Identification cards
-
పత్తి రైతులకు గుర్తింపు కార్డులు
జోగిపేట: జిల్లాలో పత్తి అమ్మకాలపై రైతులకు అవగాహన కలిగించేందుకు చర్య లు తీసుకుంటున్నట్టు జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. మంగళవారం జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల్లో పత్తి అమ్మకాలపై అవగాహన పెంచేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పత్తి రైతులకు 1.50 లక్షల గుర్తింపు కార్డులను పంపిణీ చేసే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. జిల్లాలో 7 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఇదివరకే మంత్రి హరీష్‌రావు వీటిని ప్రారంభించారన్నారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.4100 ప్రభుత్వం చెల్లిస్తుందని, తేమ ఎక్కువ ఉంటే ఒక్కొక్క శాతానికి రూ.41 చొప్పున తగ్గిస్తామన్నారు. వట్పల్లిలో 19న, జోగిపేట, తొగుటలలో 23న పత్తి కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తామని ఆయన తెలి పారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ కమి టీ ఏర్పాటు కానుందన్నారు. మార్కెట్ కార్యదర్శి రామకృష్ణ, సీసీఐ జిల్లా ఇన్చార్జి వశిష్ట్ ఆయన వెంట ఉన్నారు. -
చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు
హిరమండలం : జిల్లాలోని చేనేత కార్మికులందరికీ గుర్తింపుకార్డులు అందిస్తామని జిల్లా జౌలు చేనేత సంస్థ ఏడీ జి.రాజారావు తెలిపారు. శనివారం సుభలయి శ్రీ ఏకాంబరే శ్వర చేనేత సంఘం కార్యాలయ ఆవరణలో చేనేత కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 1003 మంది చేనేత కార్మికుల పిల్లలకు(విద్యార్థులకు)ఉపకార వేతనాలు మంజూరయ్యాయన్నారు. ఏకాంబరేశ్వర సంఘం పరిధిలోని విద్యార్థులకు ఇప్పటికే స్కాలర్షిప్లు అందించామన్నారు. అలాగే జిల్లాలో 4380 మంది కార్మికులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తున్నామని, ఇంకా అర్హులైన వారు పూర్తి సమాచారంతో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. హుద్‌హుద్ తుపానుకు నష్టపోయిన 2 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల చొప్పున బియ్యం అందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని చేనేత సంఘం మండల అధ్యక్షుడు గణేష్ కోరారు. శాతవాహన స్పిల్లింగ్ మిల్లు మేనేజర్ కృష్ణారావు, సర్పంచ్ ఎ.సూర్యకుమారి, పీఏసీఎస్ డెరైక్టర్ రామకృష్ణ, మేనేజర్ శంకరరావు పాల్గొన్నారు. -
గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి
డ్రైవింగ్ లెసైన్స్.. ఓటరు గుర్తుంపు కార్డు.. రేషన్ కార్డు.. ఏటీఎం.. ఆధార్ కార్డు.. ఇవన్నీ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేవి. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా కార్డుపోతే ఏం చేయాలో అర్థంగాక ఆందోళన పడుతుంటాం. అయితే వాటిని మళ్లీ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.. - చిత్తూరు టౌన్ పాన్‌కార్డు ఆదాయపు పన్నుకు అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్)కార్డు పోగొట్టుకుంటే.. సంబంధిత ఏజెన్సీల్లో పాత పాన్‌కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. కొత్తకార్డు కోసం అదనంగా మరో 96 రూపాయలు చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీచేస్తారు. www.nsdl.pan వెబ్సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. పాస్‌పోర్టు పాస్‌పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్ట్రేస్డ్ పత్రంతో పాస్‌పోర్టు కార్యాలయం, హైదరాబాద్ పేరిట వెయ్యి రూపాయల డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తర్వాత డూప్లికేట్ పాస్‌పోర్టును జారీ చేస్తారు. తత్కాల్ పాస్‌పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov. in ను సంప్రదించవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్‌తో *10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www. ceoandhra.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆధార్‌కార్డు ఆధార్‌కార్డు పోగొట్టుకుంటే టోల్‌ఫ్రీ నెంబర్ 18001801947లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai. gov.in వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందవచ్చు. డ్రైవింగ్ లెసైన్స్ వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో డ్రైవింగ్ లెసైన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జతచేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. అలాగే 10 రూపాయల బాండ్పేపరుపై కార్డుపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలి. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. aptransport.org వెబ్సైట్ నుంచి ఎల్ఎల్డీ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందవచ్చు. ఏటీఎం కార్డు ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా.. ఎవరైనా దొంగలించినా.. ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తర్వాత ఫిర్యాదు నెంబర్ ఆధారంగా బ్యాంకులో కొత్త కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. రేషన్‌కార్డు గుర్తింపుతో పాటు రేషన్‌షాపుల్లో సరుకులు తీసుకోవడానికి రేషన్‌కార్డు అవసరం. ఇదిపోతే www.icts2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. అక్కడ ఉన్న username guest, password guest123 సాయంతో విచారణ(క్వేరీ) ఉపయోగించి మన రేషన్‌కార్డు నంబర్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే మండల తహశీల్దార్ దానిని పరిశీలించి నామ మాత్రపు రుసుంతో అదే నంబరుపై కార్డు జారీ చేస్తారు. -
కౌలు కష్టాలు
రుణఅర్హత కార్డుల ఊసెత్తని రెవెన్యూ అధికారులు అమలుకు నోచని కౌలుదారుల చట్టం రుణాల మంజూరుకు బ్యాంకర్ల నిరాసక్తత అప్పులతో నష్టపోతున్న కౌలురైతులు కౌలు రైతులను కష్టాలు వీడడం లేదు. వ్యయప్రయాసలకోర్చి సాగు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందడం లేదు. కౌలురైతులకోసం రూపొందించిన చట్టం అమలును అధికార యంత్రాంగం విస్మరించింది. ఫలితంగా రుణాలు, రాయితీలు పొందలేక వారు అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ అగ్రికల్చర్ : కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏపీ ల్యాండ్ లెసైన్స్డ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్-2011 చట్టాన్ని తీసుకువచ్చింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి, వారికి రుణాలు, సబ్సిడీలు అందించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. జిల్లాలో సుమారు 50 వేల మంది కౌలు రైతులున్నారు. ఇతర రైతుల వద్ద నుంచి భూమి కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నారు. 2011-12లో పథకం ప్రారంభించినప్పుడు 29వేలకుపైగా కౌలు రైతులనుంచి దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 15,857 మందికి కార్డులు జారీ చేయగా కేవలం 3519 మందికే రూ.85 కోట్ల మేర రుణాలు ఇచ్చారు. 2012-13లో 13,554 మం ది కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందు లో 3,884 మంది పాతకార్డుదారులు రెన్యూవల్ చేసుకున్నారు. మొత్తంగా 10,004 మందికి కార్డులు ఇచ్చారు. రెన్యూవల్ చేసుకున్నవారితో పాటు కొత్తదార్డుదారులకు కలిపి 3,680 మందికి రూ.85 కోట్లు రుణాలిచ్చారు. 2013-14లో 11,327 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2,240 మంది రెన్యూవల్ చేసుకోగా 8,086 మంది కొత్తగా రుణ అర్హతకార్డులు ఇచ్చారు. మొత్తం 10,326 మందికి రుణ అర్హతకార్డులు ఇచ్చారు. వీరిలోం చి 2,088 మందికే రూ.71.8 కోట్లు రుణం మంజూరు చేశారు. ఏడాదికేడాదికి ఈ సంఖ్య తగ్గిపోతోంది. సమన్వయలోపం కౌలురైతుల గుర్తింపు, రుణ అర్హత కార్డుల జారీ, రుణాలు మంజూరు చేయించే బాధ్యతను రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో చేపట్టాల్సి ఉన్నా రెండుశాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రుణాల మంజూరులో బ్యాంకర్లు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. గ్రామసభల ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించి, రుణ అర్హత కార్డులను మంజూరు చేయాలి. ఈ కార్డుకు ఒక ఆర్థిక సంవత్సరం పరిమితి ఉంటుంది. ఏప్రిల్‌లో దరఖాస్తులు స్వీకరించి జూలై నెల వరకు కార్డుల పంపిణీ పూర్తి కావాలి. గుర్తించిన కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి. మొత్తం ప్రక్రియలో వ్యవసాయశాఖ కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో కౌలు రైతులు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చుకుంటూ అధికవడ్డీలు కడుతూ నష్టపోతున్నారు. అన్నీ సందేహాలే.. ఈ చట్టంపై మొదటినుంచి సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో కౌలురైతులతోపాటు భూ యజమానుల్లోనూ అయోమయం నెలకొంది. సాధారణంగా జూన్ నెలలో కౌలు ఒప్పందం జరుగుతుంది. దానికనుగుణంగా భూయజమానులు అంగీకరిస్తే కౌలు రైతులు రుణ అర్హత కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కౌలు రైతును గుర్తిస్తే తమకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని భూయజమానులు ఆందోళన చెందుతున్నారు. భూమిని వరుసగా 12 ఏళ్లపాటు ఎవరైనా సాగు చేస్తే వారి సొంతమవుతుందనే అనుమానం భూయజమానులను పీడిస్తోంది. రుణ అర్హత కార్డు వచ్చాక భూయజమాని కాన్సెంట్ ఇస్తేనే బ్యాంకు వారు రుణం మంజూరు చేస్తారు. దీంతో కౌలు రైతులు రుణం కట్టకపోతే అది ఎక్కడ తమకు చుట్టుకుంటుందోననే భయం కూడా యజమానులకు ఉంది. దీనిపైనా స్పష్టత లేదు. రాయితీలు, రుణమాఫీలు వస్తే కౌలుదారులకు వెళ్తాయా? లేక యజమానులకు వెళ్తాయా? అనే విషయంలోనూ రైతుల్లో అనుమానాలున్నాయి. దీంతో కౌలుకు ఇచ్చినట్లు వీరు ఎలాంటి ఒప్పందం చేయకపోవడంతో చాలా మంది కౌలు రైతులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గతంలో ఇచ్చిన రుణ అర్హత కార్డులపై బ్యాంకు రుణాలు అందకపోవడం కూడా ఓ కారణమవుతోంది. రుణఅర్హతకార్డులున్న రైతులకు మూడేళ్లుగా వరుసగా 22 శాతం, 36 శాతం, 20 శాతం మందికే రుణాలు మంజూరయ్యాయి. సందేహాలను నివృత్తి చేసి రుణాలు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కౌలురైతుల గుర్తింపు ప్రక్రియ మొదలు కాలేదు. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో కౌలురైతులు తమ కష్టాలు తీరుతాయని ఆశపడుతున్నారు. కౌలు రైతులను గుర్తించేందుకు వెంటనే షెడ్యూల్ ప్రకటించి, యజమానుల అంగీకారం లేకుండా అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు. -
పీవీసీ ఓటరు గుర్తింపు కార్డులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇకపై ఓటర్లందరికీ పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ) ఓటరు గు ర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. జనవరి 31న ఓటర్ల తు ది జాబితా ప్రకటిం చిన అనంతరం దా ని ఆధారంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు ఈ కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణరుుంచారు. ఫిబ్రవరి ఆఖరు నుంచి పీవీసీ కార్డుల జారీ ప్రక్రియ జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం పాన్‌కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లెసెన్స్‌లు పీవీసీతో తయారు చేసినవే వస్తున్నాయి. ఓటరు గుర్తింపుకార్డు మాత్రం కాగితంపై ప్రింట్‌తీసి లామినేషన్ చేయించేవారు. ఇది కొద్దిరోజులకే పాడవుతున్నందున పీవీసీ కార్డులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తొలిసారి ఓటర్లందరికీ పీవీసీ కార్డును ఉచితంగా ఇస్తారు. తరువాత కార్డులు రెండవసారి పొందాలంటే ఎంత ధర అన్న విషయం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కార్డుపై సూచనలు.. ప్రస్తుతం జారీ చేయనున్న పీవీసీ కార్డుల వెనుక వైపు ఎన్నికల సంఘం రెండు సూచలను చేస్తోంది. దీంట్లో ఒకటి ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన జాబితాలో మీపేరున్నట్లు కాదు. ఎన్నికల ముందు జాబితాలో పేరు ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని, కార్డుపై ఉన్న జన్మదిన తేదీ, వయస్సును ఇతర అవసరాల కోసం రుజువుగా చూపెట్టడానికి ప్రమాణికంగా పరిగణించడం కుదరదని స్పష్టంచేశారు. ఈ నిబంధనల వల్ల చిరునామా గుర్తింపునకు, వ్యక్తి గుర్తింపునకు.. ఓటరు గుర్తింపుకార్డును ప్రమాణికంగా తీసుకున్నవారు ఇకపై తిరస్కరించే అవకాశాలు ఉంటాయని ఓటర్లు అంటున్నారు. -
ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యం
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మీ సేవ ద్వారా నాలుగైదు రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందవచ్చుననే ఎన్నికల అధికారుల ప్రకటనలకు, అమలు జరుగుతున్న తీరుకు పొంతన లేకపోతుందని ఓటర్లు అన్నారు. ఓటరు కార్డు కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న నాలుగైదు రోజుల్లో జారీ అవుతుందని అధికారులు ప్రచారం చేశారు. దీంతో రూ.10లు చెల్లించి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా 40 రోజులైనా కార్డు జారీ కాలేదని ఓటర్లు చెబుతున్నారు. ప్రధానంగా సవరణలకు సంబంధించి ఓట ర్లు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ నిర్వాహకులు హోల్గ్రామ్లకు సంబంధించిన యూసీ లు సకాలంలో అందజేయడం లేదని అధికారులు చెబుతున్నారు. హోలోగ్రామ్ లేకపోవడం వల్లే కార్డులు జారీ కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కారణా లు ఏవైనా ఓటరు గుర్తింపు కార్డులు మాత్రం జారీ కావ డం లేదని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. నా పేరు మజ్జి సత్యనారాయణ. గుర్ల మండలం రాగోలు గ్రామం. ఓటరు గుర్తింపు కార్డు కోసం నవంబర్ 15వ తేదీన కోట జంక్షన్ వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాను. పది రోజుల తర్వాత రావాలని నిర్వాహకుడు చెప్పారు. హోలోగ్రామ్ లేనందున మరికొన్ని రోజులు పడుతుందని అన్నారు. 35 రోజుల తర్వాత వెళ్తే దరఖాస్తు చేసి ఎక్కువ రోజులయ్యాయని, మళ్లీ చేసుకోవాల్సి ఉంటుం దని నిర్వాహకుడు చెప్పారు. దీంతో నేను నిరాశ చెందాను. నా పేరు గౌసీబేగం. మా ప్రాంతం కంటోన్మెంట్. గణేష్ కోవెల వద్ద ఉన్న మీ సేవ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. రెండు రోజుల తర్వాత అడిగితే ఆర్డీఓ సంతకం లేక కార్డు జారీ కాలేదని నిర్వాహకులు చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోయింది. మీ సేవ నిర్వాహకులతో సమావేశమవుతాం... ఓటరు గుర్తింపు కార్డు జారీలో జాప్యమవుతున్నట్లు ఇటీవల మా దృష్టికి వచ్చింది. నిర్వాహకులకు ఉన్న సమస్యలు కూడా మాకు తెలియడం లేదు. దీనిపై సోమవారం మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తాం. సమస్యలు పరిష్కరించి కార్డులు జారీకి చర్యలు తీసుకుంటాం. - చిన్నారావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్, కలెక్టరేట్ -
కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.రామమోహన్ డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో 5270 మంది భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇంతవరకు వాటికి రిజిస్ట్రేషన్ చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ చేయించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేకుంటే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. కొంతమంది కార్మిక శాఖ అధికారులను గుర్తింపుకార్డుల విషయమై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికార యం త్రాంగం ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మంది భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారందరికీ సంక్షేమ ఫథకాలు వర్తించే విధంగా ఆ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. కార్మికుల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్‌కు, డీసీఎల్‌కు వినతిపత్రమివ్వడం, 9,10 తేదీల్లో ఏసీఎల్‌కు వినతిపత్రం అందజేయడం, 28న డీసీఎల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూనియన్ నాయకులు లక్ష్మినారాయణ, సిద్దిరామయ్య, వెంకటయ్య, ప్రతాప్ నాయుడు, స్వామిదాస్, హఫీజ్, రామమునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
6న తుది జాబితా
చెన్నై, సాక్షి ప్రతినిధి :వచ్చే నెల జనవరి 6వ తేదీన ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసి 25న కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ఎలక్షన్ కమిషన్ డెప్యూటీ కమిషనర్ త్రిపాఠి పేర్కొన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై భారత ఎన్నికల కమిషన్ (సీఈసీ) ఆదేశాల మేరకు శుక్రవారం అత్యున్నతస్థాయి అధికారులు, అఖిలపక్ష సమావేశాన్ని చెన్నై లో నిర్వహించారు. ఎన్నికల నగారా మోగకముందే రాష్ట్రంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం తాత్కాలిక ఓటర్ జాబితాను వెల్లడించారు. ఇంకా అనేక మార్పులు, చేర్పులు అవసరమయ్యాయి. కొత్తగా పేర్లను నమోదు చేసుకునేందుకు ఓటర్లు ముందుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన ఓటర్ల తుదిజాబితా సిద్ధం చే సి 25న కొత్త ఓటర్లకు గుర్తింపుకార్డులు జారీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు కొలిక్కి వస్తున్న సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయ డెప్యూటీ కమిషనర్ త్రిపాఠి ఆధ్వర్యంలో శుక్రవారం చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మనోజ్ పాండియన్ (అన్నాడీఎంకే), టీకేఎస్ ఇళంగోవన్ (డీఎంకే), ఏఎస్ శక్తివేల్ (కాంగ్రెస్), కేడీ రాఘవన్ (బీజేపీ), పార్థసారథి (డీఎండీకే), సేతురామన్ (సీపీఐ), ఎన్.గుణశేఖరన్ (సీపీఎం), రజనీకాంత్ (బీఎస్పీ) హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో సహాయ కమిషనర్ సుధీర్ త్రిపాఠి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కలెక్టర్‌తోనూ వేర్వేరుగా చర్చలు జరిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి నేరుగా సమీక్షలు నిర్వహించారు. ఓటర్ల జాబితా, వాటిలో మార్పులు, చేర్పులు, పోలింగ్ బూత్‌ల సంఖ్య, నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయాల, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీల నేతలు ఇచ్చిన సలహాలు, సూచనలను నమోదు చేసుకున్నారు. -
ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డులు!
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో కొత్త ఓటర్లకు సరికొత్తగా గుర్తింపు కార్డుల్ని పంపిణీ చేయడానికి ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. ఏటీఎం, పాన్ కార్డు తరహాలో ఈ కార్డుల్ని రూపకల్పన చేస్తున్నారు. ఓటర్లకు ప్యాకెట్ క్యాలండర్ సైజులో బ్లాక్ అండ్ వైట్‌తో కూ డిన గుర్తింపు కార్డుల్ని ఎన్నికల యంత్రాం గం ఇది వరకు జారీ చేసిం ది. అయితే, కొత్త సంవత్సరంలో సరికొత్తగా కార్డుల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించారు. కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియను గత నెల పూర్తి చేశారు. మార్పులు చేర్పులతో పాటుగా కొత్త ఓట ర్లుగా సుమారు 28 లక్షల మంది ఇందులో ఉన్నారు. కొత్తగా చేరిన వారికి సరికొ త్త కార్డుల్ని పంపిణీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ నిర్ణయించా రు. కేంద్ర కమిషన్ ఆమోదం లభించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. బ్లాక్ అండ్ వైట్ కాకుండా, రంగులతో పాన్ కార్డు, ఏటీఎం కార్డు సైజులో వీటిని రూపొందిస్తున్నారు. జనవరి 25న ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల జాబితా ప్రకటనతోపాటుగా కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.