ఇప్పటివరకు 'ఆధార్' (Aadhaar) కార్డు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకింగ్ రంగం వంటి వాటిలో తప్పనిసరిగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం కూడా ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. కేంద్ర హోమ్ మినిష్టర్ శాఖ (MHA) రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ కార్యాలయాన్ని జనన, మరణాల రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ ప్రామాణీకరణ చేయడానికి అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఇలాంటి రిజిస్ట్రేషన్స్ కోసం ఆధార్ అవసరం లేదు, కానీ కొత్త ఆదేశాలమేరకు ఇకపై వీటికి కూడా ఆధార్ తప్పనిసరి.
ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు!
1969 చట్టాన్ని సవరించి ఇప్పుడు జనన మరణాల నమోదు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నిర్దారణని అందించాలి. అంతే కాకుండా ఈ డేటాను ప్రతి సంవత్సరం రాష్ట్రాలన్నీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించాల్సి ఉంటుంది. సుమారు 54 సంవత్సరాల తరువాత 1969 చట్టం మొదటిసారి సవరించినట్లు తెలుస్తోంది.
ఆధార్ ఇవ్వడం ద్వారా జనాభా రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్స్ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం సవరణకు లోనైన జనన మరణాల చట్టం 2023లో లేదా ఆ తర్వాత పుట్టిన బిడ్డకు చాలా ప్రయోజనం చేకూర్చుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment