
‘సాక్షి’ ఆధ్వర్యంలో.. ‘ఆధార్’ అనుసంధానం
సాక్షి, సిటీబ్యూరో: ‘ఆధార్... ప్రస్తుతం అన్నింటికీ ఇదే ఆధారం. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బోగస్‌కు తావు లేకుండా... నిజమైన ఓటర్లే తమ ‘స్థానిక’ సారథులను ఎన్నుకునేందుకు ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సెల్‌ఫోన్ నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఆన్‌లైన్, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ ద్వారా అనుసంధానానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజా సమాచారం మేరకు గ్రేటర్ పరిధిలోని దాదాపు 73.50 లక్షల మంది ఓటర్లలో కేవలం 36 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఎలా అనుసంధానం చేసుకోవాలో అవగాహన లేనందునే చాలామంది ప్రభుత్వ ఏర్పాట్లను వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో ఆధార్ అనుసంధానానికి ‘సాక్షి’ తనవంతుగా ‘హెల్ప్‌డెస్క్’లను ఏర్పాటు చేస్తోంది. నిత్యం ప్రజల పక్షాన నిలిచే ‘సాక్షి’... ప్రజల సౌకర్యార్ధం ఆదివారం నాలుగు కేంద్రాల్లో ఆధార్ హెల్ప్‌డెస్క్‌లను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొంటున్నారు. బంజారాహిల్స్‌లోని హెల్ప్‌డెస్క్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ 11.30 గంటలకు ప్రారంభించనున్నారు.
ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులతో హెల్ప్‌డెస్క్‌ల వద్దకు వచ్చే వారికి ‘సాక్షి’ బృందమే ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తుంది. జిరాక్స్‌లు లేనివారు తమ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల నెంబర్లు తెలపాల్సి ఉంటుంది. తొలుత నాలుగు కేంద్రాల్లో ప్రారంభిస్తోంది. క్రమేపీ మరికొన్ని కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఖైరతాబాద్ నియోజకవర్గం
వేదిక: వేమిరెడ్డి ఎన్‌క్లేవ్ హౌసింగ్ సొసైటీ,
రోడ్ నెం. 12, బంజారాహిల్స్
సమయం: ఉ॥10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
ముఖ్య అతిథి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్.
అతిథి: ఎం.ఎస్.ఎస్. సోమరాజు, డిప్యూటీ కమిషనర్
ముషీరాబాద్ నియోజకవర్గం
వేదిక : ఈసేవా కేంద్రం, రామ్‌నగర్.
సమయం : ఉ॥10 నుంచి మ॥3 గంటల వరకు
ముఖ్యఅతిథులు : ఎమ్మెల్యే డా.లక్ష్మణ్, సర్కిల్ -9 డిప్యూటీ కమిషనర్ కె.సత్యనారాయణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
వేదిక: సూరారం రాంలీలా మైదానం, ఎన్టీఆర్ భవన్ కమ్యూనిటీ హాలు
సమయం: ఉదయం 10 నుంచి సా 4 గంటల వరకు
ముఖ్య అతిథి: అడిషనల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అనూప్‌సింగ్ గౌరవ అతిథులు: ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ వి.మమత
ఎల్‌బీనగర్ నియోజకవర్గం
వేదిక: భరత్‌నగర్ కమ్యూనిటీ హాల్, మన్సూరాబాద్
సమయం:ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
ముఖ్య అతిథులు: రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్
వెంకటేశ్వర్లు, ఎల్‌బీనగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి.