న్యూఢిల్లీ: దేశంలోని అంధులకు బ్రెయిలీ ఓటర్ కార్డుల్ని త్వరలో జారీచేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయకర్తలను నియమించనున్నట్లు వెల్లడించారు. కేవలం ఓటర్‌కార్డుల్నే కాకుండా ఓటర్ స్లిప్పులను కూడా దివ్యాంగులు వాడుకునేలా రూపొందిస్తామన్నారు.
ఎన్నికల్లో ప్రజల్ని భాగస్వామ్యం చేయడంపై బుధవారం నాడిక్కడ జరిగిన జాతీయ స్థాయి సదస్సులో రావత్ మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై దివ్యాంగులకు అవగాహన కల్పిచేందుకు త్వరలోనే ఓ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సహాయక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆడియో, వీడియోలతో పాటు సైగ భాషల రూపంలో వీరికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment