
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించార ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ వో) వికాస్ రాజ్ తెలిపారు. గత ఆగస్టు 1న ప్రారంభించిన ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధాన కార్యక్రమానికి రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్వయం సహా యక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) చొరవ తో రాష్ట్రంలో 40 లక్షలమంది ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నా రని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్‌జీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఓటరు గుర్తింపుకార్డుల తో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరుగుతోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment