ఆధార్, ఏటీఎం, పాన్, పోస్టు కార్డుల్ని ఓ పోస్ట్‌మ్యాన్ వారికివ్వకుండా ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంచేసుకున్నాడు. చివరికి వాటిని మూటకట్టి గ్రామానికి చెందిన ఓ చెత్త ట్రాక్టర్లో పడేశాడు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆ పోస్్టమ్యాన్ నర్సింలు నిర్వాకం గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా బయటకు వచ్చింది. వికారాబాద్ జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వెలుగు చూసిందిలా...: జిల్లాలోని చౌడాపూర్ మండల కేంద్రంలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన చెత్త ట్రాక్టర్ శనివారం చెత్తను సేకరి స్తున్న క్రమంలో గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ నర్సింలు ఇంటివద్ద ఆగింది. ఆ సమయంలో నర్సింలు కుటుంబసభ్యులు ఓ పెద్ద సంచిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పడేశా రు. కొద్ది దూరం వెళ్లాక ఈ సంచిని గమనించిన పంచాయతీ సిబ్బంది మూట విప్పి చూడగా..అందులో 2 వేలకు పైగా ఆధార్ కార్డులు, వందకు పైగా పాన్, ఏటీఎం, క్రెడి ట్ కార్డులు, మరికొన్ని ఉత్తరాలు కన్పించా యి. వీటిలో 2011 ఏడాదికి చెందినవి కూడా ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వద్ద సంచిని దించారు. ఈ విషయాన్ని కొంతమంది వీడియోతీసి సామాజిక మాధ్యమా ల్లో వైరల్ చేయగా వీడియోను చూసిన చౌడా పూర్, మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామ స్తులు అక్కడకు చేరుకుని వారికి రావాల్సిన కార్డుల్ని తీసుకున్నారు. మిగిలిన ఆధార్, ఏటీఎం, క్రెడిట్ కార్డులను చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు వద్ద భద్రపరిచారు. పోస్ట్‌మ్యాన్ నిర్లక్ష్యంపై ఆందోళన...: నర్సింలు విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నాడంటూ కొంతమంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఆందోళన కూడా చేశారు. తాజా ఘటనతో అతడిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్‌నగర్ జిల్లా పోస్టల్ అధికారులకు సిఫార్సు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. చెక్కు దొరకలేదు. డిసెంబర్లో ఓ బీమా కంపెనీ నుంచి రూ.33 వేల చెక్కు రావాల్సి ఉంది. ఈ విషయమై కొద్ది రోజులుగా పోస్ట్‌మ్యాన్‌ను అడుగుతూనే ఉన్నాను. ఆయన మాత్రం ఎలాంటి చెక్కు రాలేదని చెబుతున్నాడు. ఈ విషయమై సబ్ పోస్టాఫీస్‌కు వెళ్లి ఆరా తీయగా డిసెంబర్ 9వ తేదీనే గ్రామానికి పంపించామని చెప్పారు. వీడియో చూసి పంచాయతీకి వెళ్లి సంచిలో వెదికినా నాకు రావాల్సిన చెక్కు మాత్రం దొరకలేదు. –కావలి రాములు, చౌడాపూర్ -
Aadhaar rules: మారిన ఆధార్ రూల్స్.. ఇకపై మరింత సులువుగా..
ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆధార్ (నమోదు మరియు నవీకరణ) సవరణ నిబంధనలు, 2024గా పేర్కొంటూ దేశ పౌరులు, ప్రవాస భారతీయులకు ఆధార్ నమోదు, అప్డేట్ ప్రక్రియ మరింత సులువుగా ఉండేలా కొత్త మార్పులు చేసింది. యూఐడీఏఐ విడుదల చేసిన జనవరి 16 నాటి నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్లైన్లోనూ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ నమోదు చేసుకోవడానికి, దానిలోని సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడానికి రెండు కొత్త ఫారమ్‌లను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. ఆధార్ ఎన్రోల్మెంట్/అప్డేషన్ కోసం దేశ పౌరులు, ఎన్నారైలకు వేర్వేరు ఫారమ్‌లను జారీ చేసింది. సమాచారం అప్డేట్ యూఐడీఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కార్డుదారులు సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో తమ సమాచారాన్ని సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. నమోదు కేంద్రం, వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తాజాగా అవకాశం కల్పించింది. అంతకుముందు 2016లో ప్రవేశపెట్టిన నియమాల ప్రకారం.. చిరునామాల మార్పునకు మాత్రమే ఆన్లైన్ మోడ్‌లో అవకాశం ఉండేది. డాక్యుమెంట్ అప్డేషన్, సమాచారం, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉండేది. వయసు రుజువు తప్పనిసరి సవరించిన నిబంధనల ప్రకారం.. వయసు రుజువు కోసం డాక్యుమెంటరీ ఫ్రూఫ్ కచ్చితంగా ఉండాలి. దీని ఆధారంగానే ఆధార్ కార్డ్‌పై పూర్తి పుట్టిన తేదీని ముద్రిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా లేదా కుటుంబ పెద్ద నిర్ధారణ ఆధారంగా ఆధార్ కోసం ఎన్రోల్మెంట్, వివరాల అప్డేట్ చేయవచ్చని యూఏడీఏఐ తెలిపింది. మరోవైపు ఎన్నారైలు ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ ఎన్నారైలు విదేశీ మొబైల్ నంబర్‌ను అందిస్తే ఆ నంబర్‌కు ఆధార్ సంబంధిత మెసేజ్‌లు వెళ్లవు. సవరించిన ఫారాలు దరఖాస్తుదారులకు మరింత సులువుగా ఉండేందుకు యూఐడీఏఐ పాత ఫారమ్‌లను సవరించింది. ఫారం 1: ఆధార్ నమోదు, నవీకరణ ఫారం 2: ఎన్నారైల కోసం ఫారం 3: దేశంలో చిరునామా ఉన్న ఐదేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్లల కోసం ఫారం 4: ఐదు నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న ఎన్నారై పిల్లల కోసం ఫారం 5: భారతీయ చిరునామా ఉన్న ఐదేళ్లలోపు పిల్లల కోసం ఫారం 6: ఐదేళ్ల లోపు ఎన్నారై పిల్లల కోసం ఫారం 7: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్లు నిండిన విదేశీ పౌరుల కోసం ఫారం 8: భారత్‌లో నివాసం ఉండే 18 ఏళ్ల లోపు విదేశీ పిల్లల కోసం ఫారం 9: ఆధార్ నంబర్ రద్దు కోసం -
ఆధార్ కార్డు ఆధారం కాదు - లిస్ట్ నుంచి తొలగించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని తెలిసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు తప్పకుండా గమనించాలి. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించడంతో.. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ ఎట్టకేలకు ధ్రువీవీకరించింది. EPFO కోసం పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC) స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC) SSC సర్టిఫికేట్ (పేరు, పుట్టిన తేదీ ఉంటుంది) పాన్ కార్డ్ కేంద్ర/రాష్ట్ర పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్ పాస్‌పోర్ట్ ప్రభుత్వ పెన్షన్ ఐడీ సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఉద్యోగులకు షాకిచ్చిన సుందర్ పిచాయ్ - మరిన్ని లేఆప్స్ పక్కా! పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓలో పుట్టిన తేదీ కరెక్షన్ కోసం సమర్పించవచ్చు. వీటిలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. కాబట్టి దీనిని పుట్టిన తేదీ నిర్దారణ కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. -
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి...ఇంకా ఇతర అప్డేట్స్
-
‘ఒరిజినల్ ఆధార్’ తప్పనిసరి..
సాక్షి హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని మహిళలు వినియోగించు కోవాలంటే ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గుర్తింపుకార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ కార్డు అయినా సరే ఈ పథకానికి వర్తిస్తుందని ఆయన ‘ఎక్స్’వేదికగా సోమవారం పోస్టు చేశారు. అయితే పాన్‌కార్డు మాత్రం చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పాన్‌కార్డుపై అడ్రస్ ఉండదని, అందువల్ల ఆ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. ఒరిజినల్ గుర్తింపు కార్డులు చూపించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా..ఇప్పటికీ కొంతమంది స్మార్ట్ ఫోన్లో ఫొటో కాపీలు, కలర్ జీరాక్స్ చూపిస్తున్నారన్న విషయం ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు. దీనివల్ల సిబ్బంది ఇబ్బందులకు గురవడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతోందన్నారు. ఫలితంగా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని వ్యాఖ్యానించారు. మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని కోరారు. ఒరిజినల్ గుర్తింపుకార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్ తీసుకోవాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. వాదనలకు దిగొద్దు... ’ఎలాగూ ఉచితమే కదా. జీరో టికెట్ ఎందుకు తీసుకోవడం’అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని ఇది సరికాదని ఆయన తెలిపారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని చెప్పారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణిస్తే.. సంస్థకు నష్టం చేసిన వారవుతారని వివరించారు. అందువల్ల ప్రతి మహిళ జీరోటికెట్ తీసుకోవాలని. ఒకవేళ టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే.. అది చెకింగ్‌లో గుర్తిస్తే సిబ్బంది ఉద్యోగం ప్రమాదంలో పడుతుందన్నారు. అలాగే సదరు మహిళ నుంచి రూ.500 జరిమానా వసూలు చేస్తారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్‌కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్‌కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్‌లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
ఇకపై ఆధార్‌కు పాస్‌పోర్ట్ తరహా వెరిఫికేషన్.. కానీ..
కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. ఆధార్ ఎన్రోల్మెంట్కు సంబంధించిన ఏ అంశాన్నైనా యూఐడీఏఐ నిర్వహిస్తోంది. కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను యూఐడీఏఐకి బదులు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్ కేంద్రాల్లోకి వెళ్లి ఈ సర్వీస్ పొందొచ్చు. ఆన్లైన్లో వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సబ్‌డివిజన్ మేజిస్ట్రేట్ ఈ వెరిఫికేషన్ విధానాన్ని పరిశీలిస్తారు. అన్ని వివరాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తే 180 రోజుల్లో ఆధార్ కార్డును ఇష్యూ చేస్తారు. ఇదీ చదవండి: ఫోన్‌పే క్రెడిట్సెక్షన్, లోన్లు.. ఇవీ బెనిఫిట్లు..! తాజాగా యూఏడీఏఐ తీసుకొచ్చిన మార్పులపై సంస్థ లక్నో రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ స్పందించారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే యథావిధిగా పాత పద్ధతినే పాటించాలన్నారు. కానీ ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారు మాత్రం ఈ కొత్త విధానాన్ని అనుసరించాలని తెలిపారు. -
ఆధార్‌పై ప్రశ్నలకు భారీ స్పందన..
ఆన్లైన్లో ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఇటీవల మార్చి 14, 2024 వరకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. అయితే యూఐడీఏఐ ఆధార్‌ను ప్రవేశపెట్టి చాలా ఏళ్లు అయింది. దాంతో ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. అందుకు సంబంధించి ‘సాక్షి’లో డిసెంబర్ 13న ‘ఆధార్‌పై ప్రశ్నలా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అందులో పాఠకులు ఆధార్‌కు సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే info@sakshi.com కు పంపించాలని కోరగా చాలా మంది స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు. ‘సాక్షి బిజినెస్’టీమ్ సంబంధిత అధికారులతో మాట్లాడి కొంతమంది పాఠకుల ప్రశ్నలకు సమాధానాలు సేకరించారు. ప్రశ్న: ఆధార్ ఎందుకు, ఎలా అప్డేట్ చేసుకోవాలి? అందుకు ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏయే డాక్యుమెంట్లు అవసరం అవతాయి? శైలజ, వరంగల్. జవాబు: నిబంధనల ప్రకారం ఆధార్ తీసుకుని 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ డేటాబేస్‌లో మీ వివరాలు అప్ టు డేట్ ఉండాలి. దాంతో ఆధార్‌తో లింక్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మీ తాజా వివరాలు ఉంటే మేలు. మీ ఆధార్‌లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే చేసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన తేదీలోపు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అందుకోసం పాఠశాల టీసీ, పదో తరగతి మెమో, పాన్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్.. వంటి ఫొటో గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలి. వీటిలో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి సంబంధించిన ఫారమ్ నింపి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తులతో అప్డేట్ చేస్తారు. ప్రశ్న: బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేస్తే ఏదైనా సమస్యలు వస్తాయా? కార్తిక్, శ్రీకాకుళం. జవాబు: లేదు. మీ బ్యాంక్ సమాచారాన్ని బ్యాంక్ యాజమాన్యం ఎవరితోనూ పంచుకోదు. మీ ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా బ్యాంక్ ఖాతా గురించి సమాచారాన్ని పొందలేరు. అలాగే, యూఐడీఏఐతోపాటు ఏ సంస్థ వద్ద మీ బ్యాంక్ ఖాతా గురించి ఎలాంటి సమాచారం ఉండదు. ఉదాహరణకు, మీరు మీ మొబైల్ నంబర్‌ను బ్యాంక్, పాస్‌పోర్ట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖలు మొదలైన వివిధ అధికారులకు ఇస్తారు. కానీ మీరు ఉపయోగిస్తున్న టెలికాం కంపెనీకి మీ బ్యాంక్ సమాచారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లు వంటి సమాచారం గురించి తెలియదు. అదేవిధంగా మీరు వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు ఆధార్ నంబర్‌ను ఇచ్చినపుడు మీ వివరాలు వారి వద్దే ఉంటాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం, యూఐడీఏఐతో సహా ఏ సంస్థ కూడా యాక్సెస్ చేయలేదు. ప్రశ్న: నా ఆధార్, బ్యాంక్ అకౌంట్ నంబర్ తెలిసిన ఎవరైనా ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? సులోచన, విజయవాడ. జవాబు: కేవలం మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకోలేరు. డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ అవసరం అవుతాయి. మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆధార్ ద్వారా డబ్బును విత్‌డ్రా చేయడానికి మీ వేలిముద్ర, ఐరిస్ లేదా ఓటీపీ నంబరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న: ఆధార్‌ను ఎక్కడైనా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మరి యూఐడీఏఐ ప్రజలు తమ ఆధార్ నంబర్‌ను సోషల్ మీడియా లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టవద్దని ఎందుకు సూచిస్తోంది? కేతన్, నిజామాబాద్. జవాబు: మీరు పాన్ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ చెక్‌లను అవసరమైన చోటే ఉపయోగిస్తారు. అయితే ఈ వివరాలను ఇంటర్నెట్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) మొదలైన సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా ఉంచరుకదా. ఆధార్ విషయంలో కూడా ఇదే లాజిక్‌ని ఉపయోగించాలి. మీ వ్యక్తిగత వివరాలు అనవసరంగా పబ్లిక్ డొమైన్లో ఉంచవద్దు. ప్రశ్న: ఆధార్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? శరణ్య, అనంతపురం జిల్లా. జవాబు: ఆధార్‌ను చాలా ప్రభుత్వ పథకాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, మధ్యాహ్న భోజనం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం. ఉపాధి-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి హామీ కార్యక్రమం. జననీ సురక్ష యోజన, ఆదిమ తెగల సమూహాల అభివృద్ధి, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం. ఆరోగ్య సంరక్షణ – రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. ఆస్తి లావాదేవీలు, ఓటర్ఐడీ, పాన్‌కార్డ్ మొదలైన ఇతర ప్రయోజనాల కోసం ఆధార్ కావాల్సి ఉంటుంది. ప్రశ్న: యూఐడీఏఐ అనుసరిస్తున్న డేటా భద్రత చర్యలు ఏమిటి? సుశీల, హైదరాబాద్. జవాబు: ప్రజల నుంచి సేకరించిన డేటాకు భద్రత కల్పించే బాధ్యత యూఐడీఏఐకు ఉంది. యూఐడీఏఐ సమగ్ర భద్రత విధానాన్ని కలిగి ఉంది. పటిష్ఠమైన సెక్యూరిటీ స్టోరేజ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చట్టాలకు లోబడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్ఐసీ.. ఎంతంటే.. -
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పెంపు
సాక్షి, అమరావతి: ఆధార్‌లో అడ్రసు తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్లైన్ వెబ్‌పోర్టల్‌లో అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును ఆధార్‌కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్‌కార్డులు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారైనా వారికి సంబంధించి తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఐడీఏఐ అప్పట్లో ప్రకటించింది. అదే సమయంలో.. ఆధార్‌కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్లైన్లో సొంతంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునే వారికి ఆ సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా అప్పట్లో ప్రకటించింది. మొదట 2023 ఫిబ్రవరి వరకే ఈ ఉచిత సేవలని యూఐడీఏఐ ప్రకటించగా.. అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది. తాజాగా నాలుగోసారి 2024 మార్చి 14 వరకు గడువు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. -
ఆధార్‌పై ప్రశ్నలా..?
ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మరోసారి పొడిగించింది. తొలుత 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు ఇచ్చింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిలాఉండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(యూఐడీఏఐ) ఆధార్‌ను తీసుకొచ్చి చాలా ఏళ్లు అయింది. అయితే ఎలాంటి అవసరంలేని వారికి అది కేవలం ఒక గుర్తింపు కార్డుగానే ఉంటుంది. కానీ నిజంగా ఏదైనా అవసరానికి ఆధార్ వినియోగించే క్రమంలో చాలా ప్రశ్నలు వస్తూంటాయి. ఈ-ఆధార్ అంటే ఏమిటి, అది ఎలా ఓపెన్ అవుతుంది, పాస్వర్డ్ ఏమిటి... వంటి ఎన్నో ప్రశ్నలకు ఇప్పటికీ కొందరికి జవాబులు తెలియకపోవచ్చు. అందుకే ‘సాక్షి’ ఆధ్వర్యంలో సంబంధిత అధికారితో మాట్లాడి మీ అనుమానాలు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పే కార్యం మొదలైంది. అయితే మీ ప్రశ్నలను info@sakshi.com కు పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించే ప్రశ్నలకు మన ‘సాక్షి బిజినెస్’లోనే శనివారం సమాధానాలిస్తాం. ఉదాహరణకు.. ఆధార్ ఎందుకు అప్డేట్ చేసుకోవాలి? ఆధార్ అప్డేట్ ఎలా చేసుకోవాలి? ఆధార్ అప్డేషన్కు ఎంత ఖర్చు అవుతుంది? ఆధార్ అప్డేషన్కు ఏ డాక్యుమెంట్లు అవసరం? ఆధార్ అప్డేషన్కు ముందే ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు? ఎవరు కాదు? వర్చువల్ ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ కార్డు ఏ ముఖ్యమైన అంశాలకు లింకవుతుంది? ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవాలి? చిన్న పిల్లలకు వయస్సు పరిమితులేమిటి? బ్యాంక్ ఖాతా, పాన్, ఇతర సేవలను ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఏదైనా హాని జరుగుతుందా? బ్యాంక్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, పాన్, ఇతర సేవలకోసం ఆధార్‌తో ఎందుకు ధ్రువీకరించాలి? అపరిచితులకు మన ఆధార్ నంబర్ తెలిస్తే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చా? మీకు ఎదురైన, మీరు అడగాలనుకుంటున్న ఆధార్‌కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలనైనా info@sakshi.com కు పంపి సమధానాలు పొందగలరు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ -
ఉచిత ఆధార్ అప్డేట్కు ఇదే చివరి తేది!
ఆధార్ తీసుకుని పదేళ్లు దాటితే అప్డేట్ చేయాలని కేంద్రం నిబంధనలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వారు 2023 డిసెంబర్ 14లోపు అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. త్వరలో గడువు ముగియనుండడంతో ఈ ప్రకటన విడుదల చేసింది. గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన ధ్రువపత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాలని ఉడాయ్ సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ-సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆ తేదీల్లో ఎక్కువ.. ఈ తేదీల్లో తక్కువ పుట్టినరోజులు! ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని ఉడాయ్ తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వాడుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
ఉపాధి కూలీలకూ ‘ఆధార్’ ఆధారిత హాజరు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో బోగస్ కూలీల నమోదును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఉపాధి కూలీలకూ ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియను ప్రవేశపెట్ట్టనుంది. ఫీల్డ్‌అసిస్టెంట్ల వద్ద ఉండే మొబైల్ ఫోన్లోని యాప్ ద్వారా కూలీల హాజరును ఈ విధానంలోనే నమోదు చేస్తారు. కేంద్రం ప్రస్తుతం ఈ విధానాన్ని తప్పనిసరి చేయకుండా.. ఇప్పుడు అమల్లో ఉన్న విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. పనులు కోరిన వారి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ సేకరించి, వారికి పని కేటాయించే ఒక్క రోజు ముందు వారికి ఎక్కడ, ఎన్ని రోజులు పని కేటాయించారన్న వివరాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఎన్ఎంఎంఎస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆ పని జరిగినన్ని రోజులూ ముందుగా నమోదు చేసిన కూలీల్లో రోజూ ఎవరెవరు పనికి వచ్చారో పని జరిగే ప్రదేశంలోనే యాప్‌లో వారి పేర్ల వద్ద హాజరైనట్టు టిక్ చేస్తారు. అంతేకాదు, కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒక ఫొటో తీసి దానిని కూడా ఆ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే, ఆ ఫొటోలో పనిచేస్తున్న కూలీలు ఎవరన్నది వారి ముఖాలు స్పష్టంగా కనిపించినా, కనిపించకపోయినా.. కూలీల సంఖ్య మాత్రం స్పష్టంగా తెలిసేలా ఫొటోను అప్లోడ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, కొత్త విధానంలో కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ మొబైల్ యాప్‌లో టిక్ రూపంలో నమోదు చేసే బదులు.. ఆ కూలీ ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్‌లో నమోదైన ఫొటోతో ఈ ఫొటో సరిపోలాకే హాజరు పడేలా మొబైల్ యాప్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఆధునికీకరించనున్నారు. ఇకపై అలా వీలుపడదు.. జియో కోఆర్డినేట్ల(ఆ ప్రాంత వివరాలకు సంబంధిచిన శాటిలైట్ ద్వారా నిర్దేశించిన కొలతలు)ను ఆ పనికి అనుమతి తెలిపే సమయంలో పని ప్రదేశంలోనే ఇప్పటి వరకు నమోదు చేస్తున్నారు. కొత్త విధానంలో పని ప్రాంతంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరును యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. జియో కోఆర్డినేట్లు నమోదు చేసిన ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో హాజరు నమోదుకు ప్రయత్నించినా వీలుపడదు. ప్రస్తుతానికి రెండు విధానాల్లోనూనమోదుకు అవకాశం ఆధార్ ఆధారిత కూలీల ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ అమిత్ కటారియా ఇటీవల అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటిదాకా కూలీల హాజరు నమోదు ప్రక్రియకు అనుసరించే విధానానికి అదనంగా డిసెంబర్ 4 నుంచి యాప్ ద్వారా కూలీల ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదు చేసేలా ఆధునికీకరించిన ఎన్ఎంఎంఎస్ యాప్ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రెండు ప్రక్రియల్లో హాజరు నమోదుకు వీలున్నా.. రానున్న రోజుల్లో ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు నమోదుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. -
దాదాపు 81 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలు బహిర్గతమయ్యాయి
-
81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్!
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయులు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' (Resecurity) వెల్లడించింది. లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు (రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: రూ.6.5 కోట్ల జాబ్ వదులుకున్న మెటా ఉద్యోగి - రీజన్ తెలిస్తే.. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో కొవిన్ వెబ్సైట్ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. ఆధార్ వివరాలతో హ్యాకర్స్ ఏం చేస్తారు! భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్ దోపిడీలు, ట్యాక్స్ రిఫండ్ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. -
స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. మీ సర్టిఫికెట్లు అన్నీ ఇకపై,, 'అపార్' కార్డులోనే..
సాక్షి, నిర్మల్: ‘ఆధార్’ తరహాలో విద్యార్థుల కోసం ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) పేరుతో ’వన్ నేషన్–వన్ ఐడీ’ కార్డును అందుబాటులోకి తేనున్నారు. వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర విద్యావనరులశాఖ తాజాగా ఆదేశించింది. అపార్ ఐడీ కార్డును దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ అపార్ సంఖ్యనే విద్యార్థి జీవితకాల ఐడీగా పరిగణిస్తారు. ఇందులో విద్యార్థి అకడమిక్ జర్నీ, విద్యా ప్రయాణం, విజయాలు నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైన సమయంలో ట్రాక్ చేయొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమ్మతి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను కోరింది. ఈ అపార్ ఐడీ ప్రాముఖ్యతను వివరించాలని చెప్పింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు ఆతర్వాత ఎప్పుడైనా దాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రయోజనం ఏమిటి? విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు చదివిన, చదువుతున్న సమగ్ర వివరాలు ఒకే గొడుగు కిందకు వస్తాయి. ఎల్కేజీలో చేరినప్పట్నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడనుంది. ఈ కొత్త కార్డును ఆధార్ సంఖ్యతో పాటు ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)’ అనే ఎడ్యులాకర్‌కు అనుసంధానించబడి ఉంటుంది. పాఠశాల విద్యలోని పిల్లలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చే విధానాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘చైల్డ్ ఇన్ఫో’ పేరిట ఒక్కో విద్యార్థికి, ఒక్కో సంఖ్య విధానాన్ని కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ అమలు చేయబోతున్న ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా 1 నుంచి 12వ తరగతి వరకు దాదాపు 26 కోట్ల మంది విద్యార్థులకు 12 అంకెలున్న సంఖ్యను కేటాయిస్తారు. ‘అపార్’ నిర్వహణ ఇలా.. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు ఈ బాధ్యతను అప్పగించింది. దీనికి చైర్మన్‌గా ఏఐసీటీఈ మాజీ చైర్మన్ ఆచార్య సహస్రబుద్దే వ్యవహరిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికెట్లు, నైపుణ్యాలు, పొందిన స్కాలర్షిప్స్, తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంటుంది. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే సమయంలోనూ ధ్రువీకరణ పత్రాలను భౌతికంగా కాకుండా డిజిటల్లో పరిశీలించి సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుందని ఏఐసీటీఈ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నమోదు ప్రక్రియ.. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలలో నమోదు ప్రక్రియ నిర్వహించబడుతుంది, వారు ఏ సమయంలోనైనా వారి సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే డేటాను పంచుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పాఠశాలల ద్వారా ప్రతీ విద్యార్థిపై సేకరించిన డేటా జిల్లా సమాచార పోర్టల్‌లో నిల్వ చేయబడుతుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, దాదాపు 200కు పైగా ఇంటర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ స్థాయిలో చైల్డ్ ఇన్ఫో ద్వారా ఇప్పటికే రాష్ట్రస్థాయిలో ఐడీ నంబరు కేటాయించబడింది. కళాశాల స్థాయిలో మరో గుర్తింపు సంఖ్య ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న అపార్ ఐడీ కార్డు ద్వారా మొత్తం ఒకే కార్డులో పూర్తి విద్య ప్రగతి, సమాచారం నిక్షిప్తమై అందుబాటులోకి రానుంది. విద్యార్థులకు సౌలభ్యం! విద్యార్థి తన విద్యాభ్యా స దశలో వివిధ రకాల ప్రాంతాల్లో అభ్యసిస్తా డు. వీటన్నింటిని ఒకే గొడుగు కిందికి తేవడం అనేది శుభ పరిణామం. ఈ అపార్ ఐడీ విధానం విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. పదేపదే టీసీలు, బోనఫైడ్, పత్రాలు సేకరించడం వంటి సమస్యలు తీరుతాయి. విద్యార్థి ప్రగతి నైపుణ్యాలు ఒకేచోట నిక్షిప్తం చేయబడతాయి. – జిలకరి రాజేశ్వర్, తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, నిర్మల్ ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏకీకృతంగా అపార్ కార్డు ద్వారా అందుబాటులోకి రావడం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారం ఒకే ఐడీ నంబర్ ద్వారా నిక్షిప్తమై ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించిన తర్వాత వారి అనుమతితేనే విద్యాశాఖ ముందుకెళ్తుంది. – డాక్టర్ రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్ -
ఆధార్ లింక్.. బడికి బంక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఆధార్ అప్డేట్ కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదేళ్లకోసారి కార్డుదారుడి వేలిముద్రలను మరోసారి సేకరించడంతోపాటు ఫోన్ నంబర్, పేరు, చిరునామా సవరణల కోసం ఈ–కేవైసీ (ఎల్రక్టానిక్ నో యువర్ కస్టమర్) వివరాల నమోదును ఆధార్ సంస్థ తప్పనిసరి చేయడం, ఈ–కేవైసీ కాని కుటుంబాల్లోని వారి పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆధార్ నమోదు కేంద్రాలకు తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక్కో కేంద్రం వద్ద నిత్యం పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తుండడంతో చాలా మంది తెల్లవారుజాము నుంచే కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులే ఉంటున్నారు. వరుసగా రెండు, మూడు రోజులపాటు స్కూళ్లు ఎగ్గొట్టి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరిగితేగానీ ఈ–కేవైసీ నమోదు సాధ్యంకావట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులతోనే తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ఆధార్ నమెదు కేంద్రాల్లో పిల్లల తాకిడి విపరీతం కావడంతో అటు పిల్లలు, ఇటు పెద్దలు ఆధార్ ఈ–కేవైసీ కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. చేతులెత్తేసిన విద్యాశాఖ... బడి పిల్లలకు ఉచితంగా ఆధార్ ఎన్రోల్మెంట్, సవరణ ప్రక్రియ కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకంగా ఆపరేటర్లను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పాఠశాలలోనే ఆధార్ నమోదు కౌంటర్లు తెరిచి విద్యార్థులందరికీ ఉచితంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 876 కిట్లను ఆపరేటర్లకు అప్పగించి నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది. కానీ ఈ కార్యక్రమానికి శాఖపరంగా పర్యవేక్షణలోపం, దానికితోడు అధికారుల ఉదాసీనవైఖరి తోడవడంతో పాఠశాల స్థాయిలో నమోదు ప్రక్రియ అటకెక్కింది. అందుకు బదులుగా ఆయా కిట్లను ఆపరేటర్లు తమకు నచ్చినచోట కౌంటర్ ఏర్పాటు చేసుకొని నమోదు ప్రక్రియను సాగిస్తూ అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. కేవలం పాఠశాల పిల్లల వివరాలను నమోదు చేయాల్సి ఉండగా పెద్దల వివరాలను కూడా నమోదు చేçస్తున్నారు. అయితే చాలాచోట్ల ఈ కిట్ల ద్వారా ఎంట్రీ చేస్తున్న వివరాలు తప్పులతడకగా ఉంటుండటంతో కార్డుదారులు లబోదిబోమంటున్నారు. కేంద్రాలను పెంచరు... కొత్త కిట్లు ఇవ్వరు... ఆధార్ నమోదు నిరంతర ప్రక్రియ. ప్రస్తుతం రాష్ట్రంలో 650 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో రోజుకు గరిష్టంగా 100 మంది వివరాల నమోదు మాత్రమే సాధ్యమవుతోంది. ఆపరేటర్ల తిరస్కరణ, నమోదు కేంద్రాల నిర్వహణ భారంతో ప్రస్తుతం 350 శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలితంగా తాకిడీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రాల సంఖ్య పెంచాలని లేదా కొత్తగా రెండో కిట్టు ఇవ్వాలని ఆధార్ సంస్థకు నిర్వాహకులు వినతులు సమర్పిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రావట్లేదు. నిత్యం గలాటాలు... పరిమితికి మించి జనాలు రావడం... సాంకేతిక కారణాలతో నమోదు ప్రక్రియ జాప్యం జరుగుతుండటం లాంటి కారణాలతో ప్రతి రోజూ కార్డుదారులు మమ్మల్ని నిలదీస్తున్నారు. –శ్రీనివాస్, ఆధార్ కేంద్రం నిర్వాహకుడు బోడుప్పల్ వినతులు బుట్టదాఖలు.. మా కేంద్రానికి రెండో కిట్టు కేటాయించాలని గత కొంతకాలంగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. –కె.పవిత్ర, ఆధార్ కేంద్రం నిర్వాహకురాలు ఇబ్రహీంపట్నం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రంలో శనివారం కనిపించిన దృశ్యం ఇది. కేవలం ఆధార్‌లో వివరాల నమోదు కోసం బడికి సెలవుపెట్టి మరీ వచ్చినట్లు వారంతా పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆధార్ నంబర్ లింకుతో గతంలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ ఎన్రోల్మెంట్ జరగ్గా ఇప్పుడు ఆయా విద్యార్థులు వారి వేలిముద్రలతో ఆధార్‌లో అప్డేట్ చేసుకుంటున్నారు. వీరంతా ఆధార్ వివరాల అప్డేషన్ కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆధార్ నమోదు కేంద్రానికి ఉదయం 7 గంటలకే క్యూలో నిలబడ్డారు. ఒక్కో సెంటర్లో రోజుకు పరిమిత సంఖ్యలోనే వివరాల అప్డేషన్ ప్రక్రియ జరుగుతుండడంతో తెల్లవారుజాము నుంచే టోకెన్లు తీసుకునేందుకు ప్రయతి్నస్తూ ఇలా లైన్లలో నిరీక్షిస్తున్నారు. -
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ ఎందుకో తెలుసా? పూర్తి వివరాలు..
దేశంలో ఆధార్ కార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇలా ఎక్కడ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరైంది. అందుకే దీన్ని అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పూర్తి పేరు, శాశ్వత చిరునామా, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక సమాచారమంతా 12 అంకెల సంఖ్యకు అనుసంధానించి ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’ ఆధార్ కార్డును జారీ చేస్తోంది. ఆధార్ కార్డులు సాధారణంగా తెలుపురంగులో ఉండడం గమనించే ఉంటాం. ఇవి వయోజనుల కోసం జారీ చేసే కార్డులు. కానీ, యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డుల (బ్లూ ఆధార్)ను జారీ చేస్తోంది. వీటిని బాల ఆధార్ కార్డుగా వ్యవహరిస్తున్నారు. ఇవి 5 ఏళ్లలోపు పిల్లల కోసం జారీ చేస్తారు. వీరికి వేలిముద్రలు, కంటిపాప వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించకుండానే కార్డు అందజేస్తారు. అన్ని వివరాలు వెరిఫై చేసిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డ్ జారీ అవుతుంది. కేవలం ఫొటో, పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం అందులో ఉంటుంది. ఈ కార్డుని తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తారు. బాల ఆధార్ కార్డు కాలపరమితి పిల్లల వయసు ఐదేళ్లు వచ్చే వరకే. తర్వాత వేలి ముద్రలు, కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్‌కార్డుని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, కార్డు చెల్లదు. 15 ఏళ్లు నిండిన తర్వాత వేలిముద్రలు, కంటిపాప వివరాలతో మరోసారి ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవాలి. నవజాత శిశువుల కోసం తల్లిదండ్రులు బాల్ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పత్రం వంటి డాక్యుమెంట్లు అందజేస్తే సరిపోతుంది. లేదా పిల్లల పాఠశాల ఐడెంటిటీ కార్డుని కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగాలివీ.. బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా వినియోగించవచ్చు. దీని సహాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకు మధ్యాహ్న భోజన స్కీమ్ పొందటానికి వీలవుతుంది. నకిలీ విద్యార్థుల వివరాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అడ్మిషన్ ప్రక్రియ కోసం తల్లిదండ్రులు బ్లూ ఆధార్ కార్డులను అందించాలని అనేక పాఠశాలలు పట్టుబడుతున్నాయి. -
పటిష్ఠతే పరమావధి!
అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్‌తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్‌ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది. ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న. దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్‌ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్‌లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు. కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్‌పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్‌కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి. ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్‌కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి. తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం. -
మూడీస్ అభిప్రాయాలు నిరాధారమైనవి : కేంద్రం
-
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. -
Aadhaar card update: ఆధార్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..
Aadhaar card free update: ఆధార్ (Aadhaar) కార్డుల్లో తప్పులుంటే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గడువును పొడిగించింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఫ్రీగా అప్డేట్ చేసేందుకు విధించిన సెప్టెంబర్ 14తో ముగియనుండగా.. ఇప్పుడు దానిని మరో 3 నెలలు అంటే డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది. ఈ మేరకు యూఐడీఏఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వీలైనంత ఎక్కువ మంది ఆధార్‌లో తమ డాక్యుమెంట్లు అప్డేట్ చేసుకునేలా ప్రోత్సహించడానికి సెప్టెంబర్ 14 వరకు మై ఆధార్ (myAadhaar) పోర్టల్ ద్వారా ఉచితంగా ఆధార్‌లో డాక్యుమెంట్లు అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించాం. (పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?) దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు పొడిగించాలని నిర్ణయించాం. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫ్రీగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు’ అని యూఐడీఏఐ పేర్కొంది. అలాగే ఆధార్ కార్డు పొంది పదేళ్లు దాటిపోయినవారు కూడా అప్డేట్ చేసుకోవాలని కోరింది. -
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
డిగ్రీ సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు.. యూజీసీ కీలక ఆదేశాలు
డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: WFH: అక్కడ వర్క్ ఫ్రమ్ హోం.. కంపెనీలకు పోలీసు శాఖ సూచన ఆధార్ రెగ్యులేషన్స్ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థా విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. UGC Letter regarding display of Aadhaar number on provisional certificates and degrees issued by universities. Read:https://t.co/jtxN2oDipB pic.twitter.com/TSK9ne8hdV — UGC INDIA (@ugc_india) September 1, 2023 -
ఏబీపీఎస్‌కు మారితేనే ఉపాధి కూలి జమ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఉపాధిహామీ చట్టం కింద ఉపాధి పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత చెల్లింపు బ్రిడ్జి సిస్ట మ్ (ఏబీపీఎస్)కు మారాల్సిందే. గతంలో మూడునాలుగు పర్యాయాలు ఈ డెడ్‌లైన్ మారినా, ఇకపై ఎలాంటి పొడిగింపులు ఉండవని కేంద్ర ప్రభుత్వవర్గాలు స్పష్టం చేస్తు న్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 31వ తేదీ వరకే బ్యాంక్ ఖాతా ఆధారిత, ఆధార్ ఆధారిత పద్ధతుల్లో పేమెంట్స్ చేస్తారు. ఇకపై ఆధార్–ఎనెబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) కాకుండా, సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఏబీపీఎస్ అనుసరిస్తున్నారనే విషయాన్ని గమనించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ♦ ఈ కొత్త విధానంలో భాగంగా ఉపాధి హామీ జాబ్‌కార్డ్ హోల్డర్, తన జాబ్కార్డ్ను బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) మ్యాపర్‌తో తప్పనిసరిగా కనెక్ట్ చేయాలి. ♦ ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ సీడింగ్, ఎన్పీసీఐ మ్యాపర్‌లో మ్యాపింగ్ చేయడానికి ఖాతాదారు కేవైసీ వివరాలు, బయోమెట్రిక్, స్థానికత, ఆధార్ డేటా బేస్–బ్యాంక్ ఖాతాల్లోని వివరాల్లో తేడాలు లేకుండా చూసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది. ♦ ఉపాధిహామీ జాబ్‌కార్డు సమాచారంలో తేడాలున్నా వేజ్ పేమెంట్ అనేది స్తంభిస్తుంది. ♦ ఉపాధి కూలీలు బ్యాంక్ ఖాతాలను తరచుగా మార్చడం, దానిని ప్రోగ్రామ్ ఆఫీసర్లు అప్డేట్ చేయకపోవడం, తదితర కారణాల నేపథ్యంలో లబ్దిదారులకు నష్టం జరగకుండా ఏబీపీఎస్ అత్యుత్తమ ప్రత్యామ్నాయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. ♦క్షేత్రస్థాయిలో వివిధ జిల్లాల్లో జాబ్‌కార్డును బ్యాంక్ ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయడంలో సిబ్బందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారు. ఈ డెడ్‌లైన్ మరికొంతకాలం పొడిగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. లిబ్టెక్ నివేదికలో ఏముందంటే... ♦కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ చట్టం ఆశయాలు, లక్ష్యాలను నీరుగారుస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మొత్తం కోటీ ఐదు లక్షల మంది (ఇన్ యాక్టివ్ వర్కర్లతో సహా) ఉపాధి కూలీల్లో 42 లక్షల మంది ఏబీపీఎస్‌కి అనర్హులుగా ఉండిపోయారు. ♦ పనిచేస్తున్న 61 లక్షల కూలీల్లో (యాక్టివ్ వర్కర్స్) 5.33 లక్షల మంది ఏబీపీఎస్‌కి అర్హత సాధించలేకపోయారు. ♦ నరేగా పోర్టల్ నుంచి సమాచారాన్ని విశ్లే షించిన లిబ్టెక్ ఇండియా సంస్థ తన ని వేదికలో ఈ విషయాలను వెల్లడించింది. పేమెంట్ మిస్ కాకుండా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి యాక్టివ్ వర్కర్స్ కేటగిరీలో ఏబీపీఎస్ అర్హత విషయంలో మొత్తం కార్మికుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నపుడు గణనీయమైన సంఖ్యలో కార్మికులు దీనికి అర్హత సాధించలేదని అర్థమవుతుంది. దీంతో వారు ఉపాధి హామీ కింద పని పొందడానికి అనర్హులుగా చేస్తుంది. ఇది ఉపాధి చట్టం సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘనే. అంతేకాకుండా, గత 18 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా నికరంగా తొలగించిన దాదాపు 4 లక్షల మంది కార్మికులను ఏబీపీఎస్ అర్హత గణాంకాలు పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఏబీపీఎస్ కారణంగా ఉపాధి హామీ చట్టం కింద పని, పేమెంట్ మిస్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. – చక్రధర్ బుద్దా,డైరెక్టర్, లిబ్టెక్ ఇండియా సంస్థ -
Aadhaar Special Camps: 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియలో ఆధార్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్‌లో తప్పులు కారణంగా అర్హులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 25 వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు ఉంటాయి. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశ అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానంతో కూడిన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వివరాలను తాజాగా అప్డేట్ చేసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5.56 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 1.49 కోట్ల మంది గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వీరితోపాటు కొత్తగా ఆధార్ నమోదు, ఇతర మార్పులుచేర్పుల సేవలు అందజేసేందుకు ఈ ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నట్టు లక్ష్మీశ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎక్కువ మంది క్యాంపులను వినియోగించుకొని ఆధార్ సేవలు పొందేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఇందుకు ప్రచారం చేయించాలని ఆదేశించారు. -
ఆధార్ ఉన్నవారికి హెచ్చరిక - ఈమెయిల్ & వాట్సాప్‌లో..
ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి మీ డాక్యుమెంట్స్ షేర్ చేయమని ఏదైనా వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్‌లు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) హెచ్చిరికలు జారీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆధునిక కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఐడీఏఐ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆధార్ అప్డేట్ కోసం ఈ-మెయిల్ లేదా వాట్సాప్ మెజెజ్ రోపంలో సందేశాలు పంపదని, అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని తెలియజేసింది. ఏదైనా ఆధార్ కార్డు అప్డేట్కి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉండే ఆధార్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కావున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది. ఆధార్ అప్డేట్లో భాగంగా ఎవరూ తమ వివరాలను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపకూడదు. ఇదీ చదవండి: ఫస్ట్ టైమ్ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకుంటే.. ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు దాటితే వారు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పలుమార్లు వెల్లడించింది. ప్రస్తుతం దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. దీనికి చివరి గడువు సెప్టెంబర్ 14 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోని వారు గడువు లోపల చేసుకోవచ్చు. #BewareOfFraudsters UIDAI never asks you to share your POI/ POA documents to update your #Aadhaar over Email or Whatsapp. Update your Aadhaar either online through #myAadhaarPortal or visit Aadhaar centers near you. pic.twitter.com/QZlfOnBp54 — Aadhaar (@UIDAI) August 17, 2023 -
బ్యాంక్ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు!
కడప అర్బన్: ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన నల్లగళ్ల వెంకటే‹Ù, గుంటూరుకు చెందిన మాల్యాద్రి మల్లఅజయ్, గంటా కళ్యాణ్, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీ, పసుపులేటి గోపి ఉన్నారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో కడప నగరానికి చెందిన శంకరయ్య తన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.5,500 విత్ డ్రా అయినట్టు కడప సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఈ ఫిర్యాదు నమోదైంది. కాగా, ఈ నెల 15న ఓ వ్యక్తి వాట్సాప్, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా శంకరయ్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఫిర్యాదు చేయడం వల్ల నా అకౌంట్ ఫ్రీజ్ చేశారు. రేపటిలోగా నా అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయించకుంటే చంపేస్తాం’ అంటూ బెదిరించాడు. దీనిపై బాధితుడు కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ తుషార్‌డూడీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి విచారణ చేపట్టారు. అలా వారి ఖాతాలకు నగదు బదిలీ ఈ నేరం ఆధార్ ఎనేబుల్ సిస్టం(ఏఈపీఎస్)ద్వారా ఫిర్యాది బయోమెట్రిక్(వేలిముద్రలు)లను నకిలీవి సృష్టించి వాటి సాయంతో కస్టమర్ సరీ్వస్ పాయింట్స్(బిజినెస్ కరస్పాండెంట్స్)లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి ఫిర్యాది ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5,500 విత్‌డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నగదు విత్‌డ్రా జరిగిన ప్రదేశం కడప పట్టణంలో ఉందని గుర్తించారు. అలాగే అనుమానితుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి కడప ఓల్డ్ బైపాస్ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో వెంకటేష్(బిజినెస్ కరెస్పాండెంట్) బ్లాక్ మార్కెట్ ద్వారా ఏపీ, తెలంగాణ ప్రజల వేలిముద్రలు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి, నిందితుల సాయంతో బాధితుల బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తమ ఖాతాలకు బదిలీ చేసేవారు. నిందితుల నుంచి కారు, నాలుగు సెల్ఫోన్లు, నేరాలకు ఉపయోగించే డివైస్‌లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులపై 4 ఎఫ్ఐఆర్లు, 412(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) ఎన్సీఆర్పీ పిటిషన్లు నమోదైనట్లు, దేశంలో మొత్తం 416 మంది బాధితులను గుర్తించారు. -
పదేళ్లు పూర్తయిన వారందరికీ ఆధార్ నవీనీకరణ తప్పని సరి
సాక్షి,మేడ్చల్ జిల్లా: ఆధార్ కార్డు నవీకరణ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. కార్డులు పొంది పదేళ్లు పూర్తయిన వారు, ప్రస్తుతం ఉన్న కార్డులను నవీనీకరించుకోవాలని ఇప్పటికే యూఐడీఏఐ సూచించింది. ఆధార్ కార్డు నవీనీకరణకు మొదట జూన్ 14 వరకు గడువు విధించారు. అయితే ప్రజల నుంచి నామ మాత్రంగా స్పందన రావడంతో గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. 2010–18 సంవత్సరాల మధ్య ఆధార్ కార్డులు పొందినవారు సెపె్టంబరు 14 వరకు ఉచితంగా నవీనీకరించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. రెండు రకాలుగా... ఆధార్ కార్డును మై–ఆధార్ పోర్టల్, ఎం–ఆధార్ యాప్‌లో ఉచితంగా నవీనీకరించుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న శాశ్వత ఆధార్ కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఆధార్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు గతంలో ప్రజలు చెప్పిన వ్యక్తిగత వివరాలను మాత్రమే హడావుడిగా నమోదు చేశారు. చాలా మంది తప్పుడు సమాచారం ఇచి్చనట్లు గుర్తించారు. ప్రస్తుతం,.. గతంలో ప్రజలు వెల్లడించిన వివరాల ప్రకారం ధ్రువపత్రాలను అప్లోడ్ చేసి నవీనీకరించుకోవచ్చు. నవీనీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రాన్ని ఖచి్చతంగా సమరి్పంచాల్సి ఉంటుంది. అక్షరాస్యులైతే పదో తరగతి మార్కుల మెమోను తీసుకెళ్తే సరిపోతుంది. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ పత్రం, తహసీల్దార్ జారీ చేసిన ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఆధార్ కార్డు నవీనీకరణను పూర్తి చేసుకోవచ్చు. ఇతర మార్పులకు ఇలా... ప్రస్తుతం పదేళ్లు దాటిన వారందరూ ఆధార్ కార్డు సమాచారాన్ని నవీనీకరించుకోవాల్సి ఉంది. దీంతోపాటు పేరులో అక్షరాలను సరి చేసుకోవడానికి, ఫొటో, చిరునామా మార్పు, ఫోన్ నంబర్లలో మార్పులు చేసుకోవచ్చును. జిల్లాలోని చాలా గ్రామాల్లో ప్రస్తుతం ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో లేవు. నవీనీకరణకు తప్పనిసరిగా మండల కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గతంలో కొత్తగా ఆధార్ కార్డుల జారీ సమయంలో గ్రామాల వారీగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ నవీనీకరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
భారీ వర్షాలు, వరదలు.. ‘ధ్రువీకరణ’ వరదపాలు. వరంగల్ విద్యార్థుల గోస
వరంగల్ డెస్క్: ఇటీవల కురిసిన కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. కాలనీలు చెరువులు, కుంటలను తలపించగా, వీధులు వాగులుగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ములుగు జిల్లా కొండాయి, దొడ్ల, జయశంకర్భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి, వరంగల్ నగరంలోని ముంపుకాలనీల వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. వరధ ఉధృతికి ఇంట్లోని భూమి పట్టాదార్పాస్పుస్తకాలు, పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా అన్ని రకాల విలువైన పత్రాలు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల తడిసి పనికి రాకుండాపోయాయి. ఈ క్రమంలో తమకు కనీసం ధ్రువీకరణపత్రం కూడా లేకుండాపోయిందని పలువురు వరద బాధితులు అంటుండగా, పై చదువులకు ఎలా వెళ్లేది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటో వరంగల్ నగరంలోని బీఆర్‌నగర్.వరద బాధితులు ఇలా ఇంట్లో తడిసిన అన్ని పత్రాలను మంచంపై పరిచి ఆరబెట్టారు. ఇటీవల వరదలకు ఈ కాలనీ పూర్తిగా మునిగిపోవడంతో కాలనీవాసులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద తగ్గాక ఇంటికి చేరుకున్న వారికి ఏ వస్తువు చూసినా బురదతో నిండి ఉంది. ఇంట్లోని ధ్రువీకరణ పత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలుఅన్నీ తడిసిపోయాయి. సర్వే చేస్తున్నాం మోరంచపల్లి గ్రామంలో వరదలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికీ వెళ్లి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. సర్వే ఆధారంగా పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డులు వచ్చేలా కృషి చేస్తాం. తాత్కాలిక ఆధార్ కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేస్తాం.. కొండాయి, మోరంచపల్లి, వరంగల్‌లో.. గత 27వ తేదీన వరద బీభత్సానికి కొండాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను వదిలి ప్రాణాలను కాపాడుకునేందుకు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇళ్లల్లో దాచుకున్న ధ్రువీకరణపత్రాలు, చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఇంటిపత్రాలు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఇక వరంగల్ నగర పరిధిలో వరద ముంపునకు గురైన బీఆర్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాతకాలనీ, గోపాల్పూర్, నయీంనగర్ ప్రాంతాల్లోని వారిదీ ఇదే పరిస్థితి. అన్ని సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి ట్రంకు బాక్సులో పెట్టుకున్న పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లన్నీ కొట్టుకుపోయాయి. నా పై చదువుల పరిస్థితి ఏమిటీ? ఇంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. నా సర్టిఫికెట్లు ఇప్పించి ఆదుకోవాలి. -ప్రవీణ్‌కుమార్, దొడ్ల, ములుగు జిల్లా -
ఇకపై వాటికి ఆధార్ తప్పనిసరి.. పుట్టిన బిడ్డకు ఎంతో మేలు!
ఇప్పటివరకు 'ఆధార్' (Aadhaar) కార్డు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకింగ్ రంగం వంటి వాటిలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కేంద్ర హోమ్ మినిష్టర్ శాఖ (MHA) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ కార్యాలయాన్ని జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణ చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ అవసరం లేదు, కానీ కొత్త ఆదేశాలమేరకు ఇకపై వీటికి కూడా ఆధార్ తప్పనిసరి. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! 1969 చట్టాన్ని సవరించి ఇప్పుడు జనన మరణాల నమోదు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నిర్దారణని అందించాలి. అంతే కాకుండా ఈ డేటాను ప్రతి సంవత్సరం రాష్ట్రాలన్నీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించాల్సి ఉంటుంది. సుమారు 54 సంవత్సరాల తరువాత 1969 చట్టం మొదటిసారి సవరించినట్లు తెలుస్తోంది. ఆధార్ ఇవ్వడం ద్వారా జనాభా రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం సవరణకు లోనైన జనన మరణాల చట్టం 2023లో లేదా ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు. -
ఆధార్ ముఖ ధ్రువీకరణ లావాదేవీలు 1.06 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకణ లావాదేవీలు (గుర్తింపు ధ్రువీకరణ) మే నెలలో 10.6 మిలియన్లు (1.06 కోట్లు) నమోదయ్యాయి. ఈ లావాదేవీలు వరుసగా రెండో నెలలో కోటికి పైగా నమోదయ్యాయి. ‘‘ముఖ ధ్రువీకరణ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నెలవారీ లావాదేవీలు ఈ ఏడాది జనవరి నెలతో పోల్చి చూసినప్పుడు మే నెలలో 38 శాతం అధికంగా నమోదయ్యాయి. దీని వినియోగం పెరుగుతుందన్న దానికి సంకేతం’’అని యూఐడీఏఐ ప్రకటించింది. 2021లో ఈ సేవను ప్రారంభించిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా లావాదేవీల నమోదైంది ఈ ఏడాది మే నెలలోనేనని తెలిపింది. ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సేవలకు డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఏఐ/మెíÙన్ లరి్నంగ్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సొల్యూషన్‌ను ప్రస్తుతం 47 సంస్థలు వినియోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంక్‌లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, పీఎం కిసాన్ పథకంలో లబి్ధదారుల నమోదుకు, పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్లు పొందేందుకు ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ప్రారంభానికీ దీన్ని తీసుకుంటున్నారు. వినియోగానికి సులభంగా ఉండడం, వేగంగా గుర్తింపు ధ్రువీకరణ, ఫింగర్ ప్రింట్, ఓటీపీలతో సౌకర్యవంతంగా ఉంటున్నట్టు యూఐడీఏఐ వివరించింది. మే నెలలో ఆధార్‌కు సంబంధించి 1.48 కోట్ల అప్డేట్ అభ్యర్థనలను కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ఆధార్ ఈ కేవైసీకి డిమాండ్ పెరుగుతోంది. మే నెలలో 25.4 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నమోదైనట్టు యూఐడీఏఐ ప్రకటించింది. -
ఈ రోజే లాస్ట్.. ఆధార్ - పాన్ లింక్ చేయలేదా!
PAN-Aadhaar Linking: పాన్ - ఆధార్ లింక్ గురించి గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ లింకింగ్ గడువు ఈ రోజు కొన్ని గంటలలో ముగియనుంది. రేపటి నుంచి (జులై 01) ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. గతంలో దీని కోసం అనేక మార్లు గడువు పెంచడం కూడా జరిగింది. మరో సారి పొడిగిస్తుందో.. లేదో ప్రస్తుతానికి తెలియదు. నిజానికి పాన్ - ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసింది. అయితే 2023 మార్చి 31 వరకు రూ. 1000 ఫైన్‌తో అదనపు గడువు కల్పించారు. ఆ కూడా జూన్ 30 వరకు పొడిగించారు. ఆ గడువు కాస్త ఈ రోజుతో ముగియనుంది. ఇంకో సారి పెంచే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నా.. దీనిపైనా ఎటువంటి స్పష్టత లేదు. ఆధార్ - పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది.. ఆధార్ - పాన్ గడువు లోపలు చేయకుండా ఉంటే వారి బ్యాంకింగ్ సర్వీసులు, డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం మాత్రమే కాకుండా.. ఆన్లైన్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు, పెండింగ్ రిటర్నుల ప్రాసెస్ కూడా నిలిచిపోతుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) ఆధార్ - పాన్ లింక్ అనేది కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. ఇందులో 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు & భారత పౌరులు కాని వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఆధార్ - పాన్ లింక్ అవసరం లేదు. -
గుడ్‌న్యూస్! ఆధార్ ఉచిత అప్డేట్ గుడువు పొడగింపు
ఆధార్‌లో డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పొడిగించింది. మరో నెలలు అంటే జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14 వరకు డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్‌కు సంబంధించి గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ కోసం ఇచ్చిన పత్రాలను సెప్టెంబర్ 14 లోపు ఉచితంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవాలని యూఏడీఏఐ తన వెబ్సైట్లో పేర్కొంది. డాక్యుమెంట్ల అప్డేట్, అప్లోడ్ కోసం జూన్ 14 వరకే గడువు ఉండేది. ఇప్పుడు దాన్ని యూఏడీఏఐ పొడిగించింది. ఈ అప్డేట్ సౌకర్యం https://myaadhaar.uidai.gov.in వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ డాక్యుమెంట్లను స్వయంగా అప్డేట్, అప్లోడ్ చేసుకోవచ్చు. అదే ఆధార్ సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) కేంద్రంలో అప్డేట్ చేయించుకుంటే రూ.25 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. -
ఆధార్ అప్డేట్.. గడువు 10 రోజులే!
Aadhaar Update: భారతీయ పౌరులకు ఆధార్ కార్డు ఎంత ప్రధానమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు రావాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా కూడా ఆధార్ కార్డే ఆధారం. అయితే ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం మంచిది. అంతే కాకుండా ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డుని ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది. అయితే ఈ గడువు ఇప్పుడు సమీపిస్తోంది. గతంలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డు వివరాలను రూపాయి చెల్లించకుండా జూన్ 14 లోపల అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత ఆన్లైన్లో చేసిన కనీసం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: మీ పాన్ నెంబర్‌తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్‌తో తెలుసుకోండి) నిజానికి ఈ గడువు మే చివరి నాటికి ముగియాల్సి ఉంది. కానీ అందరూ ఆధార్ కార్డుని అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని 'యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' ఆధార్ కార్డుని ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి అనుమతించింది. కావున ఇప్పటి వరకు ఆధార్ అప్డేట్ చేయని వారు ఈ నెల 14లోపు తప్పకుండా అప్డేట్ చేసుకోవడం మంచిది. -
ఆధార్ బిగ్ అప్డేట్ ఒక్క ఫోన్ తో ఆధాార్ సమస్యలకు చెక్
-
ఆధార్ కార్డులో సమస్యలా? ఇదిగో టోల్ ఫ్రీ నెంబర్..
Aadhaar Card Toll Free Number: భారతదేశంలో ఉన్న అందరికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అవసరం, అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ కార్డులో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అలాంటి తప్పులను సవరించుకోవడానికి కొన్ని సార్లు అనేక ఇబ్బదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ సెంటర్ల వద్దకు పదే పదే తిరగాల్సి కూడా వచ్చేది. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కేవలం మీరు ఒక నెంబర్‌కి కాల్ చేస్తే సరిపోతుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఆధార్ కార్డులో పేరు, ఇంటి పేరు, అడ్రస్ వంటి తప్పులను మార్చుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ 1947 అనే నెంబర్ తీసుకువచ్చింది. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే మీ సమస్యలు ఇట్టే తీరిపోతాయి. ఈ నెంబర్‌కి కాల్ చేస్తే 12 భాషల్లో సర్వీస్ ప్రతినిధులు అందుబాటులోఉంటారు. మీ సమస్యను వారికి తెలియజేస్తే వారు తగిన పరిష్కారం అందిస్తుంది. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ, కన్నడ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, మలయాళం, అస్సామీ, ఉర్దూ, మరాఠీ భాషల ప్రజలు ఈ నెంబర్ ద్వారా సమస్యలకు పరిస్కారం పొందవచ్చు. సంస్థ ఈ నెంబర్ అందించడానికి కూడా ఒక ప్రధాన కారణం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది ఈ సంవత్సరంలోనే కావున ఈ నెంబర్ అందించడం జరిగింది. అంతే కాకుండా ఇది అందరికి గుర్తుండే నెంబర్ కూడా. (ఇదీ చదవండి: ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!) ఇది పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్, కావున ఎలాంటి చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండదు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు, పరిష్కారం పొందవచ్చు. అయితే ఆదివారం రోజు మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పేరు, అడ్రస్ మాత్రమే కాకుండా, ఆధార్ నమోదు కేంద్రాలు, ఎన్రోల్మెంట్ తర్వాత ఆధార్ కార్డు నంబర్ స్టేటస్ సహా ఆధార్‌కు సంబంధించి సమస్యలన్నింటికీ వారు పరిష్కారం అందిస్తారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఆధార్ కార్డ్ పోయిందా.. నంబర్ కూడా గుర్తులేదా.. ఎలా మరి?
దేశంలో ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికీ చాలా కీలకమైన డాక్యుమెంట్. అనేక ప్రభుత్వ పథకాలకు, ఆర్థిక లావాదేవీలకు ఇది చాలా అవసరం. మరి ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డ్‌ను పోగొట్టుకుంటే.. ఆధార్ నంబర్ కూడా గుర్తు లేకుంటే ఏం చేయాలి.. డూప్లికేట్ ఆధార్ ఎలా పొందాలి? ఆధార్ కార్డ్ మన రోజువారీ జీవనంలో భాగమైపోయింది. బ్యాంకు వెళ్లినా.. ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైపోయింది. ఒక వేళ మన ఆధార్ కార్డ్ పోగొట్టుకునిపోతే ఆధార్ నంబర్ గుర్తుంటే ఈ ఆధార్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ నంబర్ కూడా గుర్తు లేనప్పుడు ఆధార్ కార్డ్‌ను పొందడం ఎలాగో తెలియక తికమక పడుతుంటారు. ఇప్పుడు ఆధార్ నంబర్ గుర్తు లేకపోయినా సరే ఆధార్ కార్డ్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఆధార్ కొత్త ఫీచర్: ఓటీపీ మీ మొబైల్ నంబర్‌కే వస్తోందా? ఆధార్ నంబర్ ఉంటే.. https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.inని సందర్శించండి ‘ఆర్డర్ ఆధార్ కార్డ్’ను క్లిక్ చేయండి 12 అంకెల ఆధార్ నంబర్, 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబర్ నమోదు చేయండి. స్క్రీన్‌పై ఇతర వివరాలు, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి అనంతరం మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ వస్తుంది. మళ్లీ యూఐడీఏఐ సెల్ఫ్-సర్వీస్ పోర్టల్‌ని సందర్శించి ‘డౌన్లోడ్ ఆధార్’పై క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ లేకపోతే.. https://myaadhaar.uidai.gov.in/retrieve-eid-uidని సందర్శించండి. ఆధార్ నంబర్ కావాలో లేదా ఎన్రోల్మెంట్ ఐడీ కావాలో ఎంచుకోండి. పేరు, మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ నమోదు చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ లేదా ఎన్రోల్మెంట్ ఐడీ వస్తుంది. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ ద్వారా.. యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1800 180 1947 లేదా 011 1947కు డయల్ చేయండి మీ ఆధార్ కార్డును తిరిగి పొందడానికి అవసరమైన ఆప్షన్ ఎంచుకోండి. అన్ని వివరాలను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీకి ఆధార్ నంబర్ వస్తుంది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్‌ని సందర్శించండి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ - ప్రజలు సమ్మతిస్తారా..?
ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్‌ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆధార్‌ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మర్చిపోయారా? డోంట్ వర్రీ.. ఇలా తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ఆధార్‌కు లింక్ అయిన ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ధ్రువీకరించే సదుపాయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ వెబ్సైట్, మొబైల్ యాప్ నుంచే వీటి ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్టు పేర్కొంది. కొంత మంది యూజర్లకు తమ మొబైల్ నంబర్లలో ఏది ఆధార్‌తో సీడ్ అయిందనే విషయమై అవగాహన ఉండడం లేదని యూఐడీఏఐ గుర్తించింది. దీంతో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆధార్ ఓటీపీ వేరొక మొబైల్ నంబర్‌కు వెళుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రకటించిన సదుపాయంతో ఆధార్‌కు ఏ మొబైల్ నంబర్ సీడ్ అయిందో తెలుసుకోవచ్చు. ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా ఎంఆధార్ యాప్‌లో ‘వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్’ను క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయం పొందొచ్చు’’అని యూఐడీఏఐ పేర్కొంది. ఏదైనా మొబైల్ నంబర్ సీడ్ అవ్వకపోతే అదే విషయాన్ని సూచిస్తుందని, దాంతో మొబైల్ నంబర్ అప్డేషన్కు చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటికే మొబైల్ నంబర్ ధ్రువీకరించి ఉంటే, అదే విషయం తెలియజేస్తుందని వెల్లడించింది. ఆధార్ తీసుకునే సమయంలో ఏ నంబర్ ఇచ్చామో గుర్తు లేనివారు, సంబంధిత మొబైల్ నంబర్ చివరి మూడు నంబర్లను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ ఈ మెయిల్/ మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించొచ్చని సూచించింది. ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు 22 సంస్థలకు అనుమతి కాగా క్లయింట్ల ధ్రువీకరణను ఆధార్ ఆధారితంగా నిర్ధారించుకునేందుకు 22 ఆర్థిక సేవల సంస్థలకు అనుమతి లభించింది. ఈ 22 కంపెనీలు ఇప్పటికే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రిపోర్టింగ్ ఎంటెటీలుగా (కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సమాచారం అందించేవి)గా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. (ఇదీ చదవండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) ఇవి తమ క్లయింట్ల గుర్తింపు ధ్రువీకరణను ఆధార్ సాయంతో చేపట్టేందుకు అనుమతించినట్టు ప్రకటించింది. ఇలా అనుమతులు పొందిన వాటిల్లో గోద్రేజ్ ఫైనాన్స్, అమెజాన్ పే (ఇండియా), ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ ఫైనాన్స్ సొల్యూషన్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంకులు తమ కస్టమర్ల గుర్తింపును ఆధార్ సాయంతో ధ్రువీకరించేందుకు ఇప్పటికే అనుమతి ఉంది. -
‘ఉపాధి’కి తగ్గిన బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లబ్ధి పొందుతున్న కుటుంబాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రతి ఏటా తగ్గుతున్న నిధుల కేటాయింపులకు తోడు ఆధార్ అనుసంధానిత చెల్లింపులు, ఆన్లైన్ హాజరు వంటి చర్యలతో పథకం కింద పనిచేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వలసదారులకు ప్రధాన ఆర్థిక భద్రతగా ఉంటూ ఆసరాగా నిలిచిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2021 ఆర్ధిక సంవత్సరం నుంచి తగ్గుతూ వస్తోంద కేంద్ర గణాంకాలు చాటుతున్నాయి. కోవిడ్ సమయంలో 2020–21లో రికార్డు స్థాయిలో 7.55 కోట్ల కుటుంబాలు దీనిద్వారా ఉపాధి పొందాయి. ఆ తర్వాత 2021–22 వచ్చేసరికి ఈ సంఖ్య 7.25కోట్లకు తగ్గింది. 2022–23 నాటికి 6.19 కోట్లకు పడిపోయింది. తగ్గిన కుటుంబాలకు తోడు పనిదినాల సంఖ్య కుచించుకుపోవడం ఆందోళనకరం. 2020–21లో సగటు పనిదినాల సంఖ్య 51.42 రోజులుకాగా, ఆ సంఖ్య 2022–23 ఏడాదికల్లా 47.84 రోజులకు పడిపోయింది. 2021–22లో కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి రూ.98,467కోట్లు కేటాయించారు. 2022–23లో ఆ కేటాయింపులు కేవలం రూ.89వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈసారి బడ్జెట్లో కేవలం రూ.60వేల కోట్లే విదిల్చేందుకు సిద్ధమైంది. బడ్జెట్‌లేక పనిదినాలను కుదిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికీ వెళ్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రతి నెలా ఆఖరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు వారి సొంత ఊళ్లలోనే ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సేవల వివరాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరి శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఆధార్ నిబంధనల్లో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే వివిధ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా అన్ని వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సేవల గురించి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంటింటా వివరించి చెప్పాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. -
ఆధార్ కార్డులో ఫోటో మార్చాలా? ఇలా చేయండి!
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, లైసెన్స్ వంటి వాటికి అప్లై చేసుకోవడానికి ప్రధాన ఆధారం ఆధార్ కార్డే. అయితే ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డులో ముఖాలు చాలా వరకు గుర్తు పట్టలేని విధంగా ఉంటాయి. అలాంటి ఫోటోలను మనకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆధార్ కార్డులో ఫోటో మాత్రమే కాకుండా పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వంటి వాటిని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. బయోమెట్రిక్ మార్చుకోవడానికి ఆధార్ సెంటర్‌కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇతర వివరాలను ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడం ఎలా? ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోవడానికి ముందుగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రానికి వెళ్ళాలి. https://appointments.uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా కూడా మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆధార్ సెంటర్ చేరుకున్న తరువాత అక్కడ దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఫిల్ చేసే అందించాలి. అప్పుడు వారు మీ బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆధార్ కార్డులో మీ ఫోటో మార్చాలనుకుంటే ఆపరేటర్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాడు. కావలసిన అన్నీ తీసుకున్న తరువాత అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అందిస్తారు. ఈ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అప్డేట్ రిక్వెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కోసం రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ అయిన తరువాత డిజిటల్ కాఫీని అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: ఒకప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఇప్పుడు ఆస్తులు సున్నా అంటున్నాడు..) నిజానికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందులో 12 అంకెల యూనిక్ నెంబర్ ఉంటుంది. దీనిని యుఐడిఏఐ జారీ చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెడా బయోమెట్రిక్ ఐడి సిస్టం అని చెబుతారు. ఇందులో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు మొదలైనవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కేంద్రం కీలక ప్రకటన.. ఆధార్ అథెంటికేషన్ ప్రైవేట్ చేతుల్లోకి
ఆధునిక కాలంలో ఆధార్ కార్డు మనిషి జీవితంలో భాగమైపోయింది. ప్రస్తుతం ఆధార్ కార్డు లేకుండా ఏ ముఖ్యమైన పని జరగదనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి పనికి ఆధార్ నంబర్ కచ్చితంగా కావాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. లోన్స్ తీసుకోవాలన్నా.. ఆధార్ కార్డే ఆధారం. భారతదేశంలో ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డుని జారీ చేస్తుంది. 2022 నవంబర్ 30 నాటికి 135 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ప్రైవేటు కంపెనీలకు కూడా ఆధార్ అథెంటికేషన్ అప్పగించాలని చూస్తోంది. ఆధార్ అథెంటికేషన్ సేవలు ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రిత్వ శాఖల పరిధిలో మాత్రమే ఉన్నాయి. అయితే వాటి పరిధిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు - తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు తెలుసుకోండి..) ఆధార్‌ను ప్రజలకు మరింత అనువైనదిగా, అనుకూలమైనదిగా మార్చడానికి మాత్రమే కాకుండా మరింత మెరుగైన సేవలు అందించడానికి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కావున ఆధార్ అథెంటికేషన్ ప్రైవేటు చేతుల్లోకి కూడా వెళ్లనుంది. (ఇదీ చదవండి: Kumar Mangalam Birla: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) ప్రభుత్వ విభాగాలు అందించే ప్రయోజనాలు, సేవలు, రాయితీల కోసం ఆధార్ అథెంటికేషన్ నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలను అనుమతిచేలా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈ సేవలను పొందాలనుకునే ప్రైవేటు సంస్థలు దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాలి. కేంద్రం అనుమతి పొందిన తరువాత మాత్రమే ఆధార్ అథెంటికేషన్ చేసేందుకు అర్హత పొందుతుంది. -
పిల్లల ఆధార్ నమోదుకు కొత్త నిబంధన.. యూఐడీఏఐ ఆదేశాలు జారీ
సాక్షి, అమరావతి: పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు దరఖాస్తు ఫారంలో తప్పనిసరి చేస్తూ ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో పాటు ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తమ ఆధార్ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ యూఐడీఏఐ విభాగపు డిప్యూ టీ డైరెక్టర్ ప్రభాకరన్ ఆదేశాలు జారీ చేశారు. వయసును బట్టి దరఖాస్తు ఫారం ► ఐదేళ్లలోపు పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డుల జారీ లేదా ఆధార్‌లో వారి వివరాల అప్డేట్ చేసేందుకు ఒక రకమైన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ► ఐదు ఏళ్లకు పైబడి 18 ఏళ్ల మధ్య వయసు వారికి వేరే దరఖాస్తు ఫారం నమూనాను యూఐడీఏఐ సంస్థ విడుదల చేసింది. ► 18 ఏళ్ల పైబడిన వారికి మరో ఫార్మాట్లో దరఖాస్తు ఫారం ఉంటుందని పేర్కొంది. ► ఈ మేరకు మూడు రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను యూఐడీఏఐ తాజాగా జారీ చేసిన ఆదేశాలతో పాటే విడుదల చేసింది. ► ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మూడు రకాల దరఖాస్తు ఫారాల విధానం అమలులోకి రాగా.. దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. -
విద్యార్థుల కోసం ఆధార్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వయసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూనియర్ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుంతో అదనంగా మరో 10 రకాల ఆధార్ సేవలను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్ (ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్) అప్డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్ వివరాల నమోదు, ఆధార్ కార్డు డౌన్లోడ్ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు. -
శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు
బిహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధరణంగా అడ్మిషన్ పొందేందుకో లేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసమే కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటాం. అయితే జంతవుల కోసం దరఖాస్తు చేయడం గురించి ఇప్పటి వరకు విని ఉండం కదా. కానీ ఇక్కడ ఓ కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు ఒక అపరిచిత వ్యక్తి. దీన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు అధికారులు. వివరాల్లోకెల్తే..బిహార్‌లోని గయాలో కుల ధృవీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తు వచ్చింది. టామీ అనే కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అంతేగాదు ఆశ్చర్యపోకండి ఈ టామీకి ఆధార్‌కార్డు కూడా ఉంది అంటూ ఓ ఆధార్ కార్డ్‌ని కూడా జత చేశారు. అందులో టామీ తండ్రి పేరు గిన్ని, పుట్టిన తేది ఏప్రిల్ 14, 2022 అని ఉంది. చిరునామ పందేపోఖర్, పంచాయతీ రౌనా వార్డు నంబర్ 13, గురారు సర్కిల్ అని ఉంది. పైగా ఆ ఆధార్ కార్డుపై 'ఆమ్ కుత్తా కా అధికారం' అని రాసి ఉంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు గురారు సర్కిల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దరఖాస్తుపై పేర్కొన్న ఫోన్ నెంబరు ట్రూకాలర్‌లో రాజబాబు అని చూపుతుందని చెప్పారు. ఐతే అధికారులు ఈ విచిత్ర సంఘటనతో కంగుతిన్నారు. ఈ వికృత చేష్టల వెనుక ఉన్న దుండగలను పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..) -
AP: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..
సాక్షి, అమరావతి: ఆధార్‌లో బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో గురువారం నుంచి ఐదు రోజులపాటు ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించనుంది. ఈ నెల 19, 20, 21, 23, 24 తేదీల్లో ఆయా సచివాలయాలు, వాటి పరిధిలోని పాఠశాలల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో 7 నుంచి 10 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మరోసారి ఈ క్యాంపులు నిర్వహిస్తారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సాగిలి షన్మోహన్ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, గ్రామ వార్డు సచివాలయాల శాఖ జిల్లాల ఇన్చార్జి అధికారులు, జిల్లాల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఈ క్యాంపుల ద్వారా ఆధార్ సేవలు పొందేలా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపుల రోజుల్లో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు పూర్తిగా ఆధార్ సేవల పైనే దృష్టి పెడతారు. ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం పదేళ్లలో కనీసం ఒకసారి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకోనివారు రాష్ట్రంలో ఇంకా 80 లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారుల అంచనా. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. నవరత్నాలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 35 సంక్షేమ పథకాలకూ ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తోంది. పారదర్శకత కోసం ప్రభుత్వ లబ్ధిని అందజేసే ముందు, అందజేసిన తర్వాత కూడా లబ్ధిదారుల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ తీసుకొంటున్నారు. బయోమెట్రిక్ వివరాల్లో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక క్యాంపుల ద్వారా రాష్ట్ర ప్రజలందరి ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేస్తోంది. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
రేపటి నుంచి ఏపీ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు
-
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్‌లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్‌కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్‌కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్‌కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
‘ఆధార్ కార్డు’లో అడ్రస్ మార్పు మరింత ఈజీ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. ఇంటిపెద్ద(హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ) అంగీకారంతో ఆధార్ పోర్టల్‌లో (ఆన్లైన్లో) చిరునామా సులువుగా మార్చుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త విధానంలో ఇంటి పెద్దతో సంబంధాన్ని ధ్రువీకరించే ఏదైనా పత్రం సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్లో ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా అడ్రస్ మారుతుంది. ఇంటిపెద్ద ఫోన్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌ను నిర్ధారించే డాక్యుమెంట్ లేకపోతే ఇంటిపెద్ద సెల్ఫ్–డిక్లరేషన్ సమర్పించవచ్చు. ఇది యూఐడీఏఐ నిర్దేశించిన ఫార్మాట్లో ఉండాలి. ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవడానికి తగిన ధ్రువపత్రాలు లేని వారికి ఈ కొత్త విధానంతో ఏంతో ప్రయోజనం చేకూరుతుందని యూఐడీఏఐ తెలియజేసింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినవారికి సైతం ఉపయోగకరమని వివరించింది. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
న్యూ ఇయర్ అలర్ట్: ఆధార్ కార్డ్‌ని ఇలా ఉపయోగించండి!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాటి వల్ల మంచితో పాటు చెడు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల వ్యక్తిగత వివరాలు( మొబైల్ నంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ , డెబిట్ కార్డ్, పిన్ నంబర్) తెలుసుకుని సైబర్ నేరగాళ్లు మన జేబులకు చిల్లు పెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఆధార్ వినియోగంపై కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆధార్ వినియోగం ఎలా అంటే.. ఇటీవల ఆధార్ కేవలం గుర్తింపు కార్డ్‌లానే కాకుండా పలు సంక్షేమ పథకాలు, బ్యాంక్, పాన్ వంటి వాటితో జత చేయడంతో చాలా క్రీయాశీలకంగా మారింది. దీంతో సైబర్ కేటుగాళ్ల కళ్లు ఆధార్ నెంబర్‌పై పడింది. ఈ నేపథ్యంలో .. మోసాల బారిన పడకుండా యూఐడీఏఐ పలు సూచనలు చేసింది. ఇంత వరకు బ్యాంక్ ఖాతా నంబర్లు, పాన్, పాస్‌పోర్ట్‌లతో సహా ఇతర డ్యాకుమెంట్లు మాదిరిగానే ప్రజలు ఆధార్ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్‌ఫాంలతో సహా పబ్లిక్ డొమైన్లో ఆధార్ కార్డ్‌లను ఎప్పుడూ షేర్ చేయవద్దని సూచించింది. ఏ పరిస్థితిల్లోనూ ఇతరులతో ఆధార్ ఓటీపీ (OTP)ని పంచుకోకూడదని తెలిపింది. ఒక వేళ ఏదైనా విశ్వసనీయ సంస్థతో ఆధార్‌ను పంచుకునేటప్పుడు, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి, పాన్, రేషన్ కార్డ్ వంటి ఏదైనా ఇతర గుర్తింపు పత్రాన్ని పంచుకునే సమయంలో అదే స్థాయి జాగ్రత్తలు పాటించాలని UIDAI సూచనలు చేసింది. చదవండి: న్యూ ఇయర్ ఆఫర్: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే! -
ఆధార్ ఈ కేవైసీ లావాదేవీలు 29 కోట్లు
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు నెలవారీగా చూస్తే నవంబర్‌లో 22 శాతం పెరిగాయి. 28.75 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 1,350 కోట్ల మైలురాయిని లావాదేవీలు అధిగమించాయి. ఆధార్ ధ్రువీకృత లావాదేవీలు సైతం నవంబర్‌లో 11 శాతం అధికంగా 195 కోట్లు నమోదయ్యాయి. ఆధార్ వాడకం దేశవ్యాప్తంగా పెరుగుతోందని, చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ప్రకటించింది. ఆధార్ ఈ కేవైసీ లావాదేవీ అంటే.. బ్యాంక్ ఖాతా కోసం ఈ–కేవైసీ ఇస్తాం కదా, ఇది ఒక లావాదేవీ కిందకు వస్తుంది. ఆధార్ ఈ–కేవైసీ లావాదేవీల వృద్ధికి ప్రధానంగా బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక లావాదేవీలు మద్దతునిస్తున్నాయి. ఈ–కేవైసీ వల్ల పేపర్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన ఇబ్బంది తప్పిపోయింది. ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ ఖాతాలు, టెలికం సిమ్ కార్డుల జారీ, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తదితర సేవలు ఎంతో సులభంగా మారడం తెలిసిందే. ఆధార్ హోల్డర్ వ్యక్తిగతంగా హాజరై వేలిముద్ర, ఓటీపీ ఇస్తేనే ధ్రువీకరణ కావడం ఇందులో భద్రతకు హామీ ఇస్తోంది. ఇక ఆధార్ ఈ–కేవైసీ విధానం వచ్చిన నాటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 8,621 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆధార్ ఆధారిత చెల్లింపులు రూ.1,592 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో 1,100 ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు అసలైన లబ్ధిదారులకు వేగంగా, పారదర్శకంగా చేరేందుకు ఆధార్ ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ తెలిపింది. -
30 వరకు సచివాలయాల్లో ప్రత్యేక ‘ఆధార్’ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్ కార్డుదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఈ నెల 30 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది. మంగళవారం నుంచి నాలుగు రోజులు పాటు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ ఆధార్ కార్డులో తమ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి దాకా ఆధార్ వివరాలు అసలు నమోదు చేసుకోని పాఠశాలల విద్యార్థులు ఈ క్యాంపులో తమ వివరాలు పూర్తి ఉచితంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
అన్నింటికీ ఆధార్ లింక్ తప్పని సరి
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు ఇతర సేవలకు ఇక ఆధార్ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగానే ఇక నుంచి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్‌ను లింక్ చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఇప్పటి వరకు కోటి 9 లక్షల మంది తమ కనెక్షన్లకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించారు. మరో కోటి మందికి పైగా ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాటలో పయనించే విధంగా తాజాగా రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలు, రాయితీలు తదితర ప్రభుత్వ సేవలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఇందులో భాగంగా ట్రెజరీల ద్వారా వేతనం, పదవీ విరమణ పెన్షన్, ఇతర పెన్షన్లు పొందుతున్న వారందరూ ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని స్పష్టం చేశారు. కొత్త లబ్ధిదారులు సైతం ఇకపై దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు. చదవండి: స్పోర్ట్స్ మీట్లో అపశ్రుతి.. విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఐసీయూలో చికిత్స -
ఇక ఈజీగా ఆధార్ అప్డేట్
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆధార్ నమోదు చేసుకొని పదేళ్లు దాటిందా? ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మార్పులతో అప్డేట్ చేసుకోలేదా? అయితే తప్పనిసరి కాకున్నా.. సులభతర గుర్తింపు కోసం ‘మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్’ లేదా దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను సమరి్పంచి, వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచిస్తోంది. తాజాగా ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ సంఖ్య కలిగి ఉన్నవారు నమోదు తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. అథంటికేషన్ కోసమే.. ఆధార్ అనుసంధానం గుర్తింపులో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా, సులభతరంగా పనులు పూర్తి చేసుకునేందుకు అప్డేషన్ తప్ప నిసరిగా తయారైంది. పేరు, ఇంటిపేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫొటో వంటి వివరాలను ఏమైనా మార్పులు చేయాల్సివచ్చినప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు. వయసు, అనారోగ్యం, ప్రమాదం వంటి కారణాలతో మార్పులు రావచ్చు. ఇందుకోసం తమ బయోమెట్రిక్ డేటాను 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయడం మంచిదని యూఐడీఏ సూచిస్తోంది. 22.49 శాతం అప్డేషన్ తప్పనిసరిగా.. దేశంలోనే ఆధార్ నమోదులో అగ్రగామిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ 22.49 శాతం అప్డేషన్ తప్పనిసరిగా తయారైంది. మొత్తం ఆధార్ కార్డులు కలిగి ఉన్నవారిలో 0 నుంచి ఐదేళ్లలోపు 2.99 శాతం, ఐదు నుంచి 18 ఏళ్లు దాటిన వారు 19.5 శాతం ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఆధార్ నమోదు సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అందులో ఐదు నుంచి 15 ఏళ్ల వయసు దాటిన వారికి, ఐదేళ్లలోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్డేట్ తప్పని సరిగా మారింది. స్వయంగా అప్డేట్ ఇలా.. ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు, ఎవరి సాయం అవసరం లేకుండా ఇంటర్నెట్లో.. https://ssup.uidai.gov.in/web/guest/ssup-home నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఆధార్ సంఖ్యను, నమోదు చేసిన మొబైల్ నంబర్ ఉపయోగించి ఈ పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. వన్‌టైమ్ పాస్వర్డ్ మొబైల్ ఫోనుకు వస్తుంది. దాని సాయంతో వెబ్సైట్లో ప్రవేశించాలి. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు స్వీయ ధ్రువీకరణతో వ్యక్తిగత, చిరునామా నిర్ధారణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోని వివరాలను నవీకరణ కార్యాలయం తనిఖీ చేసి, మార్చాల్సిన సమాచారంతో పోల్చిచూస్తోంది. ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారు తన మొబైల్ నంబర్‌ను ముందుగానే నమోదు చేసి ఉండాలి. లేదంటే పైన సూచించిన వెబ్ చిరునామాలోనే ఉండే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసి పోస్టులో పంపాలి. ఈ సేవను పొందాలంటే మొబైల్ నంబర్ తప్పక రిజిస్టరై ఉండాలి. -
పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా.. అందుబాటులోకి కొత్త సేవలు వచ్చాయ్!
పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు. ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్‌లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్‌గా అంగీకరించబడుతుంది. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌టీవీ! -
ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్!
ఇటీవల ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి దానిలో ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చాలా వాటిలో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవగా, పాన్ కార్డులో ఇది ఇంకా కొనసాగుతోంది. అందుకే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వ ( March 2023) లోపు లింక్ చేసుకోవాలిని సూచిస్తోంది. వాస్తవానికి ఈ అనుసంధానం కోసం ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చింది ఐటీ శాఖ. ఈ క్రమంలో మరో మారు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చినా, ఇక్కడ ఇంకో నిబంధన కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత గడువు లోపు లింకు చేస్తున్న వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు గమనిస్తే.. మరోమారు ఈ ప్రక్రియకు పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గడువు తేదిలోపు లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
ఫోన్‌పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్‌పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్‌పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్‌లో దూసుకుపోతుంది ఫోన్‌పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్‌పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్‌పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్‌పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్‌గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్‌పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్‌ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్‌ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్‌పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్‌లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
పదేళ్లకోసారి ‘ఆధార్’ అప్డేట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్రోల్మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్రోల్మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. -
రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఆధార్‌కు బయోమెట్రిక్ నమోదు ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు ఈ నెల మూడో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఈ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కోటి మంది ఆధార్‌కు బయోమెట్రిక్ నమోదు కాలేదని, డిసెంబర్ నెలాఖరులోపు వారందరి బయోమెట్రిక్‌ను సేకరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 1,950 ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా డిసెంబర్ నెలాఖరుకు నూరు శాతం ఆధార్‌కు బయోమెట్రిక్ సేకరించడం సాధ్యం కాదని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా మొబైల్ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ మొబైల్ క్యాంపుల సమాచారాన్ని ముందుగా వలంటీర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలని సూచించింది. విద్యా శాఖ భాగస్వామ్యంతో పాఠశాలల పిల్లల ఆధార్ బయోమెట్రిక్‌ను సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో భాగంగా ఒక్కో కేంద్రం ద్వారా కనీసం 200 బయోమెట్రిక్‌ను సేకరించాలని స్పష్టం చేసింది. ప్రత్యేక క్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణకు మండల, డివిజన్ వారీగా అధికారులను ఇన్చార్జిలుగా నియమించాలని తెలిపింది. పాఠశాలలు, సచివాలయాల్లో రోజు వారీగా ఆధార్ బయోమెట్రిక్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు సూచించింది. -
Andhra Pradesh: జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధార్ సంబంధిత కార్యకలాపాలన్నీ పర్యవేక్షించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పిల్లలతో సహా నూటికి నూరు శాతం ఆధార్ అనుసంధానం చేయించడం, సంబంధిత అంశాలను మరింత పటిష్టంగా అమలు కోసం జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5.17 కోట్ల ఆధార్ నంబర్లు జారీ చేయగా.. 97 శాతం జనాభాకు ఆధార్ కవర్ అయినట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆధార్ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణకు కలెక్టర్ అధ్యక్షునిగా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ఇవి కనీసం మూడునెలలకోసారి సమావేశమై ఆధార్ సంబంధిత కార్యకలాపాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కమిటీ పర్యవేక్షించే అంశాలు ఇలా.. కవర్ కాని ప్రాంతాల్లో అదనపు ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల ఏర్పాటు. జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్ స్థాయిలో ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు. జనన రిజిస్ట్రేషన్‌తో ఆధార్ అనుసంధానం చేయడం. వివిధ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం. ఆధార్‌కు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించడం. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షణ చేయడంతోపాటు సమస్యలను పరిష్కరించడం. ఆధార్‌కు సంబంధించి నిపుణులు అవసరమైతే చైర్మన్ కమిటీలో నియమించవచ్చు. -
పదేళ్లకోసారైనా ఆధార్ అప్డేట్!
సాక్షి, అమరావతి: మీరు ఆధార్ తీసుకొని పదేళ్లు పైనే అయ్యిందా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆధార్ కార్డులో మీ వివరాలను అప్డేట్ చేసుకోలేదా? అయితే, వీలైనంత త్వరగా ఆధార్ కార్డులో మీ తాజా ఫొటో, అడ్రస్ తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సూచిస్తోంది. ఇందుకు గాను ఆధార్ ఆన్లైన్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ పేరుతో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వాలు ఇప్పుడు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నా.. లబ్ధిదారుల ఎంపికకు ఆధార్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే లావాదేవీలను నిలిపివేసే అవకాశముందంటూ వివిధ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి మన ఫొటోతో పాటు ప్రస్తుత చిరునామా.. ఆధార్‌లోని చిరునామా సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆధార్ పోర్టల్‌లో ‘అప్డేట్ డాక్యుమెంట్’ ద్వారా ఫొటో, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచిస్తోంది. ఈ మేరకు ప్రజలకు అవగాహన కలిగించి.. వివరాలు అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని యూఐడీఏఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ డైరక్టర్ జనరల్ పి.సంగీత ఇటీవల ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అండమాన్ నికోబార్ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో సచివాలయాల ద్వారా.. రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల ద్వారా వీలైనంత త్వరగా అందరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్ల ద్వారా సచివాలయాల సిబ్బందికి, వలంటీర్లకు దీని గురించి సమాచారమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వలంటీర్లు తమ పరిధిలోని అన్ని కుటుంబాలకు అవగాహన కల్పించడంతో పాటు ఆధార్ కార్డులలో వారి వివరాలు అప్డేట్ చేసేందుకు సహకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయం ఆదేశించింది. -
జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. చదవండి: మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ! -
ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవండోయ్!
ఆధార్ కార్డ్.. ఇటీవల ప్రజలకు ఇది గుర్తింపు కార్డ్‌లా మాత్రమే కాకుండా జీవితంలో ఓ భాగమైందనే చెప్పాలి. ఎందుకంటే బ్యాంకు అకౌంట్ తెరవడం, పర్సనల్, ఇంటి రుణాల కోసం, సంక్షేమ పథకాల కోసం, ఉద్యోగం కోసం.. ఇలా చెప్తూ పోతే పెద్ద జాబితానే ఉంది. ఆర్థిక లావాదేవీలలో ముఖ్యమైన బ్యాంక్, పాన్ కార్డ్‌లకు ఆధార్ కార్డ్‌ని అనుసంధానించిన తర్వాత దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. అందుకే ఈ కార్డులో ఏ తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కార్డుదారులు ఆఫర్లు, సర్వీస్‌లను, లేదా మొబైల్ పోయిన తరచూ ఫోన్ నెంబర్లను మారుస్తుంటారు. ఆ తర్వాత ఏదో పనిలో పని కొత్త నెంబర్‌ను ఆధార్‌లో అప్డేట్ చేయడం మరిచిపోతుంటారు. ఆపై భవిష్యత్తులో డిజిటల్ బ్యాంక్ అకౌంట్స్, డీమ్యాట్ అకౌంట్స్ వంటితో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబందించిన వాటిలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇబ్బందులు రాకుండా ఆధార్‌లో ఫోన్ నంబర్ ఈ విధంగా ఈజీగా అప్డేట్ చేసేయండి. 1: ముందుగా, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ లేదా మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని వెళ్లాల్సి ఉంటుంది. 2: ఆపై ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో అధికారిక ఎగ్జిక్యూటివ్‌ని కలిసి అతని వద్ద నుంచి ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంని తీసుకోవాలి. 3: ఎగ్జిక్యూటివ్‌కు ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారంను నింపి, సమర్పించాలి. 4: ఎగ్జిక్యూటివ్ బయోమెట్రిక్ సమాచారం ద్వారా మీ వివరాలను ధృవీకరిస్తారు. 5: మీ కొత్త ఫోన్ నంబర్ వివరాలు, లేదా మీరు కోరిన విధంగా మార్పులు చేస్తాడు. 6: ఈ మార్పులను ఆధార్ అధికారిక సైట్లలో అప్డేట్ చేశాక, ఈ సేవకు రుసుము చెల్లించాలి. 7: మీరు సంబంధిత అధికారి నుంచి అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ పొందుతారు. ఆ స్లిప్‌లో ఒక అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) ఉంటుంది. దీని ద్వారా మీ ఆధార్ కార్డు రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. చివరగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ లేదా మీ వివరాలు అప్డేట్ అయిన తర్వాత, మీరు అధికారిక UIDAI వెబ్సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆపై రుసుము చెల్లించి ఆధార్ కార్డ్ PVC ప్రింట్‌ను కూడా ఆర్డర్ చేయవచ్చు. చదవండి: దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు! -
‘ఫేషియల్ అథంటికేషన్’కు అనుమతి .. తొలి రాష్ట్రం ఏపీనే
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, ఉద్యోగుల హాజరు వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆధార్ అనుసంధానంతో కూడిన ‘ఫేషియల్ అథెంటికేషన్’ వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది. దేశంలో ఇలా ఆమోదం పొందిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మాత్రమే ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్) ద్వారా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగిస్తున్నారు. నిజానికి.. మన రాష్ట్రంలో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో, ప్రభుత్వోద్యోగుల హాజరులో ఆధార్ బయోమెట్రిక్ విధానాన్ని మాత్రమే అమలుచేస్తున్నారు. అయితే.. ఈ విధానంలో లబ్దిదారుల వేలిముద్రలు సేకరించడానికి, ఉద్యోగుల హాజరు నమోదుకు మొబైల్ ఫోన్లు, యాప్‌లకు తోడు ప్రత్యేక వేలిముద్రల నమోదు యంత్రాలను ఉపయోగిస్తారు. సంక్షేమ పథకాల కోసం ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల బయోమెట్రిక్ పరికరాలను ప్రభుత్వ యంత్రాంగం వినియోగిస్తోంది. ఇవి సున్నితమైనవి కావడంతో.. ఏటా 30–40 వేల పరికరాలు కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటోంది. ఇందుకు ఏటా రూ.10–12 కోట్లు వెచి్చంచాల్సి వస్తోంది. మరోవైపు.. వేలిముద్ర సరిపోక లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫేíషియల్ అథంటికేషన్ విధానంలో అయితే అదనంగా ఎలాంటి పరికరాలు అక్కర్లేదని అధికారులు వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుని ముఖాన్ని స్కాన్ చేయగానే అది ఆధార్‌కు అనుసంధానమై లబి్ధదారుణ్ణి గుర్తిస్తుందని అధికారులు తెలిపారు. 80 వేల మందికి పింఛన్ల పంపిణీకి రూ.కోటి ఖర్చు.. ఇక ప్రస్తుతం అమలుచేస్తున్న బయోమెట్రిక్ విధానంలో ప్రతినెలా పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల వేలిముద్రలు సరిపోక అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వృద్ధులు, ఎక్కువ కాయకష్టం పనులు చేసుకునే వాళ్ల వేలిముద్రలు అరిగిపోవడంతో బయోమెట్రిక్ సమయంలో ఇచ్చే వేలిముద్రలకు ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్రలతో సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బయోమెట్రిక్ స్థానంలో ఐరిస్ విధానం అమలుచేసినా.. కళ్ల శుక్లం ఆపరేషన్ చేసుకున్న వారితోనూ సమస్యలు ఏర్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా పింఛన్ల పంపిణీలో వేలిముద్రలు సరిపోక ప్రతినెలా 80 వేల మందికి ఆధార్‌తో సంబంధం లేకుండా పంపిణీ జరుగుతోంది. ఇలాంటి వారి ఫొటోలను స్థానిక సిబ్బందే ముందుగా యాప్‌లో నమోదుచేసి, పంపిణీ చేసే సమయంలో ఆ లబి్ధదారుని ఫొటో సరిపోల్చుకుని పంపిణీ చేస్తున్నారు. నిజానికి.. ఒక లబి్ధదారునికి ఒక విడత పంపిణీ చేస్తే రూ.10 చొప్పున సాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇప్పుడు పింఛన్ల పంపిణీలో ఆధార్ ఫేషియల్ విధానాన్ని ప్రవేశపెడితే మధ్యలో స్టాఫ్ట్వేర్ ప్రొవైడర్‌కు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆధార్ బేస్డ్ ‘ఫేషియల్ అథంటికేషన్’లో కొద్దిపాటి అవినీతికీ ఆస్కారముండదని అధికార వర్గాలు వివరించాయి. ప్రయోగాత్మకంగా అమలుచేశాకే పూర్తిస్థాయిలో.. ఈ రెండు విధానాలు అధార్ డేటాతో అనుసంధానం అవుతున్నప్పటికీ బయోమెట్రిక్ విధానంలో తలెత్తే ఇబ్బందులన్నింటినీ ఫేషియల్ అథంటికేషన్ విధానంతో అధిగమించడంతోపాటు పూర్తి పారదర్శకంగానూ అమలుచెయ్యొచ్చని అధికారులు అంటున్నారు. అలాగే, బయోమెట్రిక్ స్థానంలో ఫేషియల్ అథంటికేషన్ అమలుచేయాలంటే కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆమోదంతో పాటు యూఐడీఏఐ విభాగం అనుమతి తప్పనిసరి. దీంతో రాష్ట్రంలో ఫేషియల్ అథంటికేషన్ విధానం అమలుకు కేంద్ర ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూఐడీఏఐ అనుమతిని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కోరింది. ఆయా సంస్థల సూచనల మేరకు పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో అమలుచేశారు. ఆ తర్వాతే ఆధార్ ఫేషియల్ అథంటికేషన్ వినియోగానికి ఆమోదం లభించింది. సచివాలయ ఉద్యోగులకు ‘ఫేషియల్’ ఇక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా శుక్రవారం నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన ఫేషియల్ (ముఖం గుర్తింపు) ద్వారా కూడా హాజరు నమోదుచేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొబైల్ యాప్‌లో శుక్రవారం కొత్తగా ఈ సౌకర్యాన్ని కలి్పంచారు. ఇక నుంచి సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బయోమెట్రిక్ (వేలిముద్రలు) విధానంతోపాటు ఐరిస్ (కళ్లు గుర్తింపు) విధానం, కొత్తగా ఫేషియల్ విధానంలోనూ హాజరు నమోదుకు వీలు కల్పించారు. ఈ మూడింట్లో దేని ద్వారానైనా హాజరు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. -
వింత ఘటన.. ఆధార్ చూపిస్తేనే పెళ్లి భోజనం.. వీడియో వైరల్
అమ్రోహా(యూపీ): అక్కాచెల్లెళ్ల వివాహాలను ఒకే రోజు జరిపించింది ఓ కుటుంబం. దాంతో బంధు మిత్రులు, తెల్సినవారు తండోపతండాలుగా హాజరయ్యారు. అంతమందికీ సరిపడా భోజన ఏర్పాట్లు చేయడంలో కుటుంబం విఫలమైంది. పైగా పిలవని వాళ్లు కూడా భారీగా వచ్చారేమోనని అనుమానం. దాంతో, ఆధార్ కార్డును చూపిస్తేనే భోజనం ప్లేటు ఇస్తామని ప్రకటించారు. దీంతో అతిథులు హుతాశులయ్యారు. ఆధార్ కార్డులున్న వారు వాటిని చూపించి భోజనాలు కానిచ్చేశారు. మిగతావాళ్లు ఇదేం అవమానమంటూ వెళ్లిపోయారు. యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని హసన్‌పూర్‌లో జరిగిన ఈ వింత ఘటన తాలూకు వీడియోలు వైరల్‌గా మారాయి. In a seemingly bizarre incident, guests at a #wedding in Uttar Pradesh's #Amroha district were asked to show their #Aadhaar cards before they were allowed to pick up dinner plates.The incident took place in Hasanpur where two sisters were getting married at the same venue. pic.twitter.com/9IfenucXUH— IANS (@ians_india) September 25, 2022 -
బిగ్ అలర్ట్: అమలులోకి ఆధార్ కొత్త రూల్..వారికి మాత్రం మినహాయింపు!
దేశంలో ఆధార్ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్‌లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేసుకోవాలనే రూల్స్ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి. సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్‌లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లకు లోపు ఉన్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఇకపై రైళ్లలో వారికోసం.. -
కోటి మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించార ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ వో) వికాస్ రాజ్ తెలిపారు. గత ఆగస్టు 1న ప్రారంభించిన ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధాన కార్యక్రమానికి రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహా యక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) చొరవ తో రాష్ట్రంలో 40 లక్షలమంది ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నా రని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్‌జీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఓటరు గుర్తింపుకార్డుల తో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరుగుతోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే శిశు ఆధార్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆస్పత్రులకు ట్యాబ్‌లు, ఫింగర్ ప్రింట్ స్కానర్లను సమకూర్చారు. ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్ రిజిస్ట్రేషన్ తరహాలోనే శిశు ఆధార్ ఎన్రోల్మెంట్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు యూఐడీఏఐ ఓ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఆధార్ ఎన్రోల్మెంట్పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ మొదలవుతుంది. తాత్కాలిక ఆధార్ యూఐడీఏఐ ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేస్తుంది. ఇందుకు శిశువుల బయోమెట్రిక్ డేటాతో పనిలేదు. పిల్లల ఫొటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తదితర వివరాల ఆధారంగా శిశువుకు తాత్కాలిక ఆధార్ జారీ చేస్తారు. -
జనాభాను మించి ఆధార్!
సాక్షి, హైదరాబాద్: పేద, ధనిక తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కావాల్సింది ఆధార్ కార్డు. ఎందుకంటే దేశంలోని ప్రతి పౌరుడికీ భారత ప్రభుత్వం కేటాయించే విశిష్ట గుర్తింపు సంఖ్య అందులో ఉంటుంది. అంతేకాదు ఈ కార్డు బహుళ ప్రయోజనకారి. అన్నిటికీ అనుసంధానమవుతూ, ప్రతిదానికీ ఆధారమవుతోంది. ఆధార్ కార్డు లేకుండా ఏ పనీ జరగదన్నట్టుగా దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. బ్యాంకింగ్, బీమా, పన్నులు తదితర లావాదేవీలకు, డిజిటిల్ కార్యకలాపాలకు, మొబైల్ సిమ్ కనెక్షన్ నుంచి పిల్లల స్కూల్ అడ్మిషన్, స్థిర, చర ఆస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అయ్యింది. దీంతో ప్రతి ఒక్కరూ విశిష్ట గుర్తింపు సంఖ్యను పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆధార్ నమోదు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటం గమనార్హం. అంచనా జనాభా దాటి.. తెలుగు రాష్ట్రాల్లో జనాభా కంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అంచనా వేసిన జనాభా కంటే కూడా ఆధార్ నమోదు సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నవారు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్న కారణంగా ఈ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆధార్ కార్డుల జారీ సంఖ్య నాలుగు కోట్ల తొమ్మిది లక్షల పైచిలుకుగా ఉంది. అంచనా వేసిన జనాభా (3.79 కోట్లు) సంఖ్య కంటే 29.98 లక్షలు (7.91 శాతం) ఎక్కువగా ఆధార్ నమోదు కావడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 3.51 కోట్ల జనాభా ఉండగా 2022 అంచనాల ప్రకారం ఈ సంఖ్య 3.79 కోట్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా సంఖ్య 4.93 కోట్ల నుంచి ప్రస్తుతం 5.29 కోట్లకు చేరింది. ఐదుకోట్ల 46 లక్షల ఆధార్ కార్డులు జారీ కాగా, అంచనా జనాభా కంటే 17.05 లక్షలు (3.21 శాతం) అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద 18 ఏళ్లు దాటిన వారే అధిక సంఖ్యలో ఆధార్ నమోదు చేసుకొని విశిష్ట నంబర్లు పొందినట్లు యూఐడీఏఐ వర్గాలు పేర్కొటున్నాయి. గత రెండు నెలల్లో ఎక్కువగా గడిచిన రెండు నెలల్లో ఆధార్ నమోదు సంఖ్య బాగా పెరిగింది. ఏడాది కాలం (ఆగస్టు 2021 నుంచి 2022 జూలై 31 వరకు) పరిశీలిస్తే.. తెలంగాణలో 6,10, 236 మంది నమోదైతే అందులో కేవలం జూన్, జూలైలోనే 1,25,665 మంది నమోదయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో 7,71,818 మంది నమోదైతే అందులో రెండు నెలల్లో 1,72,614 నమోదు చేసుకున్నట్లు యూఐడీఏఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పురుషులు, మహిళలు సమానంగా.. ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్య పొందిన వారిలో మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణలో 50.11 శాతం పురుషులు, 49.89 శాతం మహిళలు, ఏపీలో 50.43 శాతం పురుషులు, 49.57 శాతం మహిళలు ఉన్నట్లు యూఐడీఏఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారే అధికం ఆధార్ నమోదు చేసుకున్న వారిలో 18 ఏళ్ల పైబడిన వారే అధికంగా ఉన్నారు. తెలంగాణలో 18 ఏళ్లు దాటిన వారు 77.51 శాతం ఉండగా అందులో పురుషులు 38.92 శాతం, మహిళలు 38.59 శాతం ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోçపు వారు 19.55 శాతం ఉండగా, అందులో బాలురు 10.02 శాతం, బాలికలు 9.47 శాతం ఉన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు 2.99 శాతం ఉండగా అందులో బాలురు 1.48 శాతం, బాలికలు 1.51 శాతం ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ►ఏపీలో 18 ఏళ్లు దాటిన వారు 78.16 శాతం ఉండగా అందులో 38.92 శాతం పురుషులు, 39.24 శాతం మహిళలు ఉన్నారు. 5 నుంచి 18 ఏళ్లలోపు వారు 18.13 శాతం ఉంటే అందులో 9.31 శాతం బాలురు, 8.82 శాతం బాలికలు, ఐదేళ్లలోపుగల వారు 3.7 శాతం ఉండగా అందులో బాలురు 1.87 శాతం, బాలికలు 1.83 శాతం ఉన్నట్లు స్పష్టమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ టాప్ ఆధార్ నమోదులో గ్రేటర్ హైదరాబాద్ టాప్‌గా ఉంది. అంచనా జనాభాకంటే అధికంగా ఆధార్ కార్డులు జారీ అవుతున్నాయి. మహానగరంలో జనాభా వృద్ధి రేటు ఏటా 8 నుంచి 12 శాతం వరకు ఉంటోంది. 2022 అంచనా ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 1.05 కోట్ల జనాభా ఉండగా ఆధార్ నంబర్లు జారీ సంఖ్య 1.25 కోట్లకు చేరింది. అంటే జనాభా కంటే 20 లక్షలు (19 శాతం) అధికంగా ఆధార్ యూఐడీలు జారీ అయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వలస వస్తున్నవారు ఎప్పటికప్పుడు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటుండటంతో జనాభా కంటే ఆధార్ అధికంగానే నమోదైనట్లు తెలుస్తోంది. -
ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు..
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 30న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతి నిధ్య చట్టం 1950లో సవరణలు చేసినట్లు చెప్పారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 23 ప్రకా రం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓట ర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్ సంఖ్యను పొందుపర్చాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగిం చటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారమ్ 6 బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్ సైట్లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చని చెప్పారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్‌ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చని తెలిపారు. మరో వైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుండి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధా ర్ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమ ర్పించాలని చెప్పారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వ హణలో జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది జన బాహుళ్యంలోకి వెళ్లదని తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితమైన కస్టడీలో ఉంటాయని, యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ విడుదల నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్‌తో ఓటర్ల జాబితా అనుసంధానం షురూ.. ‘ఆధార్’ తప్పనిసరి కాదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, వివరాల దిద్దుబాటు, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన కొత్త దరఖాస్తుల విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ఓటర్ల జాబితాలను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసే కసరత్తు కూడా సోమవారం నుంచే దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు తమ ఆధార్ నంబర్‌ను తెలపడం మాత్రం తప్పనిసరికాదు. కాగా కొత్త విధానంలో భాగంగా ఇకపై 17 ఏళ్ల వయస్సు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలగనుంది. ఓటర్ల నమోదు దరఖాస్తుల ప్రక్రియను సరళీకృతం చేయడానికి వీలుగా ఆగస్టు 1 నుంచి ఈ కింది మార్పులను అందుబాటులోకి తెచ్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆధార్ స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకోవాలి ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్‌తో అనుసంధానించడంలో భాగంగా.. ఆధార్ నంబర్ సేకరణకు వీలుగా ఓటరు నమోదు దరఖాస్తులను కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించింది. అదే విధంగా ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి నుంచి ఆధార్ నంబర్లు సేకరించడానికి కొత్త దరఖాస్తును (ఫారం–6బీ) అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ నంబర్ ఇవ్వలేదన్న కారణంతో ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేర్లను తొలగించరాదని, జాబితాలో కొత్తగా పేరును చేర్చడానికి నిరాకరించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా ఆధార్ నంబర్ ఇస్తేనే తీసుకోవాలని, బలవంతం చేయరాదని సూచించింది. ఓటర్ల జాబితాలను ప్రకటించినప్పుడు ఓటర్ల ఆధార్ నంబర్లు బహిర్గతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేస్తే పౌరుల గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా, ఎన్నికల సంఘం ఈ దిశగా ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో ముసాయిదా జాబితా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2023 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 11న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, డిసెంబర్ 8 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, కొత్తగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిసెంబర్ 26లోగా అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరించి, 2023 జనవరి 5న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. మరో మూడు అర్హత తేదీలు ఇప్పటివరకు జనవరి 1 అర్హత తేదీగా వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇకపై జనవరి 1తో పాటుగా ఏప్రిల్ 1 , జూలై 1, అక్టోబర్ 1లను అర్హత తేదీలు గా పరిగణించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 1 మధ్యకాలంలో 18 ఏళ్లు నిండి ఓటేసేందుకు అర్హత సాధించనున్న యువత నుంచి ముందస్తుగానే ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించడానికి కొత్తగా ఈ సదుపాయాన్ని కల్పించింది. అయితే వచ్చే ఏడాదికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 1 అర్హత తేదీగా దరఖాస్తు చేసుకున్న వారి పేర్లకు.. వార్షిక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్ మేరకు ఏటా జనవరిలో ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తారు.ఆ తర్వాతి 3 అర్హత తేదీలతో దరఖాస్తుదారుల పేర్లను ఓటర్ల జాబితా నిరంతర నవీకరణలో భాగంగా సంబంధిత త్రైమాసికంలో ప్రచురించే ఓటర్ల జాబితాలో చేర్చుతారు. ఫారం–001 ఇకపై ఉండదు ►ఎపిక్ కార్డు మార్పిడి దరఖాస్తు ఫారం–001 ఇకపై మనుగడలో ఉండదు. ఫారం–8లోనే ఈ సదుపాయం కొత్తగా అందుబాటులోకి రానుంది. ►ఓటర్ల జాబితాలో పేరు చేర్చడంపై అభ్యంతరం/ పేరు తొలగింపునకు చేసే దరఖాస్తు (ఫారం–7)లో స్వల్పంగా మార్పులు చేసి మరణ ధ్రువీకరణ పత్రం జత చేయడానికి అవకాశం కల్పించారు. ►ఒకే శాసనసభ నియోజకవర్గం పరిధిలో చిరునామా మారితే చేయాల్సిన ఫారం–8ఏ దరఖాస్తు ఇకపై మనుగడలో ఉండదు. ఫారం–8 దరఖాస్తులోనే కొత్తగా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫారం–8లో కొత్తగా చిరునామా మార్పు, ఓటర్ల జాబితాలో వివరాల దిద్దుబాటు, ఎపిక్ కార్డు మార్పిడి, దివ్యాంగుడిగా నమోదు చేసుకోవడానికి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. -
పిల్లల ఆధార్‌లో వేలి ముద్రల అప్డేట్
సాక్షి, అమరావతి: పిల్లలకు ఆధార్ కార్డులో వేలి ముద్రల అప్డేట్కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మూడు వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు ఆధార్ వేలి ముద్రల అప్డేట్ వంటి సేవలను పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆధార్‌లో చిరునామా మార్పు, తప్పులు సరిదిద్దడం వంటి సేవలను నిర్ణీత ఫీజుతో సచివాలయాల్లోనే అందిస్తోంది. ఇలా సచివాలయాల ద్వారా ఇప్పటి వరకు 5.63 లక్షల మంది ఆధార్ సేవలు పొందారు. పిల్లలకు ఆధార్‌లో వేలి ముద్రలు అప్డేట్ చేయడానికి ప్రభుత్వం ప్రతి నెలా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెలలోనూ బుధ, గురువారాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ సాగిలి షాన్మోహన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ వివరాల నమోదు సంస్థ యూఐడీఏఐ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 1.09 కోట్ల మందికి ఆధార్‌లో వారి చిన్న వయస్సు నాటి వేలి ముద్రలే నమోదై ఉన్నాయి. అత్యధిక సంక్షేమ పథకాలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారానే లబ్ధిదారులకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే ఆధార్ కార్డు పొందిన వారు ఆధార్‌లో వేలి ముద్రలను అప్డేట్ చేయించుకోవాలి. లేదంటే వేలి ముద్రలు సరిపోలక పథకాలు అందుకొనే అవకాశం కోల్పోతారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం చిన్న వయస్సులో ఆధార్ కార్డు పొంది ఉంటే.. 15 ఏళ్ల తర్వాత వేలిముద్రలను అప్డేట్ చేసుకోవాలి. ఐదేళ్ల వయస్సు లోపే ఆధార్ కార్డు పొంది ఉంటే, ఐదేళ్లు దాటిన తర్వాత ఒక విడత, 15 ఏళ్ల తర్వాత మరో విడత వేలి ముద్రలను అప్డేట్ చేసుకోవాలి. 15 ఏళ్లు ముగిసిన వెంటనే బడి పిల్లలు ఆధార్ వివరాల్లో వేలి ముద్రలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. స్కూళ్లవారీగా అర్హులను గుర్తించి, వారికి వలంటీర్ల ద్వారా సమాచారం ఇస్తోంది. గంటకు 15 మంది వేలిముద్రలు అప్డేట్ చేసుకునేలా ముందుగానే సమయం కేటాయిస్తోంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదుతో పాటు వివిధ రకాల ఆధార్ సేవలు అందిస్తోంది. గత నెల 29వ తేదీన 827 సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, దాదాపు 30 వేల ఆధార్ సేవలు అందజేసింది. -
ఏడాదికి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే..
సాక్షి, ముంబై: అక్రమ నగదు లావాదేవీలకు అరికట్టే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏడాదికి 20 లక్షలకుమంచి నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాలి. 2022, మే 10 నాటి నోటిఫికేషన్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటా) రూపొందించిన కొత్త నియమాలు, నిబంధనల సవరించింది. ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఆర్థికం స్కాంలు, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం వార్షిక నగదు పరిమితి నిబంధనలను సవరించింది. ఇప్పటికి వరకు రోజుకు రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను అందించే నిబంధన ఉంది. ఇకపై ఏడాదికి 20 లక్షలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ నెంబరు, ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. సన్నిహిత కుటుంబ సభ్యులనుంచి తప్ప రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన నగదును స్వీకరించడం కూడా నిషేధం. నిబంధనలకు విరుద్థంగా పరిమితికి మించి నగదు చెల్లించినా, స్వీకరించినా లావాదేవీ మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీలు , ఇతర డబ్బు నేరాల ప్రమాదాన్ని తగ్గించేలా ఆదాయపు పన్ను శాఖ, ఇతర కేంద్రం కసరత్తులో భాగంగా నిబంధనలను సవరిస్తోన్న సంగతి తెలిసిందే. -
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇంటి వద్దే చిన్నారుల ఆధార్
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ కావాలా.. అయితే పోస్టాఫీస్‌కు ఫోన్ చేయండి.. సిబ్బంది మీ ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసి ఆధార్‌కార్డు అందించే ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) తపాలా శాఖకు అనుమతినిచ్చింది. ఐదేళ్లలోపువారికి కూడా ఆధార్ అవసరమైన నేపథ్యంలో వివరాల నమోదు కోసం చిన్నారులను తీసుకుని ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటిలోనే తంతు పూర్తి చేసేలా తపాలా శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను 28 గ్రామీణ జిల్లాల్లోని పోస్ట్మన్లు, 1,552 గ్రామీణ్ డాక్ సేవక్‌లకు యూఐడీఏఐ సర్టిఫై చేసింది. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ ఆధార్ నమోదు ప్రక్రియ వేగంగా సాగేందుకు మహిళా, శిశు సంక్షేమ, విద్యాశాఖలతో సమన్వయం చేసుకుంటూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనుంది. ఇందుకుగాను అధికారులు, అంగన్వాడీ కేంద్ర ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులకు లేఖలు రాస్తోంది. బయోమెట్రిక్ లేకుండా... ఆధార్‌లో పేర్ల నమోదుకు బయోమెట్రిక్ తప్పనిసరి అయినా, ఐదేళ్లలోపు చిన్నారులకు మినహాయింపు ఇచ్చారు. చిన్నారుల వేలిముద్ర లు స్పష్టంగా ఉండనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ధారిత వయసు వచ్చాక మళ్లీ వారి వేలిముద్రలు తీసుకోవటం ద్వారా ఆధార్ అప్డేట్ చేస్తారు. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రుల బయో మెట్రిక్ తీసుకుని, జనన ధ్రువీకరణ పత్రం(బర్త్ సర్టిఫికెట్) ప్రతి సమర్పించటం ద్వారా వారి పేర్లు నమోదు చేయించొచ్చు. ఈ ప్రక్రియను ఉచితంగా నిర్వహిస్తారు. గతంలో ఐదేళ్ల కంటే పెద్ద వయసువారికి తపాలా కార్యాలయాల్లో, ప్రత్యేక శిబిరాల్లో తపాలా శాఖ ఆధార్ వివరాలను నమోదు చేయించింది. వారికి ఆధార్ కార్డులను యూఐడీఏఐ పోస్ట్ ద్వారా పంపింది. 2021 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చివరకు లక్షమంది వివరాలను తపాలాశాఖ ద్వారా నమోదు చేయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
అక్రమ వలసదారులకు ‘ఆధార్’ బంగ్లా ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ అంగీకరించాడు. అకూన్ ఇంట్లో 31 ఆధార్‌కార్డులు, 13, పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు. -
ఇంటింటికీ ఆధార్ సేవలు!
న్యూఢిల్లీ: మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పోస్టమెన్‌ను వినియోగించుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంక్‌కు చెందిన 48 వేల మంది పోస్ట్మెన్ను రంగంలోకి దించనుంది. వీరు మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవడం, ఆధార్‌తో సెల్‌ఫోన్ నంబర్లను లింక్ చేయడం, వివరాలను అప్డేట్ చేయడం వంటి సేవలు అందించనున్నారు. రెండో దశ ప్రణాళికలో భాగంగా 1.50లక్షల మంది తపాలా శాఖ అధికారులను కూడా ఇందులో భాగస్వాములను చేయనుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల వారితోపాటు, సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులకు ఆధార్‌ను అందజేయడమే యూఐడీఏఐ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లే పోస్ట్‌మెన్ ఆధార్ వివరాలను అక్కడికక్కడే అప్డేట్ చేసేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీ/ల్యాప్‌టాప్‌లను అందజేస్తామని తెలిపారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 13వేల మంది కామన్ సర్వీస్ సెంటర్ల బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఇందులో భాగంగా చేస్తామన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా 755 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి రోజూ ఆన్లైన్ ద్వారా కనీసం 50వేల మంది చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికీ 12 అంకెల బయోమెట్రిక్ గుర్తింపు సంఖ్య ఆధార్‌ను అందించేందుకు యూఐడీఏఐ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. -
సచివాలయాల్లో ఆధార్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. తొలిసారి ఆధార్ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది. అయితే, ఆధార్ కలర్ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ షాన్మోహన్ అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఐదు సచివాలయాలకు ఒకటి.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల సచివాలయాల్లో ఈ ఆధార్ సేవా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు షాన్ మోహన్ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. ప్రతి ఐదు సచివాలయాల్లో ఒకటి చొప్పున, సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాలు, వార్డుల వారికి సమాన దూరంలో ఉండేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఆధార్ సేవల కోసమే ప్రత్యేకంగా ల్యాప్‌టాప్, మానిటర్, కెమెరా, మల్టీ ఫంక్షనల్, ఐరిస్, ఫింగర్ ప్రింట్ డివైస్, వైట్ స్క్రీన్, ఫోకస్ లైట్, జీపీఎస్ డివైస్, ప్రొటెక్టర్, వీజీఏ టూ హెచ్డీఎంఐ కన్వర్టర్ సహా మొత్తం 15 రకాల ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఆయా సచివాలయాలకు సరఫరా చేస్తోంది. ఇప్పటికే రెండు దశల్లో మొత్తం 1,100 సచివాలయాలకు ఆ కిట్లను కూడా అందజేశారు. మిగిలిన చోట్లకి సరఫరా ప్రక్రియ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కిట్లు అందుకున్న సచివాలయాల్లో ఇప్పటికే ఆధార్ సేవలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ.. సచివాలయాల్లో ఆధార్ సేవలు నిర్వహణకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ సేవలకు మాత్రమే పరిమితం చేయాలని, వారికి మరే ఇతర సేవలు కేటాయించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ఆధార్ సేవలందించే సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోతే.. సమీపంలోని మరో సచివాలయంలో ఆధార్ సేవలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న సచివాలయాల వివరాలను లోకల్ టీవీ చానళ్లు ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు నిర్వహించి ఆధార్ నమోదు, బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ తదితర సేవలు అందజేయాలని కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. -
‘ఆధార’పడదగ్గదేనా..?!
ఇవ్వడమా? మానడమా? ఇదీ ఇప్పుడు సగటు భారతీయుడి సమస్య. దాదాపు పదేళ్ళ క్రితం జీవితంలోకి కొత్తగా వచ్చిపడ్డ ఆధార్ అనే గుర్తింపు కార్డు, దానిలో నమోదయ్యే సమస్త వివరాలు, ఇచ్చే పన్నెండంకెల ప్రత్యేక నంబర్ – ఇప్పుడు పెను సమస్యయ్యాయి. బ్యాంకు ఖాతా తెరవడం, సెల్‌ఫోన్ సిమ్ కొనుగోలు మొదలు చివరకు హోటళ్ళు, సినిమా హాళ్ళలో బుకింగ్ దాకా దేనికీ ఆధార్ తప్పనిసరి కాకపోయినా, ఇతర గుర్తింపుకార్డులు అనేకమున్నా, అన్నిటికీ ఆధార్ కావాలని పట్టుబట్టడమూ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అడిగిన ప్రతి సంస్థకూ ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వద్దని శుక్రవారం ఒక ప్రకటన, సాధారణ ముందు జాగ్రత్తతో ఇవ్వచ్చని ఆదివారం మరో ప్రకటన – రెండే రోజుల తేడాలో ఇలా ద్వైధీభావంతో రెండు విరుద్ధ ప్రకటనలు కేంద్రం నుంచి రావడం విచిత్రం. పెరుగుతున్న సైబర్ మోసాల వేళ ఇది మరింత గందరగోళం రేపింది. వ్యక్తిగత వివరాల గోప్యత, భద్రతపై ఉన్న అనుమానాల్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇక పాలకులదే! ఒకప్పుడు స్వచ్ఛందమైన ఆధార్ ఇప్పుడు దేశంలో అన్నిటికీ తప్పనిసరి కావడం విచిత్రమే. అధికారికంగా అనుమతి లేని సంస్థలు సైతం పౌరుల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు, ఇ–కాపీలను తీసుకోవడం కచ్చితంగా ఆందోళనకరం. దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉన్నందున అలా ఆధార్ వివరాలను ఎవరికి పడితే వాళ్ళకు అందజేయరాదంటూ, ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (యూఐడీఎఐ) బెంగళూరు కార్యాలయం గత వారం సరిగ్గానే అప్రమత్తం చేసింది. కొన్ని సంస్థలకే ఆధార్ వివరాలు సేకరించే లైసెన్స్ ఇచ్చామనీ, లైసెన్స్ లేని సంస్థలు ఆధార్ అడిగితే (ఆధార్ నంబర్లో చివరి నాలుగంకెలు మాత్రమే కనిపించే) ‘మాస్క్డ్ ఆధార్’ను ఇవ్వాలనీ చెప్పింది. నాలుగేళ్ళ క్రితమే రూ. 500కి వంద కోట్ల ఆధార్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు లభ్యమైన దేశంలో ఆధార్‌పై ఉన్న అనుమానాలకు ఈ ప్రకటన బలమిచ్చింది. కేంద్ర ఐటీ శాఖ వెంటనే బరిలోకి దిగి, ‘తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉంద’ంటూ ఆ మార్గదర్శకాల్ని ఉపసంహరించడం విడ్డూరం. ‘ఆధార్ జిరాక్స్ కాపీలు ఇవ్వద్దు’ అని ఒకరు, ‘కాదు కాదు ఇవ్వచ్చ’ని మరొకరు – ఒకే వ్యవస్థ నుంచి చెప్పారంటే, ఆధార్‌పై గందరగోళం ప్రజల్లోనే కాదు... ప్రభుత్వంలోనూ ఉందని అర్థమవు తూనే ఉంది. కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగి తూచ్ అన్నప్పటికీ, ప్రజలకు చేరాల్సిన సంకేతమైతే చేరిపోయింది. ఆధార్ వివరాల దుర్వినియోగంపై ఉన్న అనుమానం నిరాధారమైనదేమీ కాదని తేలిపోయింది. అసలు బయట ఆఫ్‌లైన్‌లో ఆధార్ వెరిఫికేషన్ చేసే వారెవరైనా సరే వ్యక్తుల ఆధార్ నంబర్లను కానీ, బయోమెట్రిక్ సమాచారాన్ని కానీ ‘సేకరణ, వినియోగం, నిల్వ’ చేయరాదు. ఆ మాటే 2016 నాటి ఆధార్ చట్టంలోని సెక్షన్ 8ఎ(4) స్పష్టంగా చెబుతోంది. అయినాసరే, అవసరం లేకున్నా ఆధార్ జిరాక్స్ అడగడం, ఇచ్చేది లేదంటే సేవలు నిరాకరించడం, తప్పక అమాయకంగా ఇచ్చేయడం – సగటు భారతీయులందరి అనుభవం. కోవిడ్ టెస్ట్‌లకు సైతం ఇదే చూశాం. అంతర్జాలంలో పుష్కలంగా సాగుతున్న డేటా లీకేజీల పుణ్యమా అని వ్యక్తిగత గోప్యత ఇప్పుడు హుళక్కి. ప్రైవేట్ ఏజెన్సీలు డిమాండ్ చేసి మరీ, ఆధార్ కాపీలు తీసుకొని ఆన్లైన్లో ఆథెంటికేషన్ చేస్తుండడం ఏ రకంగా చూసినా తప్పే. డిజిటల్ ఫోటో ఎడిటింగ్ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉండడంతో, ఆధార్ కాపీల మీద ఫోటోలు, సమాచారాన్ని యథేచ్ఛగా మార్చే ప్రమాదం ఉంది. ఆధార్ ప్రాధికార సంస్థలోని డేటా బ్యాంక్‌లో ఉన్న సమాచారాన్ని తారుమారు చేయలేరు కానీ, తమ దగ్గర చేసిన మార్పులతో మోసాలకు పాల్పడవచ్చు. ఉద్యోగ సంస్థలు, అప్పులిచ్చేవాళ్ళు సైతం వేలి ముద్రలు సేకరించడం చూస్తున్నాం. ప్రభుత్వ యూఐడీఏఐ దగ్గర గోప్యతకే దిక్కు లేదంటే, ఇక ఈ చిన్నాచితక సంస్థల వద్ద ఈ బయోమెట్రిక్ వివరాల భద్రత ఎంత సొబగుగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. వేలిముద్రల డేటాతో డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు అనేకం. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అసలు లబ్ధిదారుల బదులు నకిలీలు కడుపు నింపుకొనే వీలూ కలిగింది. అందుకే జాగ్రత్త అవసరం. ఆ మాటకొస్తే, ఆధార్ నమోదు సైతం దోషరహితమేమీ కాదు. మొన్నటికి మొన్న మే నెలలోనే ఆధార్ జారీ సంస్థ పనితీరుపై మొదటిసారిగా ఆడిట్ జరిగింది. బయోమెట్రిక్స్‌లో తప్పులు, డూప్లికేషన్ల లాంటి అయిదు ప్రధాన లోపాలు ఆధార్‌లో చోటుచేసుకున్న తీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తెలిపింది. అయితే, అంతకంతకూ పెరుగుతున్న భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఆధారచక్రంగా నిలిచింది ఆధార్ కార్డులే. వేర్వేరు బ్యాంకు ఖాతాల మధ్య తక్షణ నగదు బదలీకి తోడ్పడే స్మార్ట్‌ఫోన్ అప్లికేషనైన ‘యూపీఐ’ లాంటివి కూడా ఆధార్ వల్లే సాధ్యమయ్యాయి. కాబట్టి, ఆధార్ పద్ధతిని తప్పుబట్టే కన్నా దాని భద్రతపై దృష్టి పెట్టడం ముఖ్యం. వాణిజ్య సంస్థలేవీ ఆధార్‌ను అడగరాదని సుప్రీమ్ కోర్ట్ ఎప్పుడో చెప్పింది. అయినా అది అమలవుతున్న దాఖలా లేదు. పౌరులు సైతం ఆధార్‌లో రెండంచెల ధ్రువీకరణ, బయోమెట్రిక్స్ లాక్, పరిమిత కేవైసీకి అనుమతించే వర్చ్యువల్ ఐడెంటిటీ విధానాలను ఆశ్రయించాలి. ప్రభుత్వం సైతం బయోమెట్రిక్, ఆధార్ డేటాను ప్రైవేట్ సంస్థలు సేకరించకుండా అడ్డుకట్ట వేయాలి. మున్ముందుగా ‘మాస్క్డ్ ఆధార్’ను ప్రాచుర్యంలోకి తేవాలి. ఆ పైన ఆధార్ నంబర్ల జారీ, వినియోగాన్ని కట్టుదిట్టం చేయాలి. ఆధార్‌ను అంగట్లో సరుకుగా మార్చిన వెబ్సైట్ల భరతం పట్టాలి. అందుకే, దేశంలో పటిష్ఠమైన డేటా భద్రతకు త్వరితగతిన ఓ చట్టం చేయాలి. లేదంటే, ఎంతటి ఆధార్ అయినా వట్టి నిరాధారమే! -
Masked Aadhaar Card: ఆధార్ కార్డు వాడకంపై కేంద్రం కీలక సూచన
దేశంలో ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్‌ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది. మాస్క్డ్ ఆధార్ కాపీ అంటే.. భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్లైన్లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్‌లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. మాస్క్డ్ ఆధార్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. 1. https://eaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, 'డౌన్లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి. 2. మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. 3. మాస్క్డ్ ఆధార్ కావాలి.. అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 4. ధృవీకరణ కోసం అందించబడే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. 5. ‘Send OTP’పై క్లిక్ చేయండి. 6. ఇ-ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్లోడ్ చేసుకోండి. 7. ఆధార్ PDF పాస్వర్డ్ 8 అక్షరాలలో ఉంటుంది.(మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (ఆధార్‌లో ఉన్నట్లు) క్యాపిటల్ అక్షరాలు, YYYY ఆకృతిలో పుట్టిన సంవత్సరంతో ఎంటర్ చేయాలి.) In order to prevent misuse, the central government has asked citizens to share only masked versions of their #Aadhaar cards. Unlicensed private entities are like hotels etc are not allowed to collect or keep copies of Aadhaar card, as par the Ministry of Electronics & IT. pic.twitter.com/QQIvI4y3wi — NIRUPAM ACHARJEE 🇮🇳 (@NirupamAcharjee) May 29, 2022 -
ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు.. ఆధార్‌కు లింకు కాని ఫోన్ నంబర్లు
నర్వ (నారాయణ్‌పేట్ జిల్లా): రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ నెలాఖరులోగా ఈకేవైసీని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో బోగస్ పేర్లను లబ్ధిదారులుగా నమోదు చేసుకుని గత సీజన్లలో నిధులను కాజేసిన వైనాన్ని కేంద్రం గుర్తించగా.. ఈ సీజన్లో అర్హులను గుర్తించేందుకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కాగా గడువు ఈ నెల 31 వరకే ముగుస్తున్నా జిల్లాలో ఈకేవైసీ నామమాత్రంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే నమోదైంది. ఈకేవైసీని పూర్తి చేసిన రైతులకు మాత్రమే ప్రస్తుతం రూ.2 వేల చొప్పున చెల్లింపులు చేయాలని లేదా నమోదు పూర్తికాకుంటే ఈ సీజన్ నుంచి నిధులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి జాన్‌సుధాకర్ తెలిపారు. చదవండి👉 ‘ఇలాంటి ఫథకం దేశంలో ఎక్కడా లేదు’ అనుసంధానం ఇలా.. రైతులు ముందుగా పీఎం కిసాన్ పథకం వివరాలిచ్చిన తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌కార్డును అనుసంధానించుకోవాలి. తదుపరి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్‌ను అనుసంధానించాలి. అనంతరం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఆధార్ ఆధారితంగా ఈకేవైసీ చేస్తున్నప్పుడు ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీ సంఖ్యను తిరిగి నమోదు చేస్తేనే ఈకేవైసీ పూర్తవుతుంది. సెల్ఫోన్లో పీఎం కిసాన్ యాప్ ద్వారా లేదా కంప్యూటర్లో పోర్టల్ ద్వారా రైతులే ఈకేవైసీని చేసుకోవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్లలో సైతం ఈకేవైసీని పూర్తి చేయించాలి. ఆధార్ ద్వారా ఈ కేవైసీని పూర్తి చేసిన అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేస్తారు. బోగస్ రైతులు జాబితా నుంచి తొలగించబడతారు. 2018లో పథకం ప్రారంభించిన దగ్గర నుంచి 10 విడతలుగా నిధులను విడుదల చేయగా ప్రస్తుతం ఏప్రిల్‌లోనే 11వ విడతకు సంబంధించి ఈ దఫా నిధులు ఇవ్వాల్సి ఉండగా ఈకేవైసీతో ఈ నెలాఖరులోగా లేదా జూన్ మొదటి వారంలో నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. అవగాహన కల్పించరూ.. ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ చేసుకోవడం గురించి చాలా మంది రైతులకు తెలియదు. ఇవి చేసుకోలేకనే ఎంతో మంది రైతులు ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. తాజాగా ఈకేవైసీ తప్పనిసరి చేసింది. కానీ, క్షేతస్థ్రాయిలో ఈ విషయమే చాలా మంది రైతులకు తెలియదు. తెలిసిన వారు వెళ్లినా మీ సేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఆధార్‌కు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం వంటి కారణాలతో మళ్లీ మళ్లీ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు ధాన్యం నాణ్యత ధ్రువీకరణ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈకేవైసీని పూర్తిచేయించేందుకు రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈకేవైసీని పూర్తి చేయని రైతులకు నిధులు నిలిచిపోనున్నందున రైతులందరూ ఈకేవైసీని పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చదవండి👉🏻 గడువు 31 వరకే.. ఈ–కేవైసీ తప్పనిసరి.. ఇలా నమోదు చేసుకోండి నమోదు చేసుకోండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం రైతులు ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఈకేవైసీ నమోదు చాలా తక్కువగా ఉంది. ఆయా మండలాల ఏఈఓలు నమోదును వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాం. రైతులకు గ్రామాల్లో గడువులోగా ఈకేవైసీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలి. పీఎం కిసాన్ లబ్ధి రైతులే కాకుండా మిగిలిన రైతులు కూడా ఈకేవైసీ చేసుకుంటే మంచిది. – జాన్‌సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి ఇప్పటి వరకు రాలే.. ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదు. అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు ఈకేవైసీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ నెల 31 వరకు గడువు ఉన్నందు వల్ల వెంటనే చేసుకుంటాను. – గోవిందరెడ్డి, రైతు, పెద్దకడ్మూర్ గ్రామం -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
డ్రగ్స్‌ను పట్టించిన ‘ఆధార్’
ఆటోనగర్ (విజయవాడ తూర్పు)/సత్తెనపల్లి: ఓ కొరియర్ సంస్థ ఉద్యోగి తెలియక చేసిన పొరపాటుతో డ్రగ్స్ గుట్టురట్టయ్యింది. విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి తెలివిగా అతని ఆధార్ కార్డుకు బదులు కొరియర్ సంస్థ ఉద్యోగి ఆధార్ కార్డు కాపీ జత చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. విజయవాడ సెంట్రల్ ఏసీపీ షేక్ ఖాదర్‌బాషా ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 31న పచ్చళ్లు, దుస్తుల పార్శిళ్లను ఆస్ట్రేలియాకు పంపాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపి విజయవాడ భారతీనగర్‌లోని డీఎస్టీ కొరియర్‌కు వచ్చాడు. నిబంధనల ప్రకారం కొరియర్ పార్శిల్ పంపే వ్యక్తి ఆధార్ కార్డు కాపీ జత చేయడం తప్పనిసరి. తన ఆధార్ కార్డు నంబరు ముద్రణ సరిగా లేదని, కొరియర్ సంస్థలో పనిచేస్తున్న గుత్తుల తేజ ఆధార్ కార్డు జత చేయమని సాయిగోపి కోరాడు. దీంతో తేజ తన ఆధార్ కార్డు కాపీని జత చేసి అస్ట్రేలియాకు పార్శిల్ పంపించాడు. ఈ పార్శిల్ ఆస్ట్రేలియాకు బదులుగా పొరపాటున కెనడా చేరింది. అక్కడ కవర్‌పై సరైన స్టిక్కరింగ్ లేకపోవడంతో దానిని బెంగళూరుకు తిప్పి పంపించారు. బెంగళూరు కస్టమ్స్ అధికారులు ఆ పార్శిల్‌ను తనిఖీ చేయగా.. అందులో 4,496 గ్రాముల నిషేధిత ‘ఎఫెండ్రిన్’ అనే తెలుపు రంగు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో నిలిచిపోయిన ఈ పార్శిల్‌ను తీసుకురమ్మని గుత్తుల తేజను విజయవాడ డీఎస్టీ కొరియర్ నిర్వాహకులు ఏప్రిల్ 27న అక్కడకు పంపించారు. అక్కడ తేజను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించి ఏప్రిల్ 30న అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని తేజ విజయవాడ ప్రసాదంపాడులో ఉంటున్న తన బావ కరుణాకర్‌కు తెలియజేశాడు. దీనిపై విజయవాడ పటమట పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్‌రెడ్డితో కలిసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ డివిజన్ ఏసీపీ ఖాదర్‌బాషా చెప్పారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు కాగా, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడుకు చెందిన కొండవీటి సాయిగోపిని విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని విజయవాడ తీసుకెళ్లారు. సాయిగోపిని అదుపులోకి తీసుకునే విషయంలో విజయవాడ పోలీసులకు తాము సహకరించామని సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
పుట్టగానే ఆధార్!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: అప్పుడే పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ రానుంది. పిల్లలు జన్మించిన ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకుని.. అదే రోజున ఆధార్‌కు ఎన్రోల్ చేసేలా రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పురపాలక శాఖ జనన నమోదు పోర్టల్‌ను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు అనుసంధానం చేయనుంది. వారం, పదిరోజుల్లోనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు. జననాల పోర్టల్ నుంచి.. ఆస్పత్రులు ఆన్లైన్ ద్వారా ఏ రోజుకారోజు జననాల వివరాలను నమోదు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఆస్పత్రులు శిశువు తల్లిదండ్రుల పేర్లు, ఆధార్ నంబర్లు, చిరునామా, పుట్టిన తేదీ, సమయం, లింగం, వయసు వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని వినియోగించి.. నవజాత శిశువులకు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్‌ను కేటాయించడానికి రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. జనన నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే తల్లిదండ్రుల మొబైల్ ఫోన్‌కు జనన ధ్రువీకరణ పత్రం డౌన్లోడ్ లింక్‌తోపాటు ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ సైతం ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందుతుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఆ ఎన్రోల్మెంట్ నంబర్‌తో మీసేవ కేంద్రం నుంచి ఆధార్‌కార్డును పొందడానికి వీలుంటుందని వివరించారు. పుట్టినబిడ్డలకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ కేటాయింపు ఇప్పటివరకు ఎక్కడా ప్రారంభం కాలేదని.. తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. నీలి రంగు ఆధార్ కార్డు యూఐడీఏఐ ఐదేళ్లలోపు పిల్లల కోసం నీలిరంగులో తాత్కాలిక ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీనికోసం శిశువుల బయోమెట్రిక్ డేటా సేకరించరు. పిల్లల ఫొటో, తల్లిదండ్రు ల సమాచారం, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను మీసేవ కేంద్రాలు లేదా యూఐడీఏఐ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు. ఐదేళ్లు దాటాక బయోమెట్రిక్ డేటా ఇచ్చి శాశ్వత ఆధార్ కార్డును పొందాలి. 15 ఏళ్ల వ యసు తర్వాత మరోసారి బయోమెట్రిక్ డేటా ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు ఊరట.. దేశంలో చాలా సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు కీలకంగా మారింది. వ్యక్తిగత, చిరునామా గుర్తింపులోనూ, పాఠశాలలో ప్రవేశాలలో అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో శిశువులకు వెంటనే ఆధార్ ఎన్రోల్మెంట్ నంబర్ జారీ చేయనుండటం తల్లిదండ్రులకు ఊరట కలిగించనుంది. -
మధు కా పాంచ్వా బచ్చా.. ఆధార్ కార్డు ఎంత పని చేసింది!
సాధారణంగా మనం ఆధార్ కార్డుపై పేరు సరిగా లేదని, తప్పుగా ఉందనే కారణంతో మార్పులు చేసుకుంటుంటాం. అయితే తాజాగా ఆధార్ కార్డు సరిగా లేనందున ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. అదేంటి ఇందుకేనా అని అనుకోకుండి.. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఈ విచిత్ర ఘటన యూపీలోని బుద్వాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం బిల్సీ తహసీల్‌లోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన దినేష్ తన కుమార్తె ఆర్తిని చేర్పించేందుకు ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నాడు. ఆ పాఠశాల నిబంధన ప్రకారం ఆధార్ కార్డు ఉంటేనే పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వాలని అందులోని టీచర్ దినేశ్‌కు చెప్పింది. దీంతో అతని పాప ఆధార్ కార్డు వారికి ఇవ్వగా అది చూసి ఆ టీచర్ షాక్ అయ్యింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆధారు కార్డుపై ‘మధు కా పాంచ్వా బచ్చా’ ఇంగ్లీష్‌లో ‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ అని రాసి ఉంది. పైగా ఆ కార్డుకు ఎటువంటి ఆధార్ నెంబర్ కూడా లేదు. దీంతో ఆధార్ కార్డును తప్పుగా ఉందని, అది సరిచేయాలని టీచర్ దినేష్‌కు చెప్పి వెనక్కు పంపింది. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ మాట్లాడుతూ.. పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నామని, వారి నిర్లక్ష్యంగా కారణంగానే ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. ఇకపై వీటికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సూచించమని అన్నారు. ప్రస్తుతం ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
ఆధార్‌లో ‘కేరాఫ్’తో కొత్త చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు (ఆధార్)లో చిన్న మార్పు కొత్త చిక్కులు తెచ్చింది. చిరునామాలో ‘కేరాఫ్’ను చేర్చడం వివాహితులైన మహిళలకు తలనొప్పిగా మారింది. ఈ సవరణ ఆదాయపన్నుకు సంబంధించిన శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు జారీలో తప్పిదాలకు దారితీస్తోంది. కొత్తగా పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే బంధుత్వాలు మారిపోతున్నాయి. తండ్రి స్థానంలో భర్త పేరుతో కార్డులు జారీ కావడం ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పాన్ కార్డులో సవరణల కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు అవగాహన లేక కొందరు ఏజెంట్లను ఆశ్రయిస్తుండటతో ఈ గందరగోళం ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తుపై రెండు సంతకాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు పుట్టిన తేదీ నిర్ధారణ, చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది. అయితే వివాహితులైన మహిళలకు ఆధార్ చిరునామాలోని ‘కేరాఫ్’అంశం ఇబ్బందిగా మారింది. పాన్‌కార్డు దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సంబంధిత ఆపరేటర్లు చాలావరకు దరఖాస్తులోని వివరాలు సరిగా చూడటం లేదు. పాన్‌కార్డు దరఖాస్తులో తండ్రి పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు జిరాక్స్ ఆధారంగా నమోదు చేస్తుండటంతో.. కార్డులో తండ్రి పేరు స్థానంలో ఆధార్‌లో కేరాఫ్‌గా ఉండే భర్త పేరు వస్తోంది. సన్నాఫ్, డాటరాఫ్ స్థానంలో కేరాఫ్ పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఆరు నెలల క్రితం ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే సన్నాఫ్, డాటరాఫ్, వైఫ్ ఆఫ్ వంటి పదాలను తొలగించి కేవలం కేరాఫ్ మాత్రమే ఉండే విధంగా మార్పులు చేశారు. ఈ కేరాఫ్ వివాహిత మహిళలకు పాన్ కార్డు జారీలో పొరపాటుకు కారణమవుతోంది. ఆధార్ కార్డులో ఇంటి పేరు సాధారణంగా మొదట్లో ఉంటుండగా, పాన్ కార్డులో మాత్రం చివర్లో వస్తుండటంతో బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి సమస్యగా మారుతోంది. -
మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!
ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తనవెంట కలిగి ఉండాల్సిన గుర్తింపు పత్రాలలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా, విద్యాలయాల్లో అడ్మిషన్లు, సిమ్ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను వంటి ప్రతిదాని కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా ఈ 12 అంకెల గల కార్డులో నిక్షిప్తమై ఉన్నందున దీని భద్రత చాలా ముఖ్యం. అయితే, చాలా మంది ఆధార్ కార్డుల్లో తమ వివరాలను సరిచేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వాటిలో ఆధార్ కార్డుపై ఉన్న ఫొటో ఒకటి. వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో మార్పులు వస్తుంటాయి. మరి చాలా ఏళ్ల క్రితం తీసిన ఆధార్‌పై ఫొటోకు ఇప్పటి మన ముఖానికి అసలు పోలికలే ఉండవు. అలాంటప్పుడు గుర్తింపు తప్పనిసరైన చోట ఏదైనా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఆధార్ కార్డుపై ఉన్న ఫొటోను ఎలా మార్చుకోవలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..! మొదట UIDAI అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆపై కరెక్షన్/అప్డేట్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలను నింపండి. ఆపై ఫారమ్‌ను మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లండి. ఫారమ్‌లో నింపిన వివరాలను బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సెంటర్ ఎగ్జిక్యూటివ్ ధృవీకరిస్తారు. ఆ తర్వాత మీరు రూ.100 + జీఎస్టీ చెల్లించాలి. అప్పుడు అతను మీ కొత్త ఫోటో తీసిన తర్వాత మీకు URN స్లిప్ అందిస్తారు. URN ద్వారా మీ ఫోటో అప్డేట్ స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు. కొత్త ఫోటో గల ఆధార్ కార్డ్ అప్డేట్ కావడానికి గరిష్టంగా 90 రోజుల వరకు సమయం పట్టవచ్చు. (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్!) -
మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!
ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పన్ను మినహాయింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్, జాతీయ ఫించను స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక స్కీమ్‌లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై స్కీమ్‌లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. ఆధార్-పాన్ లింక్ మీరు ఇంకా మీ పాన్ నెంబర్‌ను మీ ఆధార్ నెంబర్‌తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేవైసీ అప్డేట్ మీ బ్యాంకులో మీ అకౌంట్‌కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్, ఆధార్, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి. (చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!) -
ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చవచ్చో తెలుసా?
ఇప్పుడు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఆధార్ కార్డు, ఇతర పత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. మన దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇది ఒక గుర్తింపు రుజువు పత్రంగా పనిచేస్తుంది. ఇందులో పౌరుల సమాచారం బయోమెట్రిక్ రూపంలో ఉంటుంది. ఇలాంటి, ఆధార్ కార్డులో మన వివరాలు సరిగా ఉండాలి. లేకపోతే గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, స్కాలర్ షిప్, వివిద పథకాలకు అనర్హులం అవుతాము. ప్రజల కష్టాలను గుర్తించిన యుఐడీఏఐ తమ చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటి విషయాలతో పాటు ఇతర వివరాలను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అయితే, మీ ఆధార్ కార్డులో వివరాలను మార్చడానికి కొన్ని షరతులు పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు ఆధార్ వివరాలను మార్చకుండా ఉండటానికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ పై ఉన్న పేరును ఎన్నిసార్లు మార్చవచ్చు? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఒక యూజర్ ఆధార్ కార్డుపై తమ పేరును జీవిత కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. అంతకన్న ఎక్కువ సార్లు, మార్చుకునే అవకాశం లేదు. ఆధార్ పై పుట్టిన తేదీని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్ కార్డుపై మీ పుట్టిన తేదీని ఎన్నడూ మార్చలేమని గుర్తుంచుకోవాలి. డేటా ఎంట్రీ సమయంలో ఏదైనా దోషం ఉన్నట్లయితే పుట్టిన తేదీని మార్చడానికి గల ఏకైక మార్గం. ఆధార్ పై చిరునామా, లింగాన్ని ఎన్నిసార్లు మార్చవచ్చు? యుఐడిఎఐ మార్గదర్శకాల ప్రకారం ఆధార్ కార్డుపై చిరునామాను, లింగాన్ని ఒక్కసారి మాత్రమే మార్చవచ్చు. ఆధార్ కార్డులో పేరు, లింగం లేదా పుట్టిన తేదీని పరిమితికి మించి మార్పులు చేయాలనుకుంటే ఆధార్ కార్డుదారుడు యుఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఈ వివరాలను మార్చడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. (చదవండి: ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం భారీ అలర్ట్.. వెంటనే బ్రౌజర్ అప్డేట్ చేయండి?) -
చాన్స్ మిస్.. ఆధార్ లేకపాయే.. ఆర్టీసీ ఆఫర్ ఆగమాయే..
మహిళా దినోత్సవం సందర్భంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మంగళవారం ఉచిత ప్రయాణం ఆఫర్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై పెద్దగా ప్రచారం చేయకపోవడంతో చాలా మందికి తెలియలేదు. దీనికి తోడు ఉదయం ఒకరిద్దరు ఈ విషయమై అడిగినా తమకేం ఆదేశాలు రాలేదని కండక్టర్లు చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆర్ఎం ఆదేశాలతో కండక్టర్లు అనుమతించినప్పటికీ.. అవగాహన లోపంతో చాలా మంది మహిళలు ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోలేదు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణమని, లేకపోతే టికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పడంతో ఆఫర్ మిస్ అయినట్లయింది. ఆర్భాటంగా ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ అధికారుల.. రెండు, మూడు రోజుల ముందు నుంచి ప్రచారం చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంతో పాటు సత్తుపల్లి, మధిర, వైరాల్లో పరిశీలించగా.. ఎక్కువ మంది ఉపయోగించుకోలేదని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మం మామిళ్లగూడెం / వైరా / సత్తుపల్లి టౌన్ / మధిర రూరల్ టికెట్ తీసుకోక తప్పలేదు.. నాకు ఫించన్ కూడా వస్తుంది. వయస్సు ఎప్పుడో 60 ఏళ్లు దాటింది. కానీ గుర్తింపు కార్డు తెచ్చుకోవటం మర్చిపోయాను. దీంతో కండక్టర్ కార్డు ఉంటేనే ఆఫర్ ఉంటుందన్నారు. ఇక టికెట్ తీసుకోక తప్పలేదు. – చింతలపాటి వరమ్మ, సత్తుపల్లి ముందే చెబితే బాగుండు.. వరంగల్ వెళ్దామని బస్సు ఎక్కా. ప్రయాణంలో ఆఫర్ ఉందని బస్సులోకి ఎక్కాక చెప్పారు. తీరా చూస్తే నా దగ్గర గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ వాడుకోలేకపోయా. ఇలాంటివి ముందే చెబితే బాగుండేది. – మాదాసి లక్ష్మమ్మ, సత్తుపల్లి వైరా నుంచి మధిర.. అరవై ఏళ్లు నిండిన మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుక బాగుంది. నేను వైరా నుంచి మధిర వరకు ప్రయాణించా. ఇంకా ఎక్కువ మందికి తెలియజేస్తే ఆధార్ కార్డు తెచ్చుకునేవారు. – గంగసాని అరుణ, బ్రాహ్మణపల్లి, మధిర ఆనందంగా ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉంది. ముందుగా తెలియడంతో ఆధార్‌కార్డు తెచ్చుకున్నా. కండక్టర్‌ను చూపించి మధిర నుంచి రాపల్లికి వెళ్లా. – వాసిరెడ్డి రజిని, రాపల్లి అభినందనీయం మహిళలను గౌరవించడం సంప్రదాయం. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం అభినందనీయం. వయోవృద్ధులైన మహిళలకు బస్సులు, బస్టాండ్లలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. – గరిక సరోజిని, గంపలగూడెం కార్డు తెచ్చుకోలే.. ఆర్టీసీ బస్సులో ఈరోజు ఉచితంగా వెళ్లొచ్చని నాకు తెలియదు. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఆధార్‌కార్డు తెచ్చుకోలేదు. ఆధార్‌కార్డు ఉంటేనే టికెట్ లేకుండా ప్రయాణించొచ్చని కండక్టర్ చెప్పాడు. దీంతో టికెట్ కొన్నా. – కరి కమల, అనాసాగరం ఆధార్ అడగలేదు నేను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో కండక్టర్ టికెట్ కొట్టా రు. ఆధార్‌కార్డు ఉందా అని కానీ ఇతర గుర్తింపు కార్డులు ఉన్నాయా అని కానీ అడగలేదు. దీంతో టికెట్ తీసుకునే ప్రయాణం చేశాను. ఆ తర్వాత ఆఫర్ ఉందనే విషయం తెలిసింది. – స్వరూప, ప్రయాణికురాలు ఆధారాలు లేకపోవడంతోనే... అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందుకోసం ఆధార్ కార్డు.. ఇతర గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎక్కువ మంది కార్డులు లేకుండా రావడంతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. – సోలోమన్, రీజియన్ మేనేజర్ (ఇది చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే!) -
ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
పర్మినెంట్ అకౌంట్ నెంబరు(పాన్ కార్డు) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పది అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నెంబరు. మన దేశంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ పాన్-కార్డు చాలా ముఖ్యమైనది. ఐ-టీ విభాగం జారీ చేసిన లామినేటెడ్ ప్లాస్టిక్ పాన్ కార్డు ఇప్పటి వరకు చాలా ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ-పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. అలాగే, అలా దరఖాస్తు చేసుకొన్న తర్వాత నెల రోజులకు గాని పాన్ కార్డు ఇంటికి వచ్చేది కాదు. అయితే, ఇప్పుడు ఆన్లైన్లో సులభంగానే పాన్ కార్డు పొందొచ్చు. అయితే దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో పాన్ నెంబర్ వచ్చేస్తుంది. దీన్ని ఈ-పాన్ అని పిలుస్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత జిరాక్స్ చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఉచితంగానే పాన్ కార్డు వచ్చినట్లు అవుతుంది. ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..! మొదట ఆదాయపు పన్నుశాఖ కొత్త (https://www.incometax.gov.in/iec/foportal) పోర్టల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు 'Instant E-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఈ-పాన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. (చదవండి: ట్యాక్స్ పేయర్స్‌కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!) -
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం తెర పైకి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్నీంటికీ ఒకే కార్డు..! ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక మేరకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ , పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి ఇతర డిజిటల్ ఐడీ కార్డులను లింక్ చేస్తూ కొత్తగా “ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్” కొత్త మోడల్ రూపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పాన్ కార్డుతో పాటుగా పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీల కోసం ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్డుపై గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వన్ కార్డు మరోసారి తెరపైకి వచ్చింది. లక్ష్యం అదే..! ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుతో వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో మరింత సులభమయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ వన్‌స్టాప్ డెస్టినేషన్‌గా ఉంటుందని తెలిపింది. చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..! -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్‌పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
మే నాటికి సచివాలయాల్లో ఆధార్ సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో మే నాటికి పూర్తిగా ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయాలని చెప్పారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ప్రారంభ కార్యక్రమం అనంతరం ఆయన గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్న వలంటీర్లను సత్కరించి, వారికి ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉగాది నాటికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది అందరికీ యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో హార్డ్ వేర్ ఎప్పటికప్పుడు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. నెలకోసారి కంప్యూటర్లు, పరికరాల స్థితిగతులపై నివేదికలు తెప్పించుకుని, ఆ మేరకు అవి సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సేవలు అందించడంలో ఉత్తమ పనితీరు ► ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉత్తమ పనితీరు, సమర్థత కనబరచాలి. ఇందుకోసం ప్రజలకు వారు అందించాల్సిన సేవల విషయంలో అనుసరించాల్సిన తీరు పట్ల నిరంతరం వారికి అవగాహన కల్పించాలి. ► నిర్దేశించిన ఎస్ఓపీలను తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రజలకు అందుబాటులో ఉండడం అన్నది అత్యంత ప్రాధాన్యతా అంశం. సేవల కోసం ఎవరైనా లంచం అడిగితే.. వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా తగిన వ్యవస్థ ఉండాలి. దీనిపై తీసుకున్న చర్యలను కూడా పొందు పరచాలి. ఇందుకు అనుగుణంగా పోర్టల్‌లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలి. ► ఇదివరకే ప్రకటించిన విధంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ పూర్తి కావాలి. ► సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. సమర్థవంతంగా ఈ కార్యక్రమం కొనసాగాలి. దీనివల్ల ప్రజల నుంచి సమస్యలు, సూచనలు అందుతాయి. ప్రజలకు మరింత అందుబాటులో ఉన్నామని మనం తెలియజేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. ► సచివాలయాల సిబ్బంది మధ్య, ప్రభుత్వ విభాగాల మధ్య నిరంతరం సమన్వయం ఉండాలి. దీనికోసం గ్రామ, వార్డు స్థాయిలో, మండల, రెవెన్యూ డివిజన్, జిల్లాల స్థాయిలో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
దేశముదుర్లు.. క్షణాల్లో నకిలీ ఆధార్ కార్డులు రెడీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆధార్ ముఠా గుట్టు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ రట్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. ► బోరబండ, న్యూ అల్లాపూర్‌కు చెందిన నితేష్ సింగ్, టోలిచౌకీకి చెందిన సయ్యద్ ముస్తఫా, ఓల్డ్ హఫీజ్‌పేటకు చెందిన షేక్ జహంగీర్ పాషా, హైదర్‌గూడకు చెందిన మహ్మద్ అన్వరుద్దీన్ స్నేహితులు. గోల్నాక తులసీనగర్‌కు చెందిన రబ్బాని ఎంఏ, హకీంపేటకు చెందిన మహ్మద్ అజహర్ షరీఫ్ ఇద్దరూ ముస్తఫాకు చెందిన ఎస్ఎం ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేసేవారు. బోరబండ ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన మహ్మద్ సోహైల్ నితేష్ సింగ్‌కు చెందిన జేబీ ఎంటర్‌ప్రైజెస్‌లో పని చేసేవారు. ► లాక్డౌన్ తర్వాత ముస్తఫా వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇబ్బందులను మిగిలిన స్నేహితులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా నితేష్ సింగ్ తనకు మధ్యప్రదేశ్ భోపాల్‌లో పవన్ అనే స్నేహితుడు ఉన్నాడని.. అతను అస్సాంలో ఆధార్ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద అస్సాంకు చెందిన ఆధార్ ఐడీ కార్డులు ఉన్నాయని, వాటిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో వారు వాటిని కొనుగోలు చేసి నగరంలో నకిలీవి సృష్టించి అవసరమైన అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం పన్నారు. ► గత అక్టోబర్‌లో నితేష్ పవన్ నుంచి రూ.90 వేలకు ఆరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీలను కొనుగోలు చేసి మిగిలిన వారికి విక్రయించాడు. దీంతో ఈ నలుగురు ఆధార్ కిట్స్, ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ స్లాబ్, కెమెరాలను కొనుగోలు చేసి తమ ఆన్లైన్ సర్వీసెస్ కేంద్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సేవలు ప్రారంభించారు. ► కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక రాష్ట్రంలో జారీ చేసిన ఆధార్ కార్డులు ఆ రాష్ట్ర పరిధిలోనే వినియోగించాలి. అయితే నిందితులు హైదరాబాద్‌లో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేషన్ కోసం అస్సాంకు కేటాయించిన కార్డులపై వివరాలను ముద్రించి నకిలీవి సృష్టించారు. ఇందుకోసం హైదరాబాద్, మేడ్చల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ల పేరుతో నకిలీ స్టాంప్‌లను సృష్టించారు. ఆయా గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను కూడా తయారు చేశారు. గత రెండు నెలలుగా ఆయా కేంద్రాల నుంచి సుమారు 3 వేల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ► నకిలీ ఆధార్ కార్డ్‌ల భాగోతం యూఐడీఏఐ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందాలు నితేష్ సింగ్, ముస్తఫా, రబ్బాని, అజహర్ షరీఫ్, సోహైల్, జహంగీర్ పాషా, అన్వరుద్దీన్లతో పాటు మొరమ్మగడ్డకు చెందిన మహ్మద్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు భోపాల్‌కు చెందిన పవన్ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.80 వేల నగదు, ఆరు ఆధార్ కిట్లు, 5 స్టాంప్‌లు, ఆధార్ ఎన్రోల్మెంట్ దరఖాస్తులు, ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వద్దంటే రెచ్చిపోయాడు, ముద్దులు పెడుతూ అసభ్యంగా తాకుతూ.. -
ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో అనుసంధానానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2022లో జరగనున్న ఎన్నికలకు ముందు ఈసీ సిఫారసుల ఆధారంగా ఎన్నికల ప్రక్రియను సంస్కరించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే.. ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేయడంతోపాటు, పలు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ►పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్‌ను అనుమతిస్తారు. అయితే, ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. ►వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వయోజనులు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే చేయడానికి అవకాశం ఉండేది. చదవండి: (కర్ణాటక సర్కారుకు సొంతపార్టీ ఎమ్మెల్యే షాక్.. అసెంబ్లీలోనే ఫైర్) ►ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇకమీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించారు. ►ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్‌కి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. వీటన్నిటిని ఆమోదిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. చదవండి: (కాంగ్రెస్ పార్టీలో చేరనున్న భారత మాజీ క్రికెటర్?) -
ఆదివాసీ బాలలకు ‘ఆధార్’ దొరికింది
జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాలు నిట్టమామిడి, బందులపనుకులోని బాలలకు ఎట్టకేలకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం జరిగింది. ఆ గ్రామాలకు చెందిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు లేకపోవటంతో చదువుకు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ఇటీవల ఈ సమస్యపై కథనం వెలువడడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఆదివాసీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టింది. పాడేరు ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ అప్పలస్వామి, ఎంఆర్ఐ చిన్నారావు, సిబ్బంది 8 కి.మీ కాలినడకన ఆయా గ్రామాలను సందర్శించి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసి ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిట్టమామిడి, బందులపనుకు గ్రామాల్లో గల 53 మంది పిల్లలకు ఆధార్ నమోదు చేశారు. దీంతో తమ పిల్లలు చదువుకోవడానికి ఒక ఆధారం దొరికిందని ఆదివాసీ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. -
‘ఆధార్ కార్డు’ మోడల్..! ప్రపంచ వ్యాప్తంగా...!
UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్ కార్డు లాంటి మోడల్‌ను ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్ గ్లోబల్ ఐడెంటిటీ సిస్టమ్‌పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది. ఆధార్‌పై ఇతర దేశాలు ఆసక్తి..! ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్‌లాంటి మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో సౌరభ్ గార్గ్ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్‌ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు. ఆధార్ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. ఇట్టే పసిగడతాయి..! ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్‌ను యాక్సెస్ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి. చదవండి: ఆండ్రాయిడ్‌లో అదిరిపోయే ఫీచర్స్..! పిల్లలను, కార్లను కంట్రోల్ చేయొచ్చు....! -
ఆధార్ కార్డు కావాలా? .. అదనపు ముడుపులు ఇవ్వాల్సిందే..
సాక్షి, తుమకూరు(కర్ణాటక): జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి దగ్గరున్న నాడ కచేరి ప్రభుత్వం కార్యాలయంలో ప్రజలు ఆధార్ కార్డు పని మీద వస్తే నిర్ణీత రుసుంతో పాటు లంచం ఇస్తేనే పనవుతోంది. ఆధార్ ముద్రణకు రుసుము రూ.15 మాత్రమే. కానీ అక్కడి సిబ్బంది రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకుంటే ఏదో సాకు చెప్పి పని వాయిదా వేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపులు తీసుకుంటున్న వీడియోలను విడుదల చేశారు. -
ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా మార్చుకోండి!
మన దేశంలో ఆధార్ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మన అందరికీ తెలిసిందే. పుట్టిన చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న మనకు ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని చిరునామాను అప్ డేట్ చేయాలి అనుకుంటే యూఐడీఏఐ పోర్టల్ ద్వారా మీ చిరునామాలో మార్పు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆధార్ అడ్రస్ మార్చుకోవడం మీకు కష్టమని భావిస్తే.. ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూడా పని పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ప్రూఫ్ డాక్యుమెంట్ తీసుకెలితే సరిపోతుంది. అయితే, ఈ అప్ డేట్ కోసం రూ.50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. చిరునామా అప్ డేట్ కోసం పాస్ పోర్ట్, బ్యాంక్ స్టేట్ మెంట్/పాస్ బుక్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్ మెంట్/పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు/వాటర్ బిల్లు/టెలిఫోన్ ల్యాండ్ లైన్ బిల్లు/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్/గ్యాస్ కనెక్షన్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు అవసరం. (చదవండి: Xiaomi: షావోమీ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు ..! ఎప్పుడు వస్తాయంటే..?) ఆధార్ కార్డులో అడ్రస్ అప్ డేట్ చేసే విధానం : మొదట ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మై ఆధార్ సెక్షన్లోకి వెళ్లాలి. ఇందులో అప్డేట్ యువర్ ఆధార్ అనే ట్యాబ్ ఉంటుంది. అప్డేట్ యువర్ ఆధార్ అడ్రస్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రూఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.