ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డులు!
Published Sun, Dec 15 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో కొత్త ఓటర్లకు సరికొత్తగా గుర్తింపు కార్డుల్ని పంపిణీ చేయడానికి ఎన్నికల యంత్రాంగం నిర్ణయించింది. ఏటీఎం, పాన్ కార్డు తరహాలో ఈ కార్డుల్ని రూపకల్పన చేస్తున్నారు. ఓటర్లకు ప్యాకెట్ క్యాలండర్ సైజులో బ్లాక్ అండ్ వైట్‌తో కూ డిన గుర్తింపు కార్డుల్ని ఎన్నికల యంత్రాం గం ఇది వరకు జారీ చేసిం ది. అయితే, కొత్త సంవత్సరంలో సరికొత్తగా కార్డుల్ని పంపిణీ చేయడానికి నిర్ణయించారు. కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియను గత నెల పూర్తి చేశారు. మార్పులు చేర్పులతో పాటుగా కొత్త ఓట ర్లుగా సుమారు 28 లక్షల మంది ఇందులో ఉన్నారు. కొత్తగా చేరిన వారికి సరికొ త్త కార్డుల్ని పంపిణీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్‌కుమార్ నిర్ణయించా రు. కేంద్ర కమిషన్ ఆమోదం లభించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. బ్లాక్ అండ్ వైట్ కాకుండా, రంగులతో పాన్ కార్డు, ఏటీఎం కార్డు సైజులో వీటిని రూపొందిస్తున్నారు. జనవరి 25న ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్ల జాబితా ప్రకటనతోపాటుగా కొత్త కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
Advertisement
Advertisement