సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకొనే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. శనివారంతో గతంలో ఇచి్చన గడువు ముగియడంతో ఉడాయ్ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఈ వివరాలను వెల్లడించింది.
పదేళ్ల కిందటి ఆధార్ కార్డులకు సంబంధించిన మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్‌డేట్‌లను ఉచితంగా చేసుకొనేందుకు గడువును మరో మూడునెలల పాటు.. డిసెంబర్ 14 వరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పొడగించింది.
ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ద్వారా మై ఆధార్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి మార్పులను ఉచితంగా చేసుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. ఇప్పటి వరకు వివరాలను అప్‌డేట్ చేసుకోలేకపోయిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉడాయ్ సూచించింది. ఒకవేళ డిసెంబర్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోలేని వారు... తర్వాత 50 రూపాయలు చెల్లించి ఆధార్ కేంద్రాల్లో వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment