‘సాక్షి’ ఆధ్వర్యంలో.. ‘ఆధార్’ అనుసంధానం | Aadhaar connected with the voter cards | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 26 2015 2:56 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

‘ఆధార్... ప్రస్తుతం అన్నింటికీ ఇదే ఆధారం. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బోగస్‌కు తావు లేకుండా... నిజమైన ఓటర్లే తమ ‘స్థానిక’ సారథులను ఎన్నుకునేందుకు ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సెల్‌ఫోన్ నుంచి ఎస్‌ఎంఎస్‌లు, ఆన్‌లైన్, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ ద్వారా అనుసంధానానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాజా సమాచారం మేరకు గ్రేటర్ పరిధిలోని దాదాపు 73.50 లక్షల మంది ఓటర్లలో కేవలం 36 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం చేసుకున్నారు. ఎలా అనుసంధానం చేసుకోవాలో అవగాహన లేనందునే చాలామంది ప్రభుత్వ ఏర్పాట్లను వినియోగించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆధార్ అనుసంధానానికి ‘సాక్షి’ తనవంతుగా ‘హెల్ప్‌డెస్క్’లను ఏర్పాటు చేస్తోంది. నిత్యం ప్రజల పక్షాన నిలిచే ‘సాక్షి’... ప్రజల సౌకర్యార్ధం ఆదివారం నాలుగు కేంద్రాల్లో ఆధార్ హెల్ప్‌డెస్క్‌లను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎన్నికల సంఘం అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొంటున్నారు. బంజారాహిల్స్‌లోని హెల్ప్‌డెస్క్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ 11.30 గంటలకు ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement