voter cards
-
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్‌సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్‌లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్‌లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోటి మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి మంది ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకుని దేశంలోనే రికార్డు సృష్టించార ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈ వో) వికాస్ రాజ్ తెలిపారు. గత ఆగస్టు 1న ప్రారంభించిన ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధాన కార్యక్రమానికి రాష్ట్రంలో మంచి స్పందన లభించిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహా యక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) చొరవ తో రాష్ట్రంలో 40 లక్షలమంది ఓటర్లు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నా రని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్‌జీల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఓటరు గుర్తింపుకార్డుల తో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా జరుగుతోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్ట ర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. -
చిత్తూరు.. మీ ఓటు ఉందా? చూసుకోండిలా..
సాక్షి, చిత్తూరు జిల్లా: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లాస్థాయిలో ఫిర్యాదు విభాగం అధికారి పేరు : గోపాలయ్య (ఎన్నికల విభాగం సూపరింటెండెంట్) సెల్ నంబర్: 94910 77009 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు Check Your Vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
ఓటేయాలంటే ఓటర్ కార్డు ఉంటే సరిపోదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బోగస్ ఓటర్ల జాబితాపై 15 రోజుల్లో తనిఖీ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు గల యువత 18 లక్షల మంది ఉన్నారని, వారిలో కేవలం 5.39 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ద్వివేదీ శుక్రవారం సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు, బీజేపీ తరపున గరిమెళ్ల చిట్టిబాబు, సీపీఐ తరపున మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీసీఎం తరపున వై. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం ద్వివేదీ విలేకరులతో మాట్లాడారు. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదని, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని చెప్పారు. పేరు లేకపోతే వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే దివ్యాంగులు 6.19 లక్షల మంది ఉన్నారని, అయితే ఓటర్లగా 3.29 లక్షల మంది మాత్రమే నమోదయ్యారని గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. కొంతమంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నా దివ్యాంగులని తెలియపరచని వారు ఉంటారని అన్నారు. దివ్యాంగులుగా నమోదు చేయించుకునే వారికి వాహన సౌకర్యం, పోలింగ్ బూత్ వద్ద వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని, పోలింగ్ బూత్‌ల వద్ద వారు బారులు తీరే అవసరం లేకుండా నేరుగా ఓటు వేసే సదుపాయం కల్పిస్తామని వివరించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులందరి సెల్‌ఫోన్ నెంబర్లతో ఒక యాప్‌ని రూపొందిస్తున్నామని చెప్పారు. ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు ఈసారి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 45,920 పోలింగ్ కేంద్రాల వద్ద టాయిలెట్స్, కుర్చీలు, వీల్ చైర్స్, మంచినీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుతామని, ఓటర్లు బారులు తీరకుండా ఓటు వేసే విధంగా టోకెన్ విధానం ప్రవేశపెడతామని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్‌లో టోకెన్ విధానం ప్రవేశపెట్టారని, అక్కడ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తుచేశారు. ఈ విధానం వల్ల ఓటర్‌కు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై పరిశీలన జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పాలుపంచుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 11న విడుదల చేశామని, ఆ జాబితాలో ఓటర్లను తొలగించడం గానీ, జత చేయడం గానీ ఇప్పటివరకు చేయలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 9 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఇచ్చిన ఫామ్–6 దరఖాస్తులు 7.36 లక్షల వరకు ఉన్నట్లు వివరించారు. బూత్‌స్థాయి అధికారులు వాటిని పరిశీస్తున్నారని, పది రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ పరిశీలనలో రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా పాల్గొనాలని కోరారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో పర్యటించనుందని, ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందన్నారు: అంబటి వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా భారీ క్యూలైన్లు లేకుండా టోకెన్ విధానం కొనసాగింపుపై ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ చర్చించారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ద్వివేదీతో సమావేశం అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసిన బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందని, 15 రోజుల్లో విచారణ పూర్తవుతుందని ద్వివేదీ పేర్కొన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల నిర్వహణ, ఓట్ల నమోదుపై పార్టీ పరంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. -
ఎంపిక షురూ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌కు సంబంధించి నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే ప్రభుత్వం çస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అధికారులు తొలుత 57–64 మధ్య వయస్సు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇంతవరకు 64 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందజేస్తుండగా టీఆర్ఎస్ తాజా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా భావించనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ప్రకారం కొత్తగా 66,760 మందికి ఆసరా పింఛన్ లభించే అవకాశముందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, డీఆర్డీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన క్రాంతి.. తొలిరోజే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. శాఖ అధికారులతో సమావేశమై ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు. 66,760 మంది గుర్తింపు ప్రభుత్వం నుంచి వెలువరించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 64 నిండిన వారికి పింఛన్లు అందజేస్తుండగా.. తాజా నిర్ణయం మేరకు 57 నుంచి 64 ఏళ్ల మధ్య వారిని గుర్తిస్తున్నారు. తొలుత ప్రతీ జిల్లా నుంచి కొత్తగా ఎందరు లబ్ధిదారులకు ఎంపికయ్యే అవకాశముందో వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 66,760 మంది ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఇవీ నిబంధనలు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆసరా పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు పలు మార్గదర్శకాలకు వెలువరించింది. వీటి ప్రకారం 1953 నుంచి 1961 మధ్య జన్మించి 57 ఏళ్ల వయస్సు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తారు. వయస్సు నిర్ధారణ కోసం ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు.. చెల్క భూమి 7.5 ఎకరాలు, తరి 3 ఎకరాలు మించకుండా.. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లోనైతే రూ.1.5 లక్షలు, నగరాల్లోనైతే రూ.2 లక్షలు దాటకుండా చూస్తున్నారు. ఇక సంతానం వైద్యులు, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నా... ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపుల వంటి వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉన్న వారు, ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారిని కూడా అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. ఎంపిక విధానం ఓటరు కార్డులోని వివరాల ప్రకారం 2018 నవంబర్ 19 నాటికి 57–64 సంవత్సరాల నిండిన వారిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తిస్తారు. ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాక.. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లోనైతే వీఆర్ఓలు, పట్టణాల్లోనైతే బిల్కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పొల్గొంటారు. ఎంపిక అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, వినతుల తర్వాత తుది జాబితా రూపొందిచనున్న అధికారులు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు సేకరిస్తారు. చివరకు ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. గ్రామసభల ద్వారా.. జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా అధికారులువిభజించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తుండగా.. ఏకంగా 8 ఏళ్లు వయో పరిమితి తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 66,760 కొత్తగా ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తుది జాబితా రూపొదించాక ఈ సంఖ్య ఎంత మేరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వికలాంగులకు ఆసరా పింఛన్ కింద రూ.1500 అందజేస్తుండగా ఇది రూ.3,016కు పెరగనుంది. ఇక మిగతా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు చేరనున్నాయి. తద్వారా ఇప్పటికే పింఛన్ల రూపంలో ఇస్తున్న రూ.32,29,06,500లో భారీగా వ్యత్యాసం రానుంది. దీనికి తోడు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం ఇంకా మారనుంది. -
ఎంపిక షురూ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అభాగ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్‌కు సంబంధించి నూతన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. లబ్ధిదారుల ఎంపికపై ఇప్పటికే ప్రభుత్వం çస్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి అనుగుణంగా అధికారులు తొలుత 57–64 మధ్య వయస్సు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇంతవరకు 64 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్ అందజేస్తుండగా టీఆర్ఎస్ తాజా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారిని కూడా అర్హులుగా భావించనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ జాబితా ప్రకారం కొత్తగా 66,760 మందికి ఆసరా పింఛన్ లభించే అవకాశముందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, డీఆర్డీఓగా గురువారం బాధ్యతలు స్వీకరించిన క్రాంతి.. తొలిరోజే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై దృష్టి సారించారు. శాఖ అధికారులతో సమావేశమై ఎంపికలో జాగ్రత్త వహించాలని ఆదేశించారు. 66,760 మంది గుర్తింపు ప్రభుత్వం నుంచి వెలువరించిన మార్గదర్శకాల మేరకు లబ్ధిదారుల ఎంపికకు ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే 64 నిండిన వారికి పింఛన్లు అందజేస్తుండగా.. తాజా నిర్ణయం మేరకు 57 నుంచి 64 ఏళ్ల మధ్య వారిని గుర్తిస్తున్నారు. తొలుత ప్రతీ జిల్లా నుంచి కొత్తగా ఎందరు లబ్ధిదారులకు ఎంపికయ్యే అవకాశముందో వివరాలు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జిల్లాలో మొత్తం 66,760 మంది ఉండొచ్చనే నిర్ధారణకు వచ్చారు. ఇవీ నిబంధనలు తాజాగా రాష్ట్రప్రభుత్వం ఆసరా పింఛన్‌కు అర్హులను గుర్తించేందుకు పలు మార్గదర్శకాలకు వెలువరించింది. వీటి ప్రకారం 1953 నుంచి 1961 మధ్య జన్మించి 57 ఏళ్ల వయస్సు దాటిన వారిని అర్హులుగా గుర్తిస్తారు. వయస్సు నిర్ధారణ కోసం ఓటర్ కార్డు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటున్న అధికారులు.. చెల్క భూమి 7.5 ఎకరాలు, తరి 3 ఎకరాలు మించకుండా.. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లోనైతే రూ.1.5 లక్షలు, నగరాల్లోనైతే రూ.2 లక్షలు దాటకుండా చూస్తున్నారు. ఇక సంతానం వైద్యులు, కాంట్రాక్టర్లతో పాటు ఇతర వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ప్రభుత్వ, ప్రైవేట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్నా... ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు, షాపుల వంటి వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉన్న వారు, ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారిని కూడా అనర్హులుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పొందుతున్న వారితో పాటు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవద్దు. ఎంపిక విధానం ఓటరు కార్డులోని వివరాల ప్రకారం 2018 నవంబర్ 19 నాటికి 57–64 సంవత్సరాల నిండిన వారిని ఆసరా పింఛన్‌కు అర్హులుగా గుర్తిస్తారు. ఓటరు జాబితా ప్రకారం వివరాలు సేకరించాక.. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లోనైతే వీఆర్ఓలు, పట్టణాల్లోనైతే బిల్కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపికలో పొల్గొంటారు. ఎంపిక అనంతరం ముసాయిదా జాబితాను గ్రామ వార్డు సభల ద్వారా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు, వినతుల తర్వాత తుది జాబితా రూపొందిచనున్న అధికారులు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్కలెక్టర్లు సేకరిస్తారు. చివరకు ఎంపీడీఓ, మున్సిపల్ కమీషనర్లు లబ్ధిదారుల తుది జాబితాను పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. గ్రామసభల ద్వారా.. జిల్లాలో అర్హులుగా గుర్తించిన వారి వివరాలను మండలాలు, గ్రామాల వారీగా అధికారులువిభజించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం 65 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇస్తుండగా.. ఏకంగా 8 ఏళ్లు వయో పరిమితి తగ్గడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 66,760 కొత్తగా ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, తుది జాబితా రూపొదించాక ఈ సంఖ్య ఎంత మేరకు తగ్గుతుందో చూడాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం వికలాంగులకు ఆసరా పింఛన్ కింద రూ.1500 అందజేస్తుండగా ఇది రూ.3,016కు పెరగనుంది. ఇక మిగతా పింఛన్లు రూ.వెయ్యి నుంచి రూ.2,016కు చేరనున్నాయి. తద్వారా ఇప్పటికే పింఛన్ల రూపంలో ఇస్తున్న రూ.32,29,06,500లో భారీగా వ్యత్యాసం రానుంది. దీనికి తోడు కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తయితే ఈ మొత్తం ఇంకా మారనుంది. -
తెలంగాణ ఎన్నికల పరిశీలకుల నియామకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాల ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా ఖరారు చేసింది. ప్రతి జిల్లాకు ఒక్కరి చొప్పున ఎన్నికల పరిశీలకులను నియమించింది. హైదరాబాద్ ఎన్నికల పరిశీలకుడిగా డీఐజీ రేంజ్ అధికారి అజయ్‌దేవ్ కుమార్ నియమితులయ్యారు. ఎన్నికల్లో భద్రత అంశాలపై ఎప్పటికప్పుడు సీఈసీకి పరిశీలకులు సమాచారం ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ప్రత్యేక అధికారులు తెలంగాణలో అన్ని జిల్లాలకు చేరుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా కట్టుదిట్టం చేశారు. రూ. 25కు మించి చెల్లించవద్దు..! ఓటరు కార్డుకు రూ. 25కు మించి చెల్లించనక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త ఓటరుగా నమోదయిన వారికి ఇంటిదగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషనే ఉచితంగా కార్డులు అందజేస్తుందని, పాత కార్డుల వారు మాత్రం రూ. 25 మాత్రమే చెల్లించి ‘మీసేవ’లో ఓటరు కార్డులు పొంద వచ్చని ఆయన వెల్లడించారు. ‘మీ సేవలో’ ఓటరు కార్డుకు రు.100 వసూలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇలా వసూలు చేయడం అక్రమమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 25కు మించి అదనంగా ఎవరైనా వసూలు చేసినపక్షంలో పూర్తి వివరాలతో 1950కి ఫిర్యాదు చేస్తే.. తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద కానీ, పోలింగ్ జరిగే రోజున అయితే పోలింగ్ కేంద్రం వద్ద కానీ ఎపిక్ కార్డులను ఉచితంగా అంద చేస్తారని వివరించారు. -
ఓటరు కార్డుకు రూ.100
సాక్షి, హైదరాబాద్: - గాజులరామారంలోని మీసేవ కేంద్రానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఓటరు కార్డుకు రూ.100 చెల్లించాడు. అదేంటంటే.. ఈసీ నిర్ణయించిన మొత్తం ఇదేనని నిర్వాహకుడు గదమాయించాడు. - ముషీరాబాద్‌లోనూ ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఇంట్లో నలుగురి కోసం కార్డుకు రూ.110 చొప్పున మొత్తం రూ.440 చెల్లించాడు. ఇదేంటని వారిని ప్రశ్నిస్తే.. ‘అంతేబాబూ.. కలర్ ప్రింట్కు ఆమాత్రం అవదా?’అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో నిర్వాహకులు ఓటరు కార్డు ప్రింట్ తీసి ఇవ్వడానికి రూ.100కు పైగా వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల కమిషన్ ఓటరు గుర్తింపు కార్డులు ప్రింట్ తీసి ఇవ్వడానికి ధర రూ.25గా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇదే ధరను అమలు చేయాలని కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఎన్నికల సంఘం ఆదేశాలు ఎక్కడా అమలుకావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎన్నికల సంఘం ఆదేశాలంటూ దబాయిస్తున్నారు. నిజమేననుకున్న పలువురు అడిగినకాడికి సమర్పించుకుంటున్నారు. లక్షల్లోనే కొత్త కార్డులు కొత్త ఓటరు జాబితాలో రాష్ట్రంలో నూతనంగా దాదా పు ఐదు లక్షలకుపైగా ఓటర్లు చేరారు. వీరందరికీ కొత్త ఓటరు కార్డులు ఇవ్వాలి. దీనికితోడు చిరునామా మార్పు, ఓటరు కార్డులో తప్పుల సవరణ చేసు కున్నవారూ లక్షల్లోనే ఉన్నారు. వీరంతా పని సులువుగా అవుతుందన్న కారణంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు కాకుండా మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఈ లెక్కన కార్డుకు రూ.100 వసూలు చేసినా ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతుంది. మీసేవ నిర్వాహకులు ఏమంటున్నారు? వాస్తవానికి మీసేవ కేంద్రం నిర్వాహకులు ధర పెంపు విషయాన్ని ఇటీవల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. తమకు ఒక్కకార్డు ప్రింట్ తీసి ఇవ్వడానికి దాదాపుగా రూ.35 వరకు ఖర్చవుతోందని వివరించారు. రూ.25కు ఇవ్వలేమని, ఈ మొత్తాన్ని పెంచా లని రెండుసార్లు వినతిపత్రాన్ని కూడా ఇచ్చారు. కానీ, ప్రభుత్వం రూ.25గానే ధర నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మీసేవ నిర్వాహకులు ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా రూ.100 నుంచి రూ.110 వరకు వసూలు చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్న మాట వాస్తవమే. మేం నిర్ణయించిన ధర కేవలం రూ.25 మాత్రమే. అంతకుమించి వసూలు చేయకూడదు. ప్రింటింగ్ కాస్ట్ అధికంగా ఉందని, ధరలు పెంచాలని ఇటీవల మీసేవ నిర్వాహకులు మమ్మల్ని సంప్రదించారు. కానీ, అధిక ధర వసూలు చేసుకోమని మేమెలాంటి అధికారిక ఆదేశాలు ఇవ్వలేదు. వాస్తవానికి ఈ కార్డులను ఎన్నికల సంఘం పోస్టులో ఉచితంగా పంపుతుంది. అధిక ధరలు వసూలు చేసేవారిపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్రావు, ఈఎస్డీ కమిషనర్ -
కొత్త ఓటర్లకు కార్డులను అందిస్తాం
వేములవాడఅర్బన్: వేములవాడ నియోజకవర్గంలో కొత్త ఓటర్లుకు ఎన్నికల కమిషన్ ద్వారా త్వరలోనే గుర్తింపు కార్డులను అందిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖిమ్యానాయక్ తెలిపారు. వేములవాడ తహసీల్ధార్ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 235 పోలింగ్ కేంద్రాలలోని ప్రతీ ఓటరుకు పోలింగ్ రశీదును అందిస్తామన్నారు. ఈ రశీదులో ఓటరు పేరు, క్రమ సంఖ్య, పోలింగ్ స్టేషన్ సంఖ్య, పోలింగ్ జరిగే ప్రాంతం, పోలింగ్ భవన చిత్రం ఉంటుందన్నారు. అందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఈనెల 9 నాటికి 4,745 మంది నూతనంగా ఓట హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో 4,161 మందికి ఓటు హక్కు కల్పించామని, 121 దరకాస్తులను తిరస్కరించామన్నారు. మిగతా వాటిని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి ఓటు హక్కును కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికి జాబితా ఏర్పాటు చేసినందున నూతనంగా దరఖాస్తు చేసుకున్న ఓటర్ల కోసం ఈ నెల 18న మరో జాబితాను విడుదల చేసి ఓటు హక్కు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో 20 వేలకు పైగా ఓటర్లు పెరిగారని, వారందరికి గుర్తింపు కార్డులను కూడా త్వరలోనే వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లోని బీఎల్వోల వద్ద ఉంచుతామన్నారు. తహసీల్దార్ నక్క శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు. -
అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డులు
న్యూఢిల్లీ: దేశంలోని అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డుల్ని త్వరలో జారీచేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయకర్తలను నియమించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఓటర్కార్డుల్నే కాకుండా ఓటర్ స్లిప్పులను కూడా దివ్యాంగులు వాడుకునేలా రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడంపై బుధవారం నాడిక్కడ జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రావత్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై దివ్యాంగులకు అవగాహన కల్పిచేందుకు త్వరలోనే ఓ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆడియో, వీడియోలతో పాటు సైగ భాషల రూపంలో వీరికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. -
అంగట్లో ఐడెంటిటీ’పై హై అలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఐదు వందలిస్తే ఎవరికైనా ఓటరు కార్డ్ సులువుగా ఇచ్చేస్తున్న వైనంపై ‘అంగంట్లో.. ఐడెంటిటీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన వ్యవహారం ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. నిషేధిత ఉగ్రవాదులు, అండర్ వరల్డ్ డాన్లు, విదేశీయులకు సైతం గంటల్లో ఓటరు కార్డులు జారీ చేసిన అంశంపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన మున్సిపల్, హోం శాఖలను ఒకింత కలవరానికి గురిచేసింది. ఓటరు కార్డుల జారీకి సంబంధించి చోటు చేసుకుం టున్న లోపాలు, అందుకు సహకరిస్తున్న వ్యవస్థలపై లోతైన విచారణ జరిపి, ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న అంశంపై నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులు నిర్ణ యించారు. ఇక అక్రమంగా కార్డుల జారీయే లక్ష్యంగా పెట్టుకున్న మీసేవ కేంద్రాలేవీ బుధ వారం తెరుచుకోనేలేదు. తన భార్య నీలోఫర్ తనకు విడాకులు ఇవ్వకుండానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిందని, ఆమెకు ఇక్కడ ఓటర్ కార్డులతో పాటు రెండు ఆధార్ కార్డులు ఎలా మంజూరు చేశారని ఆఫ్గానిస్తాన్‌కు చెందిన అహ్మద్ మసూద్ ప్రశ్నించాడు. ఆయన బుధవారం పలువురు ముస్లిం మత పెద్దలు, న్యాయవాదులతో సమావేశమైన తర్వాత పోలీసు ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మసూద్ ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ భారతదేశంలో ఇంత సులువుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటం దారుణంగా ఉందని, తన భార్యకు ఇచ్చిన అన్ని గుర్తింపులను వెంటనే రద్దు చేసి ఆమెను తమ దేశానికి పంపాలని విజ్ఞప్తి చేశాడు. -
చేపల మార్కెట్లో ఓటరు కార్డులు
విజయవాడ: అందులో 10 వేల వరకు ఓటర్ కార్డులు ఉండొచ్చని భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సామినేని ఉదయభాను, గౌతం రెడ్డిలు బస్తాల్లో లభ్యమైన ఓటర్ కార్డులను పరిశీలించారు. దీనిపై ఎన్నికల సంఘం విచారణ ప్రారంభించాలని కోరారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఓట్లుకొని అధికారంలోకి వచ్చిందన్న అనుమానాన్ని వీరు వ్యక్తం చేశారు. -
‘సాక్షి’ ఆధ్వర్యంలో.. ‘ఆధార్’ అనుసంధానం
-
‘సాక్షి’ ఆధ్వర్యంలో.. ‘ఆధార్’ అనుసంధానం
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆధార్... ప్రస్తుతం అన్నింటికీ ఇదే ఆధారం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోగస్‌కు తావు లేకుండా... నిజమైన ఓటర్లే తమ ‘స్థానిక’ సారథులను ఎన్నుకునేందుకు ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సెల్‌ఫోన్ నుంచి ఎస్ఎంఎస్లు, ఆన్లైన్, జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ ద్వారా అనుసంధానానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజా సమాచారం మేరకు గ్రేటర్ పరిధిలోని దాదాపు 73.50 లక్షల మంది ఓటర్లలో కేవలం 36 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఎలా అనుసంధానం చేసుకోవాలో అవగాహన లేనందునే చాలామంది ప్రభుత్వ ఏర్పాట్లను వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆధార్ అనుసంధానానికి ‘సాక్షి’ తనవంతుగా ‘హెల్ప్‌డెస్క్’లను ఏర్పాటు చేస్తోంది. నిత్యం ప్రజల పక్షాన నిలిచే ‘సాక్షి’... ప్రజల సౌకర్యార్ధం ఆదివారం నాలుగు కేంద్రాల్లో ఆధార్ హెల్ప్‌డెస్క్‌లను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొంటున్నారు. బంజారాహిల్స్‌లోని హెల్ప్‌డెస్క్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ 11.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులతో హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే వారికి ‘సాక్షి’ బృందమే ఆన్లైన్ ద్వారా అనుసంధానం కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తుంది. జిరాక్స్‌లు లేనివారు తమ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల నెంబర్లు తెలపాల్సి ఉంటుంది. తొలుత నాలుగు కేంద్రాల్లో ప్రారంభిస్తోంది. క్రమేపీ మరికొన్ని కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఖైరతాబాద్ నియోజకవర్గం వేదిక: వేమిరెడ్డి ఎన్క్లేవ్ హౌసింగ్ సొసైటీ, రోడ్ నెం. 12, బంజారాహిల్స్ సమయం: ఉ॥10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముఖ్య అతిథి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్. అతిథి: ఎం.ఎస్.ఎస్. సోమరాజు, డిప్యూటీ కమిషనర్ ముషీరాబాద్ నియోజకవర్గం వేదిక : ఈసేవా కేంద్రం, రామ్‌నగర్. సమయం : ఉ॥10 నుంచి మ॥3 గంటల వరకు ముఖ్యఅతిథులు : ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, సర్కిల్ -9 డిప్యూటీ కమిషనర్ కె.సత్యనారాయణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వేదిక: సూరారం రాంలీలా మైదానం, ఎన్టీఆర్ భవన్ కమ్యూనిటీ హాలు సమయం: ఉదయం 10 నుంచి సా 4 గంటల వరకు ముఖ్య అతిథి: అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనూప్‌సింగ్ గౌరవ అతిథులు: ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ వి.మమత ఎల్బీనగర్ నియోజకవర్గం వేదిక: భరత్‌నగర్ కమ్యూనిటీ హాల్, మన్సూరాబాద్ సమయం:ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముఖ్య అతిథులు: రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి. -
ఆధార్ సీడింగ్‌కు సదవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్లకు మరో సదవకాశం. ఈ సేవా, మీ సేవా, ఏపీ ఆన్లైన్ సెంటర్లలో ఏదో ఒకచోట తమ ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఓటర్ల సౌకర్యార్థం ఈ కేంద్రాలన్నింటిలో శుక్రవారం నుంచి ఈ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు సీడింగ్ చేయని ఓటర్లందరూ తమకు సమీపంలో ఉన్న కేంద్రాలకు వెళ్లి తమ ఆధార్ కార్డు నంబర్‌ను ఓటరు కార్డుతో లింక్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ గురువారం సూచించారు. ఆధార్‌తో అనుసంధానం చేసిన వెంటనే ఆ సమాచారం సంబంధిత ఓటర్ మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతుందన్నారు. ఎస్ఎంఎస్ పంపినా చాలు ఓటర్లు తమ మొైబైల్తో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. EEDEPIC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడీ నంబరు వేయాలి... మరో స్పేస్ ఇచ్చి ఆధార్ కార్డు నంబరు వేసి.. 8790499899కు ఎస్ఎంఎస్ పంపాలి. ఓటర్లు తమ ఆధార్ కార్డు ఓటరు ఐడీతో లింక్ అయిందా... లేదా అని తెలుసుకోవాలంటే VOTE అని టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి.. ఓటరు ఐడీ నంబరు వేసి 8790499899కు ఎస్ఎంఎస్ పంపాలి. ఏపీలోనే ఎక్కువ సీడింగ్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 71.85 శాతం ఆధార్ సీడింగ్ జరిగితే, తెలంగాణలో 62.35 శాతం మాత్రమే సీడింగ్ జరిగిందని భన్వర్‌లాల్ తెలిపారు. డూప్లికేట్, అనర్హులు, చనిపోయిన వారు, ఇళ్లు మారిన వారి కేటగిరీలో.. ఏపీలో 25.54 శాతం, తెలంగాణలో 33.74 శాతం ఓట్లు గుర్తించినట్లు వెల్లడించారు. -
ఆగస్టుకల్లా ఆధార్‌తో ఓటర్ల జాబితా లింక్
- కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్. బ్రహ్మ సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వీలుగా మార్చి 1 నుంచి ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఆధార్‌కార్డులను ఓటరు గుర్తింపు కార్డులతో అనుసంధానం చేసే కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ వెల్లడించారు. తద్వారా ఓటర్ల వద్ద ఒకటికన్నా ఎక్కువ కార్డులుంటే వాటిని తొలగిస్తామన్నారు. బోగస్ ఓటర్ కార్డుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల విభాగంలో ఓటరు కార్డు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఈవోలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కలెక్టర్లతో సమీక్షించిన అనంతరం బ్రహ్మ మీడియాతో మాట్లాడారు. దేశంలో 84 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో 74 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయన్నారు. ఆర్టికల్ 324 ప్రకారం నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని... అందులో భాగంగానే అనుసంధాన ప్రక్రియ చేపట్టామన్నారు. ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ నాటికి దేశంలోని 676 జిల్లాల్లో అనుసంధానం పూర్తిచేస్తామన్నారు. మొత్తం అనుసంధానం పూర్తయితే స్థానిక, పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ కార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. గత నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నేషనల్ సర్వీసు ఓటరు పోర్టల్‌ను ప్రారంభించిన విషయాన్ని బ్రహ్మ గుర్తుచేశారు. ఈ పోర్టల్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారి పేరు, చిరునామా, పోలింగ్ కేంద్రం తదితర వివరాలతోపాటు వారి పేరిట ఎన్ని ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఓటరు జాబితాలో తప్పొప్పులనూ సవరించు కోవచ్చ న్నారు. నెట్ లేకున్నా మొబైల్ అప్లికేషన్‌తో ఈ పోర్టల్ సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వంద శాతం ఆధార్ పూర్తయిందన్నారు. ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి కాదన్నారు. ఈ ప్రక్రియలో మీడియా ఓటర్లను చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం పరిధిలో నియోజక వర్గాల పెంపు నియోజకవర్గాల పెంపుపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని బ్రహ్మ స్పష్టంచేశారు. పోల వరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ముంపు మండలాలు కొన్ని ఏపీలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కలిసినందున ఖమ్మం జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ శాసనసభలో ప్రాతి ని ధ్యం వహించాలన్న అంశంపై వెంటనే నిర్ణ యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని బ్రహ్మ తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్యం కోరుతున్నా అది సాధ్యం కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఆన్లైన్లో ఓటు వేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. అయితే దేశంలో 40 శాతం మంది నిరక్ష్యరాస్యులు ఉన్నందున అది సాధ్యంకాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలను అమలు చేయ ని పార్టీలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రశ్నించ గా అటువంటి పార్టీలను ఏం చేయాలో ఓటర్లే నిర్ణయిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషనర్ నసీం జైదీ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్సిన్హా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పాల్గొన్నారు. -
పైసలిస్తేనే పింఛన్!
సాక్షి, హన్మకొండ : పింఛన్ల వ్యవహారం పంపిణీదారులకు కాసులు కురిపిస్తోంది. జాబితాలో పేర్లు లేకపోవడం, ఉన్నా అచ్చు తప్పులు రావడం, ఆధార్, ఓటరు కార్డులు, ఇంటి నంబర్లు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు అధికారులు ఆసరా పింఛన్లు నిలిపి వేస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండడం లేదు. జాబితాలో పేరు రావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో కొందరు రాజకీయ నాయకులుకూడా రంగ ప్రవేశం చేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పైసలివ్వు.. పింఛన్ పట్టు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2.70 లక్షల మం ది పింఛన్లు పొందుతున్నారు. ఇటీవల వృద్ధా ప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్ల కో సం పాత, కొత్త వారు కలిపి జిల్లాలో 5.40 లక్ష ల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.20 లక్షల మందిని అర్హులుగా పేర్కొంటూ అధికారులు మొదటి జాబితా విడుదల చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా జరిగిన పొరపాట్లు, ధ్రువీకరణ పత్రాల్లో అచ్చుతప్పులు, సకాలం లో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చకపోవడం వంటి కారణాలతో వేలాది మంది ని అనర్హులుగా ప్రకటించారు. దీనితో సరైన ధ్రు వీకరణపత్రాలు సమర్పిస్తే అర్హుల జాబితాలో పేర్లు చేర్చి ఫించన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దీనితో జాబితాలో పేర్లు లేని వృద్ధు లు, వితంతువులు, వికలాంగుల దగ్గర నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ దరఖాస్తులు మా కివ్వండి త్వరగా కంప్యూటర్లలో పేరు ఎక్కించి పింఛన్ ఇప్పిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మరికొందరు మాకు డబ్బులు ముట్టచెబితే చాలు అర్హత ఉన్నా లేకున్నా పింఛన్ ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇందుకోసం రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు.. రేగొండ మండల పరిధిలో ఏకంగా ఓ సర్పంచి ప్రతీ లబ్ధిదారుని నుంచి రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు జాబితాలో ప్రత్యక్షమవుతుండగా.. క్యూ లైన్లలో నిల్చున్న వారి పేరు కానరావడం లేదు. కాగా, పింఛన్‌కు జాబితాలో పేరులేని వ్యక్తుల ఆందోళనను కొంత మంది ద్వితీయ శ్రేణి నేతలు సొ మ్ము చేసుకుంటున్నారు. పింఛన్ ఇప్పిస్తామం టూ పైరవీలు చేస్తున్నారు. ఆపై నేరుగా అధికారులు తయూరు చేసేకంప్యూటర్ గదుల్లోకి వెళ్లి.. గంటల తరబడి కూర్చుని తమ వారి దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. పంపిణీ సిబ్బంది ఇష్టారీతిగా వ్యవహరిస్తూ పండుటాకుల ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉన్నతాధికారు ల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికారులు దృష్టిసారించి పైరవీకారులపై, పైసలు వసూలు చేస్తున్న సిబ్బంది చర్య తీసుకోవాలి. పింఛన్ త్వరగా ఇప్పించాలని పండుటాకులు కోరుతున్నారు. -
40 వేలకు 3 వేలే మాఫీ!
రూ.50 వేల లోపు రుణమున్నా దశల వారీ మాఫీయే? సాక్షి, విజయవాడ బ్యూరో: ఈ నెల 4వ తేదీన చంద్రబాబు రుణమాఫీపై విధాన ప్రకటన చేశారు. యాభై వేల లోపు రుణమైతే ఒకేసారి మాఫీ అన్నారు. 6వ తేదీన అర్హులైన రైతుల జాబితా వెబ్సైట్లో వెల్లడిస్తామన్నారు. 6 పోయింది. 7వ తేదీ వచ్చినా రైతులకు ఎదురుచూపులు తప్పలేదు. చివరకు ఆదివారం రాత్రి జాబితా పెట్టినట్లు ప్రకటించారు. సోమవారం రైతులంతా బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంతో ఉత్కంఠతో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకునేందుకు ప్రయత్నించిన రైతులకు నిరాశే ఎదురయ్యింది. సంబంధిత వెబ్సైట్ ఓ పట్టాన ఓపెన్ అయితే ఒట్టు. ఎట్టకేలకు ఓపెన్ అయినా ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలన్నీ నమోదు చేయమనడంతో అన్నదాతలు బిత్తరపోయారు. సోమవారం కూడా వెబ్సైట్ సరిగ్గా ఓపెన్ కాని పరిస్థితి. ఓపెన్ అయినచోట వివరాలన్నీ ఎంటర్ చేసిన రైతులకు మతిపోయినంత పనైంది. అర్హులైన అనేకమంది రైతుల పేర్లు లేనేలేవు. 50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకూ చుక్కెదురే. కొన్ని చోట్లయితే 40 వేల రుణం ఉన్న రైతుకు 3 వేలే మాఫీ అయినట్టుంది. 30 వేల రుణం ఉన్న రైతుకు 4 వేలే మాఫీ అయినట్టుంది. పైగా సమగ్ర వివరాలు లేకపోవడంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రెండు రోజులుగా వీరు పరీక్షా ఫలితాలు చూసుకునే విద్యార్థుల్లా మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వివరాలు లభించడం లేదు. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 2013 డిసెంబర్ నాటికి 8,70,321 మంది రైతులు రుణాలు తీసుకోగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇందులో 4.73 లక్షల మంది మాత్రమే రుణమాఫీకి అర్హత పొందారు. ప్రభుత్వం ప్రకటించిన తొలి దశ మాఫీకి (రూ.50 వేల లోపు రుణమున్నవారు) 1.98 లక్షల మంది అర్హత పొందారు. వీరికి రూ.473 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. ఈ మేరకు రూ.40 వేల రుణమున్న రైతుకు ఒక్కసారే మాఫీ కింద రూ.40 వేల మాఫీ జరగాల్సి ఉండగా, ఆన్లైన్లో మాత్రం ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకూ మాఫీ జరిగినట్లుగా అప్లోడ్ చేశారు. దీన్ని చూసి రైతులు తాము తీసుకున్న రుణం ఎంతని నమోదైందో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 4.75 లక్షల మంది రుణాలు తీసుకున్న వారుండగా, ఇందులో తొలి విడత మాఫీకి 1.20 లక్షల మంది అర్హులని అంచనా. అయితే బ్యాంకుల వారీగా ఎంతమంది, బ్రాంచీల వారీగా ఎందరు, మొత్తం ఎంత మాఫీ కావాలన్న వివరాలు అందలేదు. ఏ జిల్లాకు కూడా ఇప్పటి వరకూ ఎంతమంది రైతులు రుణ అర్హత పొందారు, ఎంత మాఫీ అవుతుందన్న సమగ్ర వివరాలు అందలేదు. రైతులు, మీడియాకు సమాధానం చెప్పలేక వివిధ జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, హైదరాబాద్‌లోని ఎస్ఎల్బీసీకి ఫోన్లు చేస్తే అక్కడినుంచి సమాధానం రావడం లేదు. ప్రభుత్వం బ్యాంకుల వారీగా నోటీసు బోర్డులపై పూర్తి వివరాలతో కూడిన జాబితాలను పెట్టే వరకూ వేచి ఉండాల్సిందేనని ఆయా జిల్లాల్లో బ్యాంకర్లు బదులిస్తున్నారు. మరోవైపు రైతుల రుణం పూర్తిగా మాఫీ అయ్యే వరకూ రైతులు స్వయంగా ఆయా రుణాలను క్లియర్ చేయకూడదన్న నిబంధనలు కూడా మింగుడు పడటం లేదు. ఇదిలా ఉండగా, రబీ సీజను ఊపందుకున్న జిల్లాల్లో అన్నదాతలకు మళ్లీ పెట్టుబడుల భారం మొదలైంది. మాఫీ అవుతున్న మొత్తమెంతో తెలిస్తే, దాన్నిబట్టి కొత్త అప్పులు తీసుకునే వీలుంటుందన్న ఆలోచనలో రైతులున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ‘తాంబూలాలిచ్చాం..తన్నుకు చావండి’ అన్న చందాన ఆన్లైన్లో మొక్కుబడిగా కొంత సమాచారం అప్లోడ్ చేసి చేతులు దులుపుకొంది. -
‘ఓటర్ కార్డులివ్వకుంటే మీసేవ లెసైన్స్‌లు సస్పెండ్’
సాక్షి, హైదరాబాద్: హోలోగ్రాములు లేవంటూ ఓటర్ కార్డులు ఇవ్వని ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల లెసైన్స్‌లను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. కోటిన్నర హోలోగ్రాములు నిల్వ ఉన్నాయని, వాటిని తెప్పించుకుని ఓటర్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కేంద్రాలపైనే ఉందని ఆయన తెలిపారు. ఓటరు కార్డులు నిరాకరించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. -
‘మీ సేవ’లు అయోమయం
సాక్షి, కాకినాడ : ఫలానా సేవకు ఇన్ని రోజుల్లో అందనున్న ప్రతి ఫలం, ఫలానా సేవకు ఇంత ధర నిర్ణయించడం వెరసి మీ సేవలు బహు చక్కగా పని చేస్తున్నాయని భావిస్తున్న అధికారులకు లోపాలు బయటపడ్డాయి. దీంతో శని వారం ఆ విభాగంపై జరిగిన సమీక్షలో స్వయం కృతాపరాధాన్ని తప్పుపడుతూ ఇక ముందు ఇలా జరగకూడదని దిశా నిర్దేశం చేయాల్సి వచ్చింది. పట్టణాల్లో, గ్రామాల్లో రెవెన్యూ కార్యాలయాల వైపు కన్నెత్తి చూడనవసరం లేకుండాఆ విభాగం నుంచి పొందే ఓటరు కార్డులు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుల దరఖాస్తులు తదితర వాటి కోసం మీ సేవకు వెళ్లి పొందే విధంగా ఆన్లైన్ చేశారు. ఇలా ఇవ్వగానే అలా అయిపోతున్నాయనుకుంటున్న ఆ సేవలు కాస్తా మీసేవా కేంద్రాల్లో కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లోనే పడకేస్తున్నాయని తేలాయి. రెవెన్యూకి పట్టిన బూజుదులపాల్సిందేనన్న నిర్ణయానికి జాయింటు కలెక్టర్ వచ్చేశారు. హోలోగ్రామ్‌కు కొరత ముఖ్యంగా పొందిన కొన్ని సేవలకు గుర్తింపుగా అధీకృతం కావాలంటే హోలోగ్రామ్ స్టిక్కర్ అంటించి ఉంటేనే దానికి ప్రామాణికత వస్తుం ది. ఇవి కలెక్టరేట్లో హెచ్- సెక్షన్లో అవసరం మేరకు ముద్రించి రెవెన్యూ కార్యాలయాలకు పంపిణీ చేస్తారు. ఇందుకు మీ సేవ చూసే విభాగం ఇండెంటు ఇవ్వాలి. ఇవేమీ లేకుండానే పనులు నడిచిపోవడం మామూలై హోలో గ్రామ్ పంపిణీ అడుగంటింది. ఉదాహరణకు ఒక మీ సేవా కేంద్రానికి వెయ్యి స్టిక్కర్లు కావాలంటే తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాలి. తీరా వెళితే రెండొందలు తీసుకో అంటూ కుదించి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల మీ సేవ వినియోగదారుల్లో నూటికి ఇరవై మందికే సేవలందుతున్నాయి. మిగిలిన వారు మీ సేవ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీని వెనుక పెద్ద కథే న డుస్తున్నట్టు ఉన్నతాధికారుల్లో అనుమాన బీజం నాటుకుంది. మీ సేవలో ఎంతకీ రాని ధ్రువీకరణ పత్రం తహశీల్దార్ కార్యాలయానికి వెళితే చిటికెలో అయిపోతుండటంతో ఆపరేటర్లు బిత్తరపోతున్నారు. ఒక్కొక్క సారి దళారీలు బయలుదేరి కట్టలుగా దరఖాస్తులు తీసుకెళ్లి పనులు పూర్తి చేసుకోవడం షరా మామూలవుతోంది. 19 వేల దరఖాస్తుల పెండింగ్ వినియోగదారుడికి ధ్రువీకరణ పత్రం జారీ అయిందో లేదో తెలిసే సాఫ్ట్వేర్ మీ సేవల్లో లేదు. అది ఒక్క రెవెన్యూ కార్యాలయాల్లోనే తెలుసుకునే వెసులు బాటుంది. ఫలితంగా మీ సేవల్లో పనులు కావడం లేదని వినియోగదారులు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవి భరించలేక మీసేవ నిర్వాహకులు కార్యాలయాలకు వెళ్లి అడుగుతుంటే అసలు ఎన్ని దరఖాస్తులొచ్చాయో రిజిస్టర్లో రాసి వెళ్లమని, చూస్తామని చె ప్పడం అధికారుల వంతవుతోంది. -
ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మీ సేవ ద్వారా నాలుగైదు రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చుననే ఎన్నికల అధికారుల ప్రకటనలకు, అమలు జరుగుతున్న తీరుకు పొంతన లేకపోతుందని ఓటర్లు అన్నారు. ఓటరు కార్డు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగైదు రోజుల్లో జారీ అవుతుందని అధికారులు ప్రచారం చేశారు. దీంతో రూ.10లు చెల్లించి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా 40 రోజులైనా కార్డు జారీ కాలేదని ఓటర్లు చెబుతున్నారు. ప్రధానంగా సవరణలకు సంబంధించి ఓట ర్లు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ నిర్వాహకులు హోల్గ్రామ్లకు సంబంధించిన యూసీ లు సకాలంలో అందజేయడం లేదని అధికారులు చెబుతున్నారు. హోలోగ్రామ్ లేకపోవడం వల్లే కార్డులు జారీ కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కారణా లు ఏవైనా ఓటరు గుర్తింపు కార్డులు మాత్రం జారీ కావ డం లేదని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నా పేరు మజ్జి సత్యనారాయణ. గుర్ల మండలం రాగోలు గ్రామం. ఓటరు గుర్తింపు కార్డు కోసం నవంబర్ 15వ తేదీన కోట జంక్షన్ వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. పది రోజుల తర్వాత రావాలని నిర్వాహకుడు చెప్పారు. హోలోగ్రామ్ లేనందున మరికొన్ని రోజులు పడుతుందని అన్నారు. 35 రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు చేసి ఎక్కువ రోజులయ్యాయని, మళ్లీ చేసుకోవాల్సి ఉంటుం దని నిర్వాహకుడు చెప్పారు. దీంతో నేను నిరాశ చెందాను. నా పేరు గౌసీబేగం. మా ప్రాంతం కంటోన్మెంట్. గణేష్ కోవెల వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత అడిగితే ఆర్డీఓ సంతకం లేక కార్డు జారీ కాలేదని నిర్వాహకులు చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మీ సేవ నిర్వాహకులతో సమావేశమవుతాం... ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యమవుతున్నట్లు ఇటీవల మా దృష్టికి వచ్చింది. నిర్వాహకులకు ఉన్న సమస్యలు కూడా మాకు తెలియడం లేదు. దీనిపై సోమవారం మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తాం. సమస్యలు పరిష్కరించి కార్డులు జారీకి చర్యలు తీసుకుంటాం. - చిన్నారావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, కలెక్టరేట్ -
చోటిస్తారా..చెరిపేస్తారా?
ఓటర్ల నమోదుపై అధికారుల గంభీర ప్రకటనలు. కొత్తవారు పేర్లను నమోదు చేయించుకొని జాతీయ ప్రక్రియకు సహకరించాలని విజ్ఞప్తులు. వాస్తవం అందుకు భిన్నం. ప్రతీ మారు దరఖాస్తులు ప్రయాసలకోర్చి ఇస్తున్నా..ఓటర్ల కార్డు దశకు వచ్చేవి ఎన్నో తెలీని పరిస్థితి. గతానుభవాల దృష్ట్యా ఇదీ ఓటర్లకు దరఖాస్తు చేసుకున్నవారి సందేహం. ఈ సారైనా తమకు కార్డు వస్తుందా అనేది వారు వేస్తున్న వేయిడాలర్ల ప్రశ్న. అధికారుల పటిష్ట చర్యలే ఇందుకు సమాధానం చెప్పాలని వారి ఆశ. కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే విషయమై అయోమయం నెలకొంది. ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ అధికారులు వివిధ కారణాలు చూపి రద్దుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సారైనా ఓటరు జాబితాలో చోటిస్తారా.. లేక మళ్లీ పేరును చెరిపేస్తారా? అని కొత్త ఓటర్లలో సంశయం నెల కొంది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సం ఘం ఓటరు నమోదుపై ప్రత్యేకదృష్టి సారించింది. అందులో భాగంగానే జిల్లా అధికారులు ప్రత్యేక ఓటర్డ్రైవ్ చేపట్టారు. నవంబర్ నుం చి డిసెంబర్ 23 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తం గా 1,38, 234 మంది కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు వాటిలో కేవలం 18,524 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించి నమోదుచేశారు. మిగిలిన వాటిని ఎప్పటివరకు పూర్తిచేస్తారో తెలియని అంతుచిక్కని ప్రశ్నగా మారిం ది. ఇదిలాఉండగా, వచ్చిన దరఖాస్తులన్నింటికీ అవకాశం కల్పించ డం కంటే అరకొరగా అవకాశం కల్పించి అందుకు రెట్టింపువాటిని తిరస్కరించడం అధికారులకు అలవాటుగా మారింది. గతేడాది నవంబర్‌లో ఓటరు జాబితాను విడుదల చేసే నాటికి 73వేల మంది కొత్తవారికి అవకాశం కల్పించి 93వేల దరఖాస్తులను పైగా తిరస్కరించారు. ఇప్పుడు కూడా ఏం చేస్తారోనని దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. గడువు వారం రోజులు లక్షకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇక వారంరోజులు మాత్రమే గడువు ఉంది. వీటన్నిం టిని ఈనెల 13 లోగా పరిష్కరించి ఎన్నికల కమిషన్‌కు ఆప్‌లోడ్ చేయాల్సి ఉంది. కానీ దరఖాస్తులను పరిష్కరించడమే పూర్తిచేయని అధికారులు ఆప్‌లోడ్ చేయడం సాధ్యమయ్యేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈసారైనా జిల్లా ఓటర్ల సంఖ్యను పెంచుతారా? లేక ఉన్నవారిని తొలగిస్తారో వారం రోజులు వేచిచూడాల్సిందే. గడువులోగా పరిష్కరిస్తాం... ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టరేట్ ‘సి’ సెక్షన్ తహశీల్దార్ చందర్ తెలిపారు. ఇందుకోసం కలెక్టర్ ఆదేశాలతో ఎక్కువమంది సిబ్బందితో పాటు కంప్యూటర్లను ఏర్పాటుచేసి ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. విచారణతో పాటు అప్లోడ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నామని తెలిపారు.