ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యం
Published Mon, Jan 13 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మీ సేవ ద్వారా నాలుగైదు రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చుననే ఎన్నికల అధికారుల ప్రకటనలకు, అమలు జరుగుతున్న తీరుకు పొంతన లేకపోతుందని ఓటర్లు అన్నారు. ఓటరు కార్డు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగైదు రోజుల్లో జారీ అవుతుందని అధికారులు ప్రచారం చేశారు. దీంతో రూ.10లు చెల్లించి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా 40 రోజులైనా కార్డు జారీ కాలేదని ఓటర్లు చెబుతున్నారు. ప్రధానంగా సవరణలకు సంబంధించి ఓట ర్లు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ నిర్వాహకులు హోల్‌గ్రామ్‌లకు సంబంధించిన యూసీ లు సకాలంలో అందజేయడం లేదని అధికారులు చెబుతున్నారు. హోలోగ్రామ్ లేకపోవడం వల్లే కార్డులు జారీ కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కారణా లు ఏవైనా ఓటరు గుర్తింపు కార్డులు మాత్రం జారీ కావ డం లేదని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
నా పేరు మజ్జి సత్యనారాయణ. గుర్ల మండలం రాగోలు గ్రామం. ఓటరు గుర్తింపు కార్డు కోసం నవంబర్ 15వ తేదీన కోట జంక్షన్ వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. పది రోజుల తర్వాత రావాలని నిర్వాహకుడు చెప్పారు. హోలోగ్రామ్ లేనందున మరికొన్ని రోజులు పడుతుందని అన్నారు. 35 రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు చేసి ఎక్కువ రోజులయ్యాయని, మళ్లీ చేసుకోవాల్సి ఉంటుం దని నిర్వాహకుడు చెప్పారు. దీంతో నేను నిరాశ చెందాను.
నా పేరు గౌసీబేగం. మా ప్రాంతం కంటోన్మెంట్. గణేష్ కోవెల వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత అడిగితే ఆర్డీఓ సంతకం లేక కార్డు జారీ కాలేదని నిర్వాహకులు చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది.
మీ సేవ నిర్వాహకులతో
సమావేశమవుతాం...
ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యమవుతున్నట్లు ఇటీవల మా దృష్టికి వచ్చింది. నిర్వాహకులకు ఉన్న సమస్యలు కూడా మాకు తెలియడం లేదు. దీనిపై సోమవారం మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తాం. సమస్యలు పరిష్కరించి కార్డులు జారీకి చర్యలు తీసుకుంటాం.
- చిన్నారావు,
ఎన్నికల విభాగం సూపరింటెండెంట్,
కలెక్టరేట్
Advertisement