పత్తి రైతులకు గుర్తింపు కార్డులు | Lakh cotton farmers To Identification cards | Sakshi
Sakshi News home page

పత్తి రైతులకు గుర్తింపు కార్డులు

Published Tue, Oct 13 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 10:54 AM

Lakh cotton farmers To Identification cards

జోగిపేట: జిల్లాలో పత్తి అమ్మకాలపై రైతులకు అవగాహన కలిగించేందుకు చర్య లు తీసుకుంటున్నట్టు జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. మంగళవారం జోగిపేటలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల్లో పత్తి అమ్మకాలపై అవగాహన పెంచేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని పత్తి రైతులకు 1.50 లక్షల గుర్తింపు కార్డులను పంపిణీ చేసే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు.

జిల్లాలో 7 సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఇదివరకే మంత్రి హరీష్‌రావు వీటిని ప్రారంభించారన్నారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాలుకు రూ.4100 ప్రభుత్వం చెల్లిస్తుందని, తేమ ఎక్కువ ఉంటే ఒక్కొక్క శాతానికి రూ.41 చొప్పున తగ్గిస్తామన్నారు. వట్‌పల్లిలో 19న, జోగిపేట, తొగుటలలో 23న పత్తి కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తామని ఆయన తెలి పారు. నారాయణఖేడ్‌లో మార్కెట్ కమి టీ ఏర్పాటు కానుందన్నారు. మార్కెట్ కార్యదర్శి రామకృష్ణ, సీసీఐ జిల్లా ఇన్‌చార్జి వశిష్ట్ ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement