న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకణ లావాదేవీలు (గుర్తింపు ధ్రువీకరణ) మే నెలలో 10.6 మిలియన్లు (1.06 కోట్లు) నమోదయ్యాయి. ఈ లావాదేవీలు వరుసగా రెండో నెలలో కోటికి పైగా నమోదయ్యాయి. ‘‘ముఖ ధ్రువీకరణ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నెలవారీ లావాదేవీలు ఈ ఏడాది జనవరి నెలతో పోల్చి చూసినప్పుడు మే నెలలో 38 శాతం అధికంగా నమోదయ్యాయి. దీని వినియోగం పెరుగుతుందన్న దానికి సంకేతం’’అని యూఐడీఏఐ ప్రకటించింది.
2021లో ఈ సేవను ప్రారంభించిన తర్వాత ఒక నెలలో అత్యధికంగా లావాదేవీల నమోదైంది ఈ ఏడాది మే నెలలోనేనని తెలిపింది. ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సేవలకు డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఏఐ/మెíÙన్ లరి్నంగ్ ఆధారిత ముఖ ధ్రువీకరణ సొల్యూషన్‌ను ప్రస్తుతం 47 సంస్థలు వినియోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంక్‌లు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నాయి.
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, పీఎం కిసాన్ పథకంలో లబి్ధదారుల నమోదుకు, పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్‌లు పొందేందుకు ఆధార్ ఆధారిత ముఖ ధ్రువీకరణను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ప్రారంభానికీ దీన్ని తీసుకుంటున్నారు. వినియోగానికి సులభంగా ఉండడం, వేగంగా గుర్తింపు ధ్రువీకరణ, ఫింగర్ ప్రింట్, ఓటీపీలతో సౌకర్యవంతంగా ఉంటున్నట్టు యూఐడీఏఐ వివరించింది. మే నెలలో ఆధార్‌కు సంబంధించి 1.48 కోట్ల అప్‌డేట్ అభ్యర్థనలను కూడా పూర్తి చేసినట్టు తెలిపింది. ఇక బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో ఆధార్ ఈ కేవైసీకి డిమాండ్ పెరుగుతోంది. మే నెలలో 25.4 కోట్ల ఈకేవైసీ లావాదేవీలు నమోదైనట్టు యూఐడీఏఐ
ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment