ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే! | Aadhaar Free Update Deadline is Coming To End | Sakshi
Sakshi News home page

ఆధార్ ఫ్రీ అప్డేట్: గడువు ఆరు రోజులే!

Published Sun, Dec 8 2024 7:28 PM | Last Updated on Sun, Dec 8 2024 8:33 PM

Aadhaar Free Update Deadline is Coming To End

ఆధార కార్డు అప్డేట్ కోసం.. 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' పలుమార్లు గడువును పెంచుకుంటూ వస్తూనే ఉంది. కాగా ఇప్పుడు పొడిగించిన గడువు (డిసెంబర్ 14) సమీపిస్తోంది. ఈ లోపు ఏదైనా మార్పులు చేయాలనుకునేవారు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 14 లోపల ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్‌ చేసుకుంటే.. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‌డేట్‌ చేసుకుంటే మాత్రం.. రూ. 50 అప్లికేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మరో మారు గడువును పొడిగిస్తారా అనే విషయం మీద ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు పూర్తయిన వారు, ఇప్పటి వరకు స్థాన చలనం చేయకుండా ఉంటే.. లేదా వ్యక్తిగత వివరాలలో ఎలాంటి అప్‌డేట్‌ అవసరం లేకుంటే.. అలాంటి వారు తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ బయోమెట్రిక్, ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. దీని వల్ల మోసాలను నివారించవచ్చు.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా?
➜మైఆధార్ పోర్టల్‌ ఓపెన్ చేయండి
➜లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయాలి.
➜నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
➜రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
➜అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.
➜మీరు ఏదైనా అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
➜అవసరమైనవన్నీ అప్డేట్ చేసుకున్న తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.

ఆధార్ కార్డును అప్డేట్ చేయడానికి.. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరం.

ఇదీ చదవండి: ఈ ఒక్క ఐడీ ఉంటే చాలు.. ఆధార్ నెంబర్‌తో పనే లేదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement